Monday, February 29, 2016

నాలుగేళ్లకు ఒకసారే జయంతి

మురార్జీ దేశాయి.. భారత దేశ నాలుగో ప్రధానమంత్రి.. సివిల్స్ సర్వీసెస్ వదిలేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు మురార్జీ.. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో చురుగ్గా పాల్గొన్నారు.. మురార్జీ వాస్తవానికి నెహ్రూ తర్వాత ప్రధాని కావాల్సిన వాడు.. కానీ కోటరీ రాజకీయాల కారణంగా రెండు సార్లు ఆయనకు ఆ అవకాశం తప్పింది.. ఇందిరాగాంధీ విధానాలను వ్యతిరేకించి కాంగ్రెస్ నుండి బయటకు వచ్చారు.. ఎమర్జెన్సీ కాలంలో జైలు పాలైన ముర్జార్జీ, జనతా పార్టీకి నేతృత్వం వహించారు.. కాంగ్రెస్ పార్టీ పరాజయం, జనతా పార్టీ ఘన విజయంతో దేశ ప్రధానమంత్రి పదవి చేపట్టారు.. మురార్జీ దేశాయి ప్రధానిగా పని చేసిన కొద్ది నెలల్లోనే పాలనతో తనదైన ముద్ర చూపారు.. అంతర్గత కుమ్ములాటలో జనతా ప్రభుత్వం పతనం కావడం తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండి పోయారు..
మురార్జీ దేశాయి జీవించింది 99 సంత్సరాలు.. కానీ ఆయన తనకు 24 ఏళ్లే అని చమత్కరిస్తారు.. అవును మరి ఆయన పుట్టిన రోజు నాలుగేళ్లకు ఒకసారే వస్తుంది.. మురార్జీ జన్మదినం ఫిబ్రవరి 29.. ఈ ఏడాది లీపు సంవత్సరం కావడంతో ఆయన జన్మదినం వచ్చింది.. ఆ మహనీయున్ని స్మరించుకునే సందర్భమిది..

(మురార్జీ దేశాయి జననం: ఫిబ్రవరి 29, 1896, మరణం: ఏప్రిల్ 10, 1995)

No comments:

Post a Comment