Thursday, December 31, 2015

భారతీయ కాలమానమే ప్రమాణికం

డిసెంబర్ 31 రోజున అందరికీ ఎక్కడ లేని హడావుడి.. ఎందుకంటే న్యూ ఇయర్ అట.. అర్ధరాత్రి 12 గంటలకు కొత్త సంవత్సరం మొదలవుతుందని సంబరాలు చేసుకుంటారు.. మీరంతా సంబరాలు చేసుకుంటే ఎలాంటి అభ్యంతరాలు లేవు.. కానీ మనం సమగ్రమైన భారత కాలమానాన్ని మరచిపోయి, అర్థంలేని గ్రెగోరియన్ (ఆంగ్ల) క్యాలండర్ ను అనుసరిస్తున్నాం అని గమనించాలి..

భారతీయ కాలమానం ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటుంది.. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకృతికి విరుద్ధం.. ఎలాగో గమనించండి..
భారతీయ కాలమానం ప్రకారం సూర్యోదయంతో దినం మొదలవుతుంది.. మనకు ఒక రోజు అంటే ఇవాళ తెల్లవారుఝాము నుండి మరునాటి తెల్లవారు వరకూ.. కానీ గ్రెగోరియన్ క్యాలండర్ మాత్రం అర్ధరాత్రి పూట దినం మొదలవుతుంది.. అది తిరిగి అర్ధరాత్రి వరకూ కొనసాగుతుంది..
సృష్టిలో ఏ ప్రాణి అయినా తెల్లవారు ఝామునే నిద్ర లేస్తుంది.. మనుషులంతా ఉదయాన్నే నిద్ర లేని దైనందిన కార్యక్రమాలకు సిద్ధమవుతాం.. పక్షుల కిలకిలరావాలు సుమధురంగా వినిపించేది.. తోటల్లో పూవులు వికసిస్తాయి.. ఆవులు దూడలకు పాలను ఇస్తాయి.. మరి ఈ చర్యలన్నీ అర్ధరాత్రి జరగడం మీరెప్పుడైనా చూశారా? ప్రకృతి నియమాల ప్రకారం సాగే ఈ చర్యలు గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం అర్ధరాత్రి పూట జరగడం మీరు ఎక్కడైనా చూశారా?
మనం ఆలయాల్లో సుప్రభాత ప్రార్ధనలు తెల్లవారునే ఎందుకు చేస్తాం? అర్ధరాత్రి ఎందుకు చేయం.. మన పండుగలు భారతీయ కాలమానం ప్రకారమే జరుపుకుంటున్నం.. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఎప్పుడైనా జరుపుకుంటున్నామా?
భారతీయ సాంప్రదాయం ప్రకారం ఉగాదితో నూతన సంవత్సరం ఆరంభం అవుతుంది.. సూర్యమానమైనా, చంద్రమానమైనా గ్రహాల గమనం, ప్రకృతి ధర్మాల ప్రకారం మన కాలమానం రూపుదిద్దుకుంది.. జనవరి 1వ తేదీన నూతన సంవత్సరం అని చెప్పడానికి సరైన ప్రమాణాలు లేవు.. రోమన్లు, గ్రీకులు పాటించే గ్రెగోరియర్ క్యాలెండర్ కాలగమనంలో అనేక మార్పులకు లోనైంది.. యూరోప్ దేశాల వలస పాలన ద్వారా ప్రపంచ దేశాలన్నిటిపైనా బలవంతాన రుద్దబడింది.. ఆంగ్లేయుల ద్వారా మన దేశానికి దాపురించింది..
నిజానికి స్పష్టమైన కాలగణన ఉన్నభారతీయ కాలమానమే ప్రపంచానికి ఆదర్శం.. గ్రెగేరియన్ క్యాలండర్లో ఎన్నో లోపాలు కనిపిస్తాయి..
మనం నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాల్సింది ఉగాది రోజునే.. జనవరి 1వ తేదీన జరుపుకోవాలని నియమం ఏమీ లేదు.. ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా గ్రెగోరియన్ క్యాలెండర్ ను అనుసరిస్తున్నాయి.. దీన్ని మనం క్యాలెండర్ మార్పుగానే గుర్తించాలి.. 

Wednesday, December 30, 2015

నిజాలను దాచగలరా?

నిజం ఎప్పటికీ నిప్పు లాంటిదే.. కొన్ని నిజాలను మసి పూసినా దాచి పెట్టలేం.. ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కారణంగా దేశానికి కలిగిన నష్టాలను తొక్కి పెట్టే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ.. సోనియా గాంధీ విషయంలోనూ ఇదే విధంగా వ్యవహరించింది..
సోషల్ మీడియా విస్తృతం అయ్యాక దేశ ప్రజలందరి దృష్టికీ ఈ విషయాలు చేరి పోయాయి..
అయినా ఉష్ట్రపక్షిలా గంభీరంగా వ్యవహరిస్తోంది ఆ పార్టీ.. ఇప్పుడు స్వయంగా కాంగ్రెస్ పార్టీ సొంత పత్రిక కాంగ్రెస్ దర్శన్ ఈ వాస్తవాలను ప్రముఖంగా ప్రచురించడం సంచలనం సృష్టించింది..
అవాక్కయిన కాంగ్రెస్ పెద్దలు పత్రిక కంటెంట్ ఎడిటర్ ను తొలగించారు.. కానీ దేశ ప్రజల మనసులోంచి వాస్తవాలను తొలగించడం సాధ్యమా? నిజం ఎప్పటికీ నిప్పులాంటిదే కదా..

Saturday, December 26, 2015

ప్ర‌ధాని మోదీ ఆక‌స్మిక పాక్‌ ప‌ర్య‌ట‌న దౌత్య విజ‌యమే..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్లో జరిపిన ఆకస్మిక పర్యటన దౌత్య పరంగా పొరుగు దేశంపై మన విజయంగా భావించాలి.. ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలోనే పొరుగు దేశాల అధినేతలతో పాటు పాకిస్తాన్ను కూడా ఆహ్వానించి తన విధానాన్ని స్పష్టం చాటుకున్నారు.. పాకిస్తాన్ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడటంతో ఆ దేశంలో పర్యటనను వాయిదా వేసుకున్నారు మోదీ..  ఇప్పుడు పరిస్థితులు కాస్త కుదుట పడగానే పాకిస్తాన్లో హఠాత్తుగా పర్యటించడం వ్యూహాత్మకమే అని భావించాలి.. ఇందుకు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంట్లో శుభకార్యాన్ని ఉపయోగించుకున్నారు.. అయితే అంతకు కొద్ది గంటల ముందే ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన కార్యక్రమంలో పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఊతం ఇవ్వడాన్ని మోదీ స్పషంగా ఎండగట్టారు.. ఆది ఆయన దౌత్య చతురతకు అద్దం పడుతోంది.. 
ఏడాదిన్నర క్రితం ఇరుగు పొరుగుతో పాటు ప్రపంచ దేశాలతో మన దేశ ద్వైపాక్షిక సంబంధాలు క్షీణిస్తూ వచ్చాయి.. ఈ నేపథ్యంలో మోదీ మన విదేశాంగ విధానాన్ని తిరగరాస్తున్నారు.. ఈ రోజున అగ్ర దేశాలతో పాటు ప్రపంచంలోని పలు దేశాలు భారత్ విషయంలో సానుకూల దృక్పథం పెంచుకోవడం దేశ ప్రజలందరికీ గర్వకారణకమైన విషయం.. ప్రధాని దేశంలోకన్నా విదేశాల్లోనే ఎక్కువగా పర్యటిస్తున్నారని నోరు పారేసుకుంటున్నవారు ఈ విషయాన్ని గుర్తించాలి.. 
తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1953,1960 సంవత్సరాల్లో పాకిస్తాన్లో పర్యటించారు.. రాజీవ్ గాంధీ 1988,1989 సంవత్సరాల్లో ఆ దేశానికి వెళ్లారు.. ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి 1999, 2004 సంవత్సరాల్లో పాక్ పర్యటనకు వెళ్లారు.. మధ్యలో ప్రధాని మన్మోహన్ సింగ్కు తీరిక దొరకలేదు.. ఈయన హయాంలో మన భారత దౌత్య విధానం పూర్తిగా దెబ్బతిన్నది..  మళ్లీ ఇన్నాళ్లకు ప్రధాని మోదీ పాకిస్తాన్కు వెళ్లారు..
భారత దేశ విదేశాంగ విధానంలో సరికొత్త అధ్యాయానికి మోదీ నాంది పలికారు..

ప్రజాస్వామ్యం, వారసత్వ రాజకీయాలకు తేడా..

2014లో భారత్, బ్రిటన్ దేశాల్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి.. బ్రిటన్ ప్రతిపక్ష లేబర్ పార్టీ పరాజయం పాలైంది.. అంతకు ముందు ఎన్నికల్లో ఆ పార్టీకి 256 సీట్లు రాగా, తాజ ఎన్నికల్లోల 24 సీట్లు క్షీణించి 232 సాట్లు వచ్చాయి..
భారత దేశంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది.. ఆ పార్టీకి గతంలో 206 సీట్లు ఉంటే 2014 ఎన్నికల్లో ఘోరంగా 44కి పడిపోయాయి..
ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తే బ్రిటన్ లేబర్ పార్టీ అధ్యక్ష పదవికి తక్షణ రాజీనామా చేశారు.. మరి ఇండియాలో?.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పదవి పదిలం..
మన దేశంలో 2004, 2009 ఎన్నికల్లో బీజేపీ పరాజయం పాలైనప్పుడు ఆ పార్టీ అధ్యక్షులు రాజీనామా చేశారు.. ప్రధాని అభ్యర్ధిగా ఉన్నఅగ్ర నాయకుడు లాల్ కృష్ణ అడ్వానీ సైతం ప్రజాభిప్రాయానికి తలొంచక తప్పలేదు..
అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్న  రాజకీయ పార్టీలకు, వారసత్వ రాజకీయ పార్టీలకు ఉన్న తేడా ఇదే.. 

Monday, December 21, 2015

నేరానికి వయసుకు సంబంధం ఏల?

పాము చిన్నదైనా, పెద్దదైనా విష పూరితమే.. నేరాలకు వయసుతో ముడిపెట్టే ముందు వారి స్వభావాన్ని కూడా గమనించాలి.. దేశ ప్రజలందరినీ కదిలించిన నిర్భయ అత్యాచార కేసులో ఓ నేరగాడు మైనర్ అనే కారణంతో విడుదల చేయడంలోని ఔచిత్యం ఏమిటో న్యాయస్థానాలే చెప్పాలి.. ఈ కేసులోని ఈ వ్యక్తి పేరుకే బాలుడు. కానీ బాధితురాలి పట్ల ఇతర నిందితులందరికన్నా అత్యంత ప్రవర్తించాడని విచారణ సందర్భంగా తేలిందటున్నారు.. ఇతర నేరగాళ్లకు కఠిన శిక్షలు పడ్డా, మైనర్ అనే కారణంతో ఇతన్నిప్రత్యేక పరివర్తన సదనంలో ఉంచారు.. కానీ ఈ సమయంలో అతనిలో ఎలాంటి పశ్చాతాపం కనిపించలేదని, పైగా మరింత తీవ్ర భావాలను ప్రదర్శించాడని న్యాయవాదులు చెబుతున్నారు.. నేరగాడి ప్రవర్తనను పరిగణనలోని తీసుకోకుండా విడుదల చేయాలని న్యాయస్థానం నిర్ణయించడం దేశ ప్రజలెవరూ జీర్ణించుకోలేక పోతున్నారు.. మన న్యాయ వ్యవస్థలోని లొసుగులను ఈ కేసు మరోసారి నిరూపించింది..

అందరికీ శ్రీమహా విష్ణువు కరుణా కటాక్షాలుకలగాలి..


Saturday, December 19, 2015

హెరాల్డ్ ఆస్తులు అమ్ముకునే హక్కు ఉందా?

తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జ్ఞాపకాలను ప్రజల స్మృతిపథం నుండి తొలగిస్తున్నారని మోదీ సర్కారుపై కొద్ది రోజుల క్రితం గయ్యిన లేచారు కాంగ్రెస్ నాయకులు.. మరి నెహ్రూ స్థాపించిన కాంగ్రెస్ పార్టీ సొంత పత్రిక నేషనల్ హెరాల్డ్ ను మూసేసి, దాని ఆస్తులను తెగనమ్ముకొని సొంత ఖాతాలో వేసుకున్న సోనియా గాంధీ, రాహుల్ రాహుల్ గాంధీలను ఎలా వెనుకేసుకు వస్తున్నారు వీరు?.. నెహ్రూ వారసులు అయినంత మాత్రాన కుంభకొణానికి పాల్పడేందుకు వీరికి పేటెంట్ రైట్స్ ఉన్నాయా?.. పైగా వీరేదో ఘన కార్యం చేసినట్లు అండగా నిలుస్తున్నారు.. చివరగా అర్థం అయింది ఏమిటంటే నెహ్రూ జ్ఞాపకాలను నిర్మూలించే హక్కు ఆయన వారసులదే.. ఈ విషయంలో మోదీకి ఎలాంటి చట్టబద్దమైన హక్కూ లేదు..

అవార్డులు.. కండిషన్లు

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు అందుకోనున్న వారందరికీ అభినందనలు.. ఈ సందర్భంగా నాదో వినతి.. మీరు సాహితీ రంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా లభిస్తున్న ఈ అవార్డులు మీకే కాకుండా దేశ ప్రతిష్టకు కూడా గర్వకారణం.. కాబట్టి అవార్డుల విషయంలో రాజకీయాలను ముడిపెట్టకండి.. అసహనకారుల ప్రభావంలో పడకండి..

ఇక కేంద్ర ప్రభుత్వానికి కూడా నాదో మనవి.. అవార్డులు ఇచ్చేప్పుడు ముందే షరతులు విధించండి.. రాజకీయ కారణాలతో అవార్డులు తిరిగి ఇవ్వొద్దని స్పష్టంగా చెప్పండి.. ఒకవేళ అవార్డు వాపసు ఇస్తే, దానితో పార్టు ఇచ్చే నగదును కూడా తిరిగి ఇవ్వాలనే షరతు విధించండి..

Thursday, December 17, 2015

వదంతులు ప్రచారం చేయకండి

నమ్మే వాడుంటే చేవిలో పువ్వు పెట్టేవాడు ఎప్పుడూ సిద్దంగానే ఉంటాడు. ఇటీవల వాట్సప్, ఫేస్ బుక్, తరతర సోషల్ మీడియా మెసెంజర్ సర్వీసుల్లో వస్తున్న వదంతులు ఈ తరహాలోనివే.
నరేంద్ర మోదీ ప్రభుత్వం డిజిటల్ ఇండియా పథకం కోసం 12 జీబీ డాటా, రూ.1029 టాక్ టైమ్ ఇస్తోంది.. దీన్ని 10 మంది మిత్రులకు షేర్ చేయాలి.. 5 నిమిషాల తర్వాత బ్యాలన్స్ వస్తుంది. ఇందు కోసం కింది మొబైట్ నెట్ వర్క్ నెంబర్స్ డయల్ చేయండి. ఇది చూసి నేను కూడా షాక్ అయ్యాను.. కానీ ఇది నిజం. ప్రయత్నించండి..
ఈ మెసేజ్ చూసి వారంతా నిజమేనని గుడ్డిగా నమ్మేస్తూ అందరికీ ఫార్వర్డ్ చేస్తున్నారు. కనీసం నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. ప్రధాని మోదీ ప్రజలకు ఏమైనా లబ్ది చేకూర్చే పథకం ప్రారంభిస్తే బహిరంగంగా ప్రకటిస్తారు.. పత్రికల్లో, టీవీల్లో ప్రకటనలు ఇచ్చి అందరికీ తెలిసేలా చేస్తారు. కానీ ఇలా రహస్యంగా సోషల్ మీడియాలో మెజేజ్ వదంతులు వ్యాపింపజేయరు. కాస్త ఇంగితంతో ఆలోచించండి. మీకు ఇలాంటి మెజేస్ వస్తే పంపిన వాడిని నిలదీయండి.. కనీసం వాడు ప్రయత్నించి చూశాడా అపి ప్రశ్నించడండి.. ప్రయత్నించలేదని చెబితే, మరి ఎందుకు మెజేస్ పంపావని అడగండి..

ఇలాంటి వదంతులను కట్టడి చేయడానికి ఇదొక్కటే మార్గం..

స్నేహ హస్తం వెనుక మతలబు ఇదేనా?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీతో సంబంధాల విషయంలో వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారు.. ఇటీవలి కాలంలో రెండు సార్లు విజయవాడ వెళ్లడం, ఏపీ సీఎం చంద్రబాబును తాను తలపెట్టిన యాగానికి ఆహ్వానించడం పక్కా స్కెచ్ ప్రకారమే జరిగింది.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు ఉంది కేసీఆర్ ఎత్తుగడ.. స్నేహ హస్తం అందించడం ద్వారా ఆంధ్రా ప్రజలను సంతోషపరచడమే కాదు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్లోని సీమాంధ్రుల ఓట్లు సాధించాలని ఆయన భావించినట్లు తెలుస్తోంది.. పొరుగు రాష్ట్రంతో సఖ్యతగా మెలగాలని కేసీఆర్ భావిస్తే మంచిదే.. అది జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కూడా కొనసాగాలి..

Wednesday, December 16, 2015

కేజ్రీ చట్టపట్టాల్ ఎవరితో?

మొన్న పాట్నాలో పశుగ్రామ కుంభకోణ నిందితుడు లాలూ ప్రసాద్ యాదవ్ ను కౌగలించుకున్నాడు.. ఇవాళ ఏకంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ముఖ్యకార్యదర్శి రాజేంద్ర కుమార్ పై సీబీఐ దాడులను తప్పు పట్టాడు.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎందుకిలా మారిపోయాడు.. లోక్ పాల్ బిల్లు కోసం జరిగిన అన్నా హజారే పోరాటాన్ని రాజకీయ లబ్ది కోసం ఉపయోగించుకొని సీఎం పదవిని సంపాదించాడు కేజ్రీవాల్.. తన హద్దులను ఢిల్లీకే పరిమితం చేసుకొని ఉద్యమాన్ని గాలికొదిలేశాడు.. ఇప్పుడు ఏకంగా అవినీతి పరులైన అధికారులకు అండగా నిలుస్తున్నాడు..
తనకు ముందుగా చెప్పి దాడులు చేయలేదని తప్పు పడుతున్నాడు కేజ్రీవాల్.. సర్జీ మేము దాడులకు వస్తున్నాం, అంతా సర్దుకొని సిద్దంగా ఉండండి అని సీబీఐ ముందుగానే సమాచారం ఇవ్వాలా?.. కేజ్రీవాల్ తో బంధం తెంచుకోవడం మంచిదైందని ఇటీవల అన్నా హజారే వ్యాఖ్యానించడం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి..

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంపై తన రాజకీయ వ్యతిరేకతను చాటుకోవడానికి కేజ్రీవాల్ కు అనేక మార్గాలు ఉన్నాయి.. కానీ అవినీతి విషయంలో ఇలా ద్వంద్వ వైఖరి ప్రదర్శించడం ఆయన విశ్వసనీయను ప్రశ్నార్ధకం చేస్తోంది..

Tuesday, December 15, 2015

దేశం కన్నా కుటుంబమే మిన్న..

1978 డిసెంబర్ మాసంలో లక్నో నుండి ఢిల్లీ వెళ్లుతున్న ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం హైజాక్ అయింది. కారణం: ఇందిరా గాంధీని అరెస్టు చేశారని.. 2015 డిసెంబర్ మాసంలో పార్లమెంటు సమావేశాలకు ఆటంకం. కారణం: సోనియా గాంధీని తన ఎదుట హాజరు కమ్మని న్యాయ స్థానం ఆదేశించినందుకు.. రెండు ఘటనలకు 37 ఏళ్ల తేడా.. కానీ రెండు చర్యలకు కారణం కాంగ్రెస్ పార్టీయే.. నాడు, నేడూ ఒక కుటుంబాన్ని రక్షించడానికి చేసిన పనే..
ఆనాడు కేంద్రంలో జనతా పార్టీ అధికారంలో ఉంది.. రాజకీయ ప్రేరిత కుట్రలో భాగంగా ఇందిరను అరెస్టు చేశారని కాంగ్రెస్ నాయకుల ఆరోపణ.. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది.. సోనియా గాంధీ విషయంలోనూ రాజకీయ కుట్రే అని కాంగ్రెస్ వాదన.. ఏది నిజం? ఏది అవాస్తవం?..
1978, 2015.. ఈ రెండు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్నవారు ఒక కుటుంబానికి చెందిన వారు.. వారిపై చర్యలు చేపట్టింది న్యాయస్థానమే.. రెండింటిలోనూ ప్రభుత్వాల ప్రమేయం ఏమాత్రం లేదు.. వారు చేసిన తప్పుల ఫలితం కారణంగానే కేసుల్లో ఇరుక్కున్నారు.. కానీ కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది..
మరీ విచిత్రం ఏమిటంటే ప్రస్తుత నేషనల్ హెరాల్డ్ కేసు 2013లో నమోదైంది.. నాడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే.. న్యాయ స్థానాలపై అధికార పార్టీల ప్రభావం ఉందని వారు భావించనట్లయితే, ఆనాడే కేసు నమోదు కాకుండా అడ్డుకోవచ్చుకదా?.. బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి కేసు నమోదు చేసినంత మాత్రాన, దాన్ని ప్రభుత్వానికి ఆపాదించడానికి ప్రయత్నించడమేనా?

ఇంతకీ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ స్థాపించిన కాంగ్రెస్ అధికార పత్రిక ఆస్తులను ఒక కుటుంబం అడ్డగోలుగా అమ్ముకొని తమ వ్యక్తిగత ఖాతాల్లో వేసుకుంటే ఆ పార్టీ నాయకులు వెనుకేసుకురావడం ఎంత వరకూ సమంజసం?.. కాంగ్రెస్ పార్టీ ఆ వ్యక్తుల కుటుంబ ఆస్తిగా భావిస్తున్నారా?.. దేశంకన్నా కుటుంబమే మిన్న అని కాంగ్రెస్ పార్టీ నమ్ముతోందా?.. ఏప్రిల్ ఇంకా నాలుగు నెలల దూరంలో ఉంది.. మరి ఎవరిని ఫూల్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.. దేశ ప్రజలనా?.. ప్రజలు అంత అమాయకులుకాదు మోసపోవడానికి..

Saturday, December 12, 2015

1857 నాటి కుట్రలు కొనసాగుతున్నాయి..

భారత స్వాతంత్ర్య సమర పోరాటానికి క్రీ.శ.1857సం.లో అంకురార్పణ జరిగింది.. బ్రిటిష్ వారు దీన్ని సిపాయిల తిరుగుబాటు (Sepoy Mutiny) అన్నారు.. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు వినాయక్ దామోదర్  సావర్కర్ 1857లో జరిగింది ప్రథమ స్వాతంత్ర్య సమరం (First war of Independence) అని ఆధార సహితంగా చాటి చెప్పారు.. ప్రథమ స్వాతంత్ర్య సమరంలో సిపాయిల తిరుగుబాటు ఒక భాగం.. ఇంతకీ సిపాయిల తిరుగుబాటు ఎందుకు జరిగిందో తెలుసా?
ఈస్టిండియా కంపెనీ సైన్యంలోని సిపాయిలకు ఎన్ ఫీల్డ్ అనే కొత్త తుపాకులు సరఫరా చేశారు.. సిపాయిలు ఈ తుపాకుల్లో లోడ్ చేసే తూటాల సీల్ ను పంటితో తొలగించాలి.. అయితే ఈ తూటాల సీలును ఆవు, పంది మాంసం నుండి తీసిన కొవ్వుతో తయారు చేయడం బయట పడింది.. కంపెనీ సైన్యంలో అత్యధికులు హిందువులు, ముస్లింలు.. బ్రిటిష్ వారు తమ మత విశ్వాసాలను అవహేళన చేయడాన్నివారు తట్టుకోలేకపోయారు.. మంగళ్ పాండే నేతృత్వంలో సైన్యంలో తిరుగుబాటు వచ్చింది..
ఒకటిన్నర శతాబ్దం క్రితం జరిగిన ఈ ఘటన బ్రిటిష్ వారి విభజించి పాలించు అనే కుటిల నీతిలో భాగం.. దేశ ప్రజలంతా ఏకమై దాన్నితిప్పికొట్టి ఐక్యతను చాటుకున్నారు.. ఆ తర్వాత జరిగిన జాతీయ ఉద్యమానికి ఈ ఐక్యత దారి చూపింది.. బ్రిటిష్ వాడు పోతూ పోతూ మన దేశాన్ని విభజించడంతో పాటు సమాజంలో చిచ్చు పెట్టి పోయాడు.. విదేశీ భావదాస్యతను జీర్ణించుకున్న కొన్ని శక్తులు ఈ నాటికి మన దేశాన్ని, సమాజాన్ని విచ్ఛినం చేసే దిశగా కుట్రలు పన్నుతూనే ఉన్నాయి..

ఇప్పుడు కొన్ని సంస్థలు నిర్వహిస్తున్న కూరల పండుగలను మనం ఏ దృష్టితో చూడాలి? తాము కోరుకుంటున్న ఆహారం తినే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంటుంది.. కానీ ఆహార స్వేచ్ఛ అంటూ వీధినపడి, మత పరమైన సెంటిమెంట్లను రెచ్చగొట్టడం ఎంత వరకూ న్యాయం? ప్రజల మత విశ్వాసాలతో ఆడుకొని వారిలో ఒకరిపట్ల మరొకరికి అపనమ్మకం, విధ్వేషాలను సృష్టించడం ఏ రకమైన స్వేచ్ఛకు ప్రతీక?.. ఆలోచించండి..

Wednesday, December 9, 2015

ఈ కూర పండుగ లొల్లి ఏంది?


అత్తను మించిన కోడలు..

తాను ఇందిరా గాంధీ కోడలినని, ఎవరికీ భయపడనని ప్రకటించుకున్నారు సోనియా గాంధీ.. ఈ విషయంలో ఎవరికీ అనుమానం లేదు.. రాజీవ్ గాంధీ భార్య నిస్సందేహంగా ఇందిరకు కోడలే అవుతుంది కదా?.. సోనియా ఎవరికీ భయపడనంటున్నారు.. అదే కదా దేశ ప్రజలకు భయం..
ఇందిరా గాంధీ ప్రధాని పదవిలో ఉన్నప్పుడు  అలహాబాద్ హైకోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే సహించలేక ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, పౌర హక్కులను కాలరాసి దేశంలో ఎమర్జెన్సీ విధించారు.. కొడుకు సంజయ్ గాంధీ అరాకచాలతో ఆమెకు అండగా నిలిచారు..  చరిత్రలో నియంతగా పేరు తెచ్చుకున్నారు ఇందిర..

ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ పత్రిక కుంభకోణంలో ఢిల్లీ హైకోర్టు తన ముందు హాజరు కమ్మని సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీలను ఆదేశించింది.. దీనికి గగ్గోలు పెడుతూ విషయం ఏమిటో చెప్పకుండా పార్లమెంటును అడ్డుకున్నారు కాంగ్రెస్ ఎంపీలు.. ఈ సందర్భంగా తాను ఇందిర కోడలినని గుర్తు చేస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు సోనియా.. తాటాకు చప్పుళ్లకు మోదీ సర్కార్ భయపడుతుందంటారా?

Friday, December 4, 2015

చెన్నై గుణ పాఠం..

చెన్నపట్నం చిన్నబోయింది.. చెరువైపోయింది. భారీ వర్షాలకు నీట మునికి అతలాకుతలమైంది.. భారత దేశంలోని మెట్రోనగరాల్లో దక్షిణాదికే తలమానికంగా నిలచిన ఈ నగరానికి ఎందుకీ దుస్థితి? మానవ తప్పిదాల కారణంగానే ప్రకృతి కన్నెర్రజేసిందా?
ఒక్కప్పుడు చెన్నై నగరంలో పెద్ద సంఖ్యలో చెరువులు ఉండేవి.. మూడు ప్రధాన నదులు ఉన్నాయి.. వర్షం నీరు కాలువల ద్వారా చెరువుల్లో చేసి అక్కడి నుండి నదుల్లో చేరేది.. ఆ తర్వాత ఈ నీరంతా సముద్రంలో కలిసేది.. శివారు ప్రాంతంలో విచ్చల విడిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగిపోయి పొలాలు కనుమరుగయ్యాయి.. ఆ తర్వాత చెరువులను కబ్జా చేశారు.. చెన్నై శరవేగంగా అభివృద్ధి చెందుతూ కాంక్రీట్ జంగల్ అయిపోయింది..
చెన్నైలో గత వందేళ్లుగా ఇంతటి భారీ వర్షం కురవలేదు.. ఒక్కసారిగా పెద్ద వానలు పడే సరికి వాననీరు నగరాన్ని ముంచెత్తింది.. చెరువులు, కాల్వలు కనుమరుగవడంతో వరద నీరంతా వీధుల్లోకి వచ్చింది. వేల సంఖ్యలో ఇళ్లూ, భవనాలు మునిగాయి.. ప్రణాళికాబద్దంగా లేని నగరాభివృద్ధి కారణంగా డ్రైనేజీలు వరద నీటిని తట్టుకోలేకపోయాయి.. దీనికి తోడు విచ్ఛల విడిగా ప్లాస్టిక్ వాడకం కారణంగా చెత్తా చెదారం డ్రైనేజీల్లో ప్రవాహానికి అడ్డు పడింది.. ఉన్న కొద్ది పాటి కాలువల్లో భవన నిర్మాణ వ్యర్ధాలను పడేస్తున్నారు.. ఇక వరద నీరు ఎక్కడికి పోవాలి.. దీని ఫలితమే ఈ జల విలయం..

ప్రకృతి చెన్నైకి నేర్పిన గుణపాఠం ఇతర నగరాలకు కనువిప్పు కావాలి.. ప్రకృతికి వ్యతిరేకంగా పోతే వినాశనమే అని ఇకనైనా మనమంతా అర్థం చేసుకోవాలి..

ఔట్ లుక్.. జూట్ లుక్ అయింది..

నిజం నిద్రలేచేలోపు అబద్దం లోకం చుట్టి వస్తుందంటారు.. ఔట్ లుక్ పత్రిక బాధ్యతారహిత వ్యవహారం అలాగే ఉంది.. 
దేశానికి 800 ఏళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ రూపంలో హిందూ పాలకుడు వచ్చారని హోంమంత్రి రాజనాథ్ సింగ్ అన్నట్లుగా ఔట్ టుక్ పత్రిక రాసింది.. ఈ అంశాన్ని సీపీఎం ఎంపీ మహ్మద్ సలీం పార్లమెంట్ లో ప్రస్థావించగా, తాను అలా అన్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని రాజనాథ్ సవాలు విసిరారు.. దీంతో ఔట్ లుక్ నాలిక కరుచుకుంది.. ఈ మాటలు రాజనాథ్ అనలేదని, అశోక్ సింఘాల్ అన్నారని ఇప్పుడు బొంకుతోంది.. అంటే ఇప్పుడు దివంగత సింఘాల్జీ వచ్చి వివరణ ఇచ్చుకోవాలా.. 
చిన్న చిన్న ఘటనలను చిలువలు పలువలుగా చేసి 'అసహన మంటలు' రాజేసి చలి కాచుకోవడం సమంజసమేనా?

ఈ కూర గోల ఏల?

ఇవాళ పెద్ద కూర పండుగ, పంది కూర పండుగ.. రేపు కుక్క కూర, గాడిద కూర పండుగలు..  అ తర్వాత మనుషుల్ని కూడా కోసుకుతింటారేమో.. ఎవడి తిండి వాడు ఇంట్లో తినక వీధినపడటం ఎందుకు?.. ఎవడి తిండి వాడిష్టం.. మరి ఇలా పండుగల పేరుతో అవతలి వారి మనోభావాలను గేలి చేయడం ఎందుకు?..