Sunday, December 31, 2017

తమిళనాడుకు రజినీయే బెస్ట్

నేను సినిమాలు పెద్దగా చూడను.. కానీ చూసిన చిత్రాల్లో కమల్ హాసన్, రజినీకాంత్ నటించినవే ఎక్కువ.. ఎందుకో నాకు మన తెలుగు హీరోల నటన పెద్దగా నచ్చదు.. కమల్, రజినీలు కాలానుగుణంగా తమ నటనా వైవిధ్యాన్ని కొనసాగించడం, వినూత్న ప్రయోగాలకు పెద్ద పీట వేయడం కారణంగా అరుదుగా వచ్చే వారి చిత్రాల కోసం ఎదురు చూస్తుంటాను.

నిజానికి నేను రజినీ కన్నా కమల్ కు పెద్ద అధిమానిని.. నటన వరకే సుమా.. అతని వ్యక్తిగత జీవితం నాకు అనవసరం అనుకున్నా.. ఇటీవల కాలంలో రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన కమల్ హాసన్ విడుదల చేస్తున్న విచిత్రమైన ప్రకటనలు, ట్వీట్లు నాకు నచ్చలేదు.. కమ్యూనిస్టుల చంకలో చేరి హైందవానికి, జాతీయవాదానికి వ్యతిరేకంగా ఆయన చేసిన ప్రకటనలు నా మనసు విరిచాయి. సైద్దాంతిక గందరగోళం, రాజకీయ పరిపక్వత లేని కమల్ రాజకీయాలకు దూరంగా ఉండటమే మంచిదని నా అభిప్రాయం. లేకుంటే నా లాంటి ఎంతో మంది అభిమానులు ఆయనకు దూరమైపోతారు.
తమిళనాట ఎంజీఆర్ తర్వాత అంతటి గొప్ప విలక్షణ నటుడు రజినీకాంత్.. మూడున్నర దశాబ్దాలుగా అగ్ర నటుడిగా ఉన్న రజినీ రాజకీయాల్లోకి రావాలని అభిమానలు చాలా కాలంగా కోరుకుంటున్నారు. కానీ ఆయన తొందర పడకుండా తన నిర్ణయాన్ని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చారు. ప్రస్తుతం తమిళనాట రాజకీయ శూన్యత ఉంది. జయలలిత తర్వాత ఆమె అంతటి సాహసోపేత, జనాధరణ గల నాయక్తవం లేదు.. ఇలాంటి సమయంలో వేర్పాటువాద శక్తులకు అండగా నిలిచిన కొన్ని సోకాల్డ్ ద్రవిడ పార్టీలు అవినీతి, చిల్లర వేశాలతో ప్రజల ఏవగింపునకు గురవుతున్నాయి. ఇలాంటి సమయంలో రాజకీయాల్లోకి వస్తున్నట్లు రజినీకాంత్ ప్రకటన చేయడం సంతోషకరం.. ఆధ్యాత్మిక చింతన అధికంగా ఉన్న రజినీకాంత్ తమిళనాడుకు నైతిక విలువలతో కూడిన రాజకీయాలు అందించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఏమీ చేయలేకపోతే రాజకీయాల్లో నుంచి తప్పుకుంటానని చేసిన ప్రకటనకు రజినీకాంత్ కట్టుబడి ఉండాలని కూడా భావిస్తున్నాను.

సినిమాలు, రాజకీయాలు వేరు వేరు.. కానీ తమిళనాట ఈ రెండూ దశాబ్దాలుగా అవిభక్త కవలలుగా సాగుతున్నాయి. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత సినీ రంగం నుంచి వచ్చి రాజకీయాలను శాసించారు. ప్రజాధరణతో రాజకీయాల్లోని వచ్చిన వీరి పాలనా కాలం అంతా అవినీతి మయమే.. ఇలాంటి సమయంలో రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నారు. ఆయన తన స్వచ్ఛతను కాపాడుకొని అవినీతి దూరంగా నీతివంతమైన, సమర్ధ పాలకుడుగా ఆవిర్భవించాలని మనసారా కోరుకుంటున్నాను.

Saturday, December 30, 2017

ఇక ఉమ్మడి పౌరస్మృతి దిశగా

అది 1985 సంవత్సరం షాబానో అనే వృద్ధురాలు తనను వదిలేసిన భర్త మనోవర్తి చెల్లించాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. సుప్రీం కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చేసరికి నాటి ముస్లిం నాయకులు గగ్గోలు పెట్టారు. తమ మత సంబంధమై విషయాల్లో జోక్యం చేసుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో నాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ సుప్రీంకోర్టు తీర్పును కాలరాస్తూ 1986లో  ప్రొటెక్షన్ ఆన్ డైవర్స్ యాక్ట్ తీసుకొచ్చారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీకి లోక్ సభలో సంపూర్ణ మెజారిటీకన్నా ఎక్కువ సభ్యులు ఉన్నా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఛాందసవాసుల ఒత్తిడికి తలొగ్గాల్సి వచ్చింది.

షాబానో ఉదంతం దేశ వ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతిపై చర్చకు దారి తీసింది. పర్సనల్ లా ముసుగులో ముస్లిం మహిళలకు తీరని అన్యాయం జరుగుతోంది. ఇలాంటి సమయంలో కొందరు చైతన్యవంతులైన ముస్లిం మహిళలు ముమ్మారు తలాక్’కు వ్యతిరేకంగా గళమెత్తారు. భర్త మూడుసార్లు తలాక్ అని ఉచ్చరించగానే వైవాహిక బంధం పెటాకులు అయినట్లేనట.. సుప్రీం కోర్టు ఆదేశాల పుణ్యమా అని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు’ను ప్రవేశపెట్టి లోక్ సభలో ఆమోదించింది. కాంగ్రెస్ పార్టీ తప్పని సరైన సరిస్థితిలో మద్దతు ఇవ్వాల్సి వచ్చింది. ఇక రాజ్యసభ కూడా ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడం లాంఛనమే అని చెప్పవచ్చు.
నిజానికి భారతీయ ముస్లింలలో కొన్ని ఛాందస వర్గాలు తప్ప మెజారిటీ వర్గాలు తలాక్విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేంద్ర తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. కానీ దురదృష్టవశాత్తు కొన్ని పని లేని ప్రతిపక్షాలు, వామపక్షాలు మాత్రం వ్యతికేస్తున్నాయి. ఈ వర్గాలకు ఈ చట్టం తీసుకు రావడం ఇష్టం లేకపోవడానికి కారణం ప్రధాని మోదీపై ఉన్న గుడ్డి వ్యతిరేకతే అని చెప్పక తప్పదు..
ముమ్మారు తలాక్ వ్యతిరేక చట్టం ముస్లిం సమాజానికి ఏమాత్రం వ్యతిరేకం కాదు. ముస్లిం మహిళల ప్రయోజనాలను రక్షించేందుకు తీసుకు వచ్చిన ఈ చట్టాన్ని వ్యతిరేకించడానికి వారు చెబుతున్న కారణాలు సహేతుకంగా లేవు. ప్రపంచంలో ముస్లింల జనాఖా ఎక్కువగా ఉన్న పాకిస్తాన్, ఈజిప్టు, ఇండోనేషియా, ఇరాన్, టర్కీ, బంగ్లాదేశ్ తదితర 19 దేశాలు ఏనాడో తలాక్కు తలాక్ చెప్పేశాయి. నిత్యం మన దేశంపై విద్వేషాన్ని విరజిమ్మే మత ఛాందస దేశం పాకిస్తాన్ 1961లో ముమ్మారు తలాక్ ను నిషేధించింది. మరి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత దేశంలో సెక్యులరిజం ముసుగులో ఇంకెంత కాలం సాగుతాయి ఈ కపట నాటకాలు?

దేశ ప్రజలందరికీ ఉమ్మడి పౌరస్మృతిని రూపొందిచాలని రాజ్యాంగంలోని 44వ అధికరణం నిర్దేశించిన విషయాన్ని సుప్రీం కోర్టు గుర్తు చేసింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఆనాడే ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని వాంచించారు. దేశ సమగ్రత, సమైఖ్యత కోసం ఇప్పుడు మనం అంతా ఈ దిశగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఇందుకు ముమ్మారు తలాక్ నిషేధం స్పూర్తి కావాలి..

Wednesday, December 27, 2017

మనువు పేరుతో ధర్మంపై దాడి

మ‌నుస్మృతి.. ఈ పేరు విన‌గానే హిందూ వ్య‌తిరేక శ‌క్తులు ర‌గిలిపోతుంటాయి. హిందూ మ‌తంపై దాడికి ఈ గ్రంథాన్ని సాకుగా చూపుతాయి. మ‌నుస్మృతిలోని చాతుర్వ‌ర్ణ వ్య‌వ‌స్థ‌, అంట‌రాని త‌నం, శూద్రులు, మ‌హిళ‌ల‌పై వివ‌క్ష‌, ఘోర‌మైన శిక్ష‌ల‌ను ప్ర‌స్థావించి స‌మాజంలోని కొన్ని వ‌ర్గాల‌ను రెచ్చ‌గొట్టి హిందూ మ‌తం నుంచి దూరం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అస‌లు కాలం చెల్లిన‌, మ‌నుగ‌డ‌లో లేని ఈ శిక్షాస్మృతిపై ఎందుకు ఇంత రాద్దాంతం?
ప్ర‌తి మ‌తంలోనూ మంచి, చెడూ రెండూ ఉంటాయి. ఇత‌ర మ‌తాల‌తో పోలిస్తే స‌నాత‌న హిందూ ధ‌ర్మంలో కాలానుగుణంగా వచ్చి మార్పులలో మంచిని గ్రహించి చెడును వదిలేస్తూ వచ్చింది.. అందుకే వేలాది సంవ‌త్స‌రాలుగా నిత్య నూతనంగా కొన‌సాగుతోంది హిందూ ధ‌ర్మం. 
ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌రిత్ర‌ను గ‌మ‌నించి చూస్తే పూర్వం రాజ్యాలు ప‌రిపాల‌న కోసం తమదైన వ్య‌వ‌స్థ‌ల‌ను ఏర్పాటు చేసుకోవ‌డం గ‌మ‌నించవ‌చ్చు.. రాజ్యంలో పాల‌కులు-పాలితుల మధ్య సంబంధాలు, పౌరుల విధులు బాధ్యతలు, సమాజంలో వివిధ వర్గాల ప్రజలు, ఎవ‌రు ఏం చేయాలి?.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన ప‌న్నులు.. నేరాలు, త‌ప్పులు చేస్తే వారికి విధించాల్సిన శిక్ష‌లు.. ఇలా అన్నింటికీ చ‌ట్టాలు, శిక్ష్మా స్మృతులు ఉంటాయి.. రాజ్యాలు పోయి ప్ర‌జాస్వామ్య పాల‌న వ‌చ్చాక వీటిలో చాలా వరకూ మార్పలు చేర్పులు వచ్చాయి.. ఇందులో కొన్ని ఒక‌నాడు ఒప్పు అనిపించిన‌వి, ఇప్పుడు త‌ప్పు అనిపించ‌డం స‌హ‌జం. 
భార‌తదేశాన్ని ఎంద‌రో రాజులు పాలించారు. విదేశీయుల దండ‌యాత్ర‌లు, వారి పాల‌న చూశాం.. చివ‌ర‌కు స్వాతంత్ర్యం పొంది ప్ర‌జాస్వామ్య పాల‌న అనుభ‌విస్తున్నాం. మ‌న దేశంలో వేలాది సంవత్స‌రాలుగా స‌నాత‌న ధ‌ర్మం కొన‌సాగుతోంది. ఆ కాలంలోని చ‌ట్టాలు, శిక్షాస్మృతుల‌ను మ‌నం నేటి స‌మాజానికి ఆపాదించ‌లేం.. హైంద‌వ స‌మాజం ఎన్నో మార్పుల‌ను కూడా చూసింది. స‌మాజంలో అంట‌రానిత‌నం, వివ‌క్ష‌త‌ల‌ను రెండు వేల సంవత్స‌రాల క్రిత‌మే ఆది శంక‌రాచార్యులు, రామానుజాచార్యులు త‌దిత‌ర మ‌హ‌నీయులు ప్ర‌శ్నించారు. ఆధునిక కాలంలో కూడా ఎంతో మంది సంఘ సంస్క‌ర్త‌లు వీటిపై పోరాటం కొన‌సాగించారు. 
హైంద‌వ ధ‌ర్మశాస్త్రాల్లో మ‌నుస్మృతి ఒక‌టి మాత్ర‌మే లేదు. ఇలాంటి 18 స్మృతులు ఉన్నాయి.. అవి మనుస్మృతి, బృహస్పతిస్మృతి, దక్షస్మృతి, గౌతమస్మృతి, యమస్మృతి, అంగీరసస్మృతి, యాజ్ఞవల్క్యస్మృతి, ప్రచేతస్స్మృతి, శాతాతపస్మృతి, పరాశరస్మృతి, సంవర్తస్మృతి, ఔశనసస్మృతి, శంఖస్మృతి, లిఖితస్మృతి, ఆత్రేయస్స్మృతి, విష్ణుస్మృతి, ఆపస్తంబస్మృతి, హరీతస్మృతి... ఇవికాక మ‌రో 18 ఉపస్మృతులు ఉన్నాయి. అవి కణ్వస్మృతి, కపిలస్మృతి, లోహితస్మృతి, దేవలస్మృతి, కాత్యాయనస్మృతి, లోకాక్షిస్మృతి, బుధస్మృతి, శాతాతపస్మృతి, అత్రిస్మృతి, ప్రచేతస్మృతి, దక్షస్మృతి, విష్ణుస్మృతి, వృద్ధవిష్ణుస్మృతి, వృద్ధమనుస్మృతి, ధౌమ్యస్మృతి, నారదస్మృతి, పౌలస్త్యస్మృతి, ఉత్తరాంగిరసస్మృతి..
ఇక్క‌డ మ‌నం అర్థం చేసుకోవాల్సిన విష‌యం ఏమిటంటే.. హైంద‌వ ధ‌ర్మానికి మ‌నుస్మృతి ఒక‌టే ప్ర‌మాణికం కాదు.. అందులో కొందరికి మంచి కనిపించవచ్చు, మరి కొందరికి చెడు కనిపించవచ్చు.. అస‌లు ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నుస్మృతి ఎక్క‌డ ఉంది?.. దీన్ని ఎవ‌రైనా ఆచ‌రిస్తున్నారా?.. ఎవ‌రూ ప‌ట్టించుకోని ఈ గ్రంథంపై అస‌లు ఎందుకు ఇంత ర‌భ‌స‌?.. మ‌నం ఇప్పుడు ప్ర‌జాస్వామ్యంలో ఉన్నాం.. ఆధునిక కాలానికి అనుగుణంగా మ‌న‌కు రాజ్యాంగం, చ‌ట్టం, శిక్షా స్మృతులు ఉన్నాయి. అలాంట‌ప్పుడు కొన్ని వ‌ర్గాల‌కు ఎప్పుడో అన్యాయం జ‌ర‌గిపోయింది అంటూ నేటికీ మ‌నుస్మృతిని ప‌ట్టుకొని హిందూ ధ‌ర్మాన్ని నిందంచ‌డం ఎందుకు?. చాలా మంది తెలిసీ తెలియ‌క మ‌నుస్మృతి గ్రంధాన్ని త‌గుల‌బెడుతున్నారు. ప్ర‌తిగా మ‌రి కొంద‌రు రెచ్చిపోయి గొడ‌వ‌కు దిగుతున్నారు. మ‌నం ప‌ట్టించుకున్న కొద్దీ అవ‌త‌లి వారు అలా రెచ్చిపోతూనే ఉంటారు.. కాబ‌ట్టి మీరింతే అని ప‌ట్టించుకోక‌పోవ‌డ‌మే ఉత్త‌మం.. 

అన్య‌మ‌తాల గ్రంథాల్లో ఇంకా దారుణ‌మైన శిక్షాస్మృతులను చూడ‌వ‌చ్చు.. మ‌రి ఆ మ‌తాల‌ను నిందించ‌కుండా హిందూ మ‌తాన్ని మాత్ర‌మే టార్గెట్ చేయ‌డం ఎందుకు? ఇందులోని కుట్ర కోణాన్ని మ‌నం అర్థం చేసుకోవాలి.. 

జైల్ మే రహేగా లాలూ..

‘జబ్ తక్ సమోసేమే రహేగా ఆలూ, బిహార్ మే రహేగా లాలూ..’ అని గొప్పలు చెప్పుకున్నాడు.. ఇప్పుడు పశువుల నోటికాడి గ్రాసాన్ని కాజేసి మెక్కిన కేసులో మరోసారి జైలుకు వెళ్లాడు.. చారా చోర్ లాలూ ప్రసాద్ యాదవ్ నేరం నిరూపితం అయి జైలుకు పోవడం శుభ పరిణామం.. కానీ పశుగ్రాసం కేసును రెండు దశాబ్దాల పాటు సాగదీయడమే నాకు నచ్చలేదు.

సత్వర న్యాయం జరగడంలో తీవ్ర జాప్యం కారణంగా నేరగాళ్లు కాలర్ ఎగరేస్తూ సమాజాన్ని శాసించడం దురదృష్టకరం. రాంచీ సీబీఐ కోర్టులో దోషిగా తేలిన లాలూ శిక్షను తప్పించుకోవడానికి హైకోర్టు, ఆ తర్వాత సుప్రీం కోర్టులను ఆశ్రయించడం ఖాయం.. ఈలోగా ఆయన శిక్షను పూర్తిగా అనుభవించకుండానే నూకలు చెల్లిపోవడం ఖాయం అనిపిస్తోంది..
కోట్లాది రూపాయ ప్రజా ధనం అడ్డగోలుగా దోచుకుంటూ తరతరాలకు సరిపడే సంపదను, వారసత్వ అధికారాన్ని చలాయించే నాయకులకు ఐకాన్ లాలూ ప్రసాద్ యాదవ్. ఇప్పుడు దాదాపుగా ఆయన కుటుంబ సభ్యులంతా కేసులు ఎదుర్కొంటున్నారు. వీరికి తర్వగా శిక్షలు విధించడమే కాదు, దోచుకున్న సంపదనంతా రాబట్టి బిహార్ ఖజానాకు దాఖలు చేయాల్సిన అవసరం ఉంది.
ఇలాంటి నాయకులు లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్, రాంమనోహర్ లోహియా వారసులం అటూ, వారి ఆశయాలకే తూట్లు పొడుస్తున్నారు. సమాజాన్ని కులాల పేరిట చీలుస్తూ వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటి చీడ పురుగులను భారత రాజకీయాల నుంచి శాశ్వతంగా వదిలించుకోవాల్సిన అవసరం ఉంది.
పై కోర్టులలో త్వరిత గతిన విచారణ పూర్తయి ‘జబ్ తక్ సమోసేమే రహేగా ఆలూ.. జైల్ మే రహేగా లాలూ..’ అని వినాలని కోరుకుంటున్నాను నేను..

24.12.2017

అర్థంలేని ఆరోపణలు

మోకాలికి బట్టతలకు ముడి పెట్టడం అంటే ఇదే.. ప్రధాని నరేంద్ర మోదీని వ్యతిరేకించేందుకు సాకుల కోసం కాచుకున్న శక్తులు విచక్షణ కోల్పోవడం మరోసారి స్పష్టంగా కనిపించింది.. 2జీ స్పెక్ట్రమ్ కేసులో నాటి టెలికమ్ మంత్రి రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి తదితరులు నేరం చేశారనేందుకు ఆధారాలు లేక వదిలేస్తున్నట్లు సీబీఐ న్యాయస్థానం ప్రకటించగానే కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడులు మొదలయ్యాయి.

యూపీఏ ప్రభుత్వ హయాంలో 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణాన్ని బయట పెట్టింది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్).. 2008లో జరిగిన కేటాయింపులకు 2001 నాటి ధరలను ప్రామాణికంగా తీసుకొని అస్మదీయులకు కేటాయింపులు జరిపారని ఆరోపణ. మంత్రి రాజా తన కుటుంబ వ్యాపార కార్యకలాపాలతో సంబంధం ఉన్న యూనిటెక్, డాట్ కామ్, స్వాన్ కంపెనీలకు కట్టబెట్టడాన్ని 2012లో స్వయానా సుప్రీం కోర్టు గుర్తించి 122 లైసెన్సులపై వేటు వేసింది..
2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ.1.76 లక్ష కోట్ల నష్టం జరగిందని కాగ్ నిర్ధారించింది. ఇక్కడ గమనించాల్సిన విషయంలో ఒకటి ఉంది. కుంభకోణం జరిగింది కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో, కుంభకోణంతో సంబంధం ఉన్న వారు కాంగ్రెస్ మిత్రపక్షం డీఎంకే పార్టీకి చెందిన రాజా, ఆ పార్టీ అధినేత కరుణానిధి తనయ ఎంపీ కనిమొళి.. మరి కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ సంస్థ ఎవరి కనుసన్నల్లో పని చేసినట్లు.. ఆ సమయంలోనే కీలకమైన పత్రాలను తారుమారు అయ్యే అవకాశం ఉంటుంది. ఒక రకంగా కేసు అప్పుడే నీరు గారింది..
తాజాగా సీబీఐ న్యాయస్థానం తీర్పు చెప్పే సమయానికి ప్రాసిక్యూషన్ వాదన వీగిపోయింది. సాక్ష్యాలను ప్రవేశ పెట్టడంలో విఫలం అయ్యారని న్యాయమూర్తి సైతం వ్యాఖ్యానించడం గమనార్హం.. మరి ఇక్కడ మోదీ ప్రభుత్వ ప్రమేయం ఎక్కడ ఉన్నట్లు?. కొద్ది రోజుల క్రితం చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి మోదీ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందిన డీఎంకే అధినేత కరుణానిధిని కలవడం ఇక్కడ ప్రస్థావనకు వస్తోంది..
కరుణానిధిని పరామర్శించడమే మోదీ చేసిన నేరమా?. దీనికి, తాజా తీర్పుకు ముడి పెట్టడం ఆశ్చర్యకరంగా ఉంది. డీఎంకేను తమవైపు తిప్పుకోవడానికే స్పెక్ట్రమ్ కేసును బీజేపీ ప్రభుత్వం నీరు గార్చిందని వాదన. మోదీ ప్రభుత్వం నిజంగా న్యాయస్థానాలను, దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసిందని నమ్మగలమా? ఇదే నిజమైతే ఇటీవల చాలా కేసుల్లో న్యాయస్థానాలు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నాయి. అంత పెద్ద కుంభకోణాన్నే ప్రభావితం చేసిన మోదీ, చిన్నా చితకా కేసుల్లో తన ప్రభుత్వాన్ని తప్పు పట్టకుండా చూసుకోలేరా?
నిజానికి 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం న్యాయస్థానానికి చేరేందుకు కారణం బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి.. ఆయన ఈ కేసును అంత తేలికగా వదిలి పెట్టరు.. పై కోర్టుల్లో ఈ వ్యవహారాన్ని తేల్చేందకు అప్పుడే సిద్దమైపోయారు. డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు పండుగ చేసుకుంటూ ఉండొచ్చు.. అసలైన మొసళ్ల పండుగ ముందు ముందు ఉంటుంది.

22.12.2017

వారు ఎలా అమాయకులో?



యూపీఏ హ‌యాం 2009లో వెలుగు చూసిన 2జీ స్పెక్ట్మ్ కుంభ‌కోణంలో నాటి టెలికమ్ శాఖ మంత్రి ఏ.రాజా, ఎంపీ క‌ణిమొళి నిర్దోషులంటూ సీబీఐ ప్ర‌త్యేక న్యాయ‌స్థానం తీర్పు ఇవ్వ‌గానే డీఎంకే, కాంగ్రెస్ నాయ‌కులు సంబ‌రాలు చేసుకుంటున్నారు. . అవినీతికి ఆధారాలు దొర‌క‌లేద‌ని భావిస్తే వారు నేరం చేయ‌లేద‌ని అర్థం కాదు. నేరాన్ని నిరూపించ‌డంలో ప్రాసిక్యూష‌న్ విఫ‌ల‌మైంద‌ని న్యాయ‌మూర్తి చెప్ప‌డం ఇక్క‌డ గ‌మ‌నించాలి. కుంభ‌కోణం జ‌ర‌గ‌లేద‌ని న్యాయ‌స్థానం చెప్ప‌లేదు. 
మ‌రి ఈ కుంభ‌కోణం కార‌ణంగా ప్ర‌భుత్వ ఖ‌జానాకు రూ.1.76 ల‌క్ష‌ల కోట్ల న‌ష్టం వాటిల్లింద‌ని కంట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ర్ (కాగ్‌) నివేదిక చెప్పింది క‌దా? ఆ సొమ్ము ఎవ‌రు తిన్న‌ట్లు?. దొరికితేనే దొంగ‌లు అనుకోరాదు.. ఇంకా పైకోర్టులు ఉన్నాయ‌ని, అవి నిగ్గు తేలుస్తాయ‌ని మ‌రచిపోవ‌ద్దు.. స‌త్య‌మేవ‌జ‌య‌తే..
21.12.2017

ఇదేం నైతిక విజయమో?

ఓ పెంకి పిల్లోడు స్కూలు మైదానంలో జరిగిన కుస్తీ పోటీలో ఓడిపోయాడు.. కానీ ఇంట్లో వాళ్లందరికీ నేనే గెలిచాను.. ప్రత్యర్థిని ముప్పు తిప్పలు పెట్టాను.. అని గొప్పలకు పోయాడు.. వాస్తవం ఏమిటో అందరికీ తెలిసినా వాడి సంతోషాన్ని ఎందుకు కాదనాలని ఆహా అలాగా భేష్ అంటూ అభినందించి మునగ చెట్టు ఎక్కించారు..

గుజరాత్ అసెంబ్లీలో వరుసగా ఆరోసారి గెలిచింది భాజపా.. రెండు దశాబ్దాల పాలనలో ఎంతో కొంత ప్రజా వ్యతిరేకత సహజం.. అయినా గెలిపించారు గుజరాతీలు.. ఈ వాస్తవాన్ని గుర్తించలేక తామే గెలిచామన్నంత సంబరపడిపోతున్నారు కాంగ్రెస్ వారు. వాస్తవానికి వారు అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ ను కోల్పోయినందుకు బాధ పడాలి.. కానీ కింద పడ్డా నైతిక విజయం తమదే అని గొప్పలకు పోతున్నాడు రాహుల్ గాంధీ..
మోదీ విశ్వసనీయతపై, గుజరాత్ అభివృద్ధి నమూనాపై సందేహాలట.. రాహులయ్యా!.. గుజరాతీలు మోదీపై విశ్వాసంతోనే మళ్లీ భజపాకు అధికారం ఇచ్చారు అన్న వాస్తవాన్ని ఎందుకు జీర్ణించుకోలేపోతున్నారు?.. గుజరాతీలకు మీ విశ్వసనీయతపై సందేహం కారణంగానే మీకు అధికారం ఇవ్వలేకపోయారు.. కాకపోతే సమర్ధవంతమైన ప్రతిపక్ష పాత్రను మరోసారి ఇచ్చి గౌరవించారు.. దీన్ని అంగీకరించలేకపోతే మీ కర్మ 2019లో ఇలాగే తిరగబడతది..
మొత్తానికి కాంగ్రెస్ కు భలే సారథి దొరికాడు.. ఆయన చేతిలోని స్టీరింగ్ ఎంత భద్రమో మరో రెండేళ్లలోపే తెలిసివస్తుంది..

20.12.2017

కిమ్ ఆదర్శమా? సిగ్గు సిగ్గు..



ఇండియన్ మార్క్సిస్టులకు ఎప్పుడు విదేశీ నియంతలే ఆదర్శం.. చైనా మావో చాలలేదేమో?.. ఇప్పుడు ఉత్తర కొరియా నియంత కిమ్ జోన్ ఉన్ ఫోటోలు పెట్టుకొని ఊరేగుతున్నారు.. ఇంతకీ ఈ పిచ్చోడు ఏ విధంగా ఆదర్శమో చెప్పగలరా కమ్మీస్?..
19.12.2018

Tuesday, December 19, 2017

గుజరాత్ ఎన్నికల ఫలితాలు బీజేపీకే లాభదాయకం

గుజరాత్ లో బీజేపీ తిరిగి విజయం సాధించడం, కాంగ్రెస్ పార్టీ నుంచి హిమాచల్ ప్రదేశ్ ను స్వాధీనం చేసుకోవడం ప్రధాని నరేంద్ర మోదీ ఘనతగా చెప్పడానికి కొందరు రాజకీయ, మీడియా విశ్లేషకులు అంగీకరించడం లేదు. తమదైన వక్రభాష్యాలు జోడించి గందరగోళం చేస్తున్నారు. నా దష్టిలో మాత్రం ఇది అసలైన విజయం.
ప్రధాని మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్న వేళ ప్రతిపక్షాలతో పాటు కొన్ని వర్గాలు పెద్ద ఎత్తున దుష్ప్రచారం మొదలు  పెట్టాయి. పెద్ద నోట్ల రద్దును స్వాగతించే మనస్థత్వం లేక చిన్న చిన్న కష్టాలను భూతాలుగా చూపి ప్రజలకు నష్టం జరిగిపోతున్నట్లు తప్పుదోవ పట్టించాయి. జీఎస్టీ విషయంలో కూడా ఇదే వైఖరిని ప్రదర్శించాయి.
ఇదే సమయంలో మోదీజీ సొంత రాష్ట్రం గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు రావడం వారికి ఆయుధంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నోట్ల రద్దు, జీఎస్టీలనే ప్రధాన ఎజెండాగా స్వీకరించింది. మరోవైపే రిజర్వేషన్ల కోసం ఉద్యమించిన పాటీదార్ల నాయకుడు హార్ధిక్ పటేల్ ను దుర్వింది. తాము అధికారంలోకి వస్తే పాటీదార్లకు రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇవ్వడంతో పాటు, ఆచరణ సాధ్యం కాని హామీలు ఎన్నో ఇచ్చింది. గుజరాత్ లో రెండు దశాబ్దాలుగా వరుస విజయాలు సాధిస్తున్న బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, వామపక్షాలు, కొన్ని శక్తులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశాయి.
ఈ పరిణామాలను ఛాలెంజ్ గా నే స్వీకరించారు ప్రధాని మోదీ.. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం మించరాదని, ఎవరైనా ఇలాంటి హామీ ఇస్తే మోస పూరితం అవుతుందని కుండ బద్దలు కొట్టినట్లు స్పష్టం చేశారు మోదీ.. దీన్ని అర్థం చేసుకున్న మెజారిటీ పాటీదార్ వర్గీయులు కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలను నమ్మలేదు. ఇక జీఎస్టీతో ఏర్పడ్డ ఇబ్బందులు పరిష్కరించాలంటే అది కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాతోనే సాధ్యం. కాంగ్రెస్ గుజరాత్ లో గెలిచినా చేతులు ముడుచుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదని ఆ రాష్ట్ర వ్యాపార వర్గాలకు తెలుసు. అందుకే ఈ అంశాన్ని కూడా పెద్దగా పట్టించుకోలేదు.
గతంలో మోదీజీని ఛాయ్ వాలా అంటూ పరిహసించిన కాంగ్రెస్ పార్టీ, ఈసారి నీచ్అంటూ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకే నష్టం చేకూర్చాయి. పైగా గుజరాత్ ఎన్నికల సమయంలో పాకిస్తాన్ నాయకులతో కాంగ్రెస్ పార్టీ జరిపిన రహస్య సమావేశం వెలుగులోకి వచ్చింది. ఈ అంశాలను ప్రధాని ఎన్నికల ప్రచారంలో ప్రస్థావిస్తే, దాన్ని కూడా తప్పు పట్టే ప్రయత్నం చేశారు.
గుజరాత్ ఎన్నికల ఫలితాలు ఓటింగ్ సరళిని విశ్లేషిస్తే నగరాలు, పట్టణాల ప్రజలు, వ్యాపారులు  భాజపాకే ఓటు వేశారు. పాటీదార్లు అధికంగా ఉన్న సౌరాష్ట్ర, గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి అధికంగా సీట్లు వచ్చాయి. రైతాంగంలో కొంత మేర అసంతృప్తి ఉంది. ఈ లోపాలను సరిదిద్దు కోవడం బీజేపీకి కష్టం కాదు. కాంగ్రెస్ ఉచ్చులో పడి హార్దిక్ పటేల్ మోసపోయాడు. అదే సమయంలో పాటీదార్ల రిజర్వేషన్లకు వ్యతిరేకమైన దళిత నేత జిగ్నేష్ మేవానీ, ఓబీసీ నేత అల్పేష్ ఠాగూర్ కాంగ్రెస్ పార్టీలో ఒప్పందం కుదుర్చకొని ఎమ్మెల్యేలుగా గెలిచారు.
కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి తగ్గట్టే గుజరాతీ ప్రజలు ఓటు ఇచ్చి సత్కరించారు. మరోసారి బలమైన ప్రతిపక్షంగా గెలిపించారు. పాపం రాహుల్ గాంధీ గుళ్లూ, గోపురాలు తిరిగి హిందూ ఓటు బ్యాంకును పొందేందుకు చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు.
గుజరాత్ లో బీజేపీ గెలిచినా సీట్లు తగ్గాయి. కానీ ఇది ప్రధాని మోదీజికి నిజమైన గెలుపు. ఆయన చేపట్టిన పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ లాంటి సంస్కరణలను గుజరాతీ ప్రజలు స్వాగతించారు అనే ఫలితాలు చెబుతున్నాయి. కాబట్టి మోదీజీ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు మాయాజాలంలో పడకుండా నిరభ్యంతరంగా ముందుకు సాగవచ్చు.. అదే సమయంలో గుజరాత్ ఫలితాలను అధ్యయనం చేసిన కాంగ్రెస్ ముక్త్ భారత్ దిశగా వ్యూహాలకు పదును పెట్టుకోవచ్చు..

సో.. మోదీజీ ఆగే బడో.. ఇస్ దేశ్ ఆప్ కే సాథ్ హై..

Friday, December 15, 2017

అమరనాథ్ యాత్రపై మతిలేని ఆంక్షలు

సనాతన హిందూ ధర్మానికి ప్రకృతికి విడదీయరాని సంబంధం ఉంది. పంచభూతాలైన అగ్ని, భూమి, నీరు, వాయువు, ఆకాశాలను దేవతలుగా పూజిస్తాం.. మన వేద వాఙ్మయంలో వీటి ప్రస్థావన ఉంది. కానీ హైందవం ప్రకృతికి విఘాతం అనే రీతిలో కొన్ని వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. వినాయక చవితి, దీపావళి వేడుకల సందర్భంగా ఈ వర్గాలకు ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. అడ్డగోలుగా మాట్లాడేస్తూ మెజారిటీ ప్రజల మనోభావాలను కించపరచడం పరిపాటిగా మారింది. బాధ్యతాయుతమైన సంస్థలు కూడా గుడ్డిగా ఇలాంటి వారి వాదలకు వత్తాసు పలిచే ఆంక్షలు విధించడం, ప్రకటనలు చేయడం దారుణం..
అమరనాథ్ యాత్ర కారణంగా హిమాలయాల్లో పర్యావరణానికి ముప్పు వాటిల్లిందని ఎవరో పనికిమాలిన వారు వేసిన పిటిషన్ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అతిగా స్పందించింది.. యాత్రీకులకు విధించిన ఆంక్షలు పూర్తిగా హాస్యాస్పదంగా ఉన్నాయి..
' అమరనాథ్ గుహలో గంట కొట్టరాదు.. మంత్రాలు చదవరాదు.. కొబ్బరికాయ కొట్టరాదు..' ఇలాంటి ఆంక్షలను చూస్తుంటే అమరనాథ్ యాత్రపై ఎందుకు ఇంత కక్ష అనిపించడం లేదా?
ఏటా లక్షలాది మంది యాత్రీకులు హిమాలయ గుహలో మంచు లింగం రూపంలో వెలిసిన భోళా శంకరున్ని దర్శించుకుంటారు.. ఈ భక్తుల మనోభావాలను దెబ్బతీసే హక్కు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు ఎవరు ఇచ్చారు?..
మధ్యయుగంలో హిందువుల తీర్థయాత్రలపై జిజియా పన్ను విధించేవారు.. ఇంకా నయం ఇలాంటి పన్నును అమరనాథ్ యాత్రీకులపై విధించాలని సిఫార్స్ చేయలేదు..
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధిస్తున్న తలతిక్క తుగ్లక్ ఆంక్షలను ప్రతిఒక్కరూ వ్యతిరేకించాలి..

Wednesday, December 13, 2017

అంత రహస్యం ఏమిటో?

‘ఉల్టా చోర్ కొత్వాల్ కో మారా..’ తాము చేసిన పనికి సిగ్గు పడకుండా ఎదురుదాడికి దిగడం ఎందుకో?..
గుజరాత్ ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకులు పాకిస్తానీ నాయకులతో సమావేశం కావడం దేనికి సంకేతం?.. ఈ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్థావించగానే ‘దూడ గడ్డి కోసం తాటిచెట్టు ఎక్కాం..’ అన్నట్లు ఆ పార్టీ వివరణ ఇచ్చుకోవడం ఏమిటి?.. ‘మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి..’ అంటూ పాకిస్తాన్ ప్రకటించడం.. ‘అసలు పాకిస్తాన్, చైనాల ప్రస్థావన ఎందుకు?, ప్రధాని క్షమాపణ చెప్పాలి’ అని కాంగ్రెస్ భుజాలు తడుముకోవడం దేనికి సంకేతం.. గతంలో కూడా రాహుల్ గాంధీ చైనా నాయకులను రహస్యంగా కలుసుకోవడం, ఒక విదేశీ ప్రతినిధుల విందులో దేశ రాజకీయాల గురుంచి నోరు జారడం అందరికీ తెలిసిందే..
తాజా ఘటనలో నిజంగానే కాంగ్రెస్ పార్టీకి నిజంగానే దురుద్దేశ్యం లేకపోతే భాజపా నాయకులు బయట పెట్టే దాకా భేటీ విషయాన్ని ఎందుకు దాచారు?.. పైగా ఈ సమావేశం జరిగింది ప్రధానిని ‘నీచ్’ అంటూ దుర్భాషలాడిన మణిశంకర్ అయ్యర్ ఇంట్లో.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మరి కొందరు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్న ఈ సమావేశం పాకిస్తాన్ మాజీ మంత్రి గౌరవార్థం అట..
బురదలోకి దిగి తమకు మరకలు అంటించొద్దని హెచ్చరించడం అంటే ఇదే మరి.. పాకిస్తాన్ నాయకులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపిందంటే దానికి ఒక అధికార హోదా ఉంటుంది.. చర్చల సారాంశం కూడా అందరికీ తెలుస్తుంది.. కానీ కాంగ్రెస నాయకులు ఏ హోదాలో శత్రు దేశం నాయకులతో సమావేశమైనట్లు? పైగా రహస్యంగా ఎందుకు దాచిపెట్టినట్లు? అందునా గుజరాత్ ఎన్నికల వేళ భేటీ ఏమిటి?.. పైగా అడిగితే దబాయింపు..
(12.12.2017)

Thursday, December 7, 2017

కాంగ్రెస్ కు అయ్యరోరి కష్టాలు

అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లు ఉంది యవ్వారం.. శతాధిక వయోవృద్ధ కాంగ్రెస్ పార్టీకి వారసత్వ (వైఫల్య) నాయకుడు సారధి అవుతున్న వేళ హాచ్మంటూ తుమ్మేశాడు అయ్యరోరు..
2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీని ఛాయ్ వాలా అంటూ ఈసడించాడు మణిశంకర్ అయ్యర్.. ఎన్నికల తర్వాత మోదీ కాంగ్రెస్ ఆఫీసు ముందు ఛాయ్ అమ్ముకుంటాడని ఎద్దేవా చేశాడు..
ఛాయ్ అమ్మి జీవితాన్ని ప్రారంభించిన మోదీ ఈ మాటలతో కుంగిపోలేదు.. ఛాయ్ నే ట్రేడ్ మార్క్ చేసుకున్నారు.. ఛాయ్ పే చర్చా పెట్టారు.. దేశానికి ప్రధాని అయిపోయారు.. పాపం అయ్యరోరు ఛాయ్ అమ్ముకొని బతకడానికి కూడా పనికిరాకుండా పోయాడు..
ఇప్పుడు ఈ అయ్యరోరు ప్రధాని మోదీని నీఛ్ అంటున్నాడు.. గతంలో మాదిరే మోదీకి మళ్లీ ఆయుధం దొరికింది.. బెంబేలెత్తిన రాహుల్ గాంధీ అర్జంటుగా మణిశంకర్ అయ్యర్ తో క్షమాపణ చెప్పించారు.. ఇది చాలదనుకున్నారేమో.. ఏకంగా ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా సాగనంపారు..

అన్నట్లు ఈ అయ్యరోరు రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడు కావడాన్ని సమర్ధించిన తీరు కూడా వింతగానే ఉంది. జహంగీర్ వారసుడిగా షాజహాను, షాజహాను వారసుడు ఔరంగజేబు వచ్చినప్పుడు ఎన్నికలు జరగలేదు.. అంటూ ఏదేదో చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలు సైతం బెడిసి కొట్టాయి.. కాంగ్రెస్ పార్టీ వారిది ఔరంగజేబు రాజ్యమని ఎద్దేవా చేశారు ప్రధాని మోదీ.. పాపం కాంగ్రెసోళ్లకు ఈ మణిశంకర్ అయ్యరోరు శల్యునిలా దాపురించారు..

మందిర్ వహీ బనాయేంగే..



6 డిసంబర్, 1992
దేశ చరిత్రను మలుపు తిప్పిన రోజు ఇది.. రామ జన్మభూమిపై విదేశీ దండ యాత్రికుడు బాబర్ నిర్మించిన కట్టడాన్ని తొలగించిన రోజు.. కుహనా లౌకికవాదం చావుదెబ్బ తిని, జాతీయవాదం మేల్కొన్న సందర్భం.. శ్రీరామ జన్మభూమి ఉద్యమం మరో స్వతంత్ర పోరాటంలా సాగింది.. వందలాది మంది ప్రాణత్యాగం చేశారు.. దురదృష్టం కొద్దీ న్యాయస్థానాల సుదీర్ఘ జాప్యం కారణంగా నేటికీ జన్మభూమిలో రామ్ లల్లా ఆలయం సాకారం కాలేదు.. అయోధ్యలో రాముని గుడి నిర్మించి నప్పుడే ఈ పోరాటం ఫలించినట్లు.. అప్పటి వరకు సాగాల్సిందే ఈ పోరు..
సౌగంథ్ రామ్ కీ ఖాతే హై.. మందిర్‌ వహీ బనాయేంగే... జై శ్రీరాం

(06.12.2017)

Tuesday, December 5, 2017

కాంగ్రెస్ ముక్త్ దిశగా మరో అడుగు

'కాగల కార్యం గంధర్వులే తీర్చారు’.. అన్నట్లు 'కాంగ్రెస్'కాంగ్రెస్ ముక్త్  ముక్త్ భారత్ అభియాన్’కు ఆ పార్టీ నాయకులు సైతం సమిధలు అందించారు. రాహుల్ గాంధీని ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ఎన్నికోవడం ద్వారా.. ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానందిట.. రాహుల్ ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్ష హోదాల్లో సాధించిన విజయాలు ఏవీ లేవు.. ఆయన ప్రచార బాధ్యతలు చేపట్టిన చోటల్లా ఓటమే కనిపిస్తోంది.. ఒకటి అరా స్థానిక కారణాల వల్ల సాధించిన గెలుపును యువరాజా ఖాతాలోకి నెట్టే ఆ పార్టీ క్యాడర్, వైఫల్యాలకు మాత్రం ఏనాడూ ఆయన్ని బాధ్యున్ని చేయలేదు..
కాంగ్రెస్ పార్టీలో హేమా హేమీ నాయకులు ఉన్నారు.. కానీ వారికి సోకాల్డ్ ‘గాంధీ – నెహ్రూ’ఫ్యామిలీయే ముద్దు. జవహర్ లాల్ నెహ్రూ హయాంలోనే కాంగ్రెస్ పార్టీ వంశ పారంపర్యం అయిపోయింది. పార్టీలో అగ్ర నేతలను కాదని తన కూతురు ఇందిరా గాంధీని ప్రోత్సహించాడా మహానుభావుడు. సీనియర్లకు పొగబెట్టే కార్యక్రమాన్ని ఇందిర విజయవంతంగా పూర్తి చేసింది. వారసునిగా సంజయ్ గాంధీని నిశ్చయించినా, ఆయన విమాన ప్రమాదంలో మరణించాడు. దీంతో అనివార్యంగా రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చాడు. ఇందిర హత్యానంతరం ప్రధానమంత్రి పదవితో పాటు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.
రాజీవ్ హత్య తర్వాత విషాదంలో మునిగిపోయిన సోనియా గాంధీని కోటరీ నాయకులు కదిలించే సాహసం చేయలేక మెతక మనిషి కదా అని పీవీ నరసింహారావును అధ్యక్షునిగా ఎన్నుకున్నారు.. ఆ తర్వాత ఆయనే ప్రధాన మంత్రిగా అయ్యారు. శాంత స్వభావుడు అనుకున్న పీవీ కాస్తా ఏకు మేకై అసలు సిసలు నారసింహుని అవతారం చూపడంతో కోటరీ పప్పులు ఉడకలేదు.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమికి బాధ్యున్ని చేసి పీవీని అన్యాయంగా తప్పించారు. సీతారాం కేసరి అనే విధేయున్ని మధ్యేమార్గంగా తోలుబొమ్మ అధ్యక్షునిగా పెట్టుకొని, చివరకు సోనియా గాంధీ చేతికి పగ్గాలు అప్పగించారు.  
తర్వాత కథ అందరికీ తెలిసిందే.. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న సోనియాకు ఎన్నికల్లో తన పార్టీ గలిచినా విదేశీయత కారణంగా ప్రధాని పదవి దక్కలేదు. దీనికి‘త్యాగం’ అనే పేరు పేట్టేశారు.. గత్యంతరం లేక మంచివాడైన మెతక మనిషి మన్మోహన్ సింగ్ ను ప్రధానిని చేసి రిమోట్ కంట్రోల్ పాలన నడిపింది సోనియా గాంధీ.. పాపం ఆ పెద్దాయన తనకు తెలియకుండానే అవినీతి మరకల పాలన అందించారు. 
అనారోగ్యంతో బాధ పడుతున్న సోనియా గాంధీ తన తనయుడు రాహుల్ గాంధీని ఎనాడో పార్టీ అధ్యక్షున్ని చేయాలనుకున్నా, ఆయన చిపల చిత్తం కారణంగా ఆ సాహసం చేయలేక పోయింది. నాయకత్వ బాధ్యతలపై నేర్పు వచ్చేందుకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా, అంతగా ఆయన ఉపయోగించుకోలేక పోయారు. కూతురు ప్రియాంకకు బాధ్యతలు ఇద్దామంటే ఇప్పటికే ఆమె పతి దేవుడు స్కాముల్లో మునిగిపోయాడు. చివరకు రాహుల్ కు పగ్గాలు అప్పగించక తప్పలేదు..
రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయినందుకు అందరికన్నా హ్యాపీగా ఉన్నది కమలనాథులే..

Monday, November 27, 2017

వేదాల మీద విషం కక్కుడు ఎందుకు?

వేదాలు కర్ణకఠోరం.. ఎవరు వింటారు వాటిని.. కంపు.. అన్ హ్యూమన్.. న్యూసెన్స్.. ఇళ్ల మధ్య వేద పాఠశాల పెడతారా?.. లొల్లితో సాటి మనుషులను బాధ పెడతారా?.. ఇంగిత గ్నానం ఉందా?.. అడవుల్లో పెట్టుకొని నేర్పించవచ్చు కాదా.. తక్షణం ఖాళీ చేయడండి.. లేకపోతే ఏం చేయాలో అది చేస్తా.. వేదాలు నేర్చుకునే ఆ విద్యార్థులను ఏట్లోకి పంపండి..
ఒక రాజకీయ పార్టీకి చెందిన అడ్డ గాడిద కూతలు ఇవి.. వేద పాఠశాల నిర్వాహకులను ఫోన్లో అనరాని మాటలు అని, బండ బూతులతో బెదిరించాడు.. ధర్మ రక్షణ కోసం వేదాలను భావితరాలకు అందించడమే ఆ పండితుడు చేసిన నేరం మరి..
మీ పెళ్లిళ్లు వేద మంత్రాల సాక్షిగా జరగాలి.. ఇంట్లో శుభ కార్యాలకు, గుడిలో అర్చనలు, సన్మానాలు, సత్కారాలకు వేద పండితుల ప్రార్ధనలు, ఆశీస్సులు కావాలి.. కానీ వేద పాఠశాలు అక్కర లేదు.. ఇళ్ల మధ్య వేద పాఠశాలలు ఉండరాదు..
అన్యమతాల ప్రార్ధనాలయాలు, విద్యాసంస్థలు మాత్రం నిరభ్యంతరం ఉండొచ్చా?.. వాటి వల్ల ఎలాంటి న్యూసెన్స్ లేదా?..
వాహ్వా.. క్యాబాత్ హైజీ.. తాలీ భజావ్.. సెక్యులరిజమా వర్ధిల్లు.. సనాతన ధర్మం, సంస్కృతి ఇంతగా హేళనలకు గురవుతున్నా, భరిస్తున్న మొద్దు చర్మం హిందువులు ఉన్నంత కాలం ఈ దేశంలో ఇలాంటి కూతలు భరించాల్సిందే.. నపుంసక రాజకీయ నాయకులు ఓటు బ్యాంకు రాజకీయాలతో స్వధర్మాన్నే నిర్వీర్యం చేస్తుంటే ప్రేక్షక పాత్ర పోషించాల్సిందే.. ఎందుకంటే ఎదిరిస్తే కమ్యూనల్ అవుతాం..

Sunday, November 19, 2017

ఇది ఇవాంక కథ కాదు

అనగనగా ఒక మహారాజు. ఆయనకు ఒక కూతురు పుట్టింది. ఆమె భవిష్యత్తులో బిచ్చగాన్ని పెళ్లి చేసుకుంటుందని జ్యోతిష్యుడు చెప్పాడు. దీంతో అప్రమత్తమైన మహారాజు ముందు జాగ్రత్తగా తన రాజ్యంలో యాచక వృత్తిని నిషేధించారు. బిచ్చగాళ్లను అరెస్ట్ చేశారు. శిక్షలకు భయపడ్డ కొందరు దేశం వదిలి పారిపోయాడు. 
కొన్నేళ్ళకు మహారాజు గారి ముద్దుల రాకుమారి లోక సంచారం తలపెట్టింది. ఎందుకైనా మంచిదని మహారాజు గారు రాకుమారి వెళ్లే దేశాలకు లేఖలు పంపారు. ' మీ దేశానికి వస్తున్న నా కూతురుకు బిచ్చగాళ్లు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోగలరు..' అని ఉందా ఉత్తరాల్లో..
ఈ లేఖను చూసిన దేశాల పాలకులు వెంటనే అప్రమత్తమయ్యారు.. ఎంతైనా అవతలి మహారాజు బలవంతుడు. ఆయన కోరికను మన్నించి సామరస్యంగా వ్యవహరిస్తే మనకే ప్రయోజనం కదా అనుకున్నారు. మొత్తానికి దేశాల్లో 'ఆపరేషన్ యాచక' అమలైంది..ఇదఇమహారాజు గారి కూతురు వెళ్లిన ఒక దేశంలో పొరపాటున ఆమెకు ఓ బిచ్చగాడు కనిపించాడు. వాడు అప్పుడే ఊరు నుంచి రాజధానికి వచ్చాడు. ఆపరేషన్ యాచక అమలులో ఉన్న సంగతి తెలియదట.
తర్వాత ఏమైంది?..
సినిమాలు చూడలేదా?.. షరా మాములే.. రాకుమారి వాడితో లవ్వులో పడింది.. కొన్ని రీళ్ల కథ నడిచాక కైమాక్స్ లో మహారాజు గారు బిచ్చగాడికి తన కూతురుని ఇచ్చి పెళ్లి చేశాడు.
గమనిక: ఇవాంక హైదరాబాద్ పర్యటనకు, ఈ కథకు ఎలాంటి సంబంధం లేదు.

(15.11.2017)

Wednesday, November 8, 2017

వీరితోనే మనకు ముప్పు

ఇటీవలి కాలంలో కొందరు వ్యక్తులు జన్మనిచ్చిన భారత దేశంపై, జాతీయ గీతంపై, హిందూ మతంపై అదే పనిగా విషం కక్కుతున్నారు.. అదే సమయంలో పార్లమెంట్ మీద దాడి చేసిన, ముంబై బాంబు పేలుళ్ల దోషులకు మరణ శిక్ష వేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలకు దిగింది ఈ బ్యాచే.. కశ్మీరీ వేర్పాటు వాదులకు, తీవ్రవాదులకు, విచ్ఛిన్నకర శక్తులకు బాహటంగా మద్దతు ఇస్తున్నారు.. బీఫ్ ఫెస్టివల్స్, కిస్ ఆఫ్ లవ్, లవ్ జిహాదీ గాళ్లకు వంతపాడుతున్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి ఆనందిస్తున్నారు.. భారత దేశ సార్వభౌమత్వం, రాజ్యాంగంపై ఏమాత్రం నమ్మకం లేదు వీరికి.. కానీ వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు.. ఎందుకు ఇంత అసహనం వీరికి?
అసలు వీరంతా ఎవరు? ఆరా తీస్తే విచిత్రమైన వ్యక్తిత్వాలు కనిపిస్తున్నాయి కొందరివి.. ఈ జాబితాలో స్వయం ప్రకటిత మేధావులు (మేతావులు), కవులు - కళాకారులు - ప్రజాసంఘాలు - విద్యావంతులం అని గప్పాలు కొట్టుకునేవారు, చట్ట విరుద్దంగా హిందూ మత కులాల రిజర్వేషన్లు పొందిన అన్య మతస్తులు, మిషనరీలు-విదేశీ నిధులతో పని చేస్తున్న సోకాల్డ్ ఎన్జీవోలు.. రకరకాల సంస్థలు, బ్యానర్లు, లెటర్ ప్యాడ్ల మీద పని చేస్తున్న ఈ పేపర్ టైగర్లన్నీ ఒకే లక్ష్యంతో పని చేస్తున్నాయి. అన్నట్లు ఈ జాబితాలో ఇటీవల కొందరు సినీ నటులు కూడా చేరి తమాషా రక్తి కట్టిస్తున్నారు.
వీరిలో కొందరి వ్యక్తిగత జీవితాలు పరమ అసహ్యం.. విలువలు, సామాజిక కట్టుబాట్లు గాలికి వదిలేసి విచ్ఛల విడిగా జీవిస్తున్నారు. అదేమంటే వ్యక్తిగతం అని నంగనాచి కబుర్లు చెబుతారు. పైకి మాత్రం సిద్దాంతాలు, నీతులు వళ్లిస్తారు.. మైకులు పట్టుకొని స్పీచులు దంచుతారు..
ఇలాంటి వారికి కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు ఇస్తున్నాయి. ఈ భిన్న ధృవ పార్టీలకు ఏ సైద్ధాంతిక ప్రాతిపదికన అవగాహన కుదిరిందో, ఎలా డీఎన్ఏ మ్యాచ్ అయిందో దేవుడెరుగు.. సారీ వీరు దేవున్ని నమ్ముతారో తేదో తెలియదు.. నమ్మినా ఏ దేవున్ని నమ్ముతారో అసలు తెలియదు..
నాకు అర్థం అయింది ఏమిటంటే.. వీరంతా మోదీ ఫోబియాతో బాధ పడుతున్నారు.. అయ్యా.. మీకు మోదీ మీద, బీజేపీల మీద కోసం ఉంటే రాజకీయంగా తీర్చుకోండి.. అంతే కానీ దీన్ని అడ్డు పెట్టుకొని ఈ దేశం, మెజారిటీ ప్రజల విశ్వాసాలతో మాత్రం ఆటలాడుకోండి.. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి సమాజంలో విధ్వేషం రగిలించే పనులు చేయకండి.. మేం ఇలాగే చేస్తాం (కుక్క తోక వంకర) అంటారా? మూల్యం మీరే చల్లించుకోవాల్సింది ఉంటుంది.. ఈ దేశ ప్రజల సహనానికి కూడా హద్దు ఉంటుందని గుర్తుంచుకోండి..
ఇది చదివి ఎవరైనా భుజాలు తడుముకుంటున్నారా?.. అందుకు నేను బాధ్యున్ని కాదు.. అది వారి కర్మ..

నల్లధనంపై చారిత్రక పోరాటం

ప్రమాదానికి గురైన ఒక వ్యక్తి పట్టించుకునే దిక్కులేక అవిటివాడై చేతి కర్రలతో కుంటుతున్నాడు.. ఒక డాక్టర్ అతని అవస్థను గుర్తించి శస్త్ర చికిత్స చేశాడు.. ఆ వ్యక్తి కోలుకుని నడవాలంటే కొన్ని వారాలు, నెలలు పడుతుంది.. ఇదే పరిస్థితి దేశ ఆర్థిక రంగానికి వస్తే..
నల్లధనంపై పోరులో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ ₹.500, 1000 నోట్లను రద్దు (Demonetisation) చేసి ఏడాది అవుతోంది.. దేశ ఆర్థిక చరిత్రలో ఇది సాహసోపేతమైన నిర్ణయం.. దశాబ్దాలుగా పేరుకు పోయిన నల్లధనం ఒక్కసారిగా మాయం అవుతుంది అని ఎవరూ భావించలేరు. కానీ ఈ దిశగా ఒక అడుగు పడింది..
పురాతనకాలంలో మంచి పని చేపట్టినప్పుడు రాక్షసులు అడుగడుగునా అడ్డుపడేవారు.. ఇప్పుడు మోదీజీ చేపట్టిన యజ్ఞానికి కూడా ఇదే పరిస్థితి.. ప్రశంసించడం ఇష్టం లేకుంటే గమ్మున ఉండి ఫలితం ఎలా ఉంటుందో వేచి చూసి స్పందించాలి.. కానీ ఆరంభం నుంచే తుమ్మలు మొదలయ్యాయి. ఈ వ్యక్తులు, శక్తుల దుష్ప్రచారం కారణంగా ప్రజల్లో ఆందోళన మొదలైంది. అవసరం లేకున్నా ఏటీఎంల ముందు గంటలు, రోజుల తరబడి క్యూలు కట్టించారు.. ఫలితంగా బ్యాంకుల్లో కరెన్సీ చెలామనికి ఇబ్బందులు కలిపించారు..
నిజానికి పెద్దనోట్ల రద్దువల్ల సామాన్యుని పెద్దగా ఇబ్బంది వచ్చింది ఏమీ లేదు.. పెద్ద ఎత్తున నగదు నిల్వలు ఉన్నవారే కష్టాలకు గురయ్యారు.. అది సహజం..
ఒక సాహసోపేతమైన భారీ కార్యక్రమం చేపట్టినప్పుడు ఫలితాలు అంత తొందరగా కనిపిస్తాయని ఆశించడం మూర్ఖత్వం.. ఉదాహరణకు మనం ఏదైనా వ్యాపారం మొదలు పెట్టగానే తక్షణ లాభాలు వచ్చేస్తాయా?.. ప్రమాదానికి గురైన రోగి చికిత్స జరిగిన వెంటనే లేచి పరుగెడతాడా?.. కొన్ని వారాలు, నెలలు కూడా పట్టవచ్చు.. మరి దశాబ్దాలుగా రోగగ్రస్థమైన దేశ ఆర్థిక వ్యవస్థకు జరిగే చికిత్సకు ఇంత తక్కువ వ్యవధిలో జడ్జిమెంట్ అవసరమా?..
ఒక చారిత్రాత్మక నిర్ణయానికి దేశ ప్రజలమంతా అండగా ఉందాం.. నల్లధనంపై పోరులో మనవంతు పాత్రను విజయవంతం చేద్దాం.. జై స్వచ్ఛ్ భారత్..

Friday, November 3, 2017

హిందువులపై ద్వేషం ఎందుకయ్యా నీకు?

హిందూ తీవ్రవాదం లేదని చెప్పలేం.. ఎక్కడైనా ఓ హిందూ తీవ్రవాదిని చూపించండనే సవాలును ఇకపై వారు (హిందువులు) విసరలేరు.. ఆ స్థాయిలో వారి వర్గంలోనే తీవ్రవాదం వ్యాపించింది.. అంటున్నాడాయన..
తమిళనాట కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి, ముఖ్యమంత్రినైపోవాలని పగటి కలలు కంటున్నాడాయన.. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లు హఠాత్తుగా రాజకీయాల్లోకి వచ్చేశాను.. పార్టీ పెడతాను.. అంటూ హడావుడిగా రోజుకో ప్రకటన చేస్తున్నాడు. ఏదేదో వాగేస్తూ నిత్యం వార్తల్లో నిలిచి పబ్లిసిటీ పొందాలని ప్రయత్నిస్తున్నాడు కమల్ హాసన్.. సత్యమేవ జయతే అన్న నినాదంపై హిందువులు విశ్వాసం కోల్పోయి, హింసా మార్గం ఎంచుకున్నారట.. ఇలా కమల్ తాను హైందవేతరున్ని అన్నట్లుగా వికట హాసం చేశాడు ఆనంద వికటన్లో.. ఓకే.. ఇలాగైనా హిందువును కాను అని ఒప్పుకున్నాడు..  
క‌మ‌ల్ ముందు తానేమీ మాట్లాడుతున్నాడో ఆత్మ విమ‌ర్శ చేసుకుంటే మంచిది.. ఆయ‌న చెబుతున్న‌హిందూ తీవ్రవాదం ఎక్క‌డ ఉంది? ఆ తీవ్రవాద సంస్థ‌లు ఏమిటో చెబితే బాగుంటుంది.. ఆధారాలు ఉంటే చట్టపరంగా పోరాటం చేయొచ్చు.. గాలిలో రాయి విసిరి ఎక్క‌డో త‌గులుతుంది క‌దా అనే ఎత్తుగ‌డ రాజ‌కీయంగా ఆయ‌న‌కే బెడిసికొడుతుంద‌ని అర్థం చేసుకోవాలి..
తీవ్రవాద కలాపాలతో దేశ ద్రోహం చేయడానికి హిందువులు ఏ దేశం నుంచో ఊడి పడలేదు.. ఈ దేశమే వారిది.. యే హిందుస్తాన్ హై.. హిందువోంకా హిందూ దేశ్.. ఈ దేశం అసలు పేరు హిందుస్తాన్.. సారే సహాజే అచ్చా హిందూ సితాహ్ హమారా అని ఎందుకు పాడుతారో తెలుసా? తెలియకుంటే చరిత్ర పుస్తకాలు చదువుకో..
హిందూ తీవ్రవాదాన్ని అరిక‌ట్ట‌డంలో కేర‌ళ ముఖ్య‌మంత్రి స‌మ‌ర్ధ‌వంతంగా ప‌ని చేస్తోంద‌ని కితాబిస్తున్నాడు క‌మ‌ల్ హాస‌న్‌.. అయ్యా.. (ప‌ర‌)లోకనాయ‌కా! కేర‌ళ‌లో జ‌రుగుతున్న వామ‌ప‌క్ష రాజ‌కీయ‌ హింసోన్మాదం నీకు క‌నిపించ‌డం లేదా?.. అక్క‌డి వామ‌ప‌క్ష ప్ర‌భుత్వం వందలాది మంది బీజేపీ, ఆరెస్సెస్ కార్య‌క‌ర్త‌ల‌ను హతమారుస్తున్న వైనంపై దేశ వ్యాప్త చ‌ర్చ నీ దృష్టికి రాలేదా?.. స్వ‌యంగా నీవు కలిసి వచ్చిన పినరయి విజయన్ సైతం హ‌త్యారోప‌ణ‌ ఎదుర్కోవడం నీకు తెలియ‌క‌పోతే తెలుసుకో.. కేర‌ళ ల‌వ్ జిహాదీ ఘ‌ట‌న‌లు నీకు చూడ ముచ్చ‌ట‌గా క‌నిపిస్తున్నాయా?.. త‌మిళ‌నాడులో హిందూ అతివాదం విస్త‌రించింద‌ని బాధ ప‌డుతున్నావుగా క‌మ‌ల్.. ఇలాంటి వాఖ్య‌లు చేస్తున్న నీకు త‌మిళ‌నాడు హిందూ ఓట‌ర్లు వాత పెట్ట‌డం ఖాయం..

క‌మ‌ల్ హాస‌న్ మాన‌సిక స్థితి బాగా లేద‌ని  అంటున్నారు కొంద‌రు నాయ‌కులు.. నేను ఈ వ్యాఖ్య‌ల‌తో ఏకీభ‌వించ‌డం లేదు.. ఎందుకంటే క‌మ‌ల్ (అతి) తెలివైన వాడిన‌ని క‌ల‌లు కంటూ ఏదేదో మాట్లాడేస్తున్నాడు.. ఎంతైనా రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాడు క‌దా?.. ఈయ‌నా ఒక సూడో సెక్యుల‌ర్ - పెక్యుల‌ర్ నాయ‌కుడు అని ముందుగానే తేలిపోయింది. దిగితే కానీ లోతు తెలియదు.. దిగాడుగా రాజకీయాల్లోకి.. ఇక‌ మూల్యం చెల్లించుకోడానికి ఆయ‌న సిద్దంగా ఉండాలి..