Thursday, December 7, 2017

కాంగ్రెస్ కు అయ్యరోరి కష్టాలు

అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లు ఉంది యవ్వారం.. శతాధిక వయోవృద్ధ కాంగ్రెస్ పార్టీకి వారసత్వ (వైఫల్య) నాయకుడు సారధి అవుతున్న వేళ హాచ్మంటూ తుమ్మేశాడు అయ్యరోరు..
2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీని ఛాయ్ వాలా అంటూ ఈసడించాడు మణిశంకర్ అయ్యర్.. ఎన్నికల తర్వాత మోదీ కాంగ్రెస్ ఆఫీసు ముందు ఛాయ్ అమ్ముకుంటాడని ఎద్దేవా చేశాడు..
ఛాయ్ అమ్మి జీవితాన్ని ప్రారంభించిన మోదీ ఈ మాటలతో కుంగిపోలేదు.. ఛాయ్ నే ట్రేడ్ మార్క్ చేసుకున్నారు.. ఛాయ్ పే చర్చా పెట్టారు.. దేశానికి ప్రధాని అయిపోయారు.. పాపం అయ్యరోరు ఛాయ్ అమ్ముకొని బతకడానికి కూడా పనికిరాకుండా పోయాడు..
ఇప్పుడు ఈ అయ్యరోరు ప్రధాని మోదీని నీఛ్ అంటున్నాడు.. గతంలో మాదిరే మోదీకి మళ్లీ ఆయుధం దొరికింది.. బెంబేలెత్తిన రాహుల్ గాంధీ అర్జంటుగా మణిశంకర్ అయ్యర్ తో క్షమాపణ చెప్పించారు.. ఇది చాలదనుకున్నారేమో.. ఏకంగా ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా సాగనంపారు..

అన్నట్లు ఈ అయ్యరోరు రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడు కావడాన్ని సమర్ధించిన తీరు కూడా వింతగానే ఉంది. జహంగీర్ వారసుడిగా షాజహాను, షాజహాను వారసుడు ఔరంగజేబు వచ్చినప్పుడు ఎన్నికలు జరగలేదు.. అంటూ ఏదేదో చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలు సైతం బెడిసి కొట్టాయి.. కాంగ్రెస్ పార్టీ వారిది ఔరంగజేబు రాజ్యమని ఎద్దేవా చేశారు ప్రధాని మోదీ.. పాపం కాంగ్రెసోళ్లకు ఈ మణిశంకర్ అయ్యరోరు శల్యునిలా దాపురించారు..

No comments:

Post a Comment