Wednesday, December 13, 2017

అంత రహస్యం ఏమిటో?

‘ఉల్టా చోర్ కొత్వాల్ కో మారా..’ తాము చేసిన పనికి సిగ్గు పడకుండా ఎదురుదాడికి దిగడం ఎందుకో?..
గుజరాత్ ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకులు పాకిస్తానీ నాయకులతో సమావేశం కావడం దేనికి సంకేతం?.. ఈ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్థావించగానే ‘దూడ గడ్డి కోసం తాటిచెట్టు ఎక్కాం..’ అన్నట్లు ఆ పార్టీ వివరణ ఇచ్చుకోవడం ఏమిటి?.. ‘మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి..’ అంటూ పాకిస్తాన్ ప్రకటించడం.. ‘అసలు పాకిస్తాన్, చైనాల ప్రస్థావన ఎందుకు?, ప్రధాని క్షమాపణ చెప్పాలి’ అని కాంగ్రెస్ భుజాలు తడుముకోవడం దేనికి సంకేతం.. గతంలో కూడా రాహుల్ గాంధీ చైనా నాయకులను రహస్యంగా కలుసుకోవడం, ఒక విదేశీ ప్రతినిధుల విందులో దేశ రాజకీయాల గురుంచి నోరు జారడం అందరికీ తెలిసిందే..
తాజా ఘటనలో నిజంగానే కాంగ్రెస్ పార్టీకి నిజంగానే దురుద్దేశ్యం లేకపోతే భాజపా నాయకులు బయట పెట్టే దాకా భేటీ విషయాన్ని ఎందుకు దాచారు?.. పైగా ఈ సమావేశం జరిగింది ప్రధానిని ‘నీచ్’ అంటూ దుర్భాషలాడిన మణిశంకర్ అయ్యర్ ఇంట్లో.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మరి కొందరు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్న ఈ సమావేశం పాకిస్తాన్ మాజీ మంత్రి గౌరవార్థం అట..
బురదలోకి దిగి తమకు మరకలు అంటించొద్దని హెచ్చరించడం అంటే ఇదే మరి.. పాకిస్తాన్ నాయకులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపిందంటే దానికి ఒక అధికార హోదా ఉంటుంది.. చర్చల సారాంశం కూడా అందరికీ తెలుస్తుంది.. కానీ కాంగ్రెస నాయకులు ఏ హోదాలో శత్రు దేశం నాయకులతో సమావేశమైనట్లు? పైగా రహస్యంగా ఎందుకు దాచిపెట్టినట్లు? అందునా గుజరాత్ ఎన్నికల వేళ భేటీ ఏమిటి?.. పైగా అడిగితే దబాయింపు..
(12.12.2017)

No comments:

Post a Comment