Tuesday, October 24, 2017

రాజేశ్ మిశ్రా హత్య.. ద్వంద్వ ప్రమాణాలు

దృశ్యం - 1
గౌరీ లంకేశ్ (55), జర్నలిస్ట్.. గత నెల బెంగుళూరులో దారుణ హత్యకు గురయ్యారు.. దేశమంతా సంచలనం సృష్టించింది.. నాయకులు, మేధావులు, జర్నలిస్టులు, రాజకీయ పార్టీలు, సంఘాలు, సంస్థలు ఈ హత్యను ఖండించాయి.. పోటీలు పడి ఆందోళనలు జరిపారు..
దృశ్యం - 2
రాకేశ్ మిశ్రా (38), జర్నలిస్ట్.. ఇటీవలే ఉత్తరప్రదేశ్ గాజీపూర్ లో దారుణ హత్యకు గురయ్యారు. ఎక్కడా పెద్దగా చర్చ జరగలేదు.. నాయకులు, మేధావులు, జర్నలిస్టులు, రాజకీయ పార్టీలు, సంఘాలు, సంస్థలు పెద్దగా పట్టించుకోలేదు.. అసలు ఆందోళనలు జరిపేవారే కరువయ్యారు..
మొదటి వ్యక్తి హత్యకు ఎంతో హడావుడి చేసిన పెద్ద మనుషులు, రెండో హత్య విషయంలో ఏ మాత్రం స్పందించలేదు.. పెద్దగా పట్టించుకోలేదు..
ఒక జర్నలిస్టు హత్య జరిగితే మిన్ను విరిగి మీద పడిందా అనే రీతిలో గగ్గోలు పెట్టిన నోళ్లు మరో జర్నలిస్టు హత్య విషయంలో మూగనోము ఎందుకు పట్టాయి? ఎందుకు ఇంత వివక్షత?.. రాజేశ్ మిశ్రా ఆరెస్సెస్ కావడమే కారణమా?.. దేశ భక్తే అతని నేరమా?..
వామపక్ష భావజాలానికి ఊడిగం చేయడమే మేధావితమా? జాతీయవాద సిద్దాంతాన్ని నమ్ముకోవడం పాపమా?.. ఎందుకు ఈ ద్వంద్వ ప్రమాణాలు? నిద్ర పోతున్నవారిని లేపవచ్చు.. నిద్ర నటిస్తున్నవారిని ఏమి అనగలం..

నేను గౌరీ లంకేశ్ హత్యను ఖండించాను.. రాజేశ్ మిశ్రా హత్యను అంతకన్నా ఎక్కువగా తప్పు పడుతున్నాను. ఎందుకంటే నేను మానవత్వం ఉన్నవాన్ని.. రాజేశ్ మిశ్రాకు ఆశ్రు నివాళి.. ఓం శాంతి..

Wednesday, October 11, 2017

మిడి మిడి పప్పూ..

కొందరికి వయసు ఎంత వచ్చినా, తెలివి మాత్రం పెరగదు.. ఈ దేశ చరిత్ర, సంస్కృతి సంప్రదాయాలు అర్థం కావు.. ఎంపీగా ఎన్నికైనా పార్లమెంటులో ఎంత మంది సభ్యులు ఉంటారు అనేది కూడా తెలియదు.. చివరకు సొంత అమ్మ కూడా వారిని విశ్వసించక వారసత్వ పీఠం కట్టబెట్టడానికి వెనుకాడుతుంటారు.. నేను చెప్పేది పప్పూ గురుంచే..
ఆరెస్సెస్ లో షార్ట్స్ వేసుకున్న మహిళలను ఆయన చూడలేదట..
రహస్యంగా పబ్బుల చుట్టూ తిరుగుతూ, విదేశీ విలాస యాత్రలు చేసి వచ్చే వారి నుంచి ఇంతకన్నా మంచి వ్యాఖ్యలను ఎలా ఆశించగలం?
దేశ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించే వీర నారీమణులను తయారు చేసే రాష్ట్ర సేవికా సమితి గురుంచి తెలియకపోతే తెలుసుకో పప్పూ..

ట్రాఫిక్ రూల్స్ పాటించండిరా నాయనా!

ద్విచ‌క్ర వాహ‌న‌దారులు హెల్మెట్ ధ‌రించ‌డం త‌ప్ప‌నిస‌రి.. ప్ర‌మాదం జరిగిన‌ప్పుడు మ‌న శ‌రీరంలో అతి ముఖ్య భాగ‌మైన త‌ల‌కు గాయం కాకుండా కాపాడుతుంది. దుర‌దృష్టం కొద్ది జ‌నం హెల్మెట్ ధ‌రించ‌డాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. పైగా త‌మ జుట్టుకు ఇబ్బంది అని, మెడ నొప్పి అని సోది వినిపిస్తారు. మ‌రి కొంద‌రు ముందు రోడ్లు బాగు చేయ‌మ‌ని ప్ర‌భుత్వానికి ఉచిత స‌ల‌హా ఇస్తారు.. ఇంత‌క‌న్నాఘోరం ఏమిటంటే ద్విచ‌క్ర‌వాహ‌నాల‌పై ముగ్గురు న‌లుగురు ప్ర‌మాణం చేయ‌డం..త‌మ‌తో పాటు మిగ‌తావారి ప్రాణాల‌ను కూడా ప‌ణంగా పెట్ట‌డం దారుణం. అనంత‌పురం జిల్లాలో ఓ వ్య‌క్తి ఏకంగా త‌న‌తో పాటు మ‌రో న‌లుగురు కుటుంబ స‌భ్యుల‌ను బైక్ పై ఎక్కించుకొని బ‌య‌లు దేరాడు. వీరిని చూసి అవాక్కైన‌ ఎస్సై శుభ‌కుమార్ ఆపి చేతుతెత్తి దండం పెట్టాడు.. ఈ ఫోటో న‌వ్వు తెప్పిస్తున్నా పౌరులుగా, వాహ‌న‌దారులుగా నిబంధ‌న‌లు పాటించాల‌నే బాధ్య‌త‌ను గుర్తు చేస్తోంది.

Sunday, October 8, 2017

శ్రీవైకుంఠపుర సందర్శన

శ్రీవైకుంఠపురం.. సంగారెడ్డిలో కొలువైన ఈ దేవస్థానం నిజంగా ఒక అద్భుతమైన.. అక్కడ కొలువైన 14 అడుగుల శ్రీ వేంకటేశ్వర స్వామి మూల విరాట్ విగ్రహం చూడటం మహాద్భాగ్యం.. ఆలయ ప్రాంగణంలోని సర్వమంగళాదేవి, దాసాంజనేయ స్వామి, సుదర్శన నారసింహ స్వామి, అడుగుల మహాలక్ష్మి అమ్మవారి విగ్రహాలు.. అన్నింటికీ మించి గోశాల, కోనేరు చూడ ముచ్చట అనిపించాయి..
WE CAN CHANGE సోషల్ మీడియా మిత్ర బృంద సభ్యులం కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ దర్శనం చేసుకున్నాం.. అక్కడ ప్రధానార్చకులు వరదాచార్యులు మా బృందంతో మాట్లాడిన అరగంట ఏంతో స్పూర్తిని నింపింది.. హైందవ ధర్మ పరిరక్షణ విషయంలో వారికి ఉన్న తన నిజంగా మమ్మల్ని కదిలించింది.. ఆలయ సందర్శన తర్వాత జరిగిన సమావేశంలో ధర్మం, దేశం, సమాజ రక్షణలో జాతీయ వాదులుగా మేం నిర్వహించాల్సిన బాధ్యతను గుర్తు చేసుకున్నాం..
శ్రీవైకుంఠపురానికి మమ్మల్ని ఆహ్వానించింది, ఆతిథ్యం ఇచ్చింది పురం సంతోష్.. ఆలయ జీర్ణోద్ధరణలో ఆయన కుటుంబ పాత్ర చాలా ఉంది.. సంతోష్ కు మేమంతా ఎంతో రుణపడి ఉన్నాం.. ఆయన సరస్వతీ విద్యాపీఠం పూర్వ విద్యార్థి, WCC సభ్యుడు కావడం మాకెంతో గర్వకారణంగా భావిస్తున్నాం.. సంతోష్ కు ప్రత్యేక ధన్యవాదాలు..

We Can Change మున్ముందు చేపట్టే కార్యక్రమాలకు ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు కావాలని కోరుకుంటున్నాం..