Tuesday, October 24, 2017

రాజేశ్ మిశ్రా హత్య.. ద్వంద్వ ప్రమాణాలు

దృశ్యం - 1
గౌరీ లంకేశ్ (55), జర్నలిస్ట్.. గత నెల బెంగుళూరులో దారుణ హత్యకు గురయ్యారు.. దేశమంతా సంచలనం సృష్టించింది.. నాయకులు, మేధావులు, జర్నలిస్టులు, రాజకీయ పార్టీలు, సంఘాలు, సంస్థలు ఈ హత్యను ఖండించాయి.. పోటీలు పడి ఆందోళనలు జరిపారు..
దృశ్యం - 2
రాకేశ్ మిశ్రా (38), జర్నలిస్ట్.. ఇటీవలే ఉత్తరప్రదేశ్ గాజీపూర్ లో దారుణ హత్యకు గురయ్యారు. ఎక్కడా పెద్దగా చర్చ జరగలేదు.. నాయకులు, మేధావులు, జర్నలిస్టులు, రాజకీయ పార్టీలు, సంఘాలు, సంస్థలు పెద్దగా పట్టించుకోలేదు.. అసలు ఆందోళనలు జరిపేవారే కరువయ్యారు..
మొదటి వ్యక్తి హత్యకు ఎంతో హడావుడి చేసిన పెద్ద మనుషులు, రెండో హత్య విషయంలో ఏ మాత్రం స్పందించలేదు.. పెద్దగా పట్టించుకోలేదు..
ఒక జర్నలిస్టు హత్య జరిగితే మిన్ను విరిగి మీద పడిందా అనే రీతిలో గగ్గోలు పెట్టిన నోళ్లు మరో జర్నలిస్టు హత్య విషయంలో మూగనోము ఎందుకు పట్టాయి? ఎందుకు ఇంత వివక్షత?.. రాజేశ్ మిశ్రా ఆరెస్సెస్ కావడమే కారణమా?.. దేశ భక్తే అతని నేరమా?..
వామపక్ష భావజాలానికి ఊడిగం చేయడమే మేధావితమా? జాతీయవాద సిద్దాంతాన్ని నమ్ముకోవడం పాపమా?.. ఎందుకు ఈ ద్వంద్వ ప్రమాణాలు? నిద్ర పోతున్నవారిని లేపవచ్చు.. నిద్ర నటిస్తున్నవారిని ఏమి అనగలం..

నేను గౌరీ లంకేశ్ హత్యను ఖండించాను.. రాజేశ్ మిశ్రా హత్యను అంతకన్నా ఎక్కువగా తప్పు పడుతున్నాను. ఎందుకంటే నేను మానవత్వం ఉన్నవాన్ని.. రాజేశ్ మిశ్రాకు ఆశ్రు నివాళి.. ఓం శాంతి..

No comments:

Post a Comment