Wednesday, February 28, 2018

ఏది నమ్మాలి?

26.02.2018

మధు హత్యను పట్టించుకోరా?



మన దేశ పార్లమెంట్ మీద దాడి చేసిన దేశ ద్రోహికి ఉరి శిక్ష వేస్తే అతనికి సంఘీభావంగా ప్రదర్శనలు చేపట్టారు..
కర్ణాటకలో మహిళా జర్నలిస్టును హత్య చేసింది ఎవరో తెలియకున్నా ఒక సంస్థను టార్గెట్ చేస్తూ ఆందోళనలు జరిపారు..
సెంట్రల్ యూనివర్సిటీలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు సామాజిక వర్గం రంగు పులిమి గోల చేశారు..
కానీ..
కేరళలో ఒక ఆదివాసీ యువకుడు ఆహారం దొంగిలించాడే సాకుతో సెల్ఫీలు దిగి మరీ దారుణంగా కొట్టి చంపితే ఎవరికీ పట్టదేం.. 
ఏమయ్యాయి మీ ఆందోళలు, నిరసనలు, ప్రదర్శనలు.. 
ఆదివాసి మధు ప్రాణానికి విలువ లేదా?.. కేరళ ప్రభుత్వ కనుసన్నల్లో జరుగుతున్న ఇతర హత్యల విషయంలోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది ఎందుకు?
25.02.2018

శ్రీదేవికి ఆశ్రునివాళి



కథగా కల్పనలా కనిపించి మాయమైందో వసంతకోకిల..
దివి నుంచి భువికి వచ్చి తిరిగి వెళ్ళిపోయిందో ఇంద్రజ..
పదహరేళ్లకే నిండు నూరేళ్లు నిండిపోయాయా?..
ఎప్పటికీ లేవని నిద్రలోకి జరుకున్నావా?..
నీవిక లేవా?.. శ్రీ దే వి
25.02.2018

కాషాయం అంటే వారికి భయం భయం


కాషాయం.. ఈ ప‌దం విన‌గానే కొంద‌రు వ్య‌క్తులు గంగ‌వెర్రులెత్తిపోతున్నారు.. ఇదేమో బీజేపీ, ఆరెస్సెస్‌ల ట్రేడ్ మార్క్ అన్న‌ట్లుగా భ‌య‌ప‌డిపోతూ దూరం దూరం అంటున్నారు. ఈ సంస్థ‌లు పుట్ట‌క ముందే వేలాది సంవ‌త్స‌రాలుగా కాషాయం ఉంది. అది ఒక మ‌త చిహ్నం మాత్ర‌మే అనుకుంటే అంత‌క‌న్నా అజ్ఞానం మ‌రొక‌టి ఉండ‌దు. స‌నాత‌న ధ‌ర్మం, సంస్కృతిక వార‌స‌త్వంతో ముడిప‌డిన కాషాయం రంగు త్యాగానికి ప్ర‌తీక‌.. దేశ సంస్కృతి, చ‌రిత్ర మీద ఏమాత్రం అవ‌గాహ‌న లేనివారు, సంకుచిత రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం పాకులాడే వారు, కొన్ని విచ్చిన్న‌ర‌క‌ర శ‌క్తులు ఈ త‌ర‌హా ధోర‌ణిని ప్ర‌ద‌ర్శిస్తున్నాయి. 
కొత్త‌గా రాజ‌కీయ పార్టీ పెట్టిన న‌టుడు కాషాయం అంటేనే ఉలిక్కి ప‌డుతున్నాడు. ఏకంగా జాతీయ ప‌తాకంలోని కాషాయం రంగు విస్త‌రించ వ‌ద్దంటున్నాడు. ఈయ‌న‌కు అస‌లు జాతీయ ప‌తాకం, రాజ్యాంగ‌ప‌ట్ల ఏమాత్రం అవ‌గాహ‌న లేదు అన‌డం క‌న్నాకొన్ని శ‌క్తులు ఆయ‌న‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నాయి అన‌డం స‌మంజ‌సం. జాతీయ ప‌తాకంలోని మూడు రంగులు మ‌తాల‌కు ప్ర‌తీక‌గా భావించేవారిని చూసి వారి తెలివి త‌క్కువ‌త‌నానికి జాలి ప‌డ‌టం మిన‌హా మ‌రేం చేయ‌లేం.. 
భార‌త తొలి ఉప రాష్ట్ర‌ప‌తి డాక్ట‌ర్ స‌ర్వేప‌లి రాధాకృష్ణ‌న్ ఉల్లేఖ‌నం ప్ర‌కారం.. "కాషాయరంగు త్యాగానికి గుర్తు. ఇది మన నాయకులు స్వలాభాన్ని విడిచిపెట్టి తమ కర్తవ్యానికి అంకితం కావాలని సూచిస్తుంది. తెలుపురంగు మన ప్రవర్తనను నిర్దేశించే వెలుగుకు, సత్యానికి గుర్తు. ఆకుపచ్చరంగు మట్టితో మనకున్న అనుబంధానికి, ఇతరజీవులన్నీ ఏ వృక్షసంపదమీద ఆధారపడి ఉన్నాయో ఆ పచ్చని చెట్లకు గుర్తు. అశోకచక్రం ధర్మపాలనకు గుర్తు. సత్యం, ధర్మం అనేవి ఈ పతాకం క్రింద పనిచేసే ప్రతి ఒక్కరి నియమాలు కావాలి. పైగా చక్రం చలనానికి, చైతన్యానికి గుర్తు. జీవమున్న ప్రతిచోటా చైతన్యముంటుంది. చైతన్యం లేనిది చావులోనే. భారతదేశం ఇక మీదట మార్పును స్వాగతిస్తూ ముందుకు సాగిపోవాలి. చక్రం శాంతియుతమైన, చైతన్యవంతమైన ప్రగతికి చిహ్నం." (మ‌రిన్ని వివ‌రాల‌కు చూడండి:http://india.gov.in/knowindia/national_flag.php)
కాషాయం స్వచ్ఛతకు, ఆధ్యాత్మికతకు; తెలుపు శాంతికి, సత్యానికి; ఆకుపచ్చ సాఫల్యతకు, సస్యసమృద్ధికి చిహ్నాలనే ఒక అనధికారిక అన్వయం కూడా బాగా ప్రచారంలో ఉంది.
ఇప్ప‌టికైనా కాషాయం రంగును అవ‌మానించ‌డం మానుకోండి
24.02.18

నాకు అది కావాలి అంతే..


‘ఏమండీ డైమండ్ రింగ్ కొనిస్తారా?’
‘డైమండ్ రింగ్ బదులు మరిన్ని బంగారు ఆభరణాలు చేయించుకోవచ్చు కదా?’
‘అయితే ఓకే.. డబ్బులు ఇవ్వండి..’
ఆయన గారు అప్పుడప్పుడూ డబ్బులు ఇస్తూ పోయారు.. ఈవిడేమో ఇతరత్రా ఖర్చు చేసింది.. చివరకో రోజు ఇచ్చిన సొమ్ముకు లెక్కలు అడగాడు.. ఆమె లెక్క చెప్పడం దేవుడెరుగు ఇంటి బయటకు వచ్చి రచ్చ చేసింది.. ‘నా మొగుడు ఖర్చులకు డబ్బులివ్వడం లేదు’ అని ఇకటే గోల..
ఇంకేం దారిన పోయే దానయ్య, పనీ పాటా లేని పుల్లయ్య, ఖాళీగా తిరిగే కనకయ్య, తిన్నది అరగని తిమ్మయ్య గుమి గూడారు.. ‘ఏమయ్యా ఆమె అడిగిన సొమ్ములు ఇవ్వొచ్చు కదయ్యా’ అంటాడు ఒకాయన.. ‘ఆమె ఏమైనా ఖర్చు చేసుకుంటుంది, నీకెందుకయ్యా’ అంటాడు ఇంకొకాయన.. ‘విడాకులు ఇచ్చేయి’ అని సలహా ఇస్తాడో తింగరోడు..
ఇది చదివినోళ్లు ఆలోచించుకోవచ్చు.. ఎక్కడో తగలినోళ్లు భుజాలు తడుముకోవచ్చు.. మీ ఇష్టం..

23.02.2018

పార్టీ పెట్టగానే పండుగ కాదు కమల్..



'కమల్ హాసన్ పార్టీ పెట్టిండంట కదా?’ అని చిన్నప్పటి ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేశాడు.. ‘అయితే ఏందంట..’ అని నేను రిప్లయ్ ఇచ్చే సరికి అతడు కొద్ది క్షణాలు నివ్వెరబోయి, ‘అదేంది అట్లంటవ్?’ అని వేరే సబ్జక్ట్ లోకి వెళ్లిపోయాడు.. నన్ను దగ్గరగా చూసిన వారికి నిజంగానే కమల్ విషయంలో నా తాజా వైఖరి ఆశ్చర్యాన్నే కలిగిస్తుంది.
నేను సినిమాలు పెద్దగా చూడను.. కానీ చూసిన సినిమాల్లో కమల్ హాసన్ వే ఎక్కువ.. అలా నాకు తెలియకుండానే అందరి దృష్టిలో ఆయనకు ఫ్యాన్ అయిపోయా.. నేను చూసిన మొదటి కమల్ హాసన్ చిత్రం సాగర సంగమం.. ఆ తర్వాత స్వాతిముత్యం, వసంత కోకిల, ఇది కథ కాదు, ఆకలి రాజ్యం, నాయకుడు, పుష్పక విమానం, విచిత్ర సోదరులు, ఇంద్రుడు చంద్రుడు, భారతీయుడు, క్షత్రియ పుత్రుడు, భామనే సత్యభామనే, సతీలీలావతి, ద్రోహి, గుణ, మహానది, హేరామ్, సత్యమే శివమ్, దశావతారం, విశ్వరూపం.. ఇలా ఆయన నటించిన దాదాపు అన్ని చిత్రాలు చూశాను. కమల్ సహజ నటన, సృజనాత్మకత, కొత్త ప్రయోగాలు నాకు చాలా నచ్చేవి.
కమల్ హాసన్ తర్వాత నాకు నచ్చిన నటుడు రజినీకాంత్.. వారు తెలుగులో నేరుగా నటించినవి అతి కొద్దివే.. మిగతావన్నీ డబ్బింగ్.. అయినా నేను వారు తమిళురు అని ఏనాడూ భావించలేదు.. గొప్ప భారతీయ నటులుగానే చూశాను.. కానీ వారి మొదటి ఆట చూడాలి అనేంత వెర్రి అభిమానిని మాత్రం కాదు.. నాకు వీలుంటే చూస్తాను.. చూడని చిత్రాలే ఎక్కవ,,
రీల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు.. ఈ హద్దులు నాకు తెలుసు. అందుకే ఎవరెంత విమర్శించినా కమల్ వ్యక్తిగత జీవితాన్ని నేను అంతగా పట్టించుకోను. కానీ వారు ఎప్పుడైతే ప్రజా జీవితంలోకి వచ్చారో, అప్పుడు అన్నీ పట్టించుకోక తప్పడం లేదు.. కమల్ ఇప్పుడు ‘మక్కల్ నీది మయ్యమ్’ అనే రాజకీయ పార్టీని పెట్టారు.. పార్టీ పెట్టుకునే స్వేచ్ఛ ఆయనకు ఉండొచ్చు.. కానీ అభిమానిగా నాలాంటి వారు సమర్ధించాల్సిన అవసరం అయితే కనిపించలేదు.. అందుకు సహేతుక కారణాలు ఉన్నాయి..
కమల్ నాస్తికుడిని అని చెప్పుకుంటారు.. అది ఆయన వ్యక్తిగతం. కానీ మెజారిటీ ప్రజల హిందూ మతాన్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. గుడి దగ్గర బిచ్చగాడిని చూసి దేవుని మీద విరక్తి కలిగింది అంటారు.. మరి మిగతా మతాల ప్రార్థనాకేంద్రాల దగ్గర బిచ్చగాళ్ల సంగతేంటి? అనే ప్రశ్నకు సమాధానం లేదు.. కాషాయానికి ఆయన విరుద్దమట.. కమల్ ఆరెస్సెస్, బీజేపీలకు వ్యతిరేకం కావచ్చు, హిందూ మతానికి వీరు మాత్రమే గంపగుత్త కాదు కదా?.. సనాతన ధర్మానికి, త్యాగానికి ప్రతీక అయిన కాషాయంపై ఎందుకు విషం చిమ్ముతున్నారు?.. ఆధ్మాత్మిక విలువలు ఉన్న రజనీ కాంత్ కాషాయానికి దగ్గర అని నోరు పారేసుకున్నారు. కమల్ పార్టీ పెట్టడానికి ముందుగా పలు అంశాలపై కొద్ది రోజుల వ్యవధిలోనే పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారు.. భిన్న ధృవాలైన పార్టీల నాయకులను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. స్వయాన పార్టీ పెడుతున్నప్పుడు ఈ ముందస్తు బేరాలు ఏమిటి?
కమల్ హాసన్ ను నటుడుగా దేశ వ్యాప్తంగా అభిమానించేవారున్నారు. కానీ ఆయన తమిళనాడు హద్దులకే పరిమితం.. పైగా ద్రవిడ, దక్షిణాది అంటూ దబాయింపు.. తమిళపేరుతో ఉన్న ఆయన పార్టీ దక్షిణాది మొత్తానికి ఎలా ప్రతీక అవుతుంది? ఆయన పార్టీ ఇతర రాష్ట్రాల్లో పోటీ చేసేది లేదు. పొత్తులు పెట్టుకునే అవకాశాలు తక్కువే. నా మాతృభాష తెలుగు అయినా నేను ఒక ‘భారతీయుడు’ని అని భావిస్తాను.. కానీ కమల్ మాత్రం తాను ‘తమిళ్’ అని గిరి గీసుకున్నారు.
ఇప్పడు చెప్పండి ఇంకా ఎలా అభిమానించేది.. నా దృష్టిలో ఒకప్పుడు కమల్ హాసన్ అనే గొప్ప నటుడు ఉండేవాడు అంతే..
22.02.2018

మన భాషను కాపాడుకుందాం..



మిత్రులారా.. ఇవాళ మనం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.. అసలు విషయంలోకి వచ్చే ముందు మూడు ప్రశ్నలు వేసుకుందాం..
1. మీ పిల్లలు తెలుగు మాధ్యమంలోనే చదువుతున్నారా?
2. తెలుగు పత్రికలను స్పష్టంగా చదవగలరా?
3. అన్య భాషా పదాలు లేకుండా తెలుగులో మాట్లాడుతున్నారా?..
ఈ మూడు ప్రశ్నల్లో ఏ ఒక్కదానికీ ఔననే సమాధానం లేకపోతే మన ఇంట్లో తెలుగు భాషకు ప్రమాద ఘంటికలు మోగుతున్నట్లే లెక్క.. 
ప్రపంచంలో తెలుగు మాతృభాషగా ఉన్నవారి సంఖ్య 10 కోట్ల వరకూ ఉంటుందని ఒక అంఛనా.. ఇందుతో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే ఉన్నారు.. కర్ణాటక, తమిళనాడు, ఒడిషా రాష్ట్రాల్లో 30 నుంచి 40 శాతం దాకా, మహారాష్ట్ర, పాండిచ్చేరిలలో 20 శాతం వరకూ తెలుగు వారు ఉన్నారు..
నిజానికి దేశంలో ఎక్కువ మంది ప్రజల మాతృభాష తెలుగే.. ఇందుకు మనం జబ్బలు చరచుకోవాల్సిన అవసరం లేదు.. ఎందుకు అంటే ప్రపంచంలో అంతరిస్తున్న భాషల జాబితాలో చేరేందుకు శతాబ్దంకన్నా ఎక్కువ కాలం పట్టకపోవచ్చు..
తెలుగు అధికారిక భాషగా గుర్తింపు ఉన్న రాష్ట్రాల్లోనే మాతృ భాషకు దిక్కు లేదు. రెండు రాష్ట్రాల పాలకులు తెలుగు భాషాభివృద్ధి గురుంచి సుద్దులు బాగేనే చెప్పుతారు. ఉత్సవాలు చేస్తారు, గంభీరమైన ప్రకటనలు చేస్తుంటారు.. కానీ ఆచరణలో మాత్రం ఏమీ ఉండదు.. తమిళనాడు, కర్ణాటకలు విపరీతమైన స్వభాషాభిమానంతో తెలుగు భాషను అణచివేస్తున్నాయని బాధపడతాం.. ఈ విషయంలో మనం ఎక్కువగా స్పందిస్తే గొంగట్లో వెంట్రుకలు ఏరినట్లే ఉంటుంది..
తెలుగు భాషకు ప్రాచీన హోదా కావాలని కేంద్రంతో పోరాడి సాధించుకున్నాం.. కానీ ఏం జరిగింది.. పీఠం ఏర్పాటును గాలికి వదిలేస్తే అది మైసూరులో స్థిరపడిపోయింది..
తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ కోసం ప్రభుత్వం సక్రమంగా పని చేయడం లేదని, ఆంగ్లానికే పెద్ద పీట వేస్తున్నారని ఆరోపిస్తుంటాం.. కానీ భాషను రక్షించుకునే విషయంలో మన వంతు పాత్ర ఏమిటి అనే ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు..
తెలుగు మాధ్యమం పాఠశాలలు మూత పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాం.. కానీ మన పిల్లలను మాత్రం ఆంగ్ల మాద్యమ పాఠశాలలకే పంపుతాం..
టీవీ యాంకర్లు భాషను ఖూనీ చేస్తున్నారని నిందిస్తున్నాం.. కానీ అలాంటి కార్యక్రమాలు ఎందుకు చూస్తున్నామనే విషయాన్ని ఆలోచించం..
మీలో తెలుగు అక్షరాలను వరుసక్రమం తప్పకుండా రాసే వారు ఎంత మంది?.. ఇంతకీ తెలుగు భాషలో అక్షరాలు ఎన్ని ఉన్నాయి?.. కొన్ని అక్షరాలను ఎందుకు మింగేశాం? ఈ రోజు మనం మాతృ భాషను వదిలేసి అన్య భాషల వెంట పడుతున్నాం.. రేపు మన ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాలను కూడా ఇలాగే వదిలేస్తామా?
మారుతున్న సమాజంలో విద్య, ఉపాధి అవకాశాలు ఆంగ్ల భాష చుట్టే తిరుగుతున్నాయనేది సత్యం.. కాదనలేం.. మన పిల్లలను ఆంగ్ల మాధ్యమాల్లో చదివించక తప్పని పరిస్థితి వచ్చింది. నిజమే.. కానీ అదే సమయంలో మన భాషా సంస్కృతులను కూడా పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం మన ఇళ్లలో అయినా తెలుగు భాషను రక్షించుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలు కొంత మేరకైనా చేస్తున్నామా?
మన దేశంలో 42 భాషలు, మాండలికాలు త్వరలో అంతరించిపోయే ప్రమాదం ఉందని ఇటీవల కేంద్ర హోంశాఖ నివేదిక వెల్లడించింది. ఇందులో అండమాన్ నికోబార్ దీవులకు చెందినవి 11, మణిపూర్ (7), హిమాచల్ (4) కాగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన గడాబా, నైకీ ఉన్నాయి. అంతరిస్తున్న భాషల్లో మన తెలుగు లేదని సంతోష పడుతున్నారా?.. అప్పుడే సంబర పడకండి.. తర్వలో ఆ ముచ్చటా తీరిపోయే ప్రమాదం కనిపిస్తోంది..
తెలుగు భాషను రక్షించుకునే విషయంలో వ్యక్తిగా మనవంతు కర్తవ్యాన్ని నిర్వహిద్దాం.. సమాచార సాంకేతిక రంగం విస్తరించిన ఈ రోజుల్లో మాతృభాషను రక్షించుకునే అవకాశాలు గతంలో కన్నా మెరుగయ్యాయి.. దీన్ని సద్వినియోగం చేసుకోగలిగితే మన భాషకు ఎప్పటికీ ఢోకా ఉండదు.. ఎన్ని భాషలైనా నేర్వండి.. కానీ మీ మాతృభాషను మాత్రం మరచిపోకండి..
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం (21 ఫిబ్రవరి) సందర్భంగా ఆలోచించాల్సిన విషయాలు ఇవి..
21.02.2018

కేజ్రీ పార్టీ గుండాయిజానికి పరాకాష్ట



రాజకీయాలను ఏదో ఉద్దరిస్తామని గద్దెనెక్కిన కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం సీటులో కూర్చున్నది మొదలు ఇప్పటి దాకా చేస్తున్న ఘనకార్యాలు ఏమిటో ఎన్నో చూశాం.. పరిపాలన గాలికి వదిలేసి నిత్యం కేంద్ర ప్రభుత్వంతో, లెఫ్టినెంట్ జనరల్ తో గిల్లి కజాలతో సరిపోతోంది.. ఆప్ ఎమ్మెల్యేలలో ఎక్కువగా నేర చరితులే ఉన్నారని రికార్డులు చెబుతున్నాయి.
 తాజాగా ఈ ఎమ్మెల్యేలు ఏకంగా ఢిల్లీ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్ పై చేయి చేసుకోవడం విస్మయానికి గురి చేస్తోంది. ప్రభుత్వంలో చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు తత్కాలికం. కానీ అధికార యంత్రాంగం శాశ్వతం.. వీరిద్దరి మధ్య సయోధ్య ఉంటేనే ప్రభుత్వాలు నడుస్తాయి. ఈ మాత్రం ఇంగితం మాజీ బ్యూరోక్రాట్ కేజ్రీవాల్ కు తెలియదని అనుకోలేం.. దేశ రాజధాని ఢిల్లీ కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండటం సహజం.. దీన్ని అర్థం చేసుకోకుండా నిత్యం తగువులతోనే కాలం గడపడం, అధికారులను బెదిరించడం ఎంత వరకు సమంజసం? ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినయోగం చేసుకోలేని ఈ పాపు(ఆప్)లను ఇలాగే భరించాల్సిందేనా?.. ఈ గుండా ప్రభుత్వాన్ని తక్షణం రద్దు చేయాల్సిన అవసరం ఉంది..
21.02.2018

జై భవానీ.. వీర శివాజీ.. ఛత్రపతి



 శివాజీ మహరాజ్ జయంతి సందర్భంగా ఆయన స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో కొనసాగాలని ఆశిస్తూ..

19.02.2018

విద్యార్థులకు మోదీ చిట్కాలు



దేశవ్యాప్తంగా విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాసిన 'ఎగ్జామ్ వారియర్స్' పుస్తకం విడుదలైంది..
విద్యార్థులు పరీక్షల సమయంలో వత్తిడిని ఎలా తగ్గించుకోవచ్చు.. ఏకాగ్రతను పెంచుకొని, చదువుపై దృష్టి పెట్టడం ఎలా అనే విషయాలను ప్రధాని ఈ పుస్తకంలో ప్రస్తావించారు.. క్రమశిక్షణ, సమయపాలనతో పాటు వత్తిడిని జయించేందుకు యోగ సాధన సూచించారు. పెంగ్విన్ సంస్థ ఈ పుస్తకాన్ని ప్రచురించింది.. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా చదవాల్సిన పుస్తకం ఇది..
18.02.2018

మూర అలీ జిన్నా

నటుడు ముదిరి రాజకీయం నేర్చాడు.. నాయకుని బినామీగా ఆస్తులు కూడ బెట్టాడు.. జనం ఓట్లతో చట్ట సభకు పోయాడు.. ఇప్పుడు దేశాన్ని విడగొడదామంటున్నాడు..
వెంచర్లు చేసి అమ్ముకోడానికి ఈ దేశం నీ రియల్ ఎస్టేట్ కంపెనీ కాదు రా.. 'మూర్ అలీ జిన్నా'..


15.02.2018

అయ్యరోరు పాకీ భక్తుడు



పో.. పోరా.. అక్కడే చావు.. నీలాంటి మాతృదేశ ద్రోహుల కారణంగానే భారత్ ఇలా తయారైంది.. ఐఎస్ఐ ఏజెంట్లు ఎక్కడో లేరు.. అయ్యర్ లాంటి వారి రూపంలో దేశమంతా తగలడ్డారు..
14.02.2018

సైన్యంలో చేరతామంటే తప్పేముంది?



సుశిక్షితులైన సైనికుల్ని మూడు రోజుల్లోనే తయారు చేసి అందిస్తామని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ (ఆరెస్సెస్ చీఫ్) మోహన్ భగవత్ జీ చేసిన వ్యాఖ్యల్లో వివాదాస్పదం ఏముంది?.. ఆయన మాటలను అర్థం చేసుకోకుండా గుడ్డు మీద ఈకలు పీకే కామెంట్స్ ఎందుకు?..

దేశం కోసం ప్రాణాలర్పించేందుకు స్వయంసేవకులు ఎప్పటీ సిద్ధంగా ఉంటారని, సైనికుల మాదిరే స్వయం సేవకులు దేశభక్తి, క్రమశిక్షణతో శత్రువులతో పోరాడేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పడం సైన్యాన్ని అగౌరవ పరచడగమా?.. ఆర్మీకి సైనికులను తయారు చేయడానికి వారం రోజులు పడితే, ఆరెస్సెస్ కు మూడే రోజులు చాలు అన్నారు.. ఇందులో తప్పు ఏముంది?.. ఈ పని రాజ్యాంగం అనుమతిస్తేనే అని కూడా స్పష్టంగా చెప్పారు భగవత్ జీ.. వారికి ఉన్న కాన్ఫిడెన్స్ ను అభినందించడానికి ధైర్యం లేని వారు ఎన్నైనా కువిమర్శలు చేస్తారు.. పట్టించుకోవాల్సిన అవసరం లేదు..
భగవత్ జీ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ అండ్ కో డిమాండ్ చేస్తోంది.. ఎందుకు చెప్పాలి క్షమాపణలు.. ఆయన తప్పు ఏమి మాట్లాడారని? కశ్మీర్ తో సహా దేశ సరిహద్దు వివాద సమస్యలకు కారణమైన మీ కుటుంబ మాత్రం దేశానికి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదా?
దేశానికి స్వాతంత్ర్యం రావడంతో పాటు దేశ విభజన జరిగిన రోజుల్లో కొత్తగా ఏర్పడిన పాకిస్తాన్ నుంచి మానప్రాణాలు కోల్పోయి కట్టుబట్టలతో భారత్ కు వచ్చిన కోట్లాది మంది ప్రజల కన్నీరు తుడిచి ఆదుకున్నది ఎవరు?.. ముస్లింలీగ్ పార్టీ ప్రేరిత అల్లర్లు, మారణకాండ భారి నుంచి లక్షలాది మంది ప్రాణాలు కాపాడింది ఎవరు?.. మహారాజా హరిసింగ్ కశ్మీర్ భారత దేశంలో విలీనం చేయగానే పాకిస్తాన్ సైనిక మూకలు యుద్దానికి దిగినప్పుడు శ్రీనగర్ లో భారత సైన్యం దిగడం కోసం విమానాశ్రయాన్ని సిద్దం చేసింది ఎవరు?.. చైనా దురాక్రమ సమయంలో సైనిక, ఆయుధ పరంగా బలహీనంగా ఉన్న భారత సైన్యంలో అత్యవసరంగా చేరేందుకు ముందుకు వచ్చింది ఎవరు?.. అప్పటి వరకూ ఆరెస్సెస్ పై ఉన్న అపోహలు తొలగించుకున్న ప్రధాని నెహ్రూ కోరిక మేరకు ఆరెస్సెస్ స్వయం సేవకులు తొలిసారిగా గణతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కవాతు చేయడం వాస్తవం కాదా? ఇప్పుడు చెప్పండి ఎవరు క్షమాపణలు చెప్పాలి?
13.02.2018

Tuesday, February 27, 2018

Nation First అనేది మా నినాదం..

Nation First అనేది మా నినాదం.. Social media for Social Service అనేది మా విధానం.. సాధారణంగా సంస్థలు, విద్యాలయాలు వార్షికోత్సవాలు జరుపుకుంటాయి.. ఒక సోషల్ మీడియా గ్రూప్, అందునా వాట్సప్ గ్రూప్ ఇలాంటి కార్యక్రమం చేపట్టడం అరుదైన విషయం..
రెండేళ్ల క్రితం ప్రారంభమైన We Can Change ఒక ప్రభావవంతమైన సామాజిక మాధ్యమంగా రూపుదిద్దుకుంది. దేశభక్తి, జాతీయవాదమే ఊపిరిగా సాగుతున్న WCC కేవలం ఒక చాటింగ్ గ్రూప్ కాదు.. సమాజంలో మార్పు, సేవ కోసం తన వంతు పాత్రను పోషిస్తూ ముందుకు సాగుతోంది.
We Can Change ద్వితీయ వార్షికోత్సవం ఒక వేడుకగా కాకుండా చర్చా గోష్టిగా నిర్వహించాం.. ఈ కార్యక్రమానికి విశ్వహిందూ పరిషత్ తెలంగాణ అధ్యక్షులు సురేందర్ రెడ్డి గారు, జాతీయ సాహిత్య పరిషత్ సంఘటనా మంత్రి భాస్కర యోగి గారు, భాజపా సీనియర్ నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు హాజరై స్ఫూర్తిని నింపారు.. ఈ కార్యక్రమానికి హాజరైన, విజయవంతం చేసేందుకు కృషి చేసిన మిత్రులకు పేరు పేరునా ధన్యవాదాలు.. (11.02.2018)
ఫోటోల కోసం కింది లింక్ క్లిక్ చేయండి

రంగు మారితే చాలదు


విదేశీ సిద్ధాంత పార్టీ రంగులు మారుస్తోందా?.. మార్క్స్, ఎంగిల్స్, లెనిన్, స్టాలిన్, మావోలు ఇక లాభం లేదు అనుకున్నారా?.. స్వామి వివేకానందుని ఫోటో పెట్టుకుంటే అభ్యంతరం లేదు.. కానీ స్వామీజీ వస్త్రాల రంగు మార్చడమే బాగోలేదు.. అన్నట్లు కమ్యూనిజం ఏనాడో చచ్చింది అనే నిజం కూడా గ్రహిస్తే సంతోషం.. జాతీయవాదం స్వీకరిస్తే మరీ సంతోషం 

వాస్తవిక బడ్జెట్ ఇది..



సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముంగిట‌ వ‌చ్చిన కేంద్ర బడ్జెట్‌లో అన్యాయం అంటూ ఇటు తెలంగాణ‌, అటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెద‌వి విరుపులు ముందుగా ఊహించిన‌వే.. మాబోటి వేత‌న జీవుల‌కు కూడా ప‌న్ను మిన‌హాయింపు ప‌రిమితి విష‌యంలో ఆశ‌లు ఉండ‌టం కూడా స‌హ‌జం.. కానీ కేంద్ర బ‌డ్జెట్‌ను పూర్తిస్థాయిలో అధ్య‌య‌నం చేస్తే దేశ ప్ర‌జ‌లంద‌రికీ మేలు చేసేదిగానే క‌నిపిస్తోంది.

ముఖ్యంగా రైత‌న్న‌ల సంక్షేమానికి, వ్య‌వ‌సాయానికి పెద్ద పీట వేయ‌డం సంతోష‌క‌రం.. పంట‌ల‌కు మ‌రింత గిట్టుబాటు ధ‌ర క‌ల్పించ‌డం చెప్పుకోద‌గ్గ విష‌య‌మే.. అన్నింటిక‌న్నా ముఖ్యంగా 10 కోట్ల పేద ప్ర‌జ‌ల‌కు రూ.5 ల‌క్ష‌ల ఆరోగ్య బీమా చాలా గొప్ప విష‌యం..
కేంద్ర బ‌డ్జెట్‌లో పెద్ద‌గా వ‌రాలు, నిధులు, తాయిలాలు,ఆక‌ర్శ‌న ఏమీ లేక‌పోక‌పోవ‌చ్చు కానీ ఇది ఆచ‌ర‌ణాత్మ‌కంగా క‌నిపిస్తోంది. ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకొని పెద్ద పెద్ద హామీలు ఇవ్వ‌డం, ఆ త‌ర్వాత నిధులు లేక‌ నిరాశ ప‌ర‌చ‌డం అవ‌స‌రం లేదు. ఏది సాధ్య‌మో ఆదే చేస్తే చాలు..
బ‌డ్జెట్‌లో తెలుగు రాష్ట్రాల‌కు ఏమీ రాలేదు అంటే అది ఇక్క‌డి నాయ‌కుల వైఫ్య‌మే.. ఇత‌ర రాష్ట్రాలు త‌మ‌కు కావాల్సిన ప్రాజెక్టుల విష‌యంలో కేంద్రాన్ని ఒప్పించి సాధిస్తున్న‌ప్పుడు మ‌నం ఎందుకు వెన‌క‌బ‌డుతున్నాం అని ఆలోచించాలి. కేంద్ర ప్ర‌భుత్వానికి తెలుగువారు ఏమీ శ‌త్రువులు కాదు.. ఆచ‌ర‌ణ సాధ్యం కానీ అంశాల‌పై వ్య‌ర్థ పోరాటాలు చేసే బ‌దులు, మ‌న‌కు ఏది ప్ర‌ధానంగా అవ‌స‌ర‌మో దాన్ని గుర్తించి, ఒప్పించి సాధించుకోవాలి..

02.02.2018

పంచ్ పంచ్


27.02.2018
కేసీఆర్ 'గారు' మీరు 'గాడు' అన్నా మేం  గారు' అనే గౌరవిస్తాం.. నా తెలంగాణ గడ్డ నేర్పిన సంస్కారం ఇది..

25.02.2018
మొన్న ఏడ్చారు.. నిన్న ఏడ్చారు.. ఇవాళ ఏడుస్తున్నారు.. రేపు కూడా ఏడుస్తారు..

24.02.2018
అభివృద్ధి చేయమనడం వేర్పాటు వాదమా?

23.02.2018
ఇచ్చిన మొత్తానికి లెక్కలు  చెప్పరేం.. మథ్స్ లో వీకా?

22.02.2018
ఇతర భాషల వారికి అర్థం కాని తమిళ పేరుతో దక్షిణాది మొత్తానికి ప్రతీక అట

21.02.2018
మరో కోత్తపార్టీ.. ముక్కల్ చెక్కల్ అయోమయం

18.02.2018
వంద అబద్దాలు చెప్పినా, నిజం నిజమే..

18.02.2018
డాక్టర్ కాలేకపోయాడు.. ఐఏఎస్ వదిలేశాడు.. పార్టీ పెట్టి విఫలం.. ఇప్పుడు ఫెడరలిజానికి కొత్త భాష్యం.. మేధావీ నీకో దండం

16.02.2018
ఉల్టాచోర్ కొత్వాల్ కో మారా..

16.02.2018
మేధావులను మాత్రమే పిలిచారట

13.02.2018
తుకుడే తుకుడే వారసత్వం మహ్మద్ అలీ జిన్నా నుంచి మూర్ అలీ జిన్నా దాకా

13.02.2018
నాకూ డబ్బున్న మామ, అమాయకపు బామ్మర్దులు ఉండి ఉంటేనా.. డైలాగ్ ఆపి భుజాలు తడుముకునేవారి వైపు లుక్కేశాడు మా సింగడు

12.02.2018
మేధావులు మౌనం పాటిస్తున్నారు. మేతావులు అతిగా వాగుతున్నారు..

08.02.2018
పైసలు కావాలి.. కానీ లెక్కలు చెప్పం

07.02.2018
మేధావుల కోసం వెతికితే అంతా మేతావులే కనిపిస్తున్నారు

06.02.2018
డ్రైవింగ్ రాకున్నా స్టీరింగ్ ఇస్తే అమెరికా దాకా పోతా అన్నాడట

05.02.2018
అమెరికాలోనూ అధికారంలోకి వస్తారట

03.02.2018
రైతులు, పేదల గురుంచి మాట్లాడిన వారంతా ఇప్పుడు U టర్న్ తీసుకున్నారేంటి?

01.02.2018
పంచభక్ష పరమాన్నాలు వడ్డించినా ఎంగిలి బొక్కల కోసం వెతుకుతారు కొందరు..

ఆ ఘటన జరగకపోతే చరిత్ర మరోలా ఉండేది..



ఆ రోజు ఆ ఘటన జరగకపోయి ఉంటే.. దేశ చరిత్ర గతి మరోలా ఉండేది..
నేను ఇక్కడ మహాత్మ గాంధీనో, నాథూరాం గాడ్సేనో సమర్థించడమో, విమర్శించడమో చేయడం లేదు.. ఇది ఒక సంక్షిప్త విశ్లేషణ మాత్రమే..
జనవరి 30, 1948, సాయంత్రం 5.17గం..
ఢిల్లీలోని బిర్లా హౌస్ దగ్గర ప్రార్ధన సమావేశానికి వెళ్లుతున్న మహాత్మా గాంధీని నాథూరాం గాడ్సే తుపాకీతో కాల్చి చంపాడు. ఆయనకు తోడ్పడింది నారాయణ ఆప్టే అనే మరో యువకుడు..
దేశ విభజన సందర్భంగా జరిగిన మత కల్లోలాల్లో లక్షలాది మంది అమాయక పౌరులు మరణించారు. ప్రజల మానప్రాణాలకు రక్షణ కరువైంది ఇళ్లూ ఆస్తులూ కోల్పోయిన అభాగ్యులెందరో.. పాకిస్తాన్ వైపు నుంచి భారత్ లోకి కట్టుబట్టలతో తరలి వచ్చిన కుటుంబాలు అసంఖ్యాకం.. వీరంతా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అదే సమయంలో దేశ విభజన సందర్భంగా జరిగిన ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ కు భారత్ ఇవ్వాల్సిన రూ.55 కోట్లను వెంటనే ఇవ్వాలంటూ మహాత్మగాంధీ నిరాహార దీక్ష చేపట్టడం ఆగ్రహం తెప్పించింది.
అప్పటికే గాంధీజీపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న నాథూరాంగాడ్సే ఆయనను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.. తన పథకాన్ని అమలులో పెట్టేశాడు.. గాడ్సే, ఆప్టేలకు ఉరిశిక్ష అమలైంది. తోడ్పడిన ఇతర నిందితులకు జైలు శిక్ష పడింది.. ఇవి బయటకు కనిపించిన సత్యాలు..
గాంధీ హత్యలో ఎలాంటి ప్రమేయం లేకున్నా నిందలు ఎదుర్కొన్న సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్.. ఈ సంస్థపై వెంటనే నిషేధం విధించారు.. వాస్తవానికి నాథూరాంగాడ్సే ఒకప్పుడు ఆరెస్సెస్ లో ఉన్నా, కాలక్రమంలో ఆ సంస్థతో విబేధించి హిందూ మహాసభలో చేరాడు..
గాంధీజీ హత్య తర్వాత జరిగిన దర్యాప్తులో ఆరెస్సెస్, హిందూ మహాసభలకు ఎలాంటి ప్రమేయం లేదని తేలిపోయింది. ఇది పూర్తిగా వ్యక్తిగతంగా చేసిన పని అని గాడ్సే కూడా స్పష్టం చేశాడు. కానీ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. గాంధీజీ హత్యతో ఎలాంటి సంబంధం లేకున్నా అన్యాయంగా అరెస్టయిన మహానేత వినాయక్ దామోదర్ సావర్కర్.. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి రెండు యావజ్జీవ శిక్షలకు గురైన మహాయోధుడు సావర్కర్. అలాంటి మహానీయుడిపై అన్యాయమైన నిందలు మోపారు. ఆయన హిందూ మహాసభ అధ్యక్షుడు కావడమే కారణం.
గాంధీజీ హత్య జరగకపోయి ఉంటే భారత దేశ చరిత్ర మరోలా ఉండేని చెప్పవచ్చు.. అప్పటికే వయసు మీద పడిన కాంగ్రెస్ నాయకులు తమ జీవిత కాలంలో పదవులు అనుభవించలేమనే భయంతో దేశ విభజనతో కూడిన స్వాతంత్ర్యాన్ని అంగీకరించారు. విభజన సందర్భంగా జరిగిన మారణహోమం, విషాద ఘటనలపై దేశ ప్రజలంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పాకిస్తాన్ లో మాన ప్రాణాలు, ఆస్తులు కోల్పోయి కట్టుబట్టలతో భారత దేశానికి తరలి వచ్చిన వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు. అలాంటి కష్ట సమయంలో వారికి అండగా నిలిచింది ఆరెస్సెస్, హిందూ మహాసభలు.. పెద్ద సంఖ్యలో శిబిరాలను ఏర్పాటు చేసి సహాయ, పునరావాస కార్యక్రమాలు నిర్వహించారు.
ఆరోజుల్లో స్వాతంత్ర్యానంతరం జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు పెద్దగా లేవు.. గెలిచినా బొటాబొటీ మెజారిటీయే ఉండేది.. హిందూ మహాసభకు అధికారం దక్కకున్నా పెద్ద సంఖ్యలోనే సీట్లు వచ్చి ఉండేవి.. తర్వాత వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీ అధికారం చేపట్టే అవకాశాలుండేవి. ఆరెస్సెస్ రాజకీయ పార్టీ కాదు. హిందువుల్లో ఐక్యత, దేశభక్తిని ప్రేరేపించే సంస్థగా అప్పటికే గుర్తింపు వచ్చింది ఆ సంస్థకు..
దురదృష్టవశాత్తు గాంధీ హత్యతో పరిస్థితి తారుమారైపోయింది. నిషేధం కారణంగా ఆరెస్సెస్ విస్తరణలో కొంత కాలం జాప్యం జరిగిపోయింది. హిందూ మహాసభ పూర్తిగా రాజకీయాలకు దూరమై కనుమరుగైంది. అదే సమయంలో సానుభూతి ఓట్ల వెల్లువలో కాంగ్రెస్ పార్టీ తొలి సార్వత్రిక ఎన్నికల్లో సునాయాసంగా గెలిచింది. నెహ్రూ వంశ పారంపర్య-కుటుంబ పాలనకు పునాది పడింది.. దేశంలో కుహనా లౌకికవాదం, ఓటు బ్యాంకు రాజకీయాలు, అవినీతి, కుంభకోణాలకు బీజం వేసిన కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించేందుకు చాలా ఏళ్లే పట్టింది.
డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ స్థాపించిన జనసంఘ్ తో ఎంతో మంది స్వయం సేవకులు చేరారు. ఎమర్జెన్సీ తర్వాతి కాలంలో జనసంఘ్ భారతీయ జనతా పార్టీగా రూపొందింది. జాతీయవాదాన్ని సమర్ధించే బీజేపీకి సహజంగానే ఆరెస్సెస్ స్వయంసేవకుల అండదండలు ఉంటాయి..
గాంధీజీతో ఎవరికి ఎన్ని విభేదాలు ఉన్నా తాను నమ్మిన సిద్ధాంతాల కోసం జీవితాంతం కట్టుబడిన గొప్ప దేశభక్తుడు ఆయన.. భారతమాత ప్రియ పుత్రుడు.. కోట్లాదిమంది ప్రజల హృదయాల్లో మహాత్ముడిగా నిలిచిపోయారు.
మహాత్మా గాంధీ స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని కోరుకున్నారు. కానీ ఆ పార్టీ నాయకులు చెట్టుపేరు చెప్పుకొని కాయలమ్ముకునేందుకు సిద్దమై మహాత్ముని సూచనను పాటించలేదు. మహాత్మగాంధీ వారసులు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వీరి స్థానంలో సోకాల్డ్ వారసత్వం పుట్టుకొచ్చింది. నకిలీ గాంధీలు దేశాన్ని పాలించారు. శతాధిక చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని వారసత్వ రాజకీయ పార్టీగా మార్చేశారు.
కాంగ్రెస్ నాయకులు, ఇప్పటికీ వల్లించే అరిగిపోయిన రికార్డులాంటి అబద్దం ఏమిటంటే.. గాంధీజీని చంపింది ఆరెస్సెస్ అని.. చరిత్ర తెలిసిన దేశ ప్రజలు ఎవరూ ఇప్పుడు ఈ అబద్దాన్ని నమ్మేందుకు సిద్దంగా లేరు..
ఓ మహాత్మా.. నీవు కోరుకున్నట్లు స్వాతంత్ర్యానంతరం కాంగ్రెస్ పార్టీ రద్దు జరగలేదు.. ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్త్ భారత్ దిశగా జరుగుతున్న అంతిమ ప్రయత్నాలకు అయినా నీ ఆశీస్సులు అందించు..