Wednesday, February 28, 2018

సైన్యంలో చేరతామంటే తప్పేముంది?



సుశిక్షితులైన సైనికుల్ని మూడు రోజుల్లోనే తయారు చేసి అందిస్తామని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ (ఆరెస్సెస్ చీఫ్) మోహన్ భగవత్ జీ చేసిన వ్యాఖ్యల్లో వివాదాస్పదం ఏముంది?.. ఆయన మాటలను అర్థం చేసుకోకుండా గుడ్డు మీద ఈకలు పీకే కామెంట్స్ ఎందుకు?..

దేశం కోసం ప్రాణాలర్పించేందుకు స్వయంసేవకులు ఎప్పటీ సిద్ధంగా ఉంటారని, సైనికుల మాదిరే స్వయం సేవకులు దేశభక్తి, క్రమశిక్షణతో శత్రువులతో పోరాడేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పడం సైన్యాన్ని అగౌరవ పరచడగమా?.. ఆర్మీకి సైనికులను తయారు చేయడానికి వారం రోజులు పడితే, ఆరెస్సెస్ కు మూడే రోజులు చాలు అన్నారు.. ఇందులో తప్పు ఏముంది?.. ఈ పని రాజ్యాంగం అనుమతిస్తేనే అని కూడా స్పష్టంగా చెప్పారు భగవత్ జీ.. వారికి ఉన్న కాన్ఫిడెన్స్ ను అభినందించడానికి ధైర్యం లేని వారు ఎన్నైనా కువిమర్శలు చేస్తారు.. పట్టించుకోవాల్సిన అవసరం లేదు..
భగవత్ జీ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ అండ్ కో డిమాండ్ చేస్తోంది.. ఎందుకు చెప్పాలి క్షమాపణలు.. ఆయన తప్పు ఏమి మాట్లాడారని? కశ్మీర్ తో సహా దేశ సరిహద్దు వివాద సమస్యలకు కారణమైన మీ కుటుంబ మాత్రం దేశానికి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదా?
దేశానికి స్వాతంత్ర్యం రావడంతో పాటు దేశ విభజన జరిగిన రోజుల్లో కొత్తగా ఏర్పడిన పాకిస్తాన్ నుంచి మానప్రాణాలు కోల్పోయి కట్టుబట్టలతో భారత్ కు వచ్చిన కోట్లాది మంది ప్రజల కన్నీరు తుడిచి ఆదుకున్నది ఎవరు?.. ముస్లింలీగ్ పార్టీ ప్రేరిత అల్లర్లు, మారణకాండ భారి నుంచి లక్షలాది మంది ప్రాణాలు కాపాడింది ఎవరు?.. మహారాజా హరిసింగ్ కశ్మీర్ భారత దేశంలో విలీనం చేయగానే పాకిస్తాన్ సైనిక మూకలు యుద్దానికి దిగినప్పుడు శ్రీనగర్ లో భారత సైన్యం దిగడం కోసం విమానాశ్రయాన్ని సిద్దం చేసింది ఎవరు?.. చైనా దురాక్రమ సమయంలో సైనిక, ఆయుధ పరంగా బలహీనంగా ఉన్న భారత సైన్యంలో అత్యవసరంగా చేరేందుకు ముందుకు వచ్చింది ఎవరు?.. అప్పటి వరకూ ఆరెస్సెస్ పై ఉన్న అపోహలు తొలగించుకున్న ప్రధాని నెహ్రూ కోరిక మేరకు ఆరెస్సెస్ స్వయం సేవకులు తొలిసారిగా గణతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కవాతు చేయడం వాస్తవం కాదా? ఇప్పుడు చెప్పండి ఎవరు క్షమాపణలు చెప్పాలి?
13.02.2018

No comments:

Post a Comment