Wednesday, February 28, 2018

కేజ్రీ పార్టీ గుండాయిజానికి పరాకాష్ట



రాజకీయాలను ఏదో ఉద్దరిస్తామని గద్దెనెక్కిన కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం సీటులో కూర్చున్నది మొదలు ఇప్పటి దాకా చేస్తున్న ఘనకార్యాలు ఏమిటో ఎన్నో చూశాం.. పరిపాలన గాలికి వదిలేసి నిత్యం కేంద్ర ప్రభుత్వంతో, లెఫ్టినెంట్ జనరల్ తో గిల్లి కజాలతో సరిపోతోంది.. ఆప్ ఎమ్మెల్యేలలో ఎక్కువగా నేర చరితులే ఉన్నారని రికార్డులు చెబుతున్నాయి.
 తాజాగా ఈ ఎమ్మెల్యేలు ఏకంగా ఢిల్లీ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్ పై చేయి చేసుకోవడం విస్మయానికి గురి చేస్తోంది. ప్రభుత్వంలో చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు తత్కాలికం. కానీ అధికార యంత్రాంగం శాశ్వతం.. వీరిద్దరి మధ్య సయోధ్య ఉంటేనే ప్రభుత్వాలు నడుస్తాయి. ఈ మాత్రం ఇంగితం మాజీ బ్యూరోక్రాట్ కేజ్రీవాల్ కు తెలియదని అనుకోలేం.. దేశ రాజధాని ఢిల్లీ కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండటం సహజం.. దీన్ని అర్థం చేసుకోకుండా నిత్యం తగువులతోనే కాలం గడపడం, అధికారులను బెదిరించడం ఎంత వరకు సమంజసం? ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినయోగం చేసుకోలేని ఈ పాపు(ఆప్)లను ఇలాగే భరించాల్సిందేనా?.. ఈ గుండా ప్రభుత్వాన్ని తక్షణం రద్దు చేయాల్సిన అవసరం ఉంది..
21.02.2018

No comments:

Post a Comment