Saturday, July 1, 2017

మోదీ ప్రభుత్వ విప్లవాత్మక నిర్ణయం.. GST

దేశ‌మంత‌టా GST అమలు న‌వ‌శ‌కానికి నాంది.. నిన్న‌టి దాకా ప‌రోక్ష ప‌న్నులు, రాష్ట్రానికో పన్ను విధానం.. ఇప్పుడు దేశంలో ఏ మూల‌కు పోయినా ఒకే ర‌క‌మైన ప‌న్ను విధానం. దీనికి స్వ‌స్థి ప‌లుకుతూ నరేంద్ర మోది ప్రభుత్వం చేప‌ట్టిన అతిపెద్ద విప్లవాత్మక అడుగు వ‌స్తు సేవ‌ల ప‌న్ను విధానం GST.. భార‌త దేశ ఆర్థిక రంగంలో అతిపెద్ద సంస్కరణ ఇది.

సెంట్రల్‌ ఎక్సైజ్‌, సేవా పన్ను, వ్యాట్‌, వినోదపు పన్ను ఇలా పలు రకాల పన్నులకు వేర్వేరు పద్దులను నిర్వహించాల్సిన పరిస్థితి మున్ముందు ఉండదు. అలాగే ఒకటే లావాదేవీపై సేవా పన్ను, వ్యాట్‌ ఇలా పలు రకాల పన్నులను చెల్లించాల్సిన పరిస్థితి తొలగిపోయి ఇలాంటి లావాదేవీలన్నింటికీ ఒక్కటే పన్ను విధానం అమ‌ల్లోకి వ‌చ్చింది.ప్రస్తుత విధానంలో పన్నుల విధింపు వివిధ రకాలుగా ఉంది. ఉదాహరణకు సెంట్రల్‌ ఎక్సైజ్‌ పన్ను విధానంలో తయారీపై పన్ను విధిస్తారు. విక్రయాలపై విలువ ఆధారిత పన్ను VAT, సేవలపై సేవా పన్ను ST విధిస్తున్నారు.‘ఒకే దేశం-ఒకే విపణి’ అన్న కల కార్యరూపం దాల్చింది. GST అనేది కేవలం పన్ను సంస్కరణ మాత్రమే కాదు. దేశ వ్యాపార ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే ఓ విధాన ప్రక్రియ. GST అమ‌లుతో రాష్ట్రాల మ‌ధ్య అడ్డుగోడ‌లు కూడా తొల‌గిపోతున్నాయి. ప్రస్తుతం ఏ రాష్ట్రంలో వస్తువులను విక్రయిస్తు న్నారో, సేవలు అందిస్తున్నారో అక్కడే పన్నులు చెల్లించాలి. GST అమలుతో వస్తువును తయారు చేసే రాష్ట్రంతో పోలిస్తే ఆ వస్తువు అమ్మకాలు జరిగే రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం సమకూరుతుంది.ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహించే ప్రతి రాష్ట్రంలోనూ కంపెనీలు ఎక్కడికక్కడ నమోదు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. GST విధానంలో ఒక రాష్ట్రంలో నమోదు చేసుకుంటే చాలు, దేశంలో ఏ ప్రాంతానికైనా వస్తువుల సరఫరా, సేవలు అందించే వీలు కంపెనీలకు ఏర్పడుతుంది.GSTతో సామాన్యుడిపై భారం ప‌డుతోంద‌న్న‌ది దుష్ప్ర‌చారం మాత్ర‌మే.. కొన్ని వ‌స్తు సేవ‌ల‌పై ప‌న్నుల భారం పెరిగిన‌ట్లు క‌నిపించ‌వ‌చ్చు.. కానీ ఎన్నో ర‌కాల ప‌న్నులు త‌గ్గ‌డంతో పాటు, ద్ర‌వ్యోల్భ‌నం అదుపులోకి వ‌స్తోంద‌నే వాస్త‌వాన్ని మ‌ర‌చిపోవ‌ద్దు. పూర్తి పార‌ద‌ర్శ‌కంగా ఉన్న ఈ ప‌న్నుల విధానం ద్వారా దేశ ఆర్థ‌క వ్య‌వ‌స్థ‌కు మేలు జ‌ర‌గ‌డంతో పాటు వినియోగ‌దారుల‌కు అన్ని విధాలుగా మేలే జ‌రుగుతుంది. అందుకే మనమంతా GSTకి స్వాగతం పలుకుదాం.. జైహింద్..