Friday, June 30, 2017

మహోన్నత వ్యక్తి హరిహర శర్మ

ప్రముఖ విద్యావేత్త, సమాజిక కార్యకర్త హరిహర శర్మ గారు ఇక లేరనే వార్త వ్యక్తిగతంగా దిగ్భ్రంతిని కలిగించింది.. ఎంతో మంది జాతీయవాదులకు, యువతకు, విద్యార్థులకు స్పూర్తి ప్రధాతగా, మార్గదర్శిగా నిలిచిన శర్మ గారు విశిష్ట వ్యక్తిత్వం ఉన్న మహావ్యక్తి. విద్యార్థి దశ నుండి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తో వారితో అనుబంధం కొనసాగింది. విద్యార్థి పరిషత్ ఉపాధ్యక్షులుగా పని చేశారు, సమాచార భారతికి సుదీర్ఘ కాలం అధ్యక్షులుగా హరిహర శర్మగారు సేవలందించారు, జాగృతి ప్రకాశన్ ట్రస్టుకు గతంలో అధ్యక్షులుగా, ప్రస్తుతం కార్యదర్శిగా ఉన్నారు. అధ్యాపక వృత్తిలో విజయనగర్ కామర్ కాలేజీ ప్రిన్సిఫల్ గా పదవీ విరమణ చేశారు, రచనా జర్మలిజం కళాశాల వ్యవస్థాపకుల్లో శర్మగారు కీలకపాత్ర పోశించారు. కేశవ మెమోరియల్ విద్యాసంస్థకు ప్రస్తుతం వారు కార్యదర్శి. హరిహర శర్మ గారి నేతృత్వంతో పని చేయడం, వారితో అనుబంధం నా అదృష్టంగా భావిస్తున్నారు. వారు మన మధ్య లేకున్నా వారి స్పూర్తి నిరంతరం మనందరిలో కొనసాగుతుంది.. ఓం శాంతి

Monday, June 12, 2017

జ్ఞాపకాల్లో సినారె

చిత్రం భళారే విచిత్రం.. పొద్దున్నే దాన వీర శూర కర్ణ చిత్రంలోని ఈ గీతం నా మదిలో మెదిలింది.. ఎన్టీఆర్ నటించిన ప్రతి నాయక పాత్ర దుర్యోధనుడికి యుగళ గీతం ఒక ఎత్తైతే, ఆ పాటను రాసిన సినారె గుర్తుకు వచ్చారు.. కొద్ది గంటల్లోనే దుర్వార్త.. ఆ మహా సాహితీ దిగ్గజం ఇక లేరని.. నా జ్ఞాపకాలు 17 ఏళ్లు వెనక్కిపోయాయి..

'సర్.. నేను మీ అభిమానిని..'
చిరునవ్వుతో నా వైపు చూసి ఏదో బ్రోచర్లో తల దూర్చారు ఆయన..
'మీ రచనలు, చాలా ఇష్టం.. మీరు రాసిన కవితలు, గజళ్లు, పాటలు తరచూ చదువుతుంటాను..'
ఈసారి ఆసక్తిగా నావైపు దృష్టి సారించారు..
ఒక జర్నలిస్టుగా రవీంద్ర భారతిలో యాదృచ్చికంగా సినారెను కలిసిన సందర్భం అది.. ఇలా ఇద్దరికీ సంభాషణ కలిసింది.. నా గురుంచి అడిగి తెలుసుకున్నారు.. ఎంతో ఆత్మీయత కనిపించింది వారి మాటల్లో..  వీడ్కోలు తీసుకునే ముందు కనబడుతూ ఉండు అన్నారు.. ఆ తర్వాత ఒకటి, రెండుసార్లు మాత్రమే వారిని కలిసి ఉంటాను.. అయినా గుర్తు పెట్టుకొని మాట్లాడారు..
ఇటీవల ఆ మహనీయున్ని కలవాలని చాలామార్లు అనుకున్నాను.. కానీ ఎప్పటికప్పుడు ఏదో పని పడుతూ వాయిదా వేస్తూ పోయాను.. ఈలోగా శాశ్వతంగా దూరమయ్యారు.
హైదరాబాద్ సంస్థానంలో పుట్టి డిగ్రీ వరకూ ఉర్దూ మీడియంలో చదివిన సింగిరెడ్డి నారాయణ రెడ్డి తెలుగు సాహిత్యంలో ఉన్నత శిఖరాలను చేరడం, అధ్యాపకుడిగా, సినీ గేయ రచయితగా ఎనలేని పేరు ప్రఖ్యాతలు సాధించడం చాలా అద్భుతమైన విషయం.
తెలుగు సాహితీ ప్రపంచానికి సినారె చేసినంత సేవ మరే సాహితీవేత్త చేయలేదని నా ప్రగాఢ విశ్వాసం.. జ్ఞానపీఠ్, సాహిత్య అకాడమీ సహా ఎన్నో సాహిత్య అవార్డులు పద్మశ్రీ, పద్మవిభూషన్ లాంటి పురస్కారాలు, రాజ్యసభ సభ్యత్వం వారి కీర్తి కిరీటంలో మణిపూసలుగా నిలిచాయి..

కానీ నాకు ఎందుకో అసంతృప్తి.. వారికి ఇంకా ఎక్కువ గౌరవం దక్కాల్సింది అని.. సిరారె పవిత్ర స్మృతికి ఇదే నా అక్షరాంజలి..

Thursday, June 8, 2017

బాబా, యోగి.. యోగా

ఇద్దరూ యోగులే.. ఒక యోగ గురువు బాబా రాందేవ్.. ఇంకొకరు యూపీ సీఎం యోగి అదిత్యనాథ్.. పైగా ఓకే వేదికపై యోగాసనాలు.. కాంబినేషన్ అదుర్స్ కదూ?..

Monday, June 5, 2017

కశ్మీర్ ను మనం అక్రమించామంటున్న కాంగ్రెస్

భార‌త్ ఆక్ర‌మిత కశ్మీర్ అట‌.. ఇదేదో పాకిస్తాన్ వాళ్లో, ఉగ్ర‌వాదులో, వారి తొత్తులు అన్నా ఈ వెధ‌వ‌లింతే అని ప‌ట్టించుకోం.. కానీ ఈ మాట కాంగ్రెస్ పార్టీ క‌ర‌ప‌త్రంలో క‌నిపించింది. మోదీ ప్ర‌భుత్వం మూడేళ్ల పాల‌నను విమ‌ర్శిస్తూ యూపీ కాంగ్రెస్ ప్ర‌చురించిందీ బ్రోచ‌ర్‌.. ఇక వీరిని ఏమ‌నాలో మీరే చెప్పండి..
ఈ మ్యాప్‌పై వివాదం చెల‌రేగ‌డంతో ప్రింటింగ్ మిస్టేక్ అని త‌ప్పించుకుంటున్నారు కాంగ్రెస్ నాయ‌కులు.. అస‌లు క‌శ్మీర్ లో చిచ్చు పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? తొలి ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ చేసిన త‌ప్పు ఫ‌లితాన్ని 70 ఏళ్లుగా ఈ దేశం అనుభ‌విస్తున్న విష‌యాన్ని మ‌రిపోతామా?

ఆవును పూజించే దేశంలో..



ఏ దేశంలో తొలి రొట్టెను గోమాతకు సమర్పించుకుంటామో, ఆ దేశంలో ఇప్పుడు అవునే మింగేస్తున్నాం..
बनती है, पहली रोटी जहाँ गाय के लिए
उस देश मे रोटी से कोई गाय ही खा गया !!
01జూన్ 2017