Tuesday, June 28, 2016

వాన‌తోనే మ‌న జీవ‌నం..


వానా వానా వల్లప్ప' అని పాడుకుంటారు మన చిన్నారులు.. 'రెయిన్ రెయిన్ గో అవే' అని నేర్పిస్తుంది పాశ్చాత్య విద్యా విధానం..
వర్షాలు బాగా కురిస్తే పంటలు బాగా పండుతాయి, అందరికీ తిండి దొరుకుతుంది.. అని మనం కోరుకుంటాం.. మన విశాల దృక్పథానికి, శ్రమ సంస్కృతికి ఇది నిదర్శనం..
కానీ తాము బాగుంటే చాలు అని కోరుకొని, ఇతరులను దోచుకు తినే వారికి వానలతో పనేముంది.. 
ఇంతకూ మన పిల్లలకు ఏమి నేర్పిద్దాం?.. వానా వానా వల్లప్పాలేక రెయిన్ రెయిన్ గో అవేనా..ఆలోచించండి..

Sunday, June 26, 2016

రండి.. చైనాపై పిడికిలి ఎత్తండి..

ఇటీవలి కాలంలో అవకాశం దక్కిన ప్రతి అంతర్జాతీయ వేదికపై భారత దేశ వ్యతిరేకతను బాహాటంగా బయట పెట్టుకుంటోంది చైనా.. మొన్న జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ పై ఆంక్షలు విధించాలనే ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని వీటో ద్వారా అడ్డుకుంది..  నిన్న NSGలో మనకు చోటు దక్కకుండా చక్రం తిప్పింది.. మన పక్కలో బల్లెంగా ఉన్న ఉగ్రవాద కర్మాగారం పాకిస్తాన్ కు అన్ని విధాలా అండగా నిలిచింది చైనా..
ఇప్పటికే పలు భారత దేశ భూ భాగాలను కబ్జా చేసిన చైనా, సైనికంగా పై చేయి సాధించాలని చూస్తోంది.. మన పొరుగు దేశాలు నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులకు సాయం ముసుగులో భారత దేశానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతోంది.. ఆ దేశాల్లో తన సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకొని భారత్ ను అష్ట దిగ్బంధనం చేసే చర్యలు చేపట్టింది..
మన తొలి ప్రధాని నెహ్రు హిందీ-చీనీ భాయ్ భాయ్ అంటూ తప్పటడుగులు వేశారు.. టిబెట్ ను ఆక్రమించినా పట్టించుకోకుండా ఆ దేశాన్ని చైనాలో అంతర్భాగంగా గుర్తించారు.. పైగా మనకే దిక్కు లేకున్నా, చైనాకు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం కృషి చేశారు.. నెహ్రూ ఇంత చేసినా కృతజ్ఞత లేని చైనా, దలైలామాకు ఆశ్రయం ఇచ్చామనే కారణంతో మన దేశంపై యుద్దానికి దిగింది..
తేనె పూసిన కత్తిలాంటిది చైనా.. పైకి స్నేహ హస్తం చూపిస్తూ, అవకాశం చిక్కినప్పుడల్లా వెన్నుపోటు పొడుస్తోంది. ప్రపంచంలో బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న భారత్ పై చైనా పరోక్ష కుట్రలకు తెరలేపింది.. 
చైనా నుండి మన దేశంలోకి అనేక వస్తువులు ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడుతున్నాయి.. మొబైళ్ళు, కంప్యూటర్లు, లాప్ టాప్స్, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, టపాకాయలు, బొమ్మలు, దుస్తులు, ఆట వస్తువులు, రంగులు, ప్లాస్టిక్ సామాగ్రి.. చివరకు ఆహార పానీయాలు..  ఇలా ఎన్నెన్నో చైనా తయారీ వస్తువులు దిగుమతి అవుతున్నాయి.. మన దేశీయ ఉత్పత్తులతో పోలిస్తే ఇవన్నీ నాసిరకం సరుకే.. కానీ చవగ్గా ఉన్నాయని జనం వీటిని కొంటున్నారు.. 
చైనా వీటిని ఇంత చవకగా తయారు చేయడానికి కారణాలు తెలుసా?.. ఆ దేశంలో మానవ వనరులు అధికంగా ఉన్నందున పోటీ పెరిగి తక్కువ జీతాలు తీసుకొని, ఎక్కువ గంటలు పని చేస్తారు.. చైనా పేరుకే కమ్యూనిస్టు దేశం.. కానీ అనుసరించేదంతా పెట్టుబడిదారీ వ్యవస్థే.. శ్రమ దోపిడీ ఎక్కువ.. కార్మికులకు కనీస సౌకర్యాలు కరువు.. తక్కువ ధరలకు లభించే వస్తు సామాగ్రిని డంప్ చేయడం ద్వారా భారతీయ పరిశ్రమలను దెబ్బ తీస్తోంది.. ఫలితంగా మన దేశీయ కుటీర పరిశ్రమలు నష్టపోయి కార్మికులు వీధిన పడుతున్నారు.. 
మొదటి నుండి కూడా భారత ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేస్తున్న ఆ దేశానికి కచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందే.. 
ఇప్పుడు మన దేశం ముందు ఉన్న తక్షణ కర్తవ్యం ఒకటే.. అదే *బాన్ ఆన్ మేడ్ ఇన్ చైనా*.. 
చైనాలో తయారైన వస్తువులన్నింటినీ బహిష్కరిద్దాం.. ఎట్టి పరిస్థితిలోనూ చైనా వస్తువులు కొనరాదు.. స్వదేశీ వస్తువులనే కొనండి.. ఇలా చైనాకు బుధ్ధి చెప్పడం ద్వారా దేశీయ పరిశ్రమలను కాపాడుకుందాం.. ఉపాధి అవకాశాలను పెంచుకుందాం.. మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేద్దాం.. భారతీయులుగా మన స్వాభిమానాన్ని చాటి చెబుదాం.. దేశభక్తిని ఎలుగెత్తి చాటుదాం.. మన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుందాం..

Tuesday, June 21, 2016

విశ్వరూప సందర్శన..యోగా

ప్రపంచానికి భారత దేశం ఇచ్చిన ఎన్నో కానుకల్లో అపూరుపమైనది యోగా  ప్రతి ఏటా జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి తీర్మానించింది. ఈ గుర్తింపు లాంఛనం మాత్రమే. యోగా ఏనాడో మన దేశ సరిహద్దులు దాటి ప్రపంచ వ్యాప్తమైంది. పతంజలి మహర్షి సూచించిన అష్టాంగ యోగ సూత్రాల నుండి రూపు దిద్దుకున్న యోగకు అధికారికంగా ప్రపంచ గుర్తింపు రావడం భారతీయులుగా మనందరికీ గర్వకారణం..
ఇంతకీ యోగాలో ఏముంది? ఎందుకు దీనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? ఇది ఒక మత ప్రచారంలో భాగం కాదా?.._ ఇలాంటి ప్రశ్నలు రావడంతో తప్పులేదు. వాటన్నింటికీ సమాధానం ఉంది. మనం ముందుగా యోగా వల్ల ఉపయోగాలు ఏమిటి అన్న విషయానికి మాత్రమే ప్రాధాన్యత ఇద్దాం.. _మొదటి ఉపయోగం సంపూర్ణ ఆరోగ్యం, రెండోది మానసిక ప్రశాంతం..
మన సనాతన ధర్మం (హిందూ మతం) ఒక రూపాన్ని సంతరిచుకోకముందే యోగా పుట్టింది. ఒక మతానికి చెందిన అత్యధికులు ఆచరిస్తున్నారనే సాకుతో యోగకు మతం రంగు పులమడం మూర్ఖత్వమే అవుతుంది.
యోగాలో ప్రధానంగా కనిపించేవి ప్రాణాయామం, సూర్యనమస్కారాలు, ముద్రలు, క్రియలు, ఆసనాలు.. ఇందులో అనేక ఆసనాలు కనిపిస్తున్నా ప్రధానంగా 25 వరకూ ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ ఆసనాలు వేయడం వల్ల తల నుండి కాలి చిటికన వేలు వరకూ మన శరీరమంతా చురుగ్గా పని చేస్తుంది. శరీరం చక్కగా వంగటం వల్ల రక్త ప్రసరణ అన్ని అవయవాలుకు సక్రమంగా జరుగుతుంది. శ్వాస మెరుగవుతుంది. గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మెదడు, వెన్నుపూస చురుగ్గా పని చేస్తాయి. చక్కగా యోగాసనాలు చేసే వారికి శారీరక కష్టాలు తగ్గుతాయి. గుండెపోటు, రక్తపోటు, మధుమేహం, స్థూలకాయం వంటి సమస్యలను ప్రాథమిక దశలోనే అడ్డుకోవచ్చు. ఇప్పటికే ఉంటే పూర్తిగా నియంత్రణలో పెట్టుకోవచ్చు. తద్వార మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. బద్దకాన్ని విడిచిపెట్టి చురుగ్గా పని చేసుకోగలుగుతాం. మెదడు చురుగ్గా పని చేయడం వల్ల మనలో కొత్త ఆలోచనలు పుంతలు తొక్కుతాయి. మొత్తం మీద సంపూర్ణ ఆరోగ్యానికి యోగా పూర్తి గ్యారంటి ఇస్తుంది..
యోగా ఖరీదైనదనే అపోహలు కొందరిలో వినిపించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ధనికులు, ప్రముఖులు యోగాసనాలను చేయడం, కొన్ని సంస్థలు భారీగా ఫీజులు వసూలు చేసి యోగా నేర్పడం చూసి తెలియని వారికి ఇలా అనిపించడం సహజం. మన ఆరోగ్యం కోసం ఎన్నో మందులు కొని వాడుతున్నాం. వీటి వల్ల మన జేబుకు చిల్లు మాత్రమే కాకుండా సహజ సిద్దంగా ఉండే శరీర రోగ నిరోధక శక్తిని క్రమంగా కోల్పోతున్న విషయాన్ని గ్రహించడం లేదు. అలాగే శరీరాన్ని నియంత్రణలో ఉంచుకోవడం కోసం జిమ్ములు, ఆరోబిక్స్, ఇతర పాశ్చాత్య వ్యాయామాల కోసం డబ్బును ఖర్చు చేస్తున్నాం.. కానీ యోగాకు ఇవేమీ అవసరం లేదు.. చక్కగా మీ ఇంట్లో, లేదా శుద్దమైన గాలి, వెలుతురు సక్రమంగా ఉన్న తగిన చోటు చూసుకొని ఆసనాలు వేసుకోవచ్చు. ఇలా చేసినందుకు మిమ్మల్ని డబ్బు ఇమ్మని అడిగేవారెవరు? 
అందరూ యోగాసనాలు వేయండి.. సంపూర్ణ ఆరోగ్యవంతులు కండి.. యోగాతో రోగ రహిత సమాజాన్ని రూపొందిద్దాం..

సార్ నే మరచిపొయారా?


అధికార మదం అన్నీ మరచిపోయేలా చేస్తుంది అంటే ఇదే.. నేడు తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ వర్ధంతి.. ఈ విషయాన్ని అధికారంలో ఉన్నవారు మార్చారు.. వారి చేతిలోని దిన పత్రిక కూడా ఎందుకో జయశంకర్ గురుంచి ఇవాళ ఒక్క ముక్క కూడా రాయలేదు. కానీ ఆంధ్రా పత్రిక అంటూ వారి వెలివేసిన పేపర్ మాత్రమే ఆ మహానీయున్ని గుర్తు చేసుకుంది..

Sunday, June 19, 2016

ఇదేం దినం?

ఇవాళ తండ్రుల దినం (father's day) అట.. ఒకటే గ్రీటింగుల హడావుడి.. మిత్రులారా.. క్షమించాలి.. ఇలాంటి దినాలు మన సంప్రదాయం కాదు.. విడాకులు, కలిసి ఉండే సంస్కృతి అధికంగా ఉండే పాశ్చాత్య దేశాల్లో తమ తండ్రి ఎవరో తెలియని పిల్లలు ఉంటారు.. అసలు తండ్రి లేదా పెంపుడు తండ్రితో ప్రేమానుబంధాలు ఏర్పరిచే లక్ష్యంతో పుట్టుకొచ్చిందే 'తండ్రుల దినం'.. వయసొచ్చిన పిల్లలు పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు తరలిస్తారు.. ఇలాంటి దినాల సందర్భంగా అక్కడకకు వెళ్లి బహుమతులు ఇచ్చి మొక్కుబడి ప్రేమను ప్రదర్శించి రావడం మరో ఆచారం..
తల్లిదండ్రులను పూజించడం, గౌరవించడం అనాదిగా మన సంస్కృతిలోనే ఉంది.. మరి మనకెందుకీ పాశ్చాత్య దిక్కుమాలిన దినాలు..
'మాతృ దేవో భవ, పితృ దేవో భవ, ఆచార్య దేవో భవ' అని మన పెద్దలు చెబుతారు.. తండ్రులను ఈ ఒక్కరోజే కాదు.. ప్రతిరోజూ గౌరవించండి..

Wednesday, June 15, 2016

ఇదేం సంభోదన..

బిహార్ విద్యాశాఖ మంత్రి డాక్ట‌ర్‌ అశోక్ చౌదరి త‌న కుసంస్కారాన్ని బ‌య‌ట పెట్టుకున్నాడు.. ఏకంగా కేంద్ర మాన‌వ వ‌న‌రుల శాఖ మంత్రి స్మృతి ఇరానీనే అవ‌మానించి, ఆమె ఇచ్చిన స‌మాధానంతో ఖంగుతిన్నాడు.. ట్విట్ట‌ర్‌లో త‌న‌ను డియ‌ర్ అంటూ సంబోధించ‌డాన్ని ఆమె త‌ప్పు ప‌ట్టారు.. స్మృతి ఇరానీ మాత్రం ఆద‌ర‌ణీయ అంటూ బ‌దులిచ్చారు.. నూత‌న విద్యా విధానంపై చౌదురి వేసిన ప్ర‌శ్న‌ల‌కు ఆమె స్పందిస్తూ ముందు మీ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు ల‌క్ష‌ల ఉపాధ్యాయుల పోస్టుల‌ను భ‌ర్తీ చేయండి అంటూ చుర‌క‌లంటించారు. విద్యా విధానం ముసుగులో ప్ర‌ధాని మోదీ, సంఘ్‌ల‌ను విమ‌ర్శించ‌డానికి అశోక్ చౌదరి ట్విట్ట‌ర్‌ను వేదికగా వాడుకొని భంగ‌ప‌డ్డాడు

Tuesday, June 14, 2016

*చదువుకుందామా?..కొందామా?*

బ‌డి గంట మోగింది.. పాఠ‌శాల‌లు మ‌ళ్లీ తెరుచుకున్నాయి.. వేస‌వి సెల‌వులు అప్పుడే అయిపోయాయా పిల్ల‌ల నిట్టూర్పులు.. కొత్త‌గా బ‌డిలో దిగ‌బెట్టిన చిన్నారుల ఏడుపులు.. ప్ర‌తీ ఏడాది జ‌రిగే త‌తంగ‌మే ఇది..
జూన్ వ‌చ్చింద‌టే త‌ల్లిదండ్రుల‌కు గుండె ద‌డ‌.. వేలాది రూపాయ‌ల‌ ఫీజులు, డొనేషన్లు, పుస్త‌కాలు, యూనిఫారమ్‌, స్కూలు వ్యాను ఖ‌ర్చులు.. స‌గ‌టు జీవి సంపాద‌నంతా ఇందుకే ఖ‌ర్చ‌యిపోతోంది.. ఇదేమి అన్యాయ‌మ‌ని ప్ర‌శ్నించ‌లేని ప‌రిస్థితి.. పోటీ ప్ర‌పంచంలో పిల్ల‌ల‌పై ఈ మాత్రం ఖ‌ర్చు త‌ప్పదంటారు కొందరు శ్రేయోభిలాషులు.. నా చిన్న‌ప్ప‌టి నుండి డిగ్రీ, పీజీ దాకా పెట్టిన ఖ‌ర్చంతా, మా అబ్బాయి ఒక ఏడాది ఫీజంత అని గొప్ప‌గా చెప్పాడో మిత్రుడు..
మ‌న పిల్ల‌ల భ‌విష్య‌త్తు కోస‌మే క‌దా ఖ‌ర్చు చేస్తున్నాం అంటూ స‌రిపుచ్చుకుంటున్నారు త‌ల్లిదండ్రులు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల అధ్వాన్న నిర్వాకాన్ని చూసి త‌ప్ప‌ని స‌రైన ప‌రిస్థితుల్లో ప్ర‌యివేటు పాఠ‌శాల‌ల‌కు పంపుతున్నారు.. ఎల్‌కేజీ నుండే ఐఏఎస్ పాఠాలు చెబుతామని బిల్డ‌ప్ ఇస్తున్నాయి ప్ర‌యివేటు విద్యా సంస్థ‌లు.. ఎమ్సెట్లూ, జేఈఈలు, ఐఐఎంలూ, ఐఏఎంలూ, ట‌క్కు ట‌మారాలంటూ మాయ చేస్తున్నాయి.. వీరు సాగిస్తున్న దారుణ దోపిడీకి అంతులేకుండా పోయింది.. ఎవ‌రూ వీరిని ప్ర‌శ్నించ‌లేక‌పోతున్నారు..
ఒక‌ప్పుడు సేవా భావంతో పాఠ‌శాల‌లు పెట్టేవారు.. కానీ  ఇప్పుడు ప‌క్తు వ్యాపార ధోర‌ణితోనే స్కూళ్ల‌ను న‌డిపిస్తున్నారు.. కార్పోరేట్ విద్యా సంస్థ‌లు ఊరూరా  బ్రాంచీలు, ప్రాంచైజీలు  స్థాపిస్తూ నయా దోపిడీకి తెర తీశాయి.. ప‌ట్టించుకోవాల్సిన ప్ర‌భుత్వ పెద్ద‌లు ఇది త‌మ‌కు సంబంధం లేని వ్య‌వ‌హారం అన్న‌ట్లు ప్ర‌వ‌ర్తిస్తున్నారు.. అవును మ‌రి వారికి ద‌క్కాల్సిన అమ్యామ్యాలు అందుతున్నాయి కదా.. ఈ విద్యా సంస్థ‌ల‌తో వారికి ప్ర‌త్య‌క్షంగాలో ప‌రోక్షంగానో సంబంధాలు ఉంటాయ‌న్నది బ‌హిరంగ ర‌హ‌స్యం..
విద్యారంగం ముసుగులో సాగుతున్న ఈ దోపిడి ఇలా కొన‌సాగాల్సిందేనా?.. ఆలోచించండి..#

Monday, June 13, 2016

పండిట్లకు మంచి రోజులు వచ్చేనా?

జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబ్ మూఫ్తీ శ్రీనగర్ సమీపంలోని ఖీర్ భవానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు.. కాశ్మీర్ పండిట్లు లోని కాశ్మీరం అసమగ్రం అని, వారిని తిరిగి లోయలోకి రప్పించి పునరావాసం కల్పించేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తానని ఆమె అంటున్నారు.. కాశ్మీర్లో అన్ని రకాల సమస్యలు తొలగి తిరిగి సంతోషం వెల్లివిరియాలని మహబూబా ఆకాంక్షించారు..
దుర్గామాత అవతారమైన ఖీర్ భవానీ కాశ్మీరీ పండిట్ల ఆరాధ్య దేవత..  కాశ్మీర్లో ఉగ్రవాదం వెర్రితలలు వేసి, పండిట్లను లోయ నుండి తరిమేసినా, ప్రతిఏటా జరిగే  భవానీ అమ్మవారి వార్షిక వేడుకలకు వారు క్రమం తప్పకుండా హాజరు ఆనవాయితీగా వస్తోంది..
జమ్మూ కాశ్మీర్లో బీజేపీ-పీడీపీ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అక్కడి పరిస్థితిలో మార్పు వస్తోంది.. కాశ్మీరంలో ఉగ్రవాద ఘటనలు తగ్గుముఖం పట్టి, తిరిగి జాతీయ జనజీవన స్రవంతిలో చేరదాన్ని మనం త్వరలో చూడవచ్చు..

Monday, June 6, 2016

మ‌ర‌పురాని ఆత్మీయ స‌మావేశం..

దాదాపు రెండు ద‌శాబ్దాల త‌ర్వాత అంతా ఒక చోట క‌లిసిన సంద‌ర్భం.. మేమంతా ఈనాడు దిల్‌సుఖ్‌న‌గ‌ర్ జోన్ ప‌రిధిలో 90'sలో పాత్రికేయ వృత్తిలో ప్ర‌వేశించాం.. కొంద‌రం జ‌ర్న‌లిస్టులుగానే స్థిర‌ప‌డ్డాం.. మ‌రి కొంద‌రు వివిధ వృత్తుల‌ను ఎంచుకున్నారు.. అలా 25 ఏళ్లు పూర్త‌వుతున్నా మా మ‌ధ్య  స్నేహ సంబందాలు, ఆప్యాయ‌త‌లు కొన‌సాగుతూ ఉన్నాయి.. ఈ నేప‌థ్యంలో మేమంతా ఒక చోట క‌లుద్దామ‌ని నిర్ణ‌యించుకున్నాం.. ఇలా రూపుదిద్దుకున్న‌దే ఈ ఆత్మీయ స‌మావేశం.. జూన్ 5వ తేదీన మ‌న్సురాబాద్‌లోని ఎస్‌వీఆర్ క‌న్వెన్ష‌న్ ఇందుకు వేదిక‌గా మారింది..
ఈ కార్య‌క్ర‌మంలో ఆనాటి మ‌ధుర స్మృతుల‌ను, క‌ష్ట సుఖాల‌ను పంచుకున్నాం.. మా సిటీ చీఫ్ న‌ర‌సింహారావు, స‌బ్ ఎడిట‌ర్లు గోవింద్ రెడ్డి, వెంక‌ట‌ర‌మ‌ణ శ‌ర్మ‌, జివీ, హ‌రింద‌ర్ గార్ల‌ను స‌త్క‌రించుకున్నాం.. ఇంత మంది పాత మిత్రుల‌ను క‌లుసుకోవ‌డం చాలా ఆనందాన్ని క‌లిగించింది.. ఇదొక మ‌ర‌పురాని రోజు
నాతో (క్రాంతి దేవ్ మిత్ర‌) పాటు శ్రీయుతులు భ‌వానీ శంక‌ర్‌, చిత్త‌లూరి వెంక‌టేశ్వ‌ర్లు, సామ‌ల ర‌వీంద‌ర్‌, సుంద‌ర్‌, కె.శ్రీనివాస్ రెడ్డి, మేక‌ల స‌త్య‌నారాయ‌ణ‌, భుజంగ రెడ్డి, హంస‌రాజ్‌, కోటేశ్వ‌ర‌రావు, ఫ‌ణిధ‌ర్‌, సంప‌త్ కుమార్‌, భ‌క్త‌వ‌త్స‌లం, ఏ వెంక‌టేశ్వ‌రావు, అర‌వింద్ శ‌ర్మ‌, సి.శ్రీనివాస్‌, జి. ర‌మేష్‌, కొండ‌ల్ రెడ్డి, కె. న‌ర‌సింహా ఈ ఆత్మీయ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు.. అంద‌రికీ పేరు పేరునా ధ‌న్య‌వాదాలు..




Sunday, June 5, 2016

ఇదేం దుస్సాహసం అమెజాన్..

ప్రపంచంలో జనాభా పరంగా రెండో అతి పెద్ద దేశం మనది.. మూడో అతిపెద్ద మతం హైందవం.. కోట్లాది మంది భారతీయులు, హిందువుల విశ్వాసాలను అవమానించింది అమెజాన్ కంపెనీ..
గణనాథుని చిత్రాలతో ఉన్న డోర్ మాట్లను ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టింది.. అమెజాన్ కంపెనీ ఇదే దుస్సాహసాన్ని అన్యమత దైవాలతో ప్రదర్శించగలదా?..
గతంలో కొన్ని దేశాల్లో హిందూ మత విశ్వాసాలతో ఇదే రకంగా వ్యవహరించిన ఘటనలు జరిగాయి..  మనలో ఐక్యత, చీము నెత్తురు లేక పోవడం వల్ల ఇంకా జరుగుతూనే ఉంటాయి..
నేను నేటి నుండి అమెజాన్ ఆన్ లైన్ కొనుగోళ్లను బహిష్కరిస్తున్నాను.. మీరంతా ఇదే మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను.

Thursday, June 2, 2016

రెండేళ్ల తెలంగాణ

*తెలంగాణ* రాష్ట్ర ఆవిర్భావ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు..