Saturday, April 30, 2016

మన ప్రాచీన చరిత్ర

ప్రాచీన భారతదేశ చరిత్రలోని కొన్ని ముఖ్య ఘట్టాలు (మహాభారత యుద్ధం నుండి శాలివాహన శకం వరకు)
క్రీ.పూ.3138: మహాభారత యుద్ద సమాప్తి, ధర్మరాజు పట్టాభిషేకం
క్రీ.పూ.3102: శ్రీకృష్ణుని నిర్యాణం, కలియుగ ప్రారంభం
క్రీ.పూ.3101: పరీక్షిత్తు రాజ్యాభిషేకం
క్రీ.పూ.3076: ధర్మరాజు స్వర్గారోహణ
క్రీ.పూ.3041: పరీక్షిత్తు మరణం, జనమేజయుని రాజ్యాభిషేకం
క్రీ.పూ.1887: బుద్ధుని జననం
క్రీ.పూ.1472: అశోకుని రాజ్యాభిషేకం
క్రీ.పూ.1400: సంస్కృత వ్యాకరణవేత్త పాణిని జననం
క్రీ.పూ.1218: యోగాచార్య పతంజలి జననం
క్రీ.పూ.648: మగధ సామ్రాజ్య స్థాపన
క్రీ.పూ.599: మహావీరుని జననం
క్రీ.పూ.509: అది శంకరాచార్య జననం
క్రీ.పూ.371:చాణక్యుని జననం
క్రీ.పూ.327: చంద్రగుప్తుని రాజ్యాభిషేకం
క్రీ.పూ.326: అలెగ్జాండర్ దండయాత్ర
క్రీ.పూ.101: విక్రమాదిత్యుని జననం
క్రీ.పూ.82: గుప్తుల యుగం అంతం
క్రీ.పూ.57: విక్రమాదిత్య శకం ప్రారంభం
క్రీ.శ.78: శాలివాహన శకం ప్రారంభం
(సేకరణ: క్రాంతి దేవ్ మిత్ర.. ఆధారం: Glimpes of Bharatiya History - Dr.Rajendra Singh Kushivaha)

Friday, April 29, 2016

హడలెత్తిస్తున్న స్వామి

దేశంలో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన రోజులు అవి.. ప్రజాస్వామ్యం స్థానంలో నియంతృత్వాన్ని నెలకొల్పారు ఆమె.. ప్రతిపక్ష నాయకులందరినీ జైలులో బంధించారు. జనసంఘ్ కు చెందిన ఒక ఎంపీ మాత్రం అప్పటికే విదేశాలకు వెళ్ళిపోయాడు.. అతను రాగానే అరెస్టు చేయమని ఆదేశించింది ఇందిర..
అదే సమయంలో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి.. ప్రతిపక్షం లేకుండా ఏకపక్షంగా సాగిపోతున్నాయి.. వందిమాగదులు ఆహా ఓహో అని పొగుడుతుంటే పులకించి పోతున్నారు ప్రధాని ఇందిర.. ఇంతలో ఢిల్లీ విమానాశ్రయంలో  ప్లయిట్ నుండి దిగాడో వ్యక్తి.. నేరుగా పార్లమెంట్ వెళ్ళాడు.. హాజరు పట్టీలో సంతకం పెట్టి లోనికి వెళ్ళాడు.. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రశ్న వేశాడు.. అతన్ని చూసి అధికార పక్షంలో కలకళం చెలరేగింది..
ప్రధాని ఇందిరాగాంధీ అవాక్కయ్యారు.. విదేశాల్లో ఉన్న ఈ వ్యక్తి దేశంలోకి ఎప్పుడొచ్చాడు.. అరెస్టు కాకుండా నేరుగా పార్లమెంటుకు వచ్చి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం ఏమిటి అంటూ నిఘా వర్గాలపై చిందులు తొక్కారు.. పార్లమెంట్ ముగియగానే అరెస్టు చేయమని ఆదేశించారు.. కానీ పార్లమెంట్ ముగిసి పోలీసులు సర్దుకునేలోపు ఆ ఎంపీ మాయమయ్యాడు.. మళ్లీ విమానం ఎక్కి విదేశాలకు వెళ్ళిపోయాడు. హతాశురాలై పోయింది ఇందిర గాంధీ..
ఆ సదరు ఎంపీయే సుబ్రహ్మణ్య స్వామి.. తర్వాత కాలంలో జనతా పార్టీ అధ్యక్షునిగా, కేంద్రమంత్రిగా పని చేశారు స్వామి.. ఆయన రాజకీయాల్లో అపర చాణక్యుడు మాత్రమే కాదు.. ఆర్థిక, న్యాయ శాస్త్ర కోవిదుడు కూడా.. హార్వార్డ్ యూనివర్సిటీ విజిటింగ్ ప్రొఫెసర్ గా కూడా సేవలు అందించారు.. అన్యాయం, అవినీతి అంటే గిట్టదు స్వామికి.. ఎంతో మంది అవినీతి పరులైన నాయకులను కోర్టు బోను ఎక్కించాడు..
సుబ్రహ్మణ్య స్వామి మరోసారి పార్లమెంట్ సభ్యునిగా రాజ్యసభలో అడుగు పెట్టారు.. ఆయన రీ ఎంట్రీ అదిరి పోయింది.. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ కుంభకోణంలో సోనియాగాంధీకి చెమటలు పట్టిస్తున్న స్వామి, తాజాగా అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాఫ్టర్ స్కామ్ లో ఆమె పాత్రపై చెడుగుడు ఆడుతున్నారు.. పాపం  పుణ్యమా అని కాంగ్రెస్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా అయింది.. థట్స్ సుబ్రహ్మణ్య స్వామి..
స్వామీజీ సంఘర్ష్ కరో.. దేశ్ తుమారే సాథ్ హై..

Tuesday, April 26, 2016

అందరికీ వందనాలు

జన్మదిన వేడుకలు జరుపుకోవడం నాకు అలవాటు లేదు.. అలాగని పుట్టిన తేదిని దాచుకోవాల్సిన అవసరం కూడా లేదు.. సోషల్ మీడియా పుణ్యమా అని ఈ తేదీ ఇలా అందరికీ తెలిసి పోతుంది..
జన్మదినం వచ్చిందంటే వయసు మాత్రమే కాదు.. మన జీవితంలో మరో ఏడాది తగ్గింది అని గ్రహించాల్సిన అవసరం ఉంది.. దేవుడిచ్చిన ఈ జీవితాన్ని ఎలా సద్వినియోగం చేయాలి?.. సొంతానికి, కుటుంబానికి మాత్రమే కాదు, సమాజానికి కూడా మన చేతనైన సేవ చేయాలి?.. అనే భావన ప్రతి ఒక్కారికీ ఉండాలని నేను భావిస్తున్నాను..
నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.. మీ అందరి అభిమానానికి ఎప్పటికీ కృతజ్ఞుడిని..

Saturday, April 16, 2016

అంతలోనే దూరమైన రవీందర్

చిరకాల మిత్రుడు దాసరి రవీందర్ ఇకలేడనే వార్తను జీర్ణించుకోవడం కష్టంగానే ఉంది.. జెమినిలో కలిసి పని చేశాం.. ఆ తర్వాత ఈటీవీ, సాక్షి, టీవీ5లలో చేసిన రవీందర్ మంత్రి ఈటెల రాజేందర్ పీఆర్వోగా చేరాడు.. తరచూ కలుసుకుంటూ, ఫోన్లో చాలా సేపు మాట్లాడుకునే వాళ్ళం.. నెల రోజుల క్రితం రవీందర్ ఫోన్ చేసినా, దురదృష్టవశాత్తు కలువలేక పోయాను.. ఎక్కడ కనిపించినా అన్నా అంటూ పలకరించి, ఆప్యాయంగా కౌగలించుకునే రవీందర్ ఇంతలో శాశ్వతంగా దూరం అవుతాడని  ఊహించ లేకపోయాను..
రవీందర్ మన స్వయంసేవక్.. ఏబీవీపీలో కూడా పనిచేశాడు..
రవీందర్ కు నా అశృనివాళి.. ఆయన కుటుంబానికి ప్రగాడ సంతాపం..

శ్రీరామ జయరామ.. లోకాభిరామ

దార్శనికుడు అంబేద్కర్

స్వతంత్ర భారత దేశాన్ని అత్యంత ప్రభావితం చేసిన దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.. షెడ్యూల్డ్ కులాలు, తెగల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడు.. వారికి సామాజిక, ఆర్థిక భద్రత కోసం రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్ల సౌకర్యం కల్పించారు.. కుల రహిత సమాజం కోసం కలలు కన్నారు అంబేద్కర్.. బాబాసాహెబ్ ఆశయాల సాధన కోసం కృషి చేస్తూ.. భారత దేశ స్వాతంత్రం, సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రలకు వ్యతిరేకంగా మనమంతా కలిసికట్టుగా పోరాడదాం..

Friday, April 15, 2016

కశ్మీరియత్ అసలైన చిరునామా


జమ్మూ కాశ్మీర్ పేరు వింటే అందరికీ వెంటనే గుర్తుకు వచ్చేది అక్కడ వెర్రి తలలు వేసిన వేర్పాటువాదం.. తాము భారతీయులం కాదని, ఆజాదీ, జీహాదీ అంటూ రంకెలు వేసే ఉగ్రవాదుల సమర్ధకులు.. తమది ప్రత్యేక సంస్కృతి అని, అదే కశ్మీరియత్ అని వాదిస్తారు.. అసలు ఏమిటి ఈ కశ్మీరియత్?.. దీనికి అర్థం తెలుసా వీరికి?.. వేర్పాటు వాదులు ప్రవచించే ఆజాదీ, జీహాదీయేనా కశ్మీరియత్? వీరి భ్రమల్లో పడి అసలైన కశ్మీరియత్, దీనికి మూల పురుషుడైన ఆచార్య అభినవ గుప్తను మరచిపోయాం మనం..
దాదాపు వేయేళ్ల క్రితం (క్రీ.శ.950-1020) కాశ్మీర్ లోయలో జన్మించారు అభినవ గుప్త.. ఆయన మహా ఆధ్యాత్మిక వేత్త.. గొప్ప పండితుడు, మేధావి, దార్శనికుడు, ఆలంకారికుడిగా ప్రసిద్ధుడు.. అభినవ గుప్తుని తల్లి విమల. తండ్రి నరసింహగుప్త.. తాత వరాహ గుప్తు. తండ్రియే ఆయనకు ప్రథమ గురువు.. పందొమ్మిది మంది మహా పండితుల వద్ద శాస్త్ర విద్యలను నేర్చుకున్నాడు అభినవ గుప్త.. భట్ట ఇందురాజు దగ్గర ధ్వని సిద్ధాంతాన్ని, భట్ట తౌతుడివద్ద నాట్య శాస్త్రాన్ని అభ్యసించారు. శైవ సంప్రదాయంలో ‘ప్రత్య భిజ్’  గ్రంధ రచన  రాశారు.. భరతుని నాట్య శాస్త్రానికి ‘అభినవ భారతి’ వ్యాఖ్యానాన్ని రాశారు అభినవుడు.. ఆనంద వర్ధనుడి ‘ధ్వన్యా లోకం’కు లోచన వ్యాఖ్యను రాసిన మహా పండితుడు.. అదే విధంగా ‘అభివ్యక్తి వాదం’ను సిద్ధాంతీకరించారు. శైవ అద్వైతం లో ఉన్న ‘ఆనంద వాదం’ భూమికగా అభినవ గుప్తుడు  ‘రసం’ అంటే ఏమిటి అన్నది చర్చించారు.. అభినవ గుప్త శైవ ఆగమాలలో నిష్ణాతుడు. తంత్ర శాస్త్రం లోనూ దిట్ట అయన. శైవానికి చెందిన నలభై ఒక్క  గ్రంధాలను రచించారు.. శైవ ఆగమాల మీద, స్తోత్రాల మీద అనేక వ్యాఖ్యలు చేశారు. భట్ట తౌతుడు రాసిన ‘కావ్య కౌతుకం’కు వివరణ రాశారు. అభినవ గుప్త ఇతర రచనల్లో తంత్రసార, బోధ పంచ దశిక, బోధార్ధ కారక, అనుభవ నివేదన, అనుభావాష్టక, క్రమస్తోత్ర భైరవ అష్టకం, దేహ స్థిత దేవతా చక్ర స్తోత్ర, పరమార్ధ వాదాసిక, మహోపదేశ వింశతిక, శివ శక్త్యావినాస స్తోత్రాలు, ఈశ్వర ప్రజ్ఞాభిజ్న విమర్శన, వృత్తి విమర్శిని, ఘత కార్పర కులాక వృత్తి కావ్య కౌతుక వివరణ, పరాత్రిక లఘు వృత్తి, పర్యంత పనికషణ, దేవీ స్తోత్ర తదితర గ్రంథాలు ఉన్నాయి.. అనేక వేదాంత గ్రంధాలు కూడా రచించారు..
అభినవ గుప్త కాశ్మీరంలో తన రచనలతో పాటు శైవ తత్వాన్ని విశేషంగా ప్రచారం చేశారు.. ఆధ్యాత్మిక సాధనకు కులం, లింగబేధాలు లేవని చాటి చెప్పారు.. దైవారాధనకు సన్యాసమే మార్గమని భావించడం సరికాదని, సంసార జీవితంలోనూ ఆధ్యాత్మిక మార్గాన్ని అవలంభించవచ్చని చెప్పిన అభినవ గుప్త, ఆ రోజుల్లో భైరవనాధ శివునిగా గుర్తింపు పొందారు.. ఆయన ప్రబోధించిన కాశ్మీరీ శైవం కొత్త పుంతలు తొక్కింది.. అభినవ గుప్త ఆజన్మ బ్రహ్మచారిగానే ఉండిపోయారు.. ముప్ఫై అయిదేళ్ళు సకల శాస్త్రాల అధ్యయనం చేస్తూ దేశాటనం చేశారు. అభినవ గుప్తకు ముమ్మట, క్షేమేంద్ర తదితర శిష్యులు ఉన్నారు. వీరితో అభినవ గుప్తాచార్య పరంపర అభివృద్ధి చెందింది..
కాలక్రమంలో విదేశీ దాడులతో కాశ్మీరం అనేక మార్పులకు లోనైంది. ఉన్మాదులు అక్కడి మూల వాసులపై పెద్ద ఎత్తున అత్యాచారాలు, దాడులు చేశారు.. మత మార్పిడులతో అసలైన కాశ్మీరి సంస్కృతిని కాలరాచారు.. సనాతన ధర్మాన్ని నమ్ముకున్నవారిని అక్కడి నుండి తరిమేశారు.. ప్రస్తుత తరానికి అభినవ గుప్త అంటే ఎవరో తెలియని దుస్థితి.. అయితే సంస్కృత భాషా పండితుల పరిశోధనల పుణ్యమా అని అభినవ గుప్త తన రచనల ద్వారా నేటికీ సజీవంగా ఉన్నారు.. ఆయన చేసిన 44 రచనల్లో ప్రస్తుతం 21 అందుబాటులో ఉన్నాయి..
జమ్మూ కాశ్మీర్ స్టడీ సెంటర్ దేశ వ్యాప్తంగా అభినవ గుప్త సహస్రాబ్ది కార్యక్రమాలను నిర్వహిస్తోంది.. ఇటీవల ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.. ప్రస్తుతం కాశ్మీర్ లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో అభినవ గుప్త మార్గాన్ని మరోసారి ఆవిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ మహనీయుని సేవలను, బోధనలు ప్రచారం చేయడం ద్వారా అసలైన 'కశ్మీరియత్'ని చాటి చెప్పాల్సిన అవసరం ఉంది.

Wednesday, April 6, 2016

బాబా నిజమే చెప్పారు కదా..

అసలు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందో నాకేమీ అర్థం కాలేదు.. వివాదాస్పద వ్యాఖ్యలు అంటున్నారు.. అసలు వివాదం ఏముంది?.. భారత మాతకు జై అనబోమని కొంత మంది అంటున్నారు.. మన దేశ చట్టాలు, రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి ఊరుకున్నాం.. లేకుంటే లక్షల తలలు తెగేవి.. ఇవి రాందేవ్ బాబా మాటలు..
భారతమాతపై గౌరవాన్ని, దేశభక్తిని, ఈ దేశ చట్టాలు, రాజ్యాంగంపై ఉన్న నిష్టను బాబా చాలా స్పష్టంగా చాటుకున్నారు.. మరి తప్పు పట్టాల్సింది ఎక్కడ?

బాబా రాందేవ్ పై కేసులు పెట్టాలి, అరెస్టు చేయాలి అంటూ రంకెలు వేస్తున్నవారికి ఒక ప్రశ్న.. అయ్యా గతంలో ఒక నాయకుడు చేసిన వ్యాఖ్యల సారాంశాన్ని చేసుకోండి.. పోలీసులు కొద్ది నిమిషాలు తప్పకుంటే చాలు.. హిందువులందరికీ నరికి పోగులేస్తాం..ఈ మాటలు ఎవరన్నారో గుర్తు చేసుకోండి..       అప్పుడు ఎక్కడ దాక్కున్నారు మీరంతా?.. 

Tuesday, April 5, 2016

సంచలనం సృష్టించిన ఐసీఐజే..

రూ. 15500000000000000 అంటే 1550 లక్షల కోట్ల రూపాయలు.. వామ్మో అసలు క్యాలిక్యులేటర్లో కూడా పట్టలేదు ఈ లెక్క.. మొత్తానికి పనామా పేపర్స్ ప్రపంచ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి.. అంతర్జాతీయ పరిశోధనాత్మక పాత్రికేయుల కూటమి (ఐసీఐజే) 1 కోటి 15 లక్షల రహస్యపత్రాలను బయట పెట్టింది.. ప్రపంచ పరిశోధనాత్మక జర్నలిజంలో కనీవినీ ఎరుగని సంచలనం ఇది.. రహస్య మార్గాల్లో నల్లధనాన్ని పోగేసిన వారిలో రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్.. అమితాబ్, ఐశ్వర్య తదిరత 500 మంది భారతీయ ప్రముఖులు ఉండటం చూసి నోళ్లు వెళ్లబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది..

ఈ కుంభకోణం ప్రపంచాన్ని కుదిపేసింది.. అనేక దేశాల్లో పీఠాలను కదిలిస్తోంది.. నల్ల దొరలు ఇంకా తాము పరిశుద్దులమని చెప్పుకుంటే ఆత్మ వంచన చేసుకోవడమే అవుతుంది.. చేసిన పాపం ఏనాటికైనా బయటకు రాక తప్పదు అని చెప్పక తప్పదు.. ఐసీఐజే సృష్టించిన ఈ పనామా పేపర్స్ దుమారంలో నిజా నిజాలు చట్టప్రకారం దర్యాప్తులోనే తేలాలి.. కానీ ఈ పరిశోధనాత్మక కథనాన్ని అభినందించాల్సిందే.. 

Friday, April 1, 2016

అర్థం లేని ఏప్రిల్ ఫూల్ డే

అవతలి వారిని తెలివి తక్కువ వారిని తేల్చి ఆనందించడం అవివేకత్వం.. దీని ప్రత్యేకంగా ఒక రోజుకు నిర్ణయించుకోవడం మూర్ఖత్వం.. అవతలి వాడిని ఫూల్ చేద్దామనుకునే ముందు నిన్ను నువ్వు అంఛనా వేసుకో.. అసలు నీవు నిజంగా తెలివైన వాడివేనా? అన్నది తేల్చుకో.. ఇలాంటి బుద్ధి తక్కువ, పనికి మాలిన వేడుకలు మనకు వద్దు..

No April fool day.. please