Saturday, July 30, 2016

ఎంసెట్ తో అయినా మారాలి ప్రభుత్వ మైండ్ సెట్..

డాక్టర్ అయ్యేందుకు మెడిసిన్ చేయాలని ఉవ్విల్లూడమే విద్యార్థులకు పాపమైంది. జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష ఉండాలా? వద్దా? అనే తర్జన భర్జన మొదలు, ఎంసెట్ పరీక్ష వరకూ అంతా గందరగోళమే. సుప్రీం కోర్టు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల జీవితాలతో బంతాటాడుకున్నాయి. ఈ వరుస పరిణామాల మధ్య లీకు వీరులు వ్యవహారాన్ని చక్కబెట్టుకున్నారు..
ఎంసెట్ 2 రద్దుచేయడం ఒకందుకు మంచిదే.. ప్రశ్నా పత్రం లీకేజీ కారణంగా ఎంత మంది దొంగ ర్యాంకులు సాధించారో తెలియదు. వీరందరూ మంచి కాలేజీల్లో సీట్లు తెచ్చుకుంటే తెలివైన విద్యార్థులకు తీరని అన్యాయమే జరుగుతుంది. మంచిగా చదువుకున్నవారు ఈసారి మరింత మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు.. కాబట్టి తల్లిదండ్రులు పాజిటివ్ గా తీసుకోవడమే మంచిది. విలువైన సమయం, డబ్బు వృధా కావడం బాధాకరమే.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే సరైన నిర్ణయం అనిపిస్తోంది..

ఎంసెట్ 2 దోషులపై చర్యలు తీసుకుంటున్నాం అని తెలంగాణ ప్రభుత్వం చేతులు దులుపుకుంటే సరిపోదు. ఇందుకు బాధ్యత కూడా వహించాలి. సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులు, పరీక్ష నిర్వహణ సిబ్బంది అసమర్ధతకు ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఏముంటుంది? ఎంసెట్ ద్వారా అయినా కావాలి వీరికి మైండ్ సెట్..

Friday, July 29, 2016

తెలుగు సాహిత్యానికి నిలువుటద్దం సినారె

ఆయన చదివింది ఉర్దూ మీడియం.. అయినా తెలుగులో గొప్ప కవి, సాహితీవేత్తగా ఆవిర్భవించారు.. కొన్ని వేల కవితలను, సినీ గీతాలను ఆవిష్కరించారు.. రోజూ ఏదో ఒక కవిత్వం రాయనిదే ఆయనకు నిద్ర పట్టదు.. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా జ్ఞానపీఠ పురస్కారం వరించింది.. రాజ్యసభ సభ్యునిగా ఉన్న సమయంలో భాషా, సాహిత్య, సాంస్కృతిక రంగాలకు సంబంధించిన ఎన్నో అంశాలను లేవనెత్తారు.. ఎన్నో పదవులు, పురస్కారాలు ఈ సాహితీవేత్తను వరించాయి.. సినారెగా ప్రసిద్దికెక్కిన డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి నేడు తన 82వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.. తెలుగు సాహిత్యానికి నిలువుటద్దమైన సినారె గారికి జన్మదిన శుభాకాంక్షలు..

Tuesday, July 26, 2016

నిర్దోషి అట..

అవును నిర్దోషి.. అనవసరంగా కృష్ణ జింకలు ఆయన వేటకు అడ్డొచ్చి చచ్చాయి మరి.. 😡

Wednesday, July 20, 2016

ఇంకో రెండేళ్లు బజ్జోవచ్చు..

పార్లమెంటులో నిద్ర పోవడం పప్పూజీకి కొత్తేం కాదు.. 2014లో నిద్ర పోయాడు.. 2015 కూడా నిద్రపోయాడు.. 2016లో కూడా నిద్ర పోతున్నాడు.. వచ్చే ఏడాది కూడా లక్షణంగా నిద్రపోతాడు..
అసలు పార్లమెంటులో వాడీ వేడీ చర్చలు జరుగుతుంటే, అందునా కాంగ్రెస్ సభ్యులే మాట్లాడుతుంటే రాహుల్ ఎందుకు నిద్ర పోయినట్లు?.. పార్లమెంటు సమావేశాలంటే  నిర్లక్ష్యమా?.. అంతగా నిద్ర వస్తే పార్లమెంటులోని వారి పార్టీ ఆఫీసుకో, ఇంటికో పోయి పడుకోవచ్చు కదా?
పాపం పప్పూను సమర్ధించుకోవడానికి కాంగ్రెస్ నేతలు తంటాలు పడుతూ, పరస్పర విరుద్ద ప్రకటనలు చేస్తున్నారు.. అప్పుడే పార్లమెంటులోకి వచ్చిన రాహుల్ కండ్లు నలుచుకొని రిలాక్స్ అయ్యారని రేణుకా చౌదరి వెనుకేసుకొస్తే, దేశ ప్రజల కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్న రాహుల్ కాస్త నిద్ర పోయుండొచ్చని ఆస్కార్ ఫెర్నాండెజ్ సెలవిచ్చారు..

ప్రతి పక్షంలో రాహుల్ లాంటి నాయకులు ఉంటే నరేంద్ర మోదీకి ఇంతకన్నా కావాల్సింది ఏముంటుంది..  పప్పూ బజ్జో నన్న.. ఇప్పుడు చేయడానికి ఏముంది?.. ఎన్నికల దాకా రెస్టు తీసుకో.. 2019 తర్వాత అంటావా? చూద్దాం అప్పుడు కూడా  మళ్లీ పార్లమెంటులో పడుకునే అవకాశం రావచ్చు

నోరుంది కదా అని..


అబద్దాన్ని ఎన్నిసార్లు వల్లించినా నిజం కాదు.. దారిన పోయే దానయ్య రచ్చబండ దగ్గర ఏదో మాట్లాడితే, తాగి వాగుతున్నాడులే అని ఎవరూ పెద్దగా పట్టించుకోరు.. అతిగా ప్రవర్తిస్తే నాలుగు పీకుతారు.. మహాత్మాగాంధీని ఆర్ఎస్ఎస్ హత్య చేసిందంటూ 68 ఏళ్లుగా దుష్ప్రచారం చేస్తున్న వారి తీరు కూడా దానయ్యల్లాగే ఉంది..
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఇలాంటి కూత కూసి ఇరకాటంలో పడ్డారు.. పరువు నష్టం దావా ఎదుర్కొంటున్నాడు.. ఈ వ్యాఖ్యలపై పశ్చాతాపం వ్యక్తం చేయకుంటే విచారణ ఎదుర్కోక తప్పదని సుప్రీం కోర్టు హెచ్చరించింది..

అయినా సరే రాహుల్ క్షమాపణ చెప్పే ప్రస్తక్తి లేదంటూ ప్రకటన చేసి కాంగ్రెస్ పార్టీ న్యాయ వ్యవస్థపై తన గౌరవాన్ని ప్రకటించుకుంది.. చింత చచ్చినా పులుపు చావదంటే ఇదేనేమో..

Tuesday, July 19, 2016

తారక్ అంటే ముఖ్యమంత్రా?


మీ మొబైల్‌లో google translate యాప్ ఉందా?.. అయితే English నుండి Telugu అనువాదం సెట్ చేసుకోండి..
tarak అని type చేయండి.. ఆశ్చ‌ర్యం.. 'ముఖ్య‌మంత్రి' అని వ‌చ్చింది క‌దూ?
ఇదేమిట‌ని అడ‌క్కండీ అంతా 'గూగుల్ త‌ల్లి' మ‌హిమ..
ఇంత‌కు ఏ తార‌క్‌?.. తెలంగాణా? లేక ఆంధ్రా? అని మాత్రం అడ‌క్కండి ప్లీజ్‌.

గురు దేవో నమ:

గురుర్బ్రహ్మా గురుర్విష్ణు: గురుర్దే వో మహేశ్వర: గురు: సాక్షాత్ పరర్బబ్రహ్మా తస్మైశ్రీ గురవే నమ: 

Sunday, July 17, 2016

మృత్యోన్మాద విలయ తాండవం

మృత్యువు ఏ రూపంలో అయినా రావచ్చు.. అది ఎక్కడో ఏ దేశంలోనో ఉండొచ్చు.. మన దేశంలో, మన ఊరిలో.. చివరకు మన ఇంటి ముందుకే వచ్చేయొచ్చు..
ఈ మృత్యువుకు దేశాలు లేవు.. ఎల్లలు తెలియవు..
చావు ఎప్పుడో తెలియదు.. చచ్చేది ఎవడో తెలియదు.. అది నువ్వు కావచ్చు.. నేనే కావచ్చు.. మనమిద్దరం అవనూ వచ్చు..
చావు ఏనాటికైనా తప్పదు.. కానీ ఇలాగేనా మనమంతా చచ్చేది?.. ఇలాంటి చావునేనా మనం కోరుకుంటున్నది?..
వికృత మృత్యోన్మాదంతో నవ్వుతుంటే ప్రపంచం అంతా భయపడిపోతోంది.. వణికిపోతున్నది..
ఎప్పుడు ఎవన్ని కాల్చి చంపుతాడో తెలియదు,, ఎందుకు చంపుతున్నాడో తెలియదు.. ఈ విషయంలో వాడికే క్లారిటీ ఉండకపోవచ్చు..  
ఒకనాడు తోటి మనిషి కనిపిస్తే దైర్యంగా ఉండేది,, కానీ ఇప్పడు ఎదుటి వాన్ని చూస్తేనే భయపడిపోతున్నాం.. వాడు మిత్రుడా? శత్రువా? తేల్చుకోలేక వణికిపోతున్నాం.. ఎందుకిలా?
నాగరికత ఎంతో ఎత్తుకు ఎదిగిందని, ముందుకు పోతున్నామని సంబర పడుతున్నాం.. కానీ మళ్లీ వెనక్కి తిరిగి శిలా యుగం వైపు పరుగులు తీస్తూ అనాగరికులుగా మారిపోతున్నాం.. మూఢులుగా తయారవుతున్నాం..
ఏమైపోతోంది ఈ సమాజం?.. ఏమవుతోంది ఈ దేశం.. చివరకు ఈ ప్రపంచమంటూ ఒకటి మిగుతుందా? కనీసం ఈ భూగోళమైనా అస్థిత్వంలో ఉంటుందా?..
ఇదేగా జరుగున్నది.. ఇలా జరగాల్సిందేనా?.. మనం కోరుకుంటున్నది ఇదేనా?
దేవుడా? కనీసం నీవైనా మిగిలావా ఈ విశ్వంలో.. మమ్మల్ని కాపాడకున్నా పర్వాలేదు.. కనీసం నిన్ను నీవైనా రక్షించుకో..

శీలా యూపీ సీఎం.. రోశయ్య తెలంగాణ సీఎం

2019 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి రోశయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే ఎలా ఉంటుంది?
అరేయ్ నీకేమన్నా పిచ్చా?,, రోశయ్య ఎంత సమైక్య రాష్ట్రానికి సీఎంగా పని చేసినా, ఇప్పుడాయన పక్క రాష్ట్రం వ్యక్తి.. అందునా తమిళనాడుకు గవర్నర్.. పైగా వృద్దాప్యం.. అసలీ వెర్రి ఐడియా ఎలా వచ్చిందిరా నీకు?
రోశయ్యను తెలంగాణ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే తప్పేముంది?.. నా అభిప్రాయం సరైందే..
అదెట్లారా అర్థం అయ్యేటట్లు చెప్పు?
గతంలో ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పని చేసిన శీలా దీక్షిత్ ను రాబోయే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ప్రకటించిందిగా కాంగ్రెస్ పార్టీ?..
అయితే?..
ఈ లెక్కన రోశయ్యను కూడా తెలంగాణకు సీఎం అభ్యర్థిని చేస్తే తప్పేముంది?
అవున్రోయ్ నీ లాజిక్ బాగానే ఏంది... ఇంకొద్దిగా అర్థం అయ్యేటట్లు చెప్పు..
రోశయ్య, శీలా దీక్షిత్ ఇద్దరూ ముఖ్యమంత్రులుగా పని చేసిన వాళ్లే.. ఇద్దరికీ గవర్నర్ గిరీ అనుభవం కూడా ఉంది.. కాంగ్రెస్ పార్టీకి వీర విధేయులు కూడా.. వయో భారం ఇద్దరికీ అధనపు అర్హత..’
అవునవును ఈ విషయాల్లో ఇద్దరికీ సామీప్యత బాగానే ఉందిరా..
మరి శీలా బాటలోనే మన రోశయ్యను కూడా పొరుగు రాష్ట్రానికి సీఎం అభ్యర్థిగా ప్రకటించడం అసాధ్యమేమీ కాదు.. ఏమంటావ్?
నీ తర్కం బాగానే ఏడిచింది కానీ.. రోశయ్యను తెలంగాణ సీఎం అభ్యర్థిని ఎందుకు చేయాలి.. అదేదో ఆయన సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కే తిరిగి సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే సరిపోతుంది కదా?
కాంగ్రెస్ పార్టీకి ఇక ఏపీలో పుట్టగతులు లేవురా?.. అందుకే కొద్దో గొప్పో బలం ఉన్న తెలంగాణకు ఆ పెద్దాయనను సీఎం అభ్యర్థిని చేయాల్సిందే.. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ దివాలా తీసినందుకే కదా శీలాను యూపీకి పంపుతున్నది..
ఆర్నీ ఏ ఐడియా రా నీది.. నిన్ను అర్జంటుగా తీసుకుపోయి సోనియా గాంధీ కోటరీలో చేర్చాల్సిందేరా?..
హహ్హ.. హ్హ..
ఎందుకురా నవ్వుతున్నావ్?

లేకపోతే ఏందిరా.. శీలా దీక్షిత్ ఏమైనా ఈ వృద్దాప్యంలో యూపీకి సారధ్యం వహిస్తే, ఆ రాష్ట్రం వాళ్లు ఆహా ఓహో అంటూ గెలిపిస్తారనుకున్నావా?.. రోశయ్యను తెలంగాణకు సీఎం చేసినా ఒకటే.. శీలాను యూపీకి సీఎం చేసినా ఒక్కటే..

పాకిస్తాన్ దీనికేమంటావ్?

కాశ్మీర్ విషయంలో ఐక్యరాజ్య సమితి జోక్యం కోరుతున్న పాకిస్తాన్, సముద్ర జలాల హక్కుల విషయంలో చైనాకు వ్యతిరేకంగా ఐక్య రాజ్య సమితి ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును గౌరవిస్తుందా?.. చచ్చింది గొర్రె..

Tuesday, July 12, 2016

ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ..

కొన్నాళ్లుగా కుదుట పడుతున్న కాశ్మీరంలో కల్లోల వాతావరణం నెలకొంది.. శ్రీనగర్ తో పాటు పలు పట్టణాలు నిరసనలు, కాల్పులతో అట్టుడుకుతున్నాయి.. హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వనీ ఎదురు కాల్పుల్లో మరణించిన తర్వాత ఉద్రిక్తతలు నెలకొన్నాయి.. కాశ్మీర్ లో పరిస్థితులు పునరావృతం కానున్నాయా?.. కాదు కానే కాదు..

ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ.. కాశ్మీర్ లో ఉగ్రవాదం పరిస్థితి అంతే.. పండుగ చేసుకోవానికి సందర్భం ఏదైతేనేం అన్నట్లు ప్రశాంత పరిస్థితులను భగ్నం చేయడానికి పాకిస్తాన్ ప్రేరిత వేర్పాటువాద శక్తులకు ఏదో ఒక కారణం కావాలి.. అది బుర్హాన్ వనీ రూపంలోవచ్చింది..
గతంతో తీవ్రవాదులంతా పాకిస్తాన్ నుండి వచ్చి కాశ్మీర్లో కార్యకలాపాలు సాగించేవారని, బుర్హాన్ స్థానికుడు కావడం వల్లే ఉద్రిక్తతలు నెలకొన్నాయని విశ్లేషిస్తున్నారు.. మరి బుర్హాన్ కమాండర్ గా ఉన్న హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థ ఎక్కడిది?.. ఆయన అంత్యక్రియల సందర్భంగా ఎగిరిన జెండాలు ఎక్కడివి?.. ఆజాదీ అంటూ పాచిపాట పాడేవారంతా కాశ్మీర్ ను పాకిస్తాన్ లో కలపాలని కోరేవారే కదా?
కాశ్మీరీల స్వీయ నిర్ణయ హక్కు గురుంచి మాట్లాడే గురవింద పాకిస్తాన్ ముందు తనకింద నలుపు చూసుకోవాలి.. కబ్జాలో ఉన్న పీవోకేను భారత్ కు తిరిగి అప్పగించకుండా చిలకపలుకులు పలుకుతోంది.. అంతర్గత వర్గపోరుతో కొట్టుకు చస్తున్న పాక్, కాశ్మీర్ లోనూ అదే పరిస్థితి ఏర్పడాలని కోరుకోవడం సహజం కదా?.. 

Friday, July 8, 2016

సెక్యులర్ నిష్టకు ఇది పరీక్ష

ఓ లీడర్లూ, క్యాడర్లూ..
పవిత్ర రంజాన్ మాసం గడచిపోయింది.. టోపీలు, షేర్వానీలు పెట్టుకున్నారు.. ఈ నెలంతా ఇఫ్తార్ విందులు బాగానే ఆరగించారు.. సంతోషం.. భక్తాయాసం తీరేదాకా కాస్త విశ్రాంతి తీసుకోండి..
త్వరలో వినాయక చవితి వస్తోంది.. మన మిత్రులను పూజలకు ఆహ్వానించండి., బొట్టు పెట్టి గణనాధుని ఆశీర్వాదం ఇప్పించండి.. చక్కని ప్రసాదం, భోజనం పెట్టండి..

మీ సెక్యులర్ నిష్టకు ఇది పరీక్ష.. విజయీ భవ..

Saturday, July 2, 2016

పుష్కరాలకు ఆలయాలు అడ్డంకా?

పుష్కర స్నానం చేశాక దేవున్ని మొక్కుకోవడం ఆచారం.. కానీ కృష్ణా పుష్కరాల పేరిట దేవుళ్ల ఆలయాలనే కూల్చేస్తే?
అసలు విజయవాడలో జరుగుతున్నది ఏమిటి? ఆలయాలను ఇంత దారుణంగా కూల్చేస్తారా?.. ఆలయాలను బుల్డోజర్లతో కూల్చి దేవతా విగ్రహాలను నిర్లక్ష్యంగా పడేశారు.. చెప్పు కాళ్లతో తొక్కారు?.. ఒకవేళ అభివృద్ధి పనుల కోసమే కూల్చివేశామని సమర్ధించుకుంటే కేవలం ఆలయాలనే ఎందుకు కూల్చేశారు? ఇది ఏ రకమైన అభివృద్ది?..
మనం స్వతంత్ర భారత దేశంలో ఉన్నామా? లేక ఇంకా మధ్య యుగంలో మగ్గిపోతున్నామా? మెజారిటీ ప్రజలైన హిందువుల మనోభావాలు పాలకులకు పట్టవా? సీఎం చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు? ఆయనకు తెలిసే జరిగిందా? లేక తెలిసీ తెలియనట్లు నటిస్తున్నారా?  అందునా దేవాదాయ శాఖ మంత్రి స్వయాన భాజపా వారే.. ఈ విషయంలో కనీసం ఆయన అయినా స్పందించకపోతే ఎలా?.. తక్షణం ఆలయాలను తిరిగి నిర్మించి పాప ప్రక్షాళన చేసుకోవాలి..

సీఎం సాబ్ కు ఎందుకు చెప్పలేదు..

నాకో అనుమానం..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర విషయంలో ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావును అప్రమత్తం చేశారట.. ఈ విషయం స్వయంగా కేసీఆర్ ఇటీవల బయట పెట్టారు.. మరి హైదరాబాద్ పాత నగరంలో తిష్ట వేసిన ఉగ్రవాదుల గురుంచి సీఎం గారికి ఓవైసీ సాబ్ ఎందుకు చెప్పలేదు?..

ఎన్ఐఏ అప్రమత్తత వల్ల ఎంత పెద్ద ముప్పు తప్పిపోయింది.. లేకపోతే భాగ్యనగరం ఏమయ్యుండేది.. అది సరే పట్టుబడ్డ ఉగ్రవాదులకు ఓవైసీ సాబ్ న్యాయ సహాయం చేస్తారట.. హతవిధి.. దేవుడా.. కాపాడు నా నగరాన్ని..