ఆయన
చదివింది ఉర్దూ మీడియం.. అయినా తెలుగులో గొప్ప కవి, సాహితీవేత్తగా ఆవిర్భవించారు..
కొన్ని వేల కవితలను, సినీ గీతాలను ఆవిష్కరించారు.. రోజూ ఏదో ఒక కవిత్వం రాయనిదే
ఆయనకు నిద్ర పట్టదు.. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా జ్ఞానపీఠ పురస్కారం
వరించింది.. రాజ్యసభ సభ్యునిగా ఉన్న సమయంలో భాషా, సాహిత్య, సాంస్కృతిక రంగాలకు సంబంధించిన
ఎన్నో అంశాలను లేవనెత్తారు.. ఎన్నో పదవులు, పురస్కారాలు ఈ సాహితీవేత్తను
వరించాయి.. సినారెగా ప్రసిద్దికెక్కిన డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి నేడు తన
82వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.. తెలుగు సాహిత్యానికి నిలువుటద్దమైన
సినారె గారికి జన్మదిన శుభాకాంక్షలు..
No comments:
Post a Comment