Saturday, May 31, 2014

ఏదీ పూర్ణ కుంభం?

కొత్తగా రూపొందించిన తెలంగాణ రాజముద్రను చూసి చాలా మంది మురిసిపోతున్నారు.. కొందరు కస్సుబుస్సుమంటున్నారు.. నాకు మాత్రం ఏదో కోల్పోయినట్లనిపించింది.. అవును మన సాంస్కృతిక వారసత్వాన్ని కోల్పోయాం.. ఏదీ పూర్ణకుంభం?
శుభానికి, పవిత్రతకు, సంస్కృతి చిహ్నమైన పూర్ణకుంభం ఆంధ్రప్రదేశ్ రాజముద్రలో ప్రముఖంగా కనిపిస్తుంది.. మామిడాకులు, కొబ్బరికాయతో అలంకరించిన కలశాన్ని మన ఇళ్లలో, శుభ కార్యాలలో చూస్తుంటాం.. ఇదే పూర్ణకుంభం.. పూర్ణ కుంభ స్వాగతం అంటే ఎంత హుందాగా ఉంటుంది? దీంతో తెలంగాణకు ఏం సంబంధం అంటున్నారా? దీని మూలాలు తెలంగాణవే అని ఎంత మందికి తెలుసు?
ఆంధ్రప్రదేశ్ రాజముద్రలో మనం చూస్తున్న పూర్ణకుంభాన్ని నల్లగొండ జిల్లాలోని దేవరకొండ దుర్గం ముఖ ద్వారం నుండి స్వీకరించారు.. తెలుగు తల్లి చేతిలో కూడా ఇది ప్రముఖంగా కనిపిస్తుంది.. రాష్ట్ర సచివాలయ ముఖ ద్వారం దగ్గర మనను పలకరిస్తున్న పూర్ణకుంభ నమూనా శిల్పాన్ని గమనించారా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరిస్తున్న ఆస్తులు, పంపకాలు అంటూ గోల పెడుతున్నాం,, కానీ మన సాంస్కృతిక వారసత్వ చిహ్నమైన పూర్ణకుంభాన్ని గాలికి వదిలేశాం.. ఎంత దౌర్భాగ్యం.. పవిత్రమైన పూర్ణ కుంభానికి మన రాజముద్రలో చోటు లేదా?

కాకతీయ శిలాతోరణం, చార్మినార్ కూడా మన చారిత్రక వారసత్వమే.. కాదనలేం.. వాస్తవానికి తెలంగాణ రాజముద్రలో కాకతీయ శిలాతోరణం మాత్రమే పెడదామనుకున్నారు.. కానీ మజ్లిస్ వత్తిడికి తలొగ్గి సంతృష్టీకరణ రాజకీయ కోణంలో చార్మినార్ ను అతికించారు.. నిజానికి లోగోలో మనం చూసేది తీన్ మినార్నే గమనించండి.. పూర్ణ కుంభానికి రాజముద్రలో చేరిస్తే వచ్చే నష్టం ఏమిటి?.. రాజకీయాలకు అతీతంగా అలోచించండి..

Friday, May 30, 2014

ఎందుకీ ఆర్టికల్ 370?..

భారత దేశంలో ఏ రాష్ట్రానికి లేని ఆర్టికల్ 370 జమ్మూ కశ్మీర్ కు మాత్రమే ఎందుకు?.. ఈ అధికరం ఉండాలని వాదిస్తున్న మేధావులు డొంక తిరుగుడు లేకుండా చెప్పగలరా?..
జమ్మూ కశ్మీర్ భారత దేశంలో సంపూర్ణంగా విలీనం అయింది.. అలాంటి సమస్యే ఉన్న హైదరాబాద్, జునాగఢ్ సంస్థానాలు కూడా ఇంచుమించు అదే సమయంలో విలీనం అయ్యాయి.. మరి మిగతా రెండు ప్రాంతాలకు ఎందుకు ఆర్టికల్ 370 ఇవ్వలేదు?
కశ్మీర్లో వేర్పాటు వాదానికి, ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తున్నది ఆర్టికల్ 370 అని ఎంత మందికి తెలుసు?.. భారత దేశంలో ఉండేవారు ఏ ప్రాంతానికైనా వెళ్లి స్వేచ్చగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందొచ్చు.. వివాహం, ఆస్తుల విషయంలో ఎలాంటి నియంత్రణలు లేదు.. కానీ కశ్మీర్ ప్రాంతానికి ఇవేవీ వర్తించవు.. భారత దేశ చట్టాలేవీ నేరుగా అక్కడ అమలు కావు.. ఇంకా చెప్పాలంటే చాలా విచిత్రాలు కనిపిస్తాయి..
ఆర్టికల్ 370ని సమీక్షిస్తామంటే గయ్యిన ఎగిరిపడుతున్నారు అబ్దుల్లాలు, ముఫ్తీలు.. వారికి వంతపాడే కాంగీలు.. వేర్పాటు వాదులు సరే సరి.. మరి కశ్మీర్ సంస్కృతికి నిజమైన వారసులైన పండిట్ల వాదనను ఎందుకు పట్టించుకోరు?.. తరతరాలుగా నివసిస్తున్న ఎందరో హిందూ పండిట్ల మాన ప్రాణాలను హరించి, వారి ఆస్తులను దోచుకొని కశ్మీర్ లోయ నుండి తరిమేశారు వేర్పాటువాదులు.. వారి వాదన వినాల్సిన అవసరం లేదా? కశ్మీరియత్ అంటే ఉగ్రవాదుల వాదనకు అర్థం పాడటమేనా?.. కశ్మీర్ సమస్యపై చర్చ అంటే వేర్పాటువాదులతోనేనా?.. పండిట్లను ఎందుకు అందులో భాగస్వాములును చేయరు?..

ప్రతి భారతీయుడు ఆలోచించాల్సిన విషయాలు ఇవి? ఆర్టికల్ 370ని పూర్తిగా చదవండి.. అందులో ఏముందో అర్థం చేసుకొని చర్చించండి.. వాస్తవం బోధపడుతుంది..

పోలవరం గోల..

పోలవరంపై ఇప్పుడు చేస్తున్న గోల అర్థంలేని మూర్ఖత్వం.. పోలవరం ప్రాజెక్టును కడితే లాభాలేమిటి? నష్టాలేమిటి అనే చర్చ చాలా కాలంగా ఉన్నా, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అందరికీ తెలిసొచ్చింది.. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇంతకాలం పట్టించుకోకుండా నిద్రపోయిన వారు ఇప్పుడేదో కొత్తగా ఏదో జరిగిపోయిందని గొంతు చించుకు అరుస్తున్నారు.. వాస్తవాలను మరుగుపరచి అవతలి వారిపై బురద చల్లుతున్నారు..
ఖమ్మం జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపాలనే నిర్ణయం రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలైనప్పుడే తీసుకున్నారు.. ప్రత్యేక రాష్ట్రం వస్తుందనే ఆనందంలో దీన్ని తెలంగాణలోని రాజకీయ పార్టీలు సీరియస్ గా తీసుకోలేదు.. నిజానికి ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపాల్సిన అవసరం ఏమిటి? కలపకపోతే నష్టపరిహారం, పునరావాసం కల్పించడం ఇబ్బంది ఉంటుందని చెప్పేవారు ఒక విషయాన్ని ఆలోచించాలి..
పోలవరం కడితే నష్టపోతున్నది ఖమ్మం జిల్లా గ్రామాలు మాత్రమే కాదు.. ఛత్తీస్ గఢ్, ఒడిషా రాష్ట్రాల గ్రామాలకు కూడా ముంపు ప్రమాదం ఉంది.. మరి ఆ గ్రామాలను నష్టపరిహారం, పునరవాసం పేరిట సీమాంధ్రలో కలుపుకుంటారా? వారికి వర్తించని సూత్రం తెలంగాణ విషయంలోనే ఎందుకు అమలు చేస్తున్నట్లు?
అసలు పోలవరం ప్రాజెక్టు డిజెన్ మార్చాలనే డిమాండును ఎందుకు పట్టించుకోవడం లేదు?.. ప్రస్తుతం ఉన్న డిజైన్ ప్రకారం నిర్మిస్తే ప్రయోజనాలు, లాభాల మాటేమిటో కానీ అనర్ధాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.. మామూలు వరద రోజుల్లోనే భద్రాచలం పట్టణం నీట మునగడాన్ని మనం చూస్తున్నాం.. పోలవరం కడితే శాశ్వత జలసమాధి ఖాయం.. ఎంతో విలువైన ప్రకృతి సంపద, గిరిజనుల ఆవాసాలు, వారి సంస్కృతి, కొండలు, కోనలు, వన్యప్రాణులకు ముప్పు పొంచి ఉంది.. పాపికొండల అందాలను ఇకపై చూలేం.. ఈ ముప్పును నివారించాలంటే డిజైన్ కచ్చితంగా మార్చాల్సిందే..

పోలవరం విషయంలో రాజకీయ పార్టీలు తమ స్వార్థపూరిత ఓటు బ్యాంకు రాజకీయాలు పక్కన పెట్టి నిండు మనసుతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను..


Thursday, May 29, 2014

సావర్కర్ గుర్తున్నారా?..

దేశం కోసం జీవితాన్నే సమర్పించుకున్న మహానుభావుడు.. స్వాతంత్ర్య సమర పోరాటంలో రెండు యావజ్జీవ కారాగార శిక్షలు పడి 27 ఏళ్లు అండమాన్ జైలులో మగ్గిపోయారు.. 1857లో జరిగింది సిపాయిల తిరుగుబాటు కాదు, ప్రథమ స్వాతంత్ర్య సమరమని బయటపెట్టిన చరిత్రకారుడు.. అంటరానితనం, అసమానతలు, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త.. హిందూ మహాసభ వ్యవస్థాపకుడు.. ఎంతో మంది సమరయోధులను తీర్చి దిద్దిన స్పూర్తి ప్రధాత.. ఇలా ఆయన గురుంచి ఎన్ని చెప్పినా తక్కువే..
వినాయక్ దామోదర్ సావర్కర్.. స్వాతంత్ర్య వీర సావర్కర్ పేరిట ప్రఖ్యాతుడు..
దేశం కోసం సర్వస్వాన్ని కోల్పోయిన ఈ మహనీయుడి జయంతిని మరోసారి దేశం గుర్తు తెచ్చుకుంది.. అటల్జీ ప్రధానిగా ఉన్నప్పుడు సావర్కర్ కు అధికారికంగా నివాళులు అర్పించినట్లు గుర్తు.. మళ్లీ నరేంద్ర మోదీ ప్రధాని అయినప్పుడే ఈ వేడుక జరిగింది..

ఇంతకీ మీ అర్హతలు ఏమిటి?

ఈ దేశంలో ఛాయ్ వాలా ప్రధాని కావొద్దు.. కానీ విదేశీ చేతిలో అధికారం ఉండాలి.. గ్రాడ్యుయేషన్ చేయని స్మృతి ఇరానీ మంత్రి కావొద్దట.. కనీస విద్యార్హత లేని సోనియా గాంధీ దేశాన్ని పాలించవచ్చట.. ఇదండీ కాంగ్రెస్ పార్టీ వాదన..
సోనియా గాంధీతో పోలిస్తే తెలివితేటల్లో స్మృతి ఇరానీయే చాలా వరకూ మెరుగు.. స్మృతి హిందీ, ఇంగ్లీషుల్లో అద్భుతంగా మాట్లాడగలరు.. ఏ విషయంలో అయినా వాదించగల అపారమైన తెలివితేటలు ఉన్నాయి ఆమెకు.. సాధారణ కుటుంబంలో వచ్చి జీవితంలో కష్టపడి పైకి వచ్చారామె.. నటిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు..  మరి సోనియా స్క్రిప్టు లేనిదే నోరు పెగలని సోనియా గాంధీకి అధనంగా ఉన్న అర్హతలు ఏమిటి? రాజీవ్ సతీమణి కావడమేనా?..
సోకాల్డ్ గాంధీ పరివారంగా చెప్పుకుంటున్న సోనియా గత చరిత్ర ఏమిటి? రాజీవ్ గాంధీని వివాహం చేసుకోకముందు ఆమె చరిత్ర ఏమిటి?.. సుబ్రహ్మణ్య స్వామి గారిని అడగండి చెబుతారు.. రాజీవ్, సోనియా, రాహుల్ విద్యార్హతలు.. వంశ చరిత్రలు సహా అన్ని విషయాలపై సమగ్ర నివేదికలు ఉన్నాయి స్వామిగారి దగ్గర.. వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లకూడదనే ఆయన చాలా వరకూ సంయమనం పాటించాయి..
మంత్రి పదవులు చేపట్టేవారికి సంబంధిత శాఖల వ్యవహారాలను అజమాయిషీ చేసే జ్ఞానం, తెలివి తేటలు ఉంటే చాలు.. తమిళం తప్ప మరే భాష రాని అలగిరి యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా పని చేయలేదా?.. వైద్య ఆరోగ్య శాఖకు ఇప్పటి వరకూ డాక్టర్లే మంత్రులుగా పని చేశారా? అంతెందుకు మన రాష్ట్రంలో ఈ శాఖను నిర్వహించిన దానం నాగేందర్ విద్యార్హత ఏమిటి.. ఆరణాల కూలీ అంజయ్య కార్మిక నేతగా ఎదిగి ముఖ్యమంత్రి పదవిని చేపట్టలేదా? ఆయన ఏం చదువుకున్నారో తెలుసా?..

ఇలా తవ్విన కొద్దీ బొమికలు బయటకు వస్తాయి.. ప్రధాన ప్రతిపక్ష హోదాలో కూడా ఉండే అర్హత లేకుండా భారత ప్రజలు కాంగ్రెస్ పార్టీని కట్టడి చేశారు.. ఈ ఇంగితం కోల్పోతే వారి వచ్చే ఎన్నికల్లో ఈ మాత్రం సీట్లు కూడా రావని కచ్చితంగా చెప్పగలను..

Wednesday, May 28, 2014

మీ ప్రమాణ స్వీకారోత్సవానికి సార్క్ సభ్యులను పిలవడం కుదరదు సార్.. పోనీ కేసీఆర్, జగన్, చిరంజీవిలను పిలుద్దామా?
(హన్స్ ఇండియా కార్టున్)"  

ఉత్తుత్తినే..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉత్తుత్తి పాలన మొదలైంది.. రాష్ట్ర విభజనకు ముందుగా ఇది ట్రయల్ అట.. ఇప్పటికే విభజితమైన ప్రభుత్వ శాఖలు విడివిడిగా పని చేస్తున్నాయి.. అయితే ఉత్తుత్తి పాలన అయినందున కీలక నిర్ణయాలు తీసుకోవు.. ఎలాంటి ఉత్తర్వులు (జీవోలు) విడుదల కావు..జూన్ 1 వరకూ ఇంతేనట.. ఆ తర్వాత ఎవరి రాష్ట్రం వారిదే.. ఎవరి గోల వారిదే..
(నోట్: ఉత్తుత్తి పాలన కదా.. ఎవరూ పట్టించుకోరని తప్పుడు పనులు చేయకండి.. పోలీసు శాఖ మాత్రం నిజంగా పని చేస్తుంది సుమా..)

మోదీ దూకుడు..

నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న మరునాడే పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తో సమావేశం కావడం సంతోషకరం. పాకిస్తాన్ నుండి భారత్ లోకి చొరబడుతున్నఉగ్రవాదులు సృష్టిస్తున్న బీభత్సాన్ని మోదీ ఆయనతో ప్రస్థావించారు.. ఉగ్రవాద నియంత్రణకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు.. మరోవైపు క్యాబినెట్ మొదటి సమావేశంలోనే విదేశీ బ్యాంకుల్లో ఉన్న భారతీయుల నల్లధనంపై చర్చిండం, సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం సిట్ ఏర్పాటు చేయడం సంతోషకరం..నరేంద్ర మోదీ ఇదే దూకుడు కొనసాగించాలని కోరుకుందాం.. 

Monday, May 26, 2014

ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఇచ్చిన తొలి సందేశం.. pmindia.nic.in నుండి..


మోదీ వెబ్ సైట్..

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి..pmindia.nic.in .. వారి వ్యక్తిగత వెబ్ సైట్ narendramodi.in తెలుగుతో సహా పలు భారతీయ భాషల్లో ఈ సైట్ ను తిలకించవచ్చు.

నమో శకం ప్రారంభమైంది..

భారత దేశ 15వ ప్రధానమంత్రిగా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ప్రమాణ స్వీకారం చేశారు.. కోట్లాది మంది ప్రజల కోరిక నెరవేరింది.. దేశ ప్రజలంతా నరేంద్ర మోదీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు..
అవినీతి రహిత, సమర్ధవంతమైన, సుపరిపాలన కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు.. భారత దేశం ఆర్థికంగా, సైనికంగా శక్తివంతమైన దేశంగా ఎదగాలి.. అందరికీ సమాన అవకాశాలు రావాలి.. పేదరికం, నిరుద్యోగం అంతం కావాలి.. ప్రతి ఒక్కరికీ కూడు, గుడ్డ, నీడ, విద్య, ఉపాధి కావాలి.. ధరలపై నియంత్రణ ఉండాలి.. సంతృష్టీకరణ రాజకీయాలకు చెల్లు చీటీ పలకాలి.. ఇవన్నీ అత్యాశగా కనిపించవచ్చు.. కానీ నరేంద్ర మోదీ నెరవేరుస్తారని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు..

దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం నరేంద్ర మోదీకి సాధ్యమేనా అని అనుమానించడం సహజం.. కానీ ఇప్పుడున్న రాజకీయ నాయకులతో పోలిస్తే ఇవన్నీఆయనకు సాధ్యమేనని నేను నమ్ముతున్నాను.. మోదీ శక్తి సామర్థ్యాలు ఏమిటో అందరికీ తెలుసు.. దేశ ప్రజలు ఆయనపై పెట్టుకున్న ఆశలు వమ్ముకావని కచ్చితంగా చెప్పగలను..

Friday, May 23, 2014

లోగోను వివాదం చేయకండి..

తెలంగాణ రాజముద్ర ఎలా ఉండాలి అనే విషయంలో మజ్లిస్ పార్టీ కొత్త వివాదానికి తెరలేపింది.. లోగోలో చార్మినార్ ఉండాలట.. ప్రపంచంలోని గొప్ప కట్టడాల్లో చార్మినార్ ఒకటి ఇందులో సందేహం లేదు.. అయితే తెలంగాణ రాజముద్రగా మీరు చిత్రంలో చూస్తున్న లోగో చాలా కాలంగా ప్రాచుర్యంలో ఉంది.. అందులో వెయ్యేళ్ల నాటి కాకతీయ సామ్రాజ్యానికి ప్రతీక అయిన ఓరుగల్లు శిలాతోరణం కనిపిస్తుంది..
తెలుగు నేలను పాలించిన గొప్ప రాజవంశంలో కాకతీయులు అగ్రస్థానంలో ఉన్నారు.. అదీ తెలంగాణలోని ఓరుగల్లు (వరంగల్)ను కేంద్రంగా చేసుకొని పాలించారు.. కాకతీయుల పాలన ముగిసిన చాలా కాలం తర్వాత గోల్కొండ (గొల్లకొండ) కేంద్రంగా కుతుబ్ షాహీలు వచ్చారు.. గొల్కొండ పాలకుల్లో ఒకరైన కులీ కుతుబ్ షా (హైదరాబాద్ నిర్మాత) చార్మినార్ ను కట్టించారు..
ఓరుగల్లు తోరణం, చార్మినార్ రెండూ గొప్పవే.. కానీ మొదటి ప్రాచీన చరిత్రకు ప్రతీక.. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే ప్రచారంలో ఉన్న రాజముద్రకు ఒకే చెప్పడమే సమంజసం.. ఇందులో మరో కోణాన్ని అన్వేషించాల్సిన అవసరమే లేదు..

ఒక నిమిషం.. నిండు ప్రాణాలను తీసింది..

ఎంసెట్ నిర్వాహకుల మతిలేని విధానం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల జీవితాలతో చలగాటం ఆడుతోంది.. ప్రపంచంలోని ఏ పరీక్షలకూ లేని తుగ్లక్ విధానం ఇది.. నిమిషయం ఆలస్యం అయిందనే కారణంతో పరీక్షకు అనుమతించకపోవడం ఎంత దర్మార్గం.. 
ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సులకు గేట్ వే లాంటి ఎంసెట్ ప్రవేశ పరీక్ష లక్షలాది మంది తల్లిదండ్రులకు జీవన్మరణ సమస్యగా మారింది.. వేలాది రూపాయలు దారపోసి సంవత్సరమంతా కోచింగ్ తీసుకుంటారు.. పిల్లలు ఆకలిదప్పులు, నిద్రాహారాలు త్యాగం చేసి తమ లక్ష్యం కోసం కష్టపడతారు.. తీరా పరీక్ష కేంద్రానికి నిమిషయం ఆలస్యం చేరాడనే సాకుతో అనుమతి ఇవ్వకపోతే పరిస్థితి ఏమిటి?..
పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వచ్చారంటే ఎన్నో కారణాలు ఉంటాయి.. ఎంత ముందుగా బయలు దేరినా దారిలో ట్రాఫిక్ సమస్యనో, వాహనం చెడిపోవడమో, ప్రమాదానికి గురి కావడమో, బస్సు, రైలు ఆలస్యమో.. ఏదో కారణం కచ్చితంగా ఉంటుంది.. ఎవరూ ఉద్దేశ్య పూర్వకంగానో, కుట్ర పూరితంగానో ఆలస్యంగా రారు.. ఇంకాస్త అడ్వాన్స్ గా ఇంటి నుండి బయలు దేరవచ్చుకదా అనే కుంటి సలహాలు ఇక్కడ అనవసరం..
జేఈఈ మెయిన్స్, సివిల్స్, గ్రూప్స్ పరీక్షలకు లేని ఒక నిమిషం నిబంధన ఎంసెట్ కే ఎందుకు?.. ఆలస్యంగా వస్తే దాని తాలూకు ఫలితం అనుభవించేది విద్యార్థే కదా? మీ సొమ్మేం పోయింది..
నల్లగొండ జిల్లా భువనగిరి మండలం బాహార్ పేటకు చెందిన రాఘవేందర్ తన కొడుకూ ఉదయ్ కుమార్ ను తీసుకొని బైక్ మీద ఎంసెట్ పరీక్షా కేంద్రానికి బయలు దేరాడు.. వెనక నుండి వేగంగా వచ్చిన లారీ ఢీ కొని రాఘవేందర్ అక్కడిక్కడే మరణించాడు.. నాన్నా..లే నాన్నా.. వెళ్దాం నాన్నా.. అంటూ ఆ తనయుడు కన్నీరు మున్నీరుగా విలపించాడు.. తండ్రి ఇక లేడనే బాధలోనూ ఆయనకు ఆశయం గుర్తుకు వచ్చింది.. తనను ఇంజినీర్ చేయాలనే తండ్రి కలను సాకారం చేసేందుకు అంతడి బాధలోనూ ఎంసెట్ పరీక్ష రాశాడు..

కనీసం ఈ కన్నీటి సంఘటన అయినా ఎంసెట్ నిర్వాహకులు హృదయాలను కరిగించాలని కోరుకుంటున్నాను..

మాతృ హృదయం..

దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు ఢిల్లీకి బయలు దేరిన నరేంద్ర మోదీని తల్లి హీరాబెన్ ఆశీర్వదించింది.. మిఠాయి తినిపించి, రూ.101 రూపాయలు షుగున్ (కానుక)గా ఇచ్చింది.. అంతేకాదు రుమాలుతో మూతి తుడిచి పుత్రవాత్పల్యం చాటుకుంది.. మోదీ ఢిల్లీకి రాజైనా ఆమెకు మాత్రం కన్న కొడుకే కదా..

Thursday, May 22, 2014

అప్పుడే మొదలెట్టేసారోచ్..

పాపం ప్రత్యర్థి సుందరాలకు మరీ తొందరెక్కువైంది..
మోదీ ఇంకా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేదు.. కానీ అప్పుడే దాడులు మొదలు పెట్టారు.. కాస్తా ఆగండి నాయనా.. మీరు మళ్లీ ఎన్నికల దాకా తిడుతూ కాలక్షేపం చేసుకోవచ్చు..

అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి..

దాసుడి తప్పులకు దండంతో సరి అని క్షమించొచ్చు.. కానీ అరవింద్ కేజ్రీవాల్ విషయంలో?.. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అర్ధంతరంగా రాజీనామా చేసినందుకు క్షమించమంటున్నాడు.. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధిస్తాడట.. ఏ మొహం పెట్టుకొని?..
తెలివైనవాడు వనరులను జాగ్రత్తపరచుకొని, కొత్త మార్గాలవైపు అన్వేషణ సాగిస్తాడు.. కానీ అధికారం అనేది బంపర్ లాటరీ కాదు.. రాత్రికి రాత్రే విజయం ఇంటి ముందుకు రావడానికి.. ఢిల్లీ సీఎం పదవిని తాకట్టుపెట్టి ఇండియా పీఎం కావాలని కలలు కన్నాడా?.. చిత్తుగా ఓడిపోతానని తెలిసి కూడా నరేంద్ర మోదీపై పోటీ చేయడం.. చేతులు కాలాక ఆకులు పట్టుకొని, మళ్లీ ఢిల్లీ పీఠం కోసం ప్రయత్నం చేయడం పిచ్చి కాకపోతే మరేంటి? ఆయనగారు కోరిన వెంటనే ఎన్నికల నిర్వహించాలట.. పాపం ఈసీ పని లేకుండా ఉందేమో?
కేజ్రీవాల్ కు రాజకీయ అనుభవం లేక తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఉండొచ్చు, కానీ అతని నిజాయితీని శంకించలేం అంటూ కొందరు మిత్రులు చెబుతున్నారు.. నమ్మగలమా?.. ఆమ్ ఆద్మీ పార్టీకి ఏ విషయంలోనూ స్పష్టత లేదు.. జాతీయ విధానాలు లేవు.. కాశ్మీర్ వేర్పాటు వాదులకు ఎందుకు మద్దతు ఇస్తున్నారంటే నీళ్లు నలుముతుంది తప్ప జవాబు ఇవ్వదు.. ముఖ్యమంత్రి హోదాలో ధర్నా చేయడం ఏమిటి అని ప్రశ్నిస్తే, సీఎం ధర్నా చేయొద్దని రాజ్యాంగంలో ఉందా అని ఎదురు ప్రశ్నిస్తాడు కేజ్రీవాల్.. మరి సీఎం ధర్నా చేయవచ్చని ఎక్కడ రాసి ఉంది అని అడిగితే సమాధానం దాటేస్తాడు.. ఏం చేస్తాం తెలివి ఆయనొక్కడి సొంతమనుకుంటాడు..
ప్రత్యర్థులపై బురద చల్లి మీడియాలో ప్రచారం పొందడం అరవింద్ భాయికి వెన్నతో పెట్టిన విద్య.. అక్కడే బోల్తా పడ్డాడు.. నితిన్ గడ్కారీపై చేసిన అవినీతి ఆరోపణలకు గాను పరువు నష్టం దావా ఎదుర్కొంటున్నాడు.. ఆధారాలు ఏవంటే చెప్పడు.. బెయిల్ కోసం 10 వేల పూచికత్తు కట్టమంటే కట్టనన్నాడు.. తప్పు చేయనప్పడు బెయిల్ ఎందుకు తీసుకోవాలి, అండర్ టేకింగ్ మాత్రమే ఇస్తానని లా పాయింట్ లేవనెత్తాడు.. జడ్జీగారికి వళ్లు మండి మూడు రోజుల కారాగారవాసం ప్రసాదించారు మన గజిబిజి వాలాకు..

సో.. నేను పునరుద్ఘాటించేది ఏమిటంటే తెలివి అనేది ఇకడి సొంతం కాదు.. అన్నీ మనం అనుకున్నట్లే జరగవు..

ఇక చాలు..


Wednesday, May 21, 2014

ఈ దోస్తీ ఎవరి కోసం?

మొన్న సమైక్యాంధ్ర.. నిన్న రాయల తెలంగాణ.. ఇవాళ జై తెలంగాణ.. ఇది మజ్లిస్ పార్టీ అనుసరించిన వైఖరి.. అవకాశవాద మత రాజకీయాలకు పెట్టింది పేరు ఆ పార్టీ.. వెనుకటి హైదరాబాద్ సంస్థానం (తెలంగాణ)లో నిజాం నవాబుకు అండగా మెజారిటీ ప్రజలపై దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, మత మార్పిడులకు పాల్పడిన రజాకార్లు మరెవరో కాదు.. మజ్లిస్ వారే.. భూస్వాములకు, దొరలకు అండదండలు అందిచారు.. సామాన్య ప్రజల బతుకులను దుర్భరం చేశారు..
ఈ ముష్కర పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు, ఆర్యసమాజీయులు, స్టేట్ కాంగ్రెస్ వారు పోరాటం చేస్తే అణచివేసి, జైళ్లలో వేసి చిత్ర హింసలు పెట్టిన నిజాం నవాబుకు మజ్లిస్ పార్టీ(రజాకార్లు) పెద్ద అండగా ఉండేది.. హైదరాబాద్ స్వతంత్ర రాజ్యంగా ఉంటుందని ప్రకటించారు వారు.. హైదరాబాద్ పోలీస్ యాక్షన్ తో భారత దేశంలో సంపూర్ణంగా విలీనం అయ్యాక వీరి నాయకుడు కాశీం రజ్వీ తదితరులను జైలులో పెట్టారు.. మజ్లిస్ పార్టీని రద్దు చేశారు.. కాశీం రజ్వీ జైలు నుండి విడుదలై తిరిగి ఈ పార్టీని ప్రారంభించి పాకిస్తాన్ పారిపోయాడు.. కాంగ్రెస్ పార్టీ అవకాశవాద మత రాజకీయాల కోసం మజ్లిస్ తో రహస్య ఉప్పందం కుదుర్చుకొని ఆ పార్టీ విస్తరణకు కారణమైంది..
నిన్నటి దాకా కాంగ్రెస్ ఇలాంటి బీభత్స పార్టీకి అండదండలు అందించి పాత నగర ప్రజలకు దూరమైంది.. ఇప్పుడు ఆ బాధ్యతను టీఆర్ఎస్ తీసుకుంది.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మనను మనం పాలించుకోవచ్చని ఇక్కడి ప్రజలు మురిసిపోయారు.. కానీ ఇప్పడు టీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరుతో మళ్లీ రజాకార్ల పాలన వస్తుందని భయపడి పోతున్నారు.. జనం ఓట్లేసి గెలిపించింది ఇందు కోసమేనా?
రజాకార్లు బైరోన్ పల్లి, పరకాల, రేణికుంట.. ఇంకా ఎన్నో గ్రామాల ప్రజలపై జరిపిన హత్యాకాండలు.. బీజీ నగర్ ను దోచుకున్న తీరు.. మహిళలను నగ్నంగా బతుకమ్మ ఆడించి అత్యారాచాలు జరిపిన చరిత్రను తెలంగాణ ప్రజలు ఇంకా మరచిపోలేదు.. చరిత్ర తెలియకపోతే ఇంకా బతికే ఉన్న ఆనాటి పెద్ద మనుషులను అడగండి చెబుతారు..
రజాకార్ల దౌర్జర్యాలను ధైర్యంగా రాసి హత్యకుగురయ్యాడు ఇమ్రోజ్ పత్రిక ఎడిటర్ షోయబుల్లా ఖాన్.. కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు కార్మిక నేత ముక్దుం మొయినుద్దీన్.. మనకు ఇలాంటి వారు ఆదర్శమా? రజాకార్లు ఆదర్శమా?.. తేల్చుకోండి..

Tuesday, May 20, 2014

జై 'సఫా'..

పాత చెప్పుల కిర్ కుర్ శబ్దాలు జనానికి నచ్చలేదేమో.. పాపం కికురె.. చివరి వరకూ పదవిని అంటి పెట్టుకొని సమైక్యాంధ్రకు ప్రయత్నిస్తూ ఉన్నానని చెప్పుకున్నారు.. జనం నమ్మినట్లు లేదు.. జై 'సఫా' అనేశారు..

మోదీ అంతర రూపం..

ఎదిగిన కొద్దీ వదగాలని మన పెద్దలు చెబుతుంటారు.. నరేంద్ర మోదీ కారణంగా బీజేపీ గతంలో ఎన్నడూ లేనంతగా సొంత మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చింది.. అయినా ఆ ఘనతను స్వీకరించడానికి ఇబ్బంది పడ్డారాయన.. అగ్రనేత అద్వానీ ప్రశంసలకు కరిగిపోయాడు.. భావోద్వేగంతో కంటతడి పెట్టేశారు.. పార్టీ తనకు తల్లిలాంటిదని, తల్లికి సేవ చేయడం తన బాధ్యతగా, అదృష్టంగా భావిస్తానని స్పష్టం చేశారు మోదీ.. అద్వానీ సైతం ఇలాంటి భావోద్వేగానికే లోనయ్యారు..
అంతకు ముందు పార్లమెంట్ భవనానికి వచ్చినరేంద్ర మోదీ, వస్తూనే భారత ప్రజాస్వామ్యానికి గౌరవ సూచకంగా మెట్లపై తలవంచి ప్రణామం చేశారు..ఈ అరుదైన సన్నివేశాలను దేశ ప్రజలంతా లైవ్ ద్వారా చూశారు..

ఎవరిది లౌకిక వాదం?

బీజేపీ 'కమ్యూనల్' అట.. ఎంఐఎం 'సెక్యులర్' అట.. 'భారతీయ' జనతా పార్టీ ఎలా మతతత్వ పార్టీ అయింది?.. మజ్లిస్ ఇత్తెహాదుల్ 'ముస్లిమీన్' ఎలా లౌకిక పార్టీ అయ్యింది?..
నాకు తత్వం బోధ పడలేదు.. మేధావులు విడమర్చి చెప్ప ప్రార్థన..

ఇంకా ఎంత కాలం ఈ డ్రామాలు?

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి జ్ఞానోదయం అయినట్లు లేదు.. ఎన్నికల ఫలితాలను సమిక్షించేందుకు సమావేశమైన సిడబ్ల్యుసి   ఎప్పటి లాగే సోకాల్డ్ గాంధి పరివార భజనకే పరిమితమైంది..  ఓటమిని భాద్యత వహిస్తూ సోనియా, రాహుల్ రాజీనామా (ఉత్తుత్తినే) సిద్దపడగా మిగతా నేతలంతా ఒద్దొద్దు అంటూఅడ్డుపడ్డారట.. ఓటమికి సమిష్టి భాద్యత వహిస్తారట.. అంటే అంటా తప్పుకొని కొత్త కమిటి వేయాలి.. అంత సాహసం చేయగలరా?ఇంకా ఎంత కాలం ఈ డ్రామాలు?
ఓటమికి ప్రజా తిరస్కారమే కారణమని తెలుస్తున్నా, ఫలితా విశ్లేషణకు ఓ కమిటి వేస్తారట.. ఎందుకు టైం పాస్కా.. అవినీతి, ధరల పెరుగుదల, అసమర్ధతే కాంగ్రెస్ ఘోర పరాజయానికి కారణమని చిన్న పిల్లోడికి కూడా తెలుసు.. ఆమాత్రం బుర్రకెక్కలేదా వీరికి?
కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం రావాలంటే సోకాల్డ్ (నకిలీ) గాంధీ పరివారం తప్పుకోవాలి.. వంశ పారంపర్య పాలనే కాంగ్రెస్ పార్టీకి పెద్ద గుది బండగా మారినిది.. ఆ సాహసం చేయగలదా కాంగ్రెస్?

Monday, May 19, 2014

ఎంత పని చేశాడు ఈ చాయ్ వాలా..


వారసత్వ రాజకీయాలు..

భారత రాజకీయాలకు పట్టిన జాడ్యం వారసత్వ రాజకీయాలు.. అన్ని పార్టీలదీ ఇదే తంతు.. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఒకే కుటుంబానికి చెందినవారు ఎందరు ఎన్నికయ్యారో చూడండి.. ఈ వార్తలో కుటుంబ సభ్యుల గురుంచే రాశారు.. బంధు మిత్రుల గురుంచి కూడా రాస్తే ఫుల్ పేజి దాటుతుందేమో..

Sunday, May 18, 2014

అంత ఆత్రం ఎందుకో?

వివాహ ముహూర్తం ముందే ఖరారైంది.. ఆతర్వాత వరులు ఎంపికయ్యారు.. కానీ పెళ్ళికొడుకులు అప్పటిదాకా ఆగేట్టు లెరు..ముహూర్తాన్ని ముందుకు మార్చి పెళ్లిచేసేయమంటున్నారు.. వారి తొందరను అర్థంచేసుకోవచ్చు..
రాష్ట్ర విభజనకు అపాయింట్మెంట్ డేట్ జూన్2 అని ముందే నిర్ణయం అయిపొయింది..ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి..తెలంగాణాలో కేసీఆర్, సీమంధ్రకు చంద్రబాబు   పాలకులంటూ ప్రజలు తీర్పుచెప్పేశారు.. కాని వీరిద్దరూ ఎప్పుడెప్పుడుముఖ్యమంత్రులం అవుదామా అనే ఆత్రుతలోఉన్నట్లున్నారు.. అపాయింట్మెంట్ డేట్ ఇంకాముందుకు జరపమంటున్నారు.. అంత తొందరఎందుకు? అధికారం కోసం దశాబ్ద కాలంఎదురు చూశారు.. మరో పక్షం రోజులు ఆగేఓపిక లేదా?..
ఎన్నికల ఫలితాలు రాక ముందు హంగ్ వస్తే ప్రత్యర్థులు బేరసారాలు సాగిస్తారనే భయంతో తెరాస అపాయింట్మెంట్ డేట్ ప్రిపోన్ చేయమని కోరింది.. కొందరు కోర్టుకు పోయారు.. ఇప్పుడు స్పష్టమైన మెజారిటి వచ్చిన తర్వాత బేరసారాల భయమే అనవసరం.. కేవలం 20 సీట్లు వచ్చిన కాంగ్రెస్ అంత ధైర్యం చేయలేదు..
విచిత్రంగా టిడిపి కూడా అపాయింట్మెంట్ డేట్ ముందుకు జరపమనడంలో అర్థం ఉందా? జూన్ 2 దాకా రాష్ట్రపతి పాలన భరించే ఓపిక లేదా?.. 

Saturday, May 17, 2014

పాపం రాగా..

పాపం రాహుల్ గాంధీ అడుగు పెట్టిన చోటల్లా కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారట.. ఆయనల్ ప్రచారానికి వచ్చిన మహబూబ్ నగర్, నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్ ప్రాంతాల అభ్యర్థులు గల్లంతై పోయారట.. సోనియాగాంధీ ప్రచారం చేసిన కరీంనగర్, చేవెళ్ళ , ఆందోల్ నియోజక వర్గాల అభ్యర్థుల పరిస్థితి అంతే సంగతులైంది.. ఇక మన్మోహన్ సింగ్ ప్రచారానికి వచ్చిన భువన గిరి సంగతీ అంతే..
దేశ వ్యాప్తంగా కమలాలు.. బీజేపీ మిషన్ 272+ టార్గెట్ అంచనాలను మించింది.. బీజేపీకి స్వయంగా 284 సీట్లు వచ్చాయి.. ఎన్.డీ.ఏ కూటమికి 335 సీట్లు వచ్చాయి.. 1984 తర్వాత తొలిసారిగా పూర్తి మెజారిటీతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడబోతోంది.. ఈ విజయం పూర్తిగా నరేంద్ర మోదీదే..

ఒక చాయ్ వాలా దేశ ప్రధాని..

'నేను పడుతున్న కష్టాన్ని ప్రత్యర్థులు ఎవరూ ప్రశ్నించ జాలరు.. రాబోయే 60 నెలల్లో నన్ను మించిన కార్మికున్ని మీరు చూడలేరు..' వదోదరలో భారి విజయం తర్వాత నరేంద్ర మోదీ అన్న మాటలివి.. ఒక చాయ్ వాలా ప్రధాని కావడమా?.. ఆయన మా సభల దగ్గర టీ అమ్ముకోవచ్చు అని ఈసడించారు కాంగ్రెస్ నెతలు.. ఆ పార్టీకి చరిత్రలోనే అధ్వాన్నమైన ఓటమి చవి చూపించారు మోదీ..

చిన్నప్పుడు తండ్రి, బాబాయిలతో కలి చాయి అమ్మారు నరేంద్ర భాయి. కానీ కాంగ్రెస్ నేతలు ఈ దేశాన్నే అమ్మకానికి పెట్టారు.. ఒక చాయ్ వాలా దేశ ప్రధాని కావడం  కన్నా గొప్ప విషయం మరేముంటుంది?

Friday, May 16, 2014

ఒక ఇంద్రుడు.. ఇద్దరు చంద్రులు.. 
దేశ వ్యాప్తంగా ఉదయ కమలాలు.. 272 దాటేసింది...
దేశ, రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయం అవుతున్న రోజు ఇది.. ప్రజాస్వామ్యమే గెలుస్తోంది.. అందరికీ శుభోదయం..

Tuesday, May 13, 2014

మోదీపై మార్కెట్ ఆశలు..

కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో జాతీయ ప్రజాతంత్ర కూటమి (ఎన్డీఏ) ప్రభుత్వం ఏర్పాటు ఖాయమనే సంకేతాలు కనిపించగానే మార్కెట్లో ఎక్కడలేని కదలిక వచ్చింది... స్టాక్ మర్కెట్లు ఉరుకులు, పరుగులు పెడుతున్నాయి.. ఇది మంచిదేనా, చెడు చేస్తుందా అని విశ్లేషించే ఆర్థిక పరిజ్ఞానం నాకు లేదు.. కానీ ఒక విషయాన్ని నేను గమనించాను..
2004లో ఎన్డీఏ ప్రభుత్వం ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈ మార్కెట్, స్టాక్ ఎక్సేంజీల పతనం ప్రారంభమైంది.. దీనికి కొందరు ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్న కారణాలు ఆసక్తిని కలిగించాయి..
కాంగ్రెస్ పార్టీ అవినీతికి చిహ్నమట.. దేశ ఆర్థిక రంగం వికసించకపోవడానికి ఆ పార్టీ నేతల లంచగొండితనం, కోటా రాజ్, లైసెన్స్ రాజ్ కారణమట.. వీటిని బద్దలు కొట్టడానికి పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలకు బాటలు వేసినా వాజ్ పేయి (ఎన్డీఏ) హయంలోనే పుంజుకొని ఫలితాలు కనిపించాయట.. అందుకే సంస్కరణలకు తెర తీసిన పీవీ అంటే సోనియాతో సహా కాంగ్రెస్ నేతలకు కోపం అంటారు..
నేను గమనించిన సత్యం ఏమిటంటే ఈ దేశంలోని సామాన్య ప్రజల బతులు ఒక మార్గంలో పడ్డాయంటే వాజ్ పేయి పాలనా ఫలాలు కొంత కారణం.. ఆ రోజుల్లో సామాన్యుడికి ఎంతో అవసరమైన వంట గ్యాసు (ఎల్పీజీ) అడిగిన వెంటనే ఇంటికి వచ్చేది.. గతంలో రోజుల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది.. ప్రస్తుత యూపీఏ పాలనలో అదే పునరావృతం కావడం గమనించొచ్చు.. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు అందుబాటులో ఉండేవి.. సెల్ ఫోన్ల టారిఫ్ దిగొచ్చి ప్రజలందరికీ అందుబాటులోకి రావడం ద్వారా సమాచార ప్రసారం ఎంతో చవక అయ్యింది.. ఎన్డీఏ ప్రభుత్వం మాళిక సదుపాయాలపై ప్రధానంగా దృష్టి పెట్టి దేశ వ్యాప్తంగా స్వర్ణ చతుర్భుజి రహదార్లు, ప్రధాని గ్రామీణ సడక్ యోజన లాంటి పథకాలను ప్రారంభించింది.. దాని ఫలితాలు మనం యూపీఏ పాలన వచ్చాక అందుబాటులోకి వచ్చాయి..

మార్కెట్, క్యాపిటలిజం అనే పదాలు కొందరు సోకాల్డ్ మేధావులకు నచ్చకపోవచ్చు.. వారు ప్రతి విషయాన్ని బూతద్దం(భూతద్దం కాదు)లో చూస్తారు.. కానీ పెట్టుబడి ద్వారానే మార్కెట్ నడుస్తుంది.. వ్యాపారస్థుల్లో నమ్మకం కలిగినప్పుడే ధైర్యం చేస్తారు.. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.. ప్రజల చేతిలో డబ్బు ఆడుతుంది.. నిత్యావసర వస్తువుల ధరలు కూడా అందుబాటులో ఉంటాయి.. ప్రభుత్వానికీ ఆదాయం పెరిగి సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించగలుగుతుంది.. కాంగ్రెస్ పార్టీని అపనమ్మకంగా చూస్తున్న మార్కెట్ ఎన్డీయే ప్రభుత్వంపై ఆశలు పెట్టుకుంది.. అందుకే మార్కెట్ లో హడావుడి ప్రారంభమైంది.. మోదీ సర్కార్ దేశ ప్రజల ఆశలను వమ్ము చేయదని నేను నమ్ముతున్నాను..

Sunday, May 11, 2014

ప్రతి రోజూ ప్రేమను చాటుకోండి..

మీ మాతృ మూర్తులను గౌరవించండి, పూజించండి, ప్రేమించండి.. ప్రతి రోజూ.. మదర్స్ డే పేరిట ఒక్కరోజు హడావుడి చేయడం అర్థంలేని పని.. దినాలు మన సంస్కృతి కాదు.. తల్లి దండ్రులకు దినాలు నిర్ణయించి ఆ ఒక్కరోజు శుభాకాంక్షలు చెప్పి, కానుకలు సమర్పించడంలో ఎలాంటి అర్థం లేదు.. ప్రతి రోజూ వారి బాగోగులను చూసుకోవడంమే నిజమైన ప్రేమ..

Friday, May 9, 2014

ఆయన కష్టాలు అయనవి..

కేసీఆర్ మాటల్లోని మర్మం ఏమిటి?..
రాహుల్ ప్రధాని అయ్యేందుకు యూపీఏకు మద్దతు ఇస్తారట.. ఎన్డీఏకు మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదట..ఎందుకు ఈ ప్రకటన చేశారో తెలుసా?..
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటు ఖాయం అని తెలుస్తున్నా, ఎన్ని సీట్లు వస్తాయో చెప్పలేని పరిస్థితి.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన కనీస సీట్లు 60 రాకపోతే?..
ఇందు కోసం ఎంఐఎంను టీఆర్ఎస్ ఎప్పటి నుండో లైన్లో పెడుతోంది.. తాము కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏకు మద్దతు ఇస్తామని ఇప్పుడే చెప్పేస్తే మొదటికే మోసం వస్తుందని టీఆర్ఎస్ భావిస్తోంది..
ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీ సీట్లు వస్తే టీఆర్ఎస్ కచ్చితంగా ఎన్డీయేకు మద్దతు ఇచ్చేస్తుంది.. కర్మగాలి మజ్లిసే దిక్కయితే మోదీకి శాశ్వతంగా రాం రాం చెప్పేస్తాడు కేసీఆర్..
2009 ఎన్నికల్లో తెలుగు దేశంతో పొత్తు పెట్టుకొని, ఎన్నికల పోలింగ్ పూర్తయి ఫలితాలు కూడా రాక పొత్తు ధర్మాన్ని వదిలేసి ఎన్డీయే బహిరంగ సభకు వెళ్లాడు కేసీఆర్.. తీరా ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాకపోయేసరికి ఢీలా పడ్డాడు..

ఇప్పుడు కేంద్రంలో మోదీ సర్కారు వస్తుందని కేసీఆర్ మనసుకు తెలుసు.. కానీ బయటకు చెప్పలేదు కదా?.. అంటే ఓవైసీ బ్రదర్స్ గుస్సా చెయ్యరూ?..

వాన కష్టాలు

భాగ్యనగరంలో భారీ వర్షం.. లక్డీకాపూల్ బస్ స్టాప్ లో ప్రయాణికులకు కష్టాలు..(నాకు కూడా..) ఇక్కడ మెట్రో రైల్ పనుల కోసం బస్సు షల్టర్లను తొలగించారు కదా.. కష్టాలు తప్పవు మరి.. 

మా మాతి బంగ్లాదేశీ..

భారత దేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు ప్రధాన సమస్య బంగ్లాదేశ్ నుండి చొరబాట్లు.. బంగ్లాదేశ్ నుండి చొరబాటుదార్లు పశ్చిమ బెంగాల్, అసోం, త్రిపుర రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తున్నారు.. అత్యధిక జనాభా, భూభాగం తక్కువగా ఉన్న బంగ్లాదేశ్ స్వయంగా తన పౌరులను భారత దేశంలోకి చొరబడేందుకు ప్రోత్సహిస్తుందనడం వాస్తవం.. దీన్ని మానవతా దృక్పథంతో చూడాలని కొందరు సోకాల్డ్ మేధావులు వాదిస్తుంటారు.. కానీ వాస్తవాలు మరో విధంగా ఉన్నాయి..
బంగ్లాదేశ్ నుండి భారత భూభాగంలోకి అక్రమంగా వచ్చిన చొరబాటుదార్లు ముప్పుగా తయారయ్యారు.. వీరి చొరబాట్లు లక్షల్లోకి చేరిపోయాయి.. ఫలితంగా పశ్చిమ బెంగాల్, అసోం, త్రిపుర రాష్ట్రాల్లో వారు స్థానికులపై దౌర్జన్యాలు చేస్తున్నారు.. చొరబాట్ల ముసుగులో తీవ్రవాదులు చేరి మన దేశంలో అరాచకం సృష్టిస్తున్నారు.. సరిహద్దు రాష్ట్రాల భాష, మతం, సంస్కృతిపై ప్రభావాన్ని చూపిస్తున్నారు..
జాతీయ దృక్పథంలేని రాజకీయ పార్టీల నాయకులు ఆయా రాష్ట్రాల్లో తమ ఓటు బ్యాంకు రాజకీయాలతో చొరబాటుదార్లుకు రేషన్ కార్డు, ఓటరు కార్డులను ఇచ్చేస్తున్నారు.. ఈ పాపంలో కాంగ్రెస్, వామపక్షాలతో ప్రధాన పాత్ర.. పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల సరిహద్దుల్లోని పలు నియోజకవర్గాల్లో ఈ రోజున బంగ్లా చొరబాటు దారుల ఓట్లు కీలకంగా మారాయి.. గెలుపు ఓటములను వారే ప్రాభావితం చేస్తారు..
పశ్చిమ బెంగాల్ బెంగాల్లో వామపక్ష ప్రభుత్వం బంగ్లా చొరబాటు దార్లను ప్రోత్సహిస్తున్న తీరుపై 1990 దశకంలో మమతా బెనర్జీ గట్టి పోరాటమే చేశారు.. కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర హోంమంత్రిగా ఉన్న ఇంద్రజీత్ గుప్తా (సీపీఎం)ను పార్లమెంటులో బంగ్లా చొరబాట్ల సమస్యపై మమత గట్టిగా నిలదీశారు..
ఇప్పడు సీన్ రివర్స్ అయ్యింది.. మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయ్యారు.. ఆమెకూ ఓట్లు బ్యాంకు రాజకీయాలే ముఖ్యమయ్యాయి.. ఈ విషయంలో వామపక్షాలను మించిపోయారు.. తాజా లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ చొరబాట్లతో ముంచుకొస్తున్న ముప్పును ప్రస్థావించినప్పుడు మమత ఆయనపై విరుచుకుపడ్డారు.. బంగ్లాదేశీయుల చొరబాట్లను బహిరంగా సమర్ధించే రీతిలో వెనుకేసుకుచ్చారు..

మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ మా మాతి మనుస్ అనే నినాదంలో పశ్చిమ బెంగాల్లో వామపక్షాలను ఓడించి అధికారంలోని వచ్చింది.. ఇప్పడు ఆమె స్వరం మారినందున ఈ నినాదాన్ని మా మాతి బంగ్లాదేశీ అని మార్చాలేమో..

Thursday, May 8, 2014

కేంద్రంలో వచ్చేది మోదీ సర్కారేనా? అయితే ఎన్ని సీట్లు?..
తెలంగాణలో కేసీయారేనా?.. హంగా?.. ఎవరికి ఎన్ని?..
సీమాంధ్రలో బాబా?.. జగనా?.. ఎవరొస్తారు?..
ఎందుకింత ఉత్కంఠ?.. ఓటరు మీట నొక్కాడు.. ఫలితాల బాంబు పేలేది మే 16న.. అప్పటి దాకా రిలాక్స్.. రిలాక్స్.. రిలాక్స్
రిలాక్సా.. పాడా.. ఈలోగా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల మోత మోగుతుంది కాదా?

నాకు ఓటు లేదు..


పాపం పప్పూకి తెలియదేమో..