Tuesday, May 13, 2014

మోదీపై మార్కెట్ ఆశలు..

కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో జాతీయ ప్రజాతంత్ర కూటమి (ఎన్డీఏ) ప్రభుత్వం ఏర్పాటు ఖాయమనే సంకేతాలు కనిపించగానే మార్కెట్లో ఎక్కడలేని కదలిక వచ్చింది... స్టాక్ మర్కెట్లు ఉరుకులు, పరుగులు పెడుతున్నాయి.. ఇది మంచిదేనా, చెడు చేస్తుందా అని విశ్లేషించే ఆర్థిక పరిజ్ఞానం నాకు లేదు.. కానీ ఒక విషయాన్ని నేను గమనించాను..
2004లో ఎన్డీఏ ప్రభుత్వం ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈ మార్కెట్, స్టాక్ ఎక్సేంజీల పతనం ప్రారంభమైంది.. దీనికి కొందరు ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్న కారణాలు ఆసక్తిని కలిగించాయి..
కాంగ్రెస్ పార్టీ అవినీతికి చిహ్నమట.. దేశ ఆర్థిక రంగం వికసించకపోవడానికి ఆ పార్టీ నేతల లంచగొండితనం, కోటా రాజ్, లైసెన్స్ రాజ్ కారణమట.. వీటిని బద్దలు కొట్టడానికి పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలకు బాటలు వేసినా వాజ్ పేయి (ఎన్డీఏ) హయంలోనే పుంజుకొని ఫలితాలు కనిపించాయట.. అందుకే సంస్కరణలకు తెర తీసిన పీవీ అంటే సోనియాతో సహా కాంగ్రెస్ నేతలకు కోపం అంటారు..
నేను గమనించిన సత్యం ఏమిటంటే ఈ దేశంలోని సామాన్య ప్రజల బతులు ఒక మార్గంలో పడ్డాయంటే వాజ్ పేయి పాలనా ఫలాలు కొంత కారణం.. ఆ రోజుల్లో సామాన్యుడికి ఎంతో అవసరమైన వంట గ్యాసు (ఎల్పీజీ) అడిగిన వెంటనే ఇంటికి వచ్చేది.. గతంలో రోజుల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది.. ప్రస్తుత యూపీఏ పాలనలో అదే పునరావృతం కావడం గమనించొచ్చు.. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు అందుబాటులో ఉండేవి.. సెల్ ఫోన్ల టారిఫ్ దిగొచ్చి ప్రజలందరికీ అందుబాటులోకి రావడం ద్వారా సమాచార ప్రసారం ఎంతో చవక అయ్యింది.. ఎన్డీఏ ప్రభుత్వం మాళిక సదుపాయాలపై ప్రధానంగా దృష్టి పెట్టి దేశ వ్యాప్తంగా స్వర్ణ చతుర్భుజి రహదార్లు, ప్రధాని గ్రామీణ సడక్ యోజన లాంటి పథకాలను ప్రారంభించింది.. దాని ఫలితాలు మనం యూపీఏ పాలన వచ్చాక అందుబాటులోకి వచ్చాయి..

మార్కెట్, క్యాపిటలిజం అనే పదాలు కొందరు సోకాల్డ్ మేధావులకు నచ్చకపోవచ్చు.. వారు ప్రతి విషయాన్ని బూతద్దం(భూతద్దం కాదు)లో చూస్తారు.. కానీ పెట్టుబడి ద్వారానే మార్కెట్ నడుస్తుంది.. వ్యాపారస్థుల్లో నమ్మకం కలిగినప్పుడే ధైర్యం చేస్తారు.. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.. ప్రజల చేతిలో డబ్బు ఆడుతుంది.. నిత్యావసర వస్తువుల ధరలు కూడా అందుబాటులో ఉంటాయి.. ప్రభుత్వానికీ ఆదాయం పెరిగి సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించగలుగుతుంది.. కాంగ్రెస్ పార్టీని అపనమ్మకంగా చూస్తున్న మార్కెట్ ఎన్డీయే ప్రభుత్వంపై ఆశలు పెట్టుకుంది.. అందుకే మార్కెట్ లో హడావుడి ప్రారంభమైంది.. మోదీ సర్కార్ దేశ ప్రజల ఆశలను వమ్ము చేయదని నేను నమ్ముతున్నాను..

No comments:

Post a Comment