Wednesday, May 21, 2014

ఈ దోస్తీ ఎవరి కోసం?

మొన్న సమైక్యాంధ్ర.. నిన్న రాయల తెలంగాణ.. ఇవాళ జై తెలంగాణ.. ఇది మజ్లిస్ పార్టీ అనుసరించిన వైఖరి.. అవకాశవాద మత రాజకీయాలకు పెట్టింది పేరు ఆ పార్టీ.. వెనుకటి హైదరాబాద్ సంస్థానం (తెలంగాణ)లో నిజాం నవాబుకు అండగా మెజారిటీ ప్రజలపై దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, మత మార్పిడులకు పాల్పడిన రజాకార్లు మరెవరో కాదు.. మజ్లిస్ వారే.. భూస్వాములకు, దొరలకు అండదండలు అందిచారు.. సామాన్య ప్రజల బతుకులను దుర్భరం చేశారు..
ఈ ముష్కర పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు, ఆర్యసమాజీయులు, స్టేట్ కాంగ్రెస్ వారు పోరాటం చేస్తే అణచివేసి, జైళ్లలో వేసి చిత్ర హింసలు పెట్టిన నిజాం నవాబుకు మజ్లిస్ పార్టీ(రజాకార్లు) పెద్ద అండగా ఉండేది.. హైదరాబాద్ స్వతంత్ర రాజ్యంగా ఉంటుందని ప్రకటించారు వారు.. హైదరాబాద్ పోలీస్ యాక్షన్ తో భారత దేశంలో సంపూర్ణంగా విలీనం అయ్యాక వీరి నాయకుడు కాశీం రజ్వీ తదితరులను జైలులో పెట్టారు.. మజ్లిస్ పార్టీని రద్దు చేశారు.. కాశీం రజ్వీ జైలు నుండి విడుదలై తిరిగి ఈ పార్టీని ప్రారంభించి పాకిస్తాన్ పారిపోయాడు.. కాంగ్రెస్ పార్టీ అవకాశవాద మత రాజకీయాల కోసం మజ్లిస్ తో రహస్య ఉప్పందం కుదుర్చుకొని ఆ పార్టీ విస్తరణకు కారణమైంది..
నిన్నటి దాకా కాంగ్రెస్ ఇలాంటి బీభత్స పార్టీకి అండదండలు అందించి పాత నగర ప్రజలకు దూరమైంది.. ఇప్పుడు ఆ బాధ్యతను టీఆర్ఎస్ తీసుకుంది.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మనను మనం పాలించుకోవచ్చని ఇక్కడి ప్రజలు మురిసిపోయారు.. కానీ ఇప్పడు టీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరుతో మళ్లీ రజాకార్ల పాలన వస్తుందని భయపడి పోతున్నారు.. జనం ఓట్లేసి గెలిపించింది ఇందు కోసమేనా?
రజాకార్లు బైరోన్ పల్లి, పరకాల, రేణికుంట.. ఇంకా ఎన్నో గ్రామాల ప్రజలపై జరిపిన హత్యాకాండలు.. బీజీ నగర్ ను దోచుకున్న తీరు.. మహిళలను నగ్నంగా బతుకమ్మ ఆడించి అత్యారాచాలు జరిపిన చరిత్రను తెలంగాణ ప్రజలు ఇంకా మరచిపోలేదు.. చరిత్ర తెలియకపోతే ఇంకా బతికే ఉన్న ఆనాటి పెద్ద మనుషులను అడగండి చెబుతారు..
రజాకార్ల దౌర్జర్యాలను ధైర్యంగా రాసి హత్యకుగురయ్యాడు ఇమ్రోజ్ పత్రిక ఎడిటర్ షోయబుల్లా ఖాన్.. కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు కార్మిక నేత ముక్దుం మొయినుద్దీన్.. మనకు ఇలాంటి వారు ఆదర్శమా? రజాకార్లు ఆదర్శమా?.. తేల్చుకోండి..

No comments:

Post a Comment