Thursday, May 29, 2014

ఇంతకీ మీ అర్హతలు ఏమిటి?

ఈ దేశంలో ఛాయ్ వాలా ప్రధాని కావొద్దు.. కానీ విదేశీ చేతిలో అధికారం ఉండాలి.. గ్రాడ్యుయేషన్ చేయని స్మృతి ఇరానీ మంత్రి కావొద్దట.. కనీస విద్యార్హత లేని సోనియా గాంధీ దేశాన్ని పాలించవచ్చట.. ఇదండీ కాంగ్రెస్ పార్టీ వాదన..
సోనియా గాంధీతో పోలిస్తే తెలివితేటల్లో స్మృతి ఇరానీయే చాలా వరకూ మెరుగు.. స్మృతి హిందీ, ఇంగ్లీషుల్లో అద్భుతంగా మాట్లాడగలరు.. ఏ విషయంలో అయినా వాదించగల అపారమైన తెలివితేటలు ఉన్నాయి ఆమెకు.. సాధారణ కుటుంబంలో వచ్చి జీవితంలో కష్టపడి పైకి వచ్చారామె.. నటిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు..  మరి సోనియా స్క్రిప్టు లేనిదే నోరు పెగలని సోనియా గాంధీకి అధనంగా ఉన్న అర్హతలు ఏమిటి? రాజీవ్ సతీమణి కావడమేనా?..
సోకాల్డ్ గాంధీ పరివారంగా చెప్పుకుంటున్న సోనియా గత చరిత్ర ఏమిటి? రాజీవ్ గాంధీని వివాహం చేసుకోకముందు ఆమె చరిత్ర ఏమిటి?.. సుబ్రహ్మణ్య స్వామి గారిని అడగండి చెబుతారు.. రాజీవ్, సోనియా, రాహుల్ విద్యార్హతలు.. వంశ చరిత్రలు సహా అన్ని విషయాలపై సమగ్ర నివేదికలు ఉన్నాయి స్వామిగారి దగ్గర.. వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లకూడదనే ఆయన చాలా వరకూ సంయమనం పాటించాయి..
మంత్రి పదవులు చేపట్టేవారికి సంబంధిత శాఖల వ్యవహారాలను అజమాయిషీ చేసే జ్ఞానం, తెలివి తేటలు ఉంటే చాలు.. తమిళం తప్ప మరే భాష రాని అలగిరి యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా పని చేయలేదా?.. వైద్య ఆరోగ్య శాఖకు ఇప్పటి వరకూ డాక్టర్లే మంత్రులుగా పని చేశారా? అంతెందుకు మన రాష్ట్రంలో ఈ శాఖను నిర్వహించిన దానం నాగేందర్ విద్యార్హత ఏమిటి.. ఆరణాల కూలీ అంజయ్య కార్మిక నేతగా ఎదిగి ముఖ్యమంత్రి పదవిని చేపట్టలేదా? ఆయన ఏం చదువుకున్నారో తెలుసా?..

ఇలా తవ్విన కొద్దీ బొమికలు బయటకు వస్తాయి.. ప్రధాన ప్రతిపక్ష హోదాలో కూడా ఉండే అర్హత లేకుండా భారత ప్రజలు కాంగ్రెస్ పార్టీని కట్టడి చేశారు.. ఈ ఇంగితం కోల్పోతే వారి వచ్చే ఎన్నికల్లో ఈ మాత్రం సీట్లు కూడా రావని కచ్చితంగా చెప్పగలను..

No comments:

Post a Comment