Friday, May 9, 2014

ఆయన కష్టాలు అయనవి..

కేసీఆర్ మాటల్లోని మర్మం ఏమిటి?..
రాహుల్ ప్రధాని అయ్యేందుకు యూపీఏకు మద్దతు ఇస్తారట.. ఎన్డీఏకు మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదట..ఎందుకు ఈ ప్రకటన చేశారో తెలుసా?..
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటు ఖాయం అని తెలుస్తున్నా, ఎన్ని సీట్లు వస్తాయో చెప్పలేని పరిస్థితి.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన కనీస సీట్లు 60 రాకపోతే?..
ఇందు కోసం ఎంఐఎంను టీఆర్ఎస్ ఎప్పటి నుండో లైన్లో పెడుతోంది.. తాము కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏకు మద్దతు ఇస్తామని ఇప్పుడే చెప్పేస్తే మొదటికే మోసం వస్తుందని టీఆర్ఎస్ భావిస్తోంది..
ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీ సీట్లు వస్తే టీఆర్ఎస్ కచ్చితంగా ఎన్డీయేకు మద్దతు ఇచ్చేస్తుంది.. కర్మగాలి మజ్లిసే దిక్కయితే మోదీకి శాశ్వతంగా రాం రాం చెప్పేస్తాడు కేసీఆర్..
2009 ఎన్నికల్లో తెలుగు దేశంతో పొత్తు పెట్టుకొని, ఎన్నికల పోలింగ్ పూర్తయి ఫలితాలు కూడా రాక పొత్తు ధర్మాన్ని వదిలేసి ఎన్డీయే బహిరంగ సభకు వెళ్లాడు కేసీఆర్.. తీరా ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాకపోయేసరికి ఢీలా పడ్డాడు..

ఇప్పుడు కేంద్రంలో మోదీ సర్కారు వస్తుందని కేసీఆర్ మనసుకు తెలుసు.. కానీ బయటకు చెప్పలేదు కదా?.. అంటే ఓవైసీ బ్రదర్స్ గుస్సా చెయ్యరూ?..

No comments:

Post a Comment