Saturday, May 31, 2014

ఏదీ పూర్ణ కుంభం?

కొత్తగా రూపొందించిన తెలంగాణ రాజముద్రను చూసి చాలా మంది మురిసిపోతున్నారు.. కొందరు కస్సుబుస్సుమంటున్నారు.. నాకు మాత్రం ఏదో కోల్పోయినట్లనిపించింది.. అవును మన సాంస్కృతిక వారసత్వాన్ని కోల్పోయాం.. ఏదీ పూర్ణకుంభం?
శుభానికి, పవిత్రతకు, సంస్కృతి చిహ్నమైన పూర్ణకుంభం ఆంధ్రప్రదేశ్ రాజముద్రలో ప్రముఖంగా కనిపిస్తుంది.. మామిడాకులు, కొబ్బరికాయతో అలంకరించిన కలశాన్ని మన ఇళ్లలో, శుభ కార్యాలలో చూస్తుంటాం.. ఇదే పూర్ణకుంభం.. పూర్ణ కుంభ స్వాగతం అంటే ఎంత హుందాగా ఉంటుంది? దీంతో తెలంగాణకు ఏం సంబంధం అంటున్నారా? దీని మూలాలు తెలంగాణవే అని ఎంత మందికి తెలుసు?
ఆంధ్రప్రదేశ్ రాజముద్రలో మనం చూస్తున్న పూర్ణకుంభాన్ని నల్లగొండ జిల్లాలోని దేవరకొండ దుర్గం ముఖ ద్వారం నుండి స్వీకరించారు.. తెలుగు తల్లి చేతిలో కూడా ఇది ప్రముఖంగా కనిపిస్తుంది.. రాష్ట్ర సచివాలయ ముఖ ద్వారం దగ్గర మనను పలకరిస్తున్న పూర్ణకుంభ నమూనా శిల్పాన్ని గమనించారా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరిస్తున్న ఆస్తులు, పంపకాలు అంటూ గోల పెడుతున్నాం,, కానీ మన సాంస్కృతిక వారసత్వ చిహ్నమైన పూర్ణకుంభాన్ని గాలికి వదిలేశాం.. ఎంత దౌర్భాగ్యం.. పవిత్రమైన పూర్ణ కుంభానికి మన రాజముద్రలో చోటు లేదా?

కాకతీయ శిలాతోరణం, చార్మినార్ కూడా మన చారిత్రక వారసత్వమే.. కాదనలేం.. వాస్తవానికి తెలంగాణ రాజముద్రలో కాకతీయ శిలాతోరణం మాత్రమే పెడదామనుకున్నారు.. కానీ మజ్లిస్ వత్తిడికి తలొగ్గి సంతృష్టీకరణ రాజకీయ కోణంలో చార్మినార్ ను అతికించారు.. నిజానికి లోగోలో మనం చూసేది తీన్ మినార్నే గమనించండి.. పూర్ణ కుంభానికి రాజముద్రలో చేరిస్తే వచ్చే నష్టం ఏమిటి?.. రాజకీయాలకు అతీతంగా అలోచించండి..

No comments:

Post a Comment