Sunday, March 30, 2014

Saturday, March 29, 2014


కాంగ్రెస్ పార్టీలో మహిళలను గౌరవించరా?

మహిళలను గౌరవించడం మన సంస్కృతి.. కానీ కాంగ్రెస్ పార్టీలో మహిళలను అగౌరవించేవారిపై ఎలాంటి చర్యలు తీసుకోరు.. పైగా మహిళలను అవమానించిన ఎమ్మెల్యేను తప్పు పట్టిన నాయకున్ని పార్టీ నుండి గెంటేసి తన ప్రత్యేకతను చాటుకుంది.. ధట్ ఈజ్ కాంగ్రెస్..
ఉత్తరప్రదేశ్ మీరట్ నుండి కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థిగా బరిలో ఉన్న సినీ నటి నగ్మా ప్రచారానికి వెళ్లినప్పుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే గజ్ రాజ్ సింగ్ బహిరంగంగా ముద్దు పెట్టుకున్నాడు.. అవాక్కయిన నగ్మా అక్కడి నుండి వెళ్లిపోయింది.. ఈ వ్యవహారాన్ని ప్రమోద్ కాత్యాయన్ అనే నేత ఖండించారు.. ఇందుకు కాత్యాయన్ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.. కాత్యాయన్ పార్టీ నుండి బహిష్కృతుడయ్యాడు.. కానీ గజ్ రాజ్ సింగ్ మాత్రం సేఫ్..
ఈ సంఘటన మరచిపోక ముందే ప్రచారానికి వెళ్లిన నగ్మాపై మరో కార్యకర్త చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు.. ఈసారి మాత్రం నగ్మా వాడి చెంప చెల్లుమనిపించింది.. ఇలా చేస్తే మళ్లీ తాను మీరట్ రాను అని బహిరంగంగా చెప్పేసిందట నగ్మా..
ఒక మహిళ అధ్యక్షురాలిగా ఉన్న జాతీయ పార్టీలో మహిళలకు ఇచ్చే గౌరవం ఎంత గొప్పగా ఉందో చూశారు కాదా.. అందునా ఒక అగ్ర నటికి, పార్టీ అభ్యర్థికి అవమానం జరిగినా దిక్కులేదా?
ధట్స్ కాంగ్రెస్..

Friday, March 28, 2014

Thursday, March 27, 2014

అయాం వేరీ లక్కీ..
నాకు అన్నయ్యలు లేరు..
కాబట్టి వారితో విభేదించాల్సిన అవసరం లేదు..
పార్టీ పెట్టే శ్రమ తప్పింది..
డబ్బు ఖర్చు చేసే బాధా తప్పింది..

Wednesday, March 26, 2014

ఈ పొత్తు లాభదాయకమేనా?

బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేస్తే ఎవరికి లాభం?
కచ్చితంగా టీడీపీకే... కాకపోతే బీజేపీకి తాత్కాలికంగా కొన్ని సీట్లు పెరుగుతాయి..
రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే?
నష్టం టీడీపీకే అధికం.. బీజేపీకి మాత్రం ఓట్ల శాతం ఘననీయంగా పెరిగి దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి..
బీజేపీ తన బలాన్ని అధికంగా అంచనా వేసుకుంటోంది.. ఏవో కొన్ని సీట్లు ఇస్తాం సర్దుకు పోవాలి అన్నిది టీడీపీ వైఖరి.. వారి వైఖరి ఇదే అయితే ఒంటరిగానే పోటీ చేసి గెలవొచ్చుకాదా? ఆ సత్తా ఉందా?
పొత్తులు ఇచ్చి పుచ్చుకునే పద్దతిలో ఉండాలి.. 1999, 2004 ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ప్రయోజనాలు ఆశించి బీజేపీ త్యాగానికి సిద్దపడి తక్కువ సీట్లు ఇచ్చినా సర్దుకుపోయింది.. కానీ ఇప్పుడు ఆ సీన్ లేదు.. తెలంగాణ, సీమాంధ్రలో తగిన సీట్లు రాకపోయినా, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా బీజేపీకి ఉంది.. పొత్తు లేకున్నా రెండు ప్రాంతాల్లో బీజేపీకి అంతో ఇంతో ఫలితాలు వస్తాయి.. వాస్తవానికి ఈ ఎన్నికల్లో టీడీపీ కన్నా బీజేపీకే సానుకూలత అధికంగా కనిపిస్తోంది..
ముద్దొచ్చినప్పుడే ఎత్తుకుంటానంటే ఇప్పడు కుదరదు.. టీడీపీది మొదటి నుండి ద్వంద్వ వైఖరే.. వారి స్నేహం నిండా స్వార్ధమే.. బీజేపీ బలంగా ఉన్నప్పుడు పొత్తుల కోసం వెంపర్లాడతారు.. లేదంటే మతతత్వం పార్టీ అంటూ దూరం పెడతారు? సెక్యులరిజం పేరుతో యునైటెడ్ ప్రంట్ ప్రభుత్వంలో చక్రం తిప్పిన చంద్రబాబు, బీజేపీ అధికారంలోకి రాగానే ఆ ఫ్రంట్ తెప్ప తగిలేశారు.. 2004లో అధికారం పోగానే మళ్లీ మతత్వం గుర్తుకు వచ్చి బీజేపీకి దూరం పెట్టి, వామపక్షాలను అక్కున చేర్చుకున్నారు..
ఇప్పుడు బీజేపీ మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తోంది అనే నమ్మకం కలగడంతో గతాన్ని మరచి మళ్లీ స్నేహ హస్తం చాస్తున్నారు..
మిత్ర ధర్మం తెలియని టీడీపీతో పొత్తు అవసరమా? బీజేపీ నేతలు ఆలోచించాలి.. సీట్లు ఎన్ని వచ్చినా సంస్థాగతంగా బలపడేందుకు ఇదే సరైన సమయం..1998 పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రం నుండి బీజేపీ వంటరిగానే పోటీ చేసి 4 పార్లమెంట్ సీట్లు గెలుచుకొని, 40 అసెంబ్లీ సీట్లలో మొదటి స్థానాన్ని, 50 సీట్లలో ద్వితీయ స్థానాన్ని పొందింది.. ఆ తర్వాత బాబు ధృతరాష్ట్ర కౌగిలిలో పడి చిక్కి శల్యమైంది..

గౌరవ ప్రదంగా సమాన స్థాయిలో సీట్లు ఇస్తేనే టీడీపీతో పొత్తు పెట్టుకోవాలి.. లేదా వంటరిగానే పోటీ చేసి సత్తా చాటుకోవాలి.. ఇది సగటు బీజేపీ అభిమానులు, కార్యకర్తల మనసులోని మాట..

Tuesday, March 25, 2014

ఫలక్ నూమా అద్దం..

నా చిన్నప్పడు మా ఇంటి పైకి వెళ్లి చూస్తే ఫలక్ నూమా ప్యాలస్ ఎంతో అందంగా, గంభీరంగా కనిపించేది.. నేను పుట్టి పెరిగిన బస్తీలో వినిపించిన ముచ్చట ఇది..
ఫలక నూమల ఓ అద్దం ఉంది.. ఎవ్వలన్నా అబద్దం ఆడితే, గా అద్దంల బరుబత్తల (నగ్నంగా) కనిపిస్తరు.. అబద్దాలు ఆడేటోళ్లను నిజాం నవాబు అద్దం ముంగట నిలబెడ్తడు.. బర్బత్తల ఉన్నట్లు కనిపిస్తే హంటర్ తో కట్టించి పంపుతడు..
పసిప్రాయంలో ఆ ముచ్చట నిజమే అని నమ్మాను నేను.. నిజంగా ఫలక్ నూమా ప్యాలస్ లో అలాంటి అద్దం ఉందా? అబద్దం ఆడితే మన పరిస్థితి ఏమిటి అనే భయపడే వాన్ని.. కానీ వయసు, బుద్ధి పెరిగిన కొద్దీ అసలు ఈ కథే ఒక అందమైన అబద్దం అని అర్థమైపోయింది.. ఇక ధైర్యంగా అవసరమైప్పడు చిన్న చిన్న అబద్దాలు ఆడటం మొదలు పెట్టాను..
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మన ఇళ్ల ముందుకు పిలవని చుట్టాళ్లా నాయకులు ఊడిపడతారు.. వాగ్దానాలు ఎన్నో ఇస్తారు.. అవి చేస్తాం, ఇవి పరిష్కరిస్తాం అంటూ అర చేతిలోనే స్వర్గాన్ని చూపిస్తారు.. గొర్రె కసాయిని నమ్మినట్లు నమ్మేస్తాం.. గెలిపించి చట్ట సభలకు పంపుతాం.. కాలం గడుస్తున్న కొద్దీ వారి మాటలు పెద్ద అబద్దాలు, చెల్లని ప్రామిసరీ నోట్లని అర్ధం అవుతుంది.. ఏదైనా పని పడా వారి దగ్గరకు పోతే, అసలు ఎవడీడు అన్నట్లు చూస్తారీ వెధవలు.. సాటి మనిషికి ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వరు..
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సిగ్గు లేకుండా మళ్లీ ఊడిపడతారు.. మీకు ఎంతో చేశాం.. మీరు ఇంకా బతికే ఉన్నారంటే అది మా పుణ్యమే అని చెవులో పూలు పెడతారీ దగుల్భాజీలు.. ఈసారి కొత్తగా ఇవి చేయబోతున్నాం అని మరోసారి నమ్మజూపుతారు.. వారు చెప్పేవన్నీ అబద్దాలే అని తెలుసు.. కానీ ఏదో మూలన ఉన్న చిన్న ఆశ మళ్లీ నమ్మేలా చేస్తుంది..

ఇలాంటి సమయంలో నాకు అనిపిస్తుంది.. ఆ ఫలక్ నూమా అద్దం నిజంగానే ఉంటే ఎంత బాగుండునో అని చేను కూడా ఈ దగుల్భాజీలను అద్దం ముందు నిలబెట్టి, మీరు బరుబత్తల ఉన్నార్రా అని తేల్చి నాలుగు తగిలించి పంపేవాన్ని కదా అని.. (క్రాంతి దేవ్ మిత్ర)

Monday, March 24, 2014

బీజేపీకి మద్దతు ఇచ్చే విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటాడట కేఏ పాల్.. ఇప్పటికే రాజనాథ్ సింగ్, ఆరెస్సెస్ పెద్దలను కలిసాడట.. హహ్హహ్హహా..  
కొద్ది రోజుల క్రితం నరేంద్ర మోడీని కలిసిన సల్మాన్ ఖాన్ సినిమాలు ఆడనివ్వబోమని ప్రకటించాడు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.. ఈ మధ్యనే మెడీని కలిసిన పవన్ కల్యాణ్ చిత్రాలు హైదరాబాద్ లో ఎలా విడుదల అవుతాయో చూస్తానంటున్నాడు ఇప్పుడు.. మరి మోడీకి ఓట్లేసిన వారిని ఏమి చేస్తారో కూడా చెబితే బాగుంటుంది..

Sunday, March 23, 2014

2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో నరేంద్ర మోడీ పాత్ర ఎంత?.. న్యాయస్థానాలు నరేంద్ర మోడీకి ఎందుకు క్లీన్ చీట్ ఇచ్చాయి?.. అసలు జకియా జాఫ్రి వేసిన పిటిషన్లోని అంశాలు ఏమిటి?.. కోర్టు ఎందుకు కొట్టేసింది?..
ఇటీవల ఇండియా టుడే(11 మార్చి,2014)లో వచ్చిన ఈ కథనం ఎంత మంది చూశారో తెలియదు.. కానీ దీన్ని చదివితే అసలు వాస్తవాలు ఏమిటో ఎవరికి వారు అర్థం చేసుకోవచ్చు..

భారత స్వాతంత్ర్య సమర యోధులు, విప్లవ వీరులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీసిన రోజు ఇవాళ.. ఈ అమర వీరులను స్మరించు కుందాం.. వారి స్పూర్తితో ముందుకు సాగుదాం..

Saturday, March 22, 2014

అవగాహన లేనిదెవరికి?

తన సోదరుడు పవన్ కల్యాణ్ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని కలవటం కేంద్ర మంత్రి చిరంజీవిని ఆశ్చర్యానికి గురి చేసిందట... ఆయన విశాఖలో మీట్‑ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ గోద్రా నరమేధంలో మోడీ పాత్ర ఉందన్న అంశంపై పవన్‑కు అవగాహన ఉందో...లేదో అని చిరంజీవి అనుమానం వ్యక్తం చేశారు. 
అయ్యా చిరు జీవి.. తమరు ప్రజా రాజ్యం పార్టీ పెట్టినప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేయలేదా?.. దేవేందర్ గౌడ్ (అప్పడు పీఆర్పీలో ఉన్నారు) గారిని రాయబారం పంపలేదా? సీట్ల విషయంలో తేడా వచ్చి ఒప్పందం కుదరలేదనుకోండి..

నాకైతే ఈ అన్నయ్య కన్నా తమ్ముడికే ఒక విజన్, అవగాహన ఉన్నట్లనిపిస్తోంది.. చిరంజీవికి మార్కెటింగ్ చేసుకోవడం రాలేదు.. పవన్ కాస్త తెలివిగా ముందుకు వెళుతున్నాడు.. 

మొత్తానికి జేపీ 'రైట్' రూట్లో పడ్డారు..

Thursday, March 20, 2014

అక్కడా ఇవ్వండి..

చంద్రబాబు గారూ.. బలహీన వర్గాలపై మీకు ఎంతో ప్రేమ ఉన్నందుకు సంతోషం..
తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీలకే ముఖ్యమంత్రి పదవి ఇస్తానన్నందుకు మరీ సంతోషం..
అదే నోటితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని కూడా బీసీలకే కేటాయిస్తానని ప్రకటిస్తే ఇంకా సంతోషం..
బాబు గారూ.. బీసీలు సీమాంధ్రలోనూ ఉన్నారు.. తెలంగాణకే ఎందుకంత భాగ్యం? సీమాంధ్ర చేసిన తప్పేమిటి?
ఈ ప్రశ్నకు సరైన జవాబు ఇస్తే, నాతో పాటు అందరికీ సంతోషం..

1962 చేదు జ్ఞాపకాల నుండి గుణపాఠం నేర్చుకున్నామా?

చరిత్రలో కొన్ని పాత గాయాలు పదే పదే గుర్తుకు వచ్చి ఇబ్బంది పెడుతుంటాయి.. 1962 భారత్ -చైనా యుద్ధ చేదు జ్ఞాపకాలు ఈ కోవలోనివే.. హిందీ-చీనీ భాయ్ భాయ్ అనే ముసుగును తొలగించుకున్న చైనా, పంచశీల సూత్రాలకు తిలోదకాలు ఇస్తూ భారత సరిహద్దులపై విరుచుకుపడింది.. అప్రమత్తంగా లేని మన సైన్యం ఓటమి పాలైంది..
ఈ ఘోర పరాజయానికి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ అనుసరించిన విధానాలే కారణమని నాటి భారత మిలటరీ అకాడమీకి చెందిన లెఫ్టినెంట్ జనరల్ హెండర్సన్ బ్రూక్స్, బ్రిగేడియర్ పి.ఎస్.భగత్ విశ్లేషించారు.. ఈ మేరకు ఓ నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చారు.. ప్రధాని నెహ్రూతో పాటు రక్షణ మంత్రి కృష్ణమీనన్ ల నగ్న స్వరూపాలను ఈ నివేదిక ఎండగట్టింది..హెండర్సన్ బ్రూక్ నివేదికను చూసి ప్రధాని నెహ్రూ ఉలిక్కి పడ్డారు.. అంతే రహస్యంగా తొక్కి పెట్టేశారు.. అప్పటి నుండి అంతర్గత రహస్యంగానే ఉన్నఈ నివేదికను తాజాగా ఆస్ట్రేలియా జర్నలిస్టు నెవెల్లి మాక్స్ వెల్ బయట పెట్టడం సంచలనం సృష్టించింది.. నిజానికి హెండర్సన్ బ్రూక్స్ నివేదికలోని విషయాలు అన్నీ బహిరంగ రహస్యాలే..
స్వాతంత్ర్యం తర్వాత ప్రథమ ప్రధాని నెహ్రూ దేశ భద్రతను తీవ్రంగా నిర్లక్ష్యం చేశారు.. మన సైన్యానికి తగినన్ని ఆయుధాలు, వాహనాలు లేవు.. సరిహద్దుల దగ్గర పటిష్టమైన భద్రత కరువైంది.. కనీసం సైన్య నిర్వహణకు సరిపడే బడ్జెట్ కూడా ఇవ్వలేని దుస్థితి.. సైన్యాన్ని ఆధునీకరించకుండా, బ్రిటిష్ వారి నుండి వారసత్వంగా వచ్చిన విధానాలే కొనసాగించారు.. అలీన ఉద్యమం పేరుతో శాంతి దూతగా పేరు తెచ్చుకొని నోబెల్ బహుమతి కొట్టేయాలనే ఆలోచనతో ఉన్న నెహ్రూ పొరుగు దేశాలతో పొంచి ఉన్న ముప్పును తక్కువ అంఛనా వేశారు..
 చైనా అప్పటికే మన దేశంలో ఉన్న సరిహద్దుల విషయంలో పేచీ పెడుతోంది.. పైగా తాము ఆక్రమించిన టిబెట్ అధిపతి దలైలామాకు భారత్ ఆశ్రయం ఇవ్వడాన్ని సహించలేకపోయింది.. అదను కోసం ఎదురు చూస్తోంది.. కానీ నెహ్రూ మాత్రం ఆదేశాన్ని గుడ్డిగా నమ్మారు.. ఆ దేశంలో పంచశీల ఒప్పందాన్ని కుదుర్చుకొని, హిందీ-చీనీ భాయ్ భాయ్ అంటూ మురిసిపోయారు.. ఇలాంటి పగటి కలలను భగ్నం చేస్తూ చైనా విరుచుకుపడింది.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. ఇప్పటికీ చైనా ఆక్రమణలోని మన భూభాగాలు విముక్తి పొందలేని దుస్థితిలో ఉన్నాం..
1962 నాటి యుద్దం నుండి మన ప్రభుత్వం ఏమైనా గుణపాఠాలు నేర్చుకుందా అనే ప్రశ్నకు లేదని చెప్పడం ఎంతో విచారాన్ని కలిగిస్తోంది.. చైనాతో ఉన్న కీలక సరిహద్దుల రక్షణపై ఇప్పటకీ సరైన దృష్టి పెట్టలేదు.. తరచూ ఆ దేశ సైన్యం మన భూభాగంలోకి వచ్చి తిష్ట వేస్తున్నా, కొద్ది రోజుల తర్వాత కానీ సమాచారం అందని దుస్థితి.. చైనాకు ధీటుగా జవాబు చెప్పే సత్తా మనకు ఉందా అంటే నీళ్లు నమిలే దుస్థితిలోఉన్నాం.. ఎన్టీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నాటి రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ చేసిన ప్రకటన ప్రకంపణలు సృష్టించింది.. భారత్ కు ప్రధమ శత్రువు చైనా అని కుండ బద్దలు చేశారు ఆయన.. నిజమే ఇది.. పాకిస్తాన్ మనకు కలనిపించే శత్రువు అయితే, చైనా కనపడని శత్రువు.. పాకిస్తాన్ కు అన్నివిధాలా సహాయ సహకారాలు అందించేది చైనాయే.. మన దేశం చుట్టూ ఉన్న దేశాలు క్రమంగా చైనా కౌగిలిలోకి పోతున్నాయి.. భారత్ ఇప్పుడు చైనా నుండి పెను సవాళ్లను ఎదుర్కొంటోంది.. గత పదేళ్లుగా మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ(కాంగ్రెస్) ప్రభుత్వం నెహ్రూ విధానాలనే ఇంకా గుడ్డిగా అనుసరిస్తూ వచ్చింది.. సమస్య తీవ్రత మరింతగా పెరిగింది..

దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ ఇది.. 1962 నాటి పరాజయం, దేశ రక్షణనకు సంబంధించిన సమస్యలు ఇప్పుడు చర్చకు రావడం మంచిదే.. కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునే విషయంలో దేశ ప్రజలంతా ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది..

ఎవరి వార్తలు వారిదే..

తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ మిత్రులందరికీ శుభోదయం.. కలిసి ముందుకు పోదాం, ప్రగతి పధంలో సాగుదాం.. కానీ ఎవరి వార్తలు వారివే.. మనసారా, సంతోషంగా మీ వార్తలు మీరే చదువుకోండి...

Wednesday, March 19, 2014

తనను అభిమానించే వారు ఆంధ్ర, తెలంగాణతో పాటు అంతటా ఉన్నారని చెబుతున్నారు హాస్య నటుడు వేణుమాధవ్.. పాకిస్తాన్లో కూడా అభిమానులు ఉంటే అక్కడి నుండి పోటీ చేయడానికి సిద్దమని ప్రకటించారు..
నల్లగొండ జిల్లా కోదాడ నుండి టిడిపి  టికెట్ పై అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్న వేణుమాధవ్, చంద్రబాబును కలుసుకున్నారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ విసిరిన చలోక్తి ఇది..
బెస్ట్ ఆఫ్ లక్ వేణుమాధవ్.. 

Monday, March 17, 2014

గజి బిజితో జర భద్రం

మిస్టర్ బీన్.. ఈ క్యారెక్టర్ మీకు పరిచయమే అనుకుంటాను.. చాలా సంవత్సరాల పాటు ప్రపంచ వ్యాప్త టెలివిజన్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈ హస్యగాడి పాత్రలో రోవన్ ఆట్కిన్ సన్ అద్భుతంగా జీవించాడు.. లండన్ ఒలింపిక్స్ సమయంలో టీవీలో మిస్టర్ బీన్ ట్రైలర్ వచ్చింది.. సముద్రం ఒడ్డును హేమా హేమీ క్రీడాకారులు పరుగుపదంలో పోటీ పడుతుంటారు.. మనోడు అడ్డదోవలో పోయి కప్పు ఎగరేసుకుపోయినట్లు కలగంటాడు..
యాదృచ్చికంగా మన గజి బిజి వాలాను చూస్తే ఈ ట్రైలరే గుర్తుకు వచ్చింది.. పదేళ్ల కాంగ్రెస్ అవినీతి, అసమర్ధపాలనపై బీజేపీ, ఇతర ప్రతిపక్షాలు పోరాడుతుంటే.. నేనున్నానంటూ నిన్న గాక మొన్న వచ్చిన గజి బిజి వాలా కిరీటం ధరించేందుకు పోటీ పడుతున్నాడు.. ఢిల్లీలో ఇతగాడి నిర్వాకం చూశాక, చేతగాని వాడిని తిలోత్తమ వరించినా వృధాయే అనిపించింది నాకు..
ఇలాంటి వారు తాము గెలవరు.. గెలిచేవారికి అడ్డుపడి పాత కాపునే గట్టెక్కిస్తారు.. దేశంలోని మేధావులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నది ఈ విషయంలోనే.. గజిబిజి వాలా రహస్య ఎజెండా స్పష్టంగా కనిపిస్తోంది.. మిస్టర్ గజిబిజి పట్ల దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది..

సిగ్గు సిగ్గు..

ఎన్నికల వేళ వచ్చింది రంగుల పండుగ.. ఏ రంగు పడినా కష్టమే..
ఎరుపు కమ్యూనిస్టులదట.. పసుపు తెలుగు దేశానిదట.. కాషాయం బీజేపీదట.. ఆకుపచ్చ ఎంఐఎందట.. నీలం బహుజనులద.. మిగతా వర్ణాలు కాంగ్రెస్, వైసీపీలవట.. అందరూ రంగులు పంచేసుకున్నారు..
ఇంతకీ నీదే రంగంటే ఏమి చెప్పను?.. ఇంధ్ర ధనస్సులోని అన్ని రంగులూ నాకు ఇష్టమే..
రాజకీయమంతా రంగుల్లానే గజిబిజిగా కనిపింది.. ఏ నాయకుడు ఎప్పుడు ఏ రంగు పులుముకుంటున్నాడో తెలియడం లేదు.. చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చేస్తున్నాడు.. సిద్దాంతాలకు ఏనాడో తిలోదకాలు ఇచ్చేశారు.. విలువలను వలవల్లా నిస్సిగ్గుగా విప్పేశారు.. ప్రజల ఆకాంక్షలు ఎవరికి పట్టాయి?.. గెలుపు, అధికారమే పరమావధిగా రంగులు మారుస్తున్న ఈ నాయకులను చూసి ఊసరవెళ్లి సైతం సిగ్గు పడుతోంది.. నాకన్నా వేరే వేగంగా రంగులు మారుస్తున్నారని..

సర్వేలన్నీ తప్పట.. మళ్లీ యూపీఏ సర్కారు అధికారంలోని వస్తుందట.. యువరాజా వారు సెలవిచ్చారు మరి..


హోళీ ఆయీరే..


Saturday, March 15, 2014

ఈ క్లారిటీ చాలదు గబ్బర్..

స్క్రిప్ట్, హైటెక్ హంగామాలు అదిరిపోయాయి.. సినిమా ఆడియో ఫంక్షన్ లెవళ్లో పార్టీని ప్రకటించేశారు.. కానీ క్లారిటీ లేదు..
ఉన్న ఒకే క్లారిటీ కాంగ్రెస్ కో హఠావో.. దేశ్ కో బచావో..’ తెలంగాణ ఏర్పాటును పరోక్షంగా వ్యతిరేకత ప్రకటించారు.. అంటే ఒక ప్రాంత ప్రజలకే పరిమితం కావాలని భావించారా? కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులపై విరుచుకుపడటానికేనా రెండు గంటల సుదీర్ఘ ప్రసంగం?.. పవన్ కల్యాణ్ ప్రసంగంలో తన వ్యక్తిగత జీవితం, కుటుంబం వచ్చిన విమర్షలకు.. ఆరోపణలు చేసిన వారికి హెచ్చరికలకే ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టంగా కనిపించింది..
పవన్ కల్యాణ్ పార్టీ పెడతారంటే అభిమానులతో పాటు రాజకీయ వర్గాలు, మీడియా, రాష్ట్ర ప్రజలంతా ఉత్సుకతతో ఎదురు చూశారు.. కానీ ఎక్కడా పార్టీ ఎందుకు పెడుతున్నారు? ఎన్నికల ముందే ఎందుకు వచ్చారు? ఎన్ని స్థానాలకు పోటీ చేస్తారు?, ఎవరితో కలిసి ముందుకు పోతారు?.. అనే విషయాలపై స్పష్టత లేదు.. పార్టీ విధానాలు ఏమిటో సరిగ్గా వివరించలేదు..

సినిమాకు, నిజ జీవితానికి చాలా తేడా ఉంటుంది.. తెరపై గబ్బర్ సింగ్ మాదిరిగా ఇరగదీసి, రప్ఫాడించడం రాజకీయాల్లో కుదరదు.. సినీ నటుడిగా పవన్ కల్యాణ్ ను అభిమానించే వారంతా, రాజకీయ నటుడిగా ఆహ్వానించాలంటే ఈ క్లారిటీ చాలదు.. 

సేమ్ టూ సేమ్..

జగ్గా రెడ్డి, మనం సేమ్ టూ సేమ్.. ఆయనకీ గడ్డం ఉంది.. మనకీ ఉంది.. కాకుంటే ఆయన షేవ్ చేసుకోడు.. మనం చేసుకుంటాం అంతే..

తిక్క.. లెక్క..

ఈయనకు కాస్త తిక్క ఉన్నా, దానికో లెక్క ఉందన్నాడో మిత్రుడు..
మీడియా అమ్ముడు పోయింది.. నేను అధికారానికి వస్తే వాళ్లందరినీ జైలుకు పంపుతానంటాడీయన.. 
అప్పుడనిపించింది ఈయన ఊండాల్సింది ఎర్రగడ్డలో అని..

Thursday, March 13, 2014

నమో థాలీ.. రాగా బాస్కెట్.

ఎన్నికల వేళ వ్యాపారాలకూ రాజకీయ రంగు అంటుకుంది.. ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ నగరంలో ఓ రెస్టారెంట్ వెరైటీ వంటకాలను వడ్డిస్తోంది..
నమో థాలీ.. రాగా బాస్కెట్..  బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్లు పెట్టి  మిషన్ మే 2014 పేరిట స్పెషల్ మెనూ ఇది.. నమో థాలీకి కాస్త డిమాండ్ ఎక్కువుందట. అందుకే రూ.110/- ధర నిర్ణయించారు.. ఇక రాగా బాస్కెట్ రూ.90 /-కే అందుబాటులో ఉంది.. ఈ మెనూ చూసి రెస్టారెంట్ కు కస్టమర్లు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారట.. బీజేపీ, కాంగ్రెస్ మద్దతుదార్లు లొట్టలేసుకుంటూ నమో థాలి, రాగా బాస్కెట్ రుచులను ఆస్వాదిస్తున్నారట..

అన్నట్లు మెనూ కింద పెట్టిన టాగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది.. అది ఈట్ కరెక్ట్.. థింక్ కరెక్ట్.. ఓట్ కరెక్ట్..ఎన్నికలను సొమ్ము చేసుకోవడంతో పాటు నీతి కూడానా.. అయినా ఇదీ ఆలోచించ తగినదే..

మోీడీది చేయి గుర్తా?..

ఈ మధ్య ఓ ఊరికి పోతే వ్యవసాయం లేక రోడ్డు పని చేస్తున్న కూలీలు కనిపించారు.. వారితో జరిగిన సంభాషణ ఇది..
  ఏమయ్యా ఎలచ్చన్లొస్తున్నయ్ కదా.. ఎవరికి ఏస్తరు ఓట్లు..
ఎవరొచ్చినా ఏం చేస్తరు సారూ.. ఎవరో మోడీ అంట.. ఆయన పేరు బాగా ఇనిపిస్తుంది.. ఈ సారి గాయనకు ఏసి సూద్దమనుకుంటున్నాం..
ఆయన ఏ పార్టో తెలుసా?..
తెల్వదు సార్.. చెయ్యి గుర్తంట గా.. మా సారు చెప్పిండు..
నరేంద్ర మోడీది చేయి గుర్తు అని చెప్పిన పెద్దాయన ఎవరా అని ఆరా తీస్తే, ఆ ఊర్లోని ఓ కాంగ్రెస్ నాయకుడని తేలింది.. ఈ గ్రామం ఎక్కడో మారు మూల ప్రాంతంలో లేదు.. హైదరాబాద్ కు కూత వేటు దూరంలో ఉన్న రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు దగ్గర్లోని పులిమామిడి..
దేశమంతటా నరేంద్ర మోడీ పేరు మార్మోగుతోంది.. తెలంగాణలోనూ, సీమాంధ్రలోనూ ఘనంగా మోడీ గురుంచి మాట్లాడుతుంటున్నారు.. కానీ నగరాలు, కొన్ని పట్టణాలు, మండలాలు, గ్రామాలు తప్ప చాలా ప్రాంతాల్లో బీజేపీకి కేడర్ లేదు.. దీంతో ఆ పార్టీ మోడీ క్రేజీని ఓట్లుగా మలచుకోగలుగుతుందా అనే అనుమానాలున్నాయి.. ఇక్కడే ఇతర పార్టీలు జనాలను బోల్తా కొడుతున్నాయి..
నరేంద్ర మోడీ ఏ పార్టీవాడు.. ఆయన పార్టీ గుర్తేదో కూడా తెలియని అమాయకులు ఉన్నారంటే వారిపై జాలి పడలేం.. ఇక్కడ తప్పు బీజేపీ నాయకులు, క్యాడర్ దే..

బీజేపీ బాబులూ.. మీ ప్రెస్ మీట్లు, చాయ్ పే చర్చలు, బహిరంగ సభలు సరే.. అర్జంటుగా గ్రామాలకు వెళ్లండి, జనాలను కలుసుకోండి.. ఇంకా నెలన్నర రోజులే ఉంది ఎన్నికలకు.. ఆ తర్వాత చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ఫలితం ఉండదు..

Wednesday, March 12, 2014

ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు?

సంయుక్త ఆంధ్రప్రదేశ్ విడిపోకుండా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా అడ్డుకోవడంలో చేతులెత్తేసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు..
ఇప్పుడు రాష్ట్రాన్ని తిరిగి ఒక్కటి చేస్తానంటూ కొత్త పార్టీని ప్రకటించారు..
సరే ఈయన పార్టీ విజయం సాధించి ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారే అనుకుందాం..
తిరిగి సమైక్యాంధ్ర ప్రదేశ్ ఏర్పాటు  చేయగలరా?
ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాధ్యం కాలేని పని, భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయితే ఎలా సాధ్యం అవుతుంది..
సమాధానం చెప్పగలరా కిరణ్ కుమార్ రెడ్డి గారూ?..

Tuesday, March 11, 2014

గాంధీ పేరు దుర్వినియోగం

మన దేశాన్ని సుధీర్ఘ కాలం పాలించింది 'గాంధీ - నెహ్రూ' కుటుంబం అని మీడియా వ్యాఖ్యానిస్తుంటుంది.. కానీ ఇందిరా గాంధీ, రాజీవ్ గాందీ, సోనియా గాందీ, రాహుల్ గాంధీ తదితరులకు మహాత్మా గాంధీ పరివారంతో ఎలాంటి సంబంధం లేదనే విషయం చాలా మందికి తెలియదు.. అందుకే నేను ఎప్పుడూ సోకాల్డ్ గాంధీ, నెహ్రూ కుటుంబం అనే పదాన్ని వాడుతుంటాను.. గాందీజీ పేరుకు ఉన్నవిలువను సొమ్ము చేసుకుంటున్న ఈ కుటుంబం తరతరాలుగా సామాన్య భారతీయులను మోసం చేస్తూ వస్తోంది.. ఈ విషయంలో గాంధీజీ వారసుడు ఏమంటున్నారో చూడండి....

Monday, March 10, 2014

ఏం సాధించాలని ఈ పార్టీ?

కథ కొత్తదేం కాదు.. పాతదే. టైటిలూ పాతదే.. అయినా చూడాలట ఈ సినిమా..ఈ మధ్య టీవీల్లో ట్రైలర్లు, ఎఫ్ఎంలలో పాటలు వినీ వినీ.. పత్రికల్లో రివ్యూలు చూసీ చూసీ సదరు చిత్రాలు చూడాలనిపించడం లేదు..
నిన్నటి దాకా కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెడతాడని వింటూనే ఉన్నాం.. టీవీల్లో, పత్రికల్లో రెండు నెలలుగా జోరుగా సాగిన ప్రచారం ఆచరణలోకి వచ్చేసింది.. జై సమైక్యాంధ్ర పార్టీ.. (టైటిల్ ఊహించిందే.. లేదా ముందుగా ప్రచారం చేయబడిందే)
తెలంగాణ ఏర్పాటు ఖాయమని చాలా నెలలుగా అందరికీ తెలుసు.. నిజంగానే అడ్డుకునే తలంపు ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడో అడ్డుకునేవారు.. అది అసాధ్యమేం కాదు..
కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఇవ్వాలని నిర్ణయించడం.. క్యాబినెట్ లో ఆమోదించడం.. పార్లమెంట్  ఉభయ సభలో బిల్లు పెట్టి పాస్ చేయించడం.. దీనంతటికి రెండు, మూడు నెలలు పట్టింది..
తెలంగాణ రాదు గాక, రాదు.. మా స్టార్ బ్యాట్ మెన్ అడ్డుకుంటారని ఆయనగారి విధేయుడు గొప్పలకు పోయారు..  కానీ ఫలితం ఏమైంది జరగాల్సింది జరిగింది..
అధిష్టానం తన అభిప్రాయాలకు విలువ ఇవ్వడం లేదని, తెలంగాణ ఇవ్వడానికే సముఖంగా ఉందని తెలియగానే కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా ఇస్తే ఆయనకు కాస్త గౌరవం దక్కేది.. హుందాగా ఉండేది.. కానీ కిరణ్ గారు చివరి వరకూ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు.. అన్ని పనులూ చక్కబెట్టుకున్నారు.. చివరకు రాజీనామా ఇచ్చేశారు..
ఇప్పుడు తెలుగు ప్రజల ఆత్మగౌరవం.. జై సమైక్యాంధ్ర పార్టీ అంటున్నారు..
తాను ముఖ్యమంత్రిగా ఉండి కాపాడలిన సమైక్యాంధ్రను, పార్టీ పెట్టి కాపాడాడట.. ఎంత హాస్యాస్పదంగా ఉందో చూశారా?.. సరే కిరణ్ గారి పార్టీ గెలిచి ఆయన మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టారనే అనుకుందాం.. తెలంగాణ, సీమాంధ్రలను కలిపి మళ్లీ సమైక్యాంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయగలరా?

ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడే చేయలేని పనిని, మళ్లీ ముఖ్యమంత్రి అయ్యి చేస్తానంటే నమ్మేదెవరు?

ఎందుకీ ద్వంద్వ ప్రామాణాలు?

తెలంగాణలో బీసీలకే ముఖ్యమంత్రి పదవి - నిన్న చంద్రబాబు నాయుడు
తెలంగాణలో దళితులకే సీఎం పదవి - ఇవాళ జైరామ్ రమేష్
తెలంగాణ వస్తే దళితున్ని ముఖ్యమంత్రి చేస్తాం - చానాళ్ల క్రితమే చంద్ర శేఖర రావు
ఓకే బలహీన వర్గాల వారైనా, దళితులు అయినా ముఖ్యమంత్రి పదవి చేపట్టడంలో ఎవరికీ అభ్యంతరం లేదు.. కానీ చంద్రబాబు, జైరామ్ రమేష్ గార్లకు ఓ ప్రశ్న తెలంగాణలో మాత్రమే ఈ రిజర్వేషన్ ఎందుకు? సీమాంధ్రలో బీసీలు, దళితులకు అత్యున్నత స్థానం అధిరోహించే అర్హత లేదా? అక్కడి పదవులు అగ్ర వర్ణాలకేనా?
తెలంగాణ దళితులు, బీసీలు చేసుకున్న పుణ్యం ఏమిటి?.. సీమాంధ్రలో వారు చేసిన పాపం ఏమిటి?
ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్ష పదవి, ముఖ్యమంత్రి పదవి బీసీలకు ఇవ్వ వచ్చుకదా?
ఇక కేసీఆర్ గారి విషయానికి వద్దాం.. తెలంగాణ వస్తే దళితున్ని సీఎం చేస్తామని గతంలోనే వాగ్దానం చేశారు.. తెలంగాణ ఖాయం అయిన తర్వాత ఈ విషయాన్ని ఎక్కడా ప్రస్థావించడం లేదు.. గతంలో చేసిన ప్రకటనకు ఇంకా కట్టుబడే ఉన్నారా?
రూ.20 వేలు ఎదురిచ్చి ఈయనతో భోజనం చేయాలా?.. అంత డబ్బు మీ దగ్గర ఉంటే దగ్గర్లోని అనాధ బాలల ఆశ్రమానికి విరాళంగా ఇవ్వండి.. ప్రయోజనం ఉంటుంది.   

ఇందు కోసమేనా మనం పోరాడింది..

రజాకార్ల దురాగతాలకు, నిజాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన హైదరాబాద్ సంస్థాన ప్రజలు 1948 సెప్టెంబర్ 17న జరిగిన పోలీస్ యాక్షన్ తో స్వతంత్ర భారత దేశంలో కలిసిపోయారు.. 1956 నవంబర్ 1న హైదరాబాద్ సంస్థానం విచ్చిన్నమై తెలంగాణ, ఆంధ్ర కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.. 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరిస్తోంది.. ఈ తేదీలకు చరిత్రలో ప్రాధాన్యత ఉంది..
బ్రిటిష్ వారు ఇండియా వదిలి వెళ్లాక అప్పటి వరకూ వారి సామంత రాజ్యంగా ఉన్న హైదరాబాద్, ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలో స్వతంత్ర ఇస్లాం దేశంగా కొనసాగాలంటూ రజాకార్లు పోరాడారు.. మజ్లిస్ ఇత్తేహాదల్ ముస్లిమిన్ (ఎంఐఎం)కు అనుబంధ సంస్థ ఇది.. వీరికి నాయకుడు కాశీం రజ్వి.. రజాకార్లు నిజాం పాలకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టు, ఆర్యసమాజ్, స్టేట్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను అణచివేసే ప్రయత్నం చేశారు..  రక్త పిపాసులలైన రజాకార్లు పోరాట యోధులతో పాటు సామాన్య ప్రజలను కూడా చిత్ర హింసలు పెట్టారు.. పెద్ద ఎత్తున మారణ కాండ సాగించారు.. గ్రామాలపై పడి దోచుకున్నారు.. మహిళల మాన ప్రాణాలను హరించారు.. బైరోన్ పల్లి మారణ కాండ, బీబీనగర్లో మహిళలను నగ్నంగా బతుకమ్మ ఆడించిన వైనం ఈనాటికీ తెలంగాణ పల్లెలు మరచిపోలేదు.. ఈ చరిత్రకు సజీవ సాక్షులు కొందరు బతికే ఉన్నారు.. (చరిత్ర పుటలు తిరగేస్తే ఈ నిజాలు కనిపిస్తాయి)
భారత దేశంలో హైదరాబాద్ విలీనం తర్వాత రజాకార్ల ఆగడాలపై విచారణ జరిగింది. మజ్లిస్ (ఎంఐఎం) పార్టీని నిషేధించారు.. కాశీం రజ్వీని అరెస్టు చేశారు.. 1957లో జైలు నుండి విడుదల అయ్యాక పాకిస్తాన్ పారిపోయాడు.. పోతూ పోతూ అబ్దుల్ వాహెద్ ఓవైసీ నాయకత్వంలో మజ్లిస్ పార్టీని పునరుద్దరించాడు.. పాత నగరంలో, తెలంగాణలో అప్పటి వరకూ బలంగా ఉన్న కమ్యూనిస్టులకు గండి కొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంను పునరుద్దరించేందుకు అనుమతి ఇచ్చింది..

66 ఏళ్ల తర్వాత మరో దురదృష్టకర సంఘటన జరుగుతోంది.. తెలంగాణ నూతన రాష్ట్రంగా ఆవిర్భవిస్తున్న వేళ మజ్లిస్ పార్టీతో పొత్తుకు సిద్దమైంది.. పాత నగరంలో ఈ పార్టీ దౌర్జన్యాలు అందరికీ తెలిసిందే.. తెలంగాణ ప్రజలు ఏ శక్తులకు వ్యతిరేకంగా పోరాడారో మళ్లీ వారి నీడలోకి పోవాలని కోరుకుంటున్నారా?.. నిరంకుశ నిజాం పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారా?.. ఓటు బ్యాంకు రాజకీయాలకు అంతులేదా? ఒక వర్గం ఓట్ల కోసం మెజారిటీ ప్రజల ప్రయోజనాలకు బలి పెడతారా? ఆత్మ విమర్శ చేసుకోంది.. 

Saturday, March 8, 2014

‘యత్ర నార్యంతు పూజ్యంతు రమంతే తత్ర దేవతా..’

ఎక్కడ స్త్రీలను పూజిస్తారో, అక్కడ దేవతలు సంతోషంగా ఉంటారని మన పెద్దలు ప్రాచీన కాలం నుండే చెబుతూ వచ్చారు.. వైదిక యుగంలో స్త్రీ, పురుషుల బేధాలు ఉండేవి కాదు.. చదువులోనూ, శక్తి సామర్ధ్యాల్లోనూ, ఇతర అన్ని అవకాశాల్లోనూ లింగబేదం లేదు.. నాటి సమాజం మహిళలను గౌరవనీయ స్థానంలో ఉంచింది.. దుర్గామాత, పార్వతి, పోచమ్మ ఎల్లమ్మ తదితర దేవతలను శక్తికి ప్రతీకగా, సరస్వతి, లక్ష్మిలను చదువు, సంపదకు ప్రతీకగా పూజించారు..
దురదృష్టవశాత్తు మన దేశంపై విదేశీయుల దండయాత్రలు మొదలయ్యాక పరిస్థితి మారింది.. ప్రజల ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది.. మరోవైపు మూఢనమ్మకాలు పెరిగాయి.. దీంతో స్త్రీలను ఇంటికే పరిమితం చేయడం మొదలు పెట్టారు.. అయినా రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీభాయి, చెన్నమ్మ తదిరత వీర వనితలు తమ ఉనికిని, శక్తి సామర్ధ్యాలను చాటుకున్నారు..
ఆధునిక యుగంలో అనేక మార్పులు వచ్చాయి.. విద్య, ఉపాది అవకాశాల్లో స్త్రీ పురుషులు పోటీ పడుతున్నారు.. మన రాజ్యాంగం అందరికీ సమాన అవకాశాలు ఇచ్చింది.. అన్ని రంగాల్లోనూ మహిళలు దూసుకుపోతున్నారు.. రాజకీయం, పరిపాలన, వ్యాపార రంగాల్లో ఎందరో మహిళలు ఉన్నత స్థానంలో ఉన్నారు.. కానీ ఇవన్నీ పైపై మెరుగులేనా అనే బాధ కలుగుతోంది..
పొద్దున లేచి పేపర్ తెరచినా, టీవీ ఛానళ్లు మార్చినా ప్రముఖంగా కనిపించే వార్తలు బాధను కలిగిస్తుంటాయి.. దేశంలో ఏదో ఒక ప్రాంతంలో మహిళలపై అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి.. మనం ఇంకా అనాగరికులమేనా అనే సందేహం కలుగుతుంది.. రాజకీయాల్లోనూ వివక్షతే కొనసాగుతోంది.. రిజర్వేషన్ల పుణ్యమా అని పదవులు మహిళలకు దక్కినా పెత్తనం పురుషులదే.. అత్యున్నత స్థానంలో ఉన్న మహిళలదీ ఇదే దుస్థితి.. గుడ్డిలో మెల్ల అన్నట్లు సోనియా, సుష్మ, మమత, జయ, మాయ తదితర మహిళా నేతల విజయగాధలు కూడా ఉన్నాయి.. అయితే మహిళలకు రాజకీయాల్లో 33 శాతం రిజర్వేషన్ల బిల్లుకు మాత్రం మోక్షం కలిగే పరిస్థితి కనిపించడంలేదు..

మార్పు అనేది మన కుటుంబాల నుండే రావాలి.. మన ఇళ్లలోని మహిళా మణులను గౌరవిస్తూ, వారు స్వశక్తిపై ఎదిగేందుకు తోడ్పడాలి.. అప్పుడే సమాజం మారుతుంది.. ఇవేవీ చేయకుండా ఎవరిని నిందించినా ఫలితం ఉండదు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు..

Friday, March 7, 2014

మహాత్ముని హత్యతో ఆరెస్సెస్ కు సంబంధం ఉందా?

మహాత్మా గాంధీని హత్య చేసింది ఆర్ఎస్ఎస్ వ్యక్తులా?.. కాంగ్రెస్ పార్టీ పదే పదే ఈ విషయంలో ఆరెస్సెస్ ను నిందిస్తూ ఉంటుంది.. తాజాగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం మరోసారి తన నోటి దురద తీర్చుకున్నాడు..
గాంధీ హత్యకు ఆర్ఎస్ఎస్ కారణమైతే నాడు నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఈ సంస్థపై చర్యలు తీసుకోలేకపోయింది?.. చట్టం ముందు ఎందుకు నిరూపించలేకపోయింది?.. ఆర్ఎస్ఎస్ కు గాంధీ హత్యతో ఎలాంటి సంబంధం లేదని నిరూపితం అయ్యాకే ఆ సంస్థపై నిషేధాన్ని ఎత్తేశారు కదా? మరి ఎందుకు పదే పదే బురద చల్లడం?
నిజానికి గాంధీజీని హత్య చేసిన నాధూరాం గాడ్సే హిందూ మహా సభ సభ్యుడు.. అయితే గతంలో ఆర్ఎస్ఎస్ తో సంబంధం ఉన్నవాడే.. కానీ అతడు తీసుకున్న నిర్ణయంతో ఈ రెండు సంస్థలకు సంబంధం లేనిదని ఆనాడే నిరూపితం అయ్యింది.. మహాత్మ గాంధీ దేశ విభజనకు కారణం అయ్యాడని, పాకిస్తాన్ కు ధన సాయం చేయాలంటూ భారత ప్రభుత్వంపై వత్తిడి తెచ్చాడని.. దేశ విభజన కారంగా కాందీశీకులుగా తరలి వచ్చిన హిందూ శరణార్థుల దుస్థితి చూసి ఆగ్రహించిన నాధూరాం గాడ్సే ఈ హత్య చేశాడని తేలింది..
ఆర్ఎస్ఎస్ సంస్థను జవహర్లాల్ నెహ్రూ మొదటి నుండి అనుమానంగానే చూశారు.. కానీ చైనా యుద్ద సమయంలో ఆర్ఎస్ఎస్ భారత సైన్యానికి అండగా నిలచి, చేసిన సాయాన్ని చూసి అపోహలు తొలగించుకున్నారు.. ఆ తర్వాత జరిగిన రిపబ్లిక్ డే కవాతులో పాల్గొన్నాలని ఆర్ఎస్ఎస్ ను ఆహ్వానించారు.. ఇందిరా గాంధీకి సైతం ఆర్ఎస్ఎస్ అంటే భయం ఉండేది.. ఎమర్జెన్సీలో నిషేధించింది కూడా.. అలాంటి ఇందిర సైతం రష్యా పర్యటనలో ఈ సంస్థను మెచ్చుకున్నారు..
ఆర్ఎస్ఎస్ రహస్య సంస్థ కాదు.. దాని కార్యకలాపాలు అన్నీ బహిరంగంగానే జరుగుతాయి.. ఆ సంస్థలో దేశ భక్తి, క్రమశిక్షణ, సంస్కారాన్ని బోధిస్తారు.. ఆత్మ రక్షణ కోసం శారీరక శిక్షణ ఇస్తారు.. ఇందులో దాపరికం ఏదీ లేదు.. ఆర్ఎస్ఎస్ శాఖలకు ఎవరైనా రావచ్చు.. చూడవచ్చు. నచ్చితే స్వయం సేవక్ గా కొనసాగవచ్చు.. దేశ వ్యాప్తంగా లక్షలాది మంది స్వయం సేవకులు ఉన్నారు.. ఆర్ఎస్ఎస్ నిజంగానే తీవ్రవాద సంస్థ అయితే పరిస్థితి ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించండి..

కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కేవలం మైనారిటీల ఓట్ల కోసమే ఆర్ఎస్ఎస్ ను బూచిగా చూపిస్తోంది.. ఇప్పుడు తాజాగా రాహుల్ గాంధీ చేసిన పని కూడా.. కానీ నిజం నిప్పులాంటిది..  రాహుల్ బాధ్యతారాహిత్య ప్రకటనపై ఈసీకి ఫిర్యాదు చేయడంతో పాటు చట్టపరమైన చర్యల కోసం ఆర్ఎస్ఎస్ ఉపక్రమిచింది..


 
చూడబోతే ఈసారి అన్ని వేళ్లకు ఇంకు మార్కులేసేట్లున్నారు.. లోక్ సభ, శాసన సభ ఎన్నికల కంటే ముందు పురపాలక ఎన్నికలు జరుగుతున్నాయి.. తీరా ఇప్పడు పంచాయితీ ఎన్నికలు కూడా జరుగుతాయట..
పట్టణాలు నగరాల్లో ఉన్న వారికి రెండు ఇంకు మరకలు తప్పవనుకున్నాను.. ఇప్పుడు పల్లెవాసులకు రెండు మరకలు తప్పేట్టు లేదు.. మరి పట్టణాలు, పల్లెల్లో ఓట్లు ఉంటే.. ఇంకేం మూడు ఇంకు మరకలు..
మొత్తానికి మన వేళ్లన్నీ ఖరాబ్.. ఖరాబ్..
తిరుమలలో శ్రీవారి దర్శణం కోసం సిఫార్సు లేఖలను అంగీకరించొద్దని గవర్నర్ తీసుకున్న నిర్ణయం సముచితమే.. అయితే దీన్ని ఎన్నికల కోడ్ వరకే పరిమితం చేయకుండా శాశ్వతంగా కొనసాగిస్తే మంచిది.. మరోవైపు టీటీడీ దేశ వ్యాప్తంగా చేపట్టిన స్వామివారి కళ్యాణ ఉత్సవాలకు ఈసీ బ్రేక్ వేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.. ధర్మ కార్యం ఎన్నికల కోడ్ పరిధిలోకి ఎలా వస్తుంది.. కళ్యాణోత్సవాల్లో పలానా పార్టీకి ఓటేయాలని ప్రచారం చేయరు కదా? ఈసీ తన నిర్ణయాన్ని సవరించుకుంటే బాగుంటుంది..

Thursday, March 6, 2014

ఎవరు హీరో?.. ఎవరు విలన్?

తెలంగాణ సోనియమ్మ ఇచ్చింది.. సోనియా గాంధీ దేవత.. తెలంగాణ ప్రజలు ఆమెకు రుణపడి ఉన్నారు.. ఇదీ తెలంగాణ కాంగ్రెస్ నాయకుల ప్రచారం. కొందరు అయితే ఆమెకు గుడి కడుతున్నారు.. తెలంగాణ తల్లి అంటూ కొలుస్తున్నారు.. తెలంగాణకు సోనియా ప్రదేశ్ అని పెట్టాలట.. ఒకాయనైతే నిండు పార్లమెంటులో ఆమె కాళ్లకు దండం పెట్టేశాడు..
తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియమ్మదే అయితే, ఆ విషయాన్ని ఆమె పార్లమెంట్ లో ఎందుకు ధైర్యంగా చెప్పుకోలేదు?.. ఎందుకుమౌన వ్రతం పాటించారు?.. ఎందుకు అంత భయపడిపోయారు.. మీ భావి ప్రధాని రాహుల్ గాంధీ పార్లమెంట్ రాకుండా ఎక్కడ దాక్కున్నాడు?

అసలు కాంగ్రెస్ నాయకులు ఎవరి చెవిలో పూలు పెడదామనుకుంటున్నారు.. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు వెళ్లగానే చేసిన పాపం పోయినట్లేనా? తెలంగాణ ఇవ్వాలనే ఉంటే ఇంత ఆలస్యం ఎందుకు చేసినట్లు? మలిదశ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుండి జరిగిన వేయికి పైగా బలి దానాలు, ఆత్మాహుతులకు బాధ్యత వహించాల్సిన అవసరం లేదా? మీ జాప్యం కారణంగానే కదా తెలంగాణ ఇక రాదనే అందోళనతో వారు ఈ పనికి పాల్పడింది.. క్రెడిట్ తీసుకుంటున్నారు సరే.. మరి సమస్యకు కారణమైన కాంగ్రెస్ పార్టీ ఇందుకు మూల్యం కూడా చెల్లించాలి కదా?
1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు రాసుకున్న పెద్ద మనుషుల ఒప్పందం అమలు కాకపోవడానకి కారణం ఎవరు?.. 1969 తెలంగాణ ఉద్యమానికి కారణం ఎవరు?.. ఈ ఉద్యమాన్ని కఠినంగా అణచివేసి నిరసన కారులను పొట్టన పెట్టుకుంది ఎవరు?.. మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రజాసమితిని కలుపుకునే సమయంలో చేసుకున్న ఒప్పదాలను అమలు చేశారా? ముల్కీ నిబంధనలు, రాష్ట్రపతి ఉత్తర్వులు, ఆరు సూత్రాల పథకం తుంగలో తొక్కింది ఎవరు?.. 610 జీవో అమలు కాకుండా  తొక్కిపెట్టింది ఎవరు?.. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలును సరి దిద్దకపోగా ఈ సెంటిమెంటును స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకున్నది కాంగ్రెస్ నేతలే కదా?.. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు మధ్యలో వచ్చిన తెలుగు దేశం ప్రభుత్వానికీ ఈ తప్పుల్లో భాగం ఉంది..
రెండో దశ తెలంగాణ ఉద్యమం వచ్చాక తెలంగాణ ఇస్తామని చెప్పి 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వాగ్దానం చేసి పొత్తు పెట్టుకొని గెలిచాక,  ఎస్సార్సీల పేరిట మాట మార్చింది ఎవరు? 2009 డిసెంబర్ 9 ప్రకటన తర్వాత మళ్లీ నివేదిక అంటూ శ్రీకృష్ణ కమిటీ పేరిట కాలాయాన చేసింది ఎవరు? మీరు చేసిన జాప్యం కారణంగానే కదా బలిదానాలు, ఆత్మాహుతుల పరంపర కొనసాగింది.. కుంభకోణాలు, అవినీతి, అసమర్థ పాలన కారణంగా కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్న సమయంలో కనీసం ఈ ప్రాంతంలో అయినా ఉనికిని కాపాడుకోవచ్చని కాంగ్రెస్ భావించింది.. పైగా తాము అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తామని బీజేపీ ప్రకటించడంతో ఆ క్రెడిట్ తమకే దక్కాలనే తాపత్రం కాంగ్రెస్లో మొదలైంది.. ఇక తప్పని పరిస్థితి రావడం వల్లే తెలంగాణ ఏర్పాటు వైపు మొగ్గు చూపారు.. విభజన తప్పదని ఏనాడో తెలిసినా, ఇంత సమయం తీసుకున్నా ఈ పనైనా సక్రమంగా చేసిందా అంటే అదీ లేదు.. వారాలు, నెలల తరబడి ఇరు ప్రాంతాల ప్రజల మధ్య ఉద్రిక్తతలు సృష్టించి, చివరకు రాజధాని లేని సీమాంధ్రతో సరికొత్త రగడను సృష్టించింది కాంగ్రెస్ పార్టీ..
తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియమ్మదే అయితే, ఆ విషయాన్ని ఆమె పార్లమెంట్ లో ఎందుకు ధైర్యంగా చెప్పుకోలేదు?.. ఎందుకుమౌన వ్రతం పాటించారు?.. ఎందుకు అంత భయపడిపోయారు.. మీ భావి ప్రధాని రాహుల్ గాంధీ పార్లమెంట్ రాకుండా ఎక్కడ దాక్కున్నాడు?

ఇప్పడు కాంగ్రెస్ పార్టీ ఇటు తెలంగాణకు, అటు సీమాంధ్రకు విలన్ అయిపోయింది.. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ కలుస్తుందన్న ఆత్యాశ అడియాస అయిపోయింది.. ఎవరు తీసిన గోతిలో వారే పడటం అంటే ఇదే.. ఇప్పుడు చెప్పండి కాంగ్రెస్ పార్టీని క్షమించేద్దామా? శిక్షిద్దామా?..


Wednesday, March 5, 2014

కాల పరీక్షకు సిద్దం కండి..

2014 సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది.. దేశ వ్యాప్తంగా 81.6 కోట్ల మంది ఓటర్లు తమ భవిష్యత్తును నిర్ణయించుకోబోతున్నారు.. 9 విడతలుగా సాగే ఈ పోలింగ్ ఏప్రిల్ 7న ప్రారంభమై మే 12న పూర్తవుతాయి.. ఫలితాలను మే 16న ప్రకటిస్తారు.. లోక్ సభతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిషా రాష్ట్రాల అసెంబ్లీలకూ ఎన్నికలు జరగబోతున్నాయి..
జూన్ 2 తెలంగాణ ఏర్పడుతోంది.. ఈలోగానే సమైక్యాంధ్రప్రదేశ్ లోనే ఎన్నికలు పూర్తవుతాయి.. తెలంగాణ, అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల భావి ప్రభుత్వాలను ఈ ఎన్నికలు నిర్ణయించబోతున్నాయి.. గతంలో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలు తెలుగువారికి చాలా కీలకమైనవి.. రెండు రాష్ట్రాలుగా విడిపోతున్న ప్రజలు ఎలా తీర్పు ఇస్తారనే ఆసక్తి తెలుగువారికే కాదు దేశ వాసులందరికీ ఉంటుంది..
రాష్ట్ర విభజన ఒకరికి సంబరం అయితే, మరొకరికి విచారం కలిగిస్తోంది.. విభజనకు ఎన్నికల తీర్పుకు సంబంధం లేదు.. అయినా విభజన ప్రభావం ఎన్నికలపై కచ్చితంగా ఉంటుంది..  విభజన సరైందా, కాదా అనే చర్చ ఇక అసందర్భమే.. ఫలితాలు కూడా ఈ ప్రక్రియను ఆపే అవకాశం లేదు.. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు అన్ని పార్టీలకూ రాష్ట్ర విభజన ప్రక్రియలో పాత్ర ఉంది.. అయితే లాభాన్ని స్వీకరించేందుకు ముందుండే వారు నష్టం అంటే భయపడటం సహజం..
తెలంగాణలో తెలంగాణ మేమే తెచ్చాం అని గొప్పలకు పోతున్న పార్టీలు, సీమాంధ్రకు పోయే సరికి రాష్ట్ర విభజనకు మీరంటే మీరే కారణం అని దుమ్మెత్తి పోసుకుంటున్నాయి.. ఇలాంటి గుంట నక్క పార్టీలకు కచ్చితంగా గుణపాఠం చెప్పక తప్పదు.. ఇరు ప్రాంతాల ప్రజలు విజ్ఞతతో నిర్ణయం తీసుకునే సందర్భం ఇది..  మనం తీసుకునే నిర్ణయం ఇరు రాష్ట్రాల భవిష్యత్ ప్రయోజనాకు ఆశాజనంగా ఉండాలి.. ఇంకా ఉద్రేకాలకు ఉద్వేగాలకు పోయి తీర్పును ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉండదు.. ఏది సబబో ఆలోచించి నిర్ణయం తీసుకోండి.. మన ఓటు భవితను మార్చేలా ఉండాలి..

జైహింద్..

ఇంకు ఈయన ఒక్కడి మొహాన కొడితే చాలా?.. ఈయన వెనుకు ఉన్న నేతాజీలపై కూడా కొట్టండి.. వీలైతే పేడ చల్లండి..


ఎవరీ చిన్నారులు?




Tuesday, March 4, 2014

తోక ముడిచిన బంకర్లు..

పెట్రోల్ బంకుల బంద్ తో నిన్నంతా నరకయాతన అనుభవించాను.. రోడ్డు మీద పార్క్ చేసిన నా వాహనం నుండి పొద్దు పొద్దునే పెట్రోలు కొట్టేశారు.. బండి స్టార్ట్ అయ్యి కొద్ది సేపటికే తత్వం బోధపడింది.. పెట్రోలు బంకుల యజమానులు సమ్మెకు దిగి బంకులు మూసేశారని.. చేసిది లేక ఓ స్నేహితుడి ఇంట్లో బండి పడేసి బస్సులో ఆఫీసు వెళ్లేసరికి గంట ఆలస్యమైపోయింది..
ప్రభుత్వాన్ని, బంకుల యాజమానులను కసితీరా తిట్టుకున్నాను.. రాష్ట్రపతి పాలనలో వీరి ఆగడాలను పట్టించుకునే నాధుడే లేడా అని ఫేస్ బుక్ లో పోస్టు చేసేందుకు టైప్ చేసి పెట్టుకున్నా.. అంతలోగనే ఉగ్ర నరసింహుడు నా మనోభావాలను పసిగట్టి గర్జించాడు.. దెబ్బకు దిగొచ్చి సమ్మె విరమించారు లుఠేరీలు..

నిజాయితీగా పని చేసే వ్యాపారులు భయపడాల్సిన అవసరం ఏమిటి? పెట్రోలు బంకుల యజమానులు వినియోగదారులను నిలువునా దోచేస్తున్నది వాస్తవం కాదా? కంటికి కనిపించని ట్యాంపరింగ్ మిషన్ల కారణంగా తాము మోసపోతున్నామనే వాస్తవం వినియోగదారులకు తెలియడం లేదు.. రోజులు లక్షలాది రూపాయల అక్రమ సంపాదన కళ్ల చూస్తున్న ఈ లుఠేరీలు తూనికలు, కొలతల శాఖ అధికారుల దాడులతో బెండేలెత్తిపోయారు.. దాడులు ఆపాలంటూ బంకులు మూసేసి ప్రభుత్వాన్నే బ్లాక్ మెయిల్ చేయబోయారు.. గవర్నర్ నరసింహన్ గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో బెంబేలెత్తిపోయిన వ్యాపారులు తోకముడి సమ్మె విరమించారు.. అప్పుడు అనిపించింది రాష్ట్రపతి పాలన ఇంత కమ్మగా ఉంటుందా అని.. అదే పౌర ప్రభుత్వం ఉన్నట్లుయితే సమ్మె వారం రోజలు సాగి, వాటాలు కుదిరాకే విరమించేవారేమో?..