Saturday, March 29, 2014

కాంగ్రెస్ పార్టీలో మహిళలను గౌరవించరా?

మహిళలను గౌరవించడం మన సంస్కృతి.. కానీ కాంగ్రెస్ పార్టీలో మహిళలను అగౌరవించేవారిపై ఎలాంటి చర్యలు తీసుకోరు.. పైగా మహిళలను అవమానించిన ఎమ్మెల్యేను తప్పు పట్టిన నాయకున్ని పార్టీ నుండి గెంటేసి తన ప్రత్యేకతను చాటుకుంది.. ధట్ ఈజ్ కాంగ్రెస్..
ఉత్తరప్రదేశ్ మీరట్ నుండి కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థిగా బరిలో ఉన్న సినీ నటి నగ్మా ప్రచారానికి వెళ్లినప్పుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే గజ్ రాజ్ సింగ్ బహిరంగంగా ముద్దు పెట్టుకున్నాడు.. అవాక్కయిన నగ్మా అక్కడి నుండి వెళ్లిపోయింది.. ఈ వ్యవహారాన్ని ప్రమోద్ కాత్యాయన్ అనే నేత ఖండించారు.. ఇందుకు కాత్యాయన్ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.. కాత్యాయన్ పార్టీ నుండి బహిష్కృతుడయ్యాడు.. కానీ గజ్ రాజ్ సింగ్ మాత్రం సేఫ్..
ఈ సంఘటన మరచిపోక ముందే ప్రచారానికి వెళ్లిన నగ్మాపై మరో కార్యకర్త చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు.. ఈసారి మాత్రం నగ్మా వాడి చెంప చెల్లుమనిపించింది.. ఇలా చేస్తే మళ్లీ తాను మీరట్ రాను అని బహిరంగంగా చెప్పేసిందట నగ్మా..
ఒక మహిళ అధ్యక్షురాలిగా ఉన్న జాతీయ పార్టీలో మహిళలకు ఇచ్చే గౌరవం ఎంత గొప్పగా ఉందో చూశారు కాదా.. అందునా ఒక అగ్ర నటికి, పార్టీ అభ్యర్థికి అవమానం జరిగినా దిక్కులేదా?
ధట్స్ కాంగ్రెస్..

No comments:

Post a Comment