Monday, March 3, 2014

ధర్మో రక్షతి రక్షిత: ..

భగవంతుని ముందు అందరూ సమానమే అంటాం.. కానీ మన దేవాలయాలు సాధారణ భక్తులను చిన్న చూపు చూస్తూ, వీఐపీలు పెద్ద పీట వేస్తాయి.. ప్రత్యేక దర్శనాలు చేయింది, శాలువాలు, ప్రసాదాలు, ఆశీర్వాదాలు ఇప్పించి గౌరవిస్తాయి.. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ వ్యవహారం మరీ పరాకాష్టకు చేరింది.. ఆలయ మర్యాదలు, ఆచారాలు తంగలో తొక్కేస్తున్నారు..
అన్యమతస్తులు హిందూ మతంపై విశ్వాసం ఉన్నట్లు డిక్లరేషన్ ఇచ్చి తిరుమల ఆలయ ప్రవేశం చేయడం ఆచారంగా వస్తోంది.. ఎంతటి అగ్ర రాజకీయ నాయకుడైనా అందుకు వినహాయింపు లేదు.. కానీ బహిరంగంగా క్రైస్తవ మతాన్ని అవలంభిస్తూ, ఆచారాలను పాటించే ఓ నాయకుడు తానేదో ఆకాశం నుండి ఊడిపడ్డ గ్రహాంతర వాసిని అన్నట్లు ఇవేవీ పట్టించేకోడు.. కనీసం చెప్పులు కూడా తీసేయకుండా తిరుమల ఆలయ ప్రదేశం చేస్తాడు.. భగవన్నామ స్మరణ ఉండాల్సిన చోట తనకు జై కొట్టించకుంటాడు.. తన మందీ మార్బలం నిబంధనలకు విరుద్దంగా, ఆచారాలు, నిష్టను పాటించకుండా ఆలయ ప్రవేశం చేస్తున్నా వారించే ప్రయత్నం చేయడు..
అన్యమతస్తులు హిందూ ఆలయాలకు రావడం, దేవున్ని మొక్కడాన్ని నేను తప్పు పట్టడం లేదు.. కానీ అక్కడి విశ్వాసాలు, ఆచార, వ్యవహారాలను, మనోభావాలను గౌరవించాలని మాత్రమే కోరుతున్నాను..

ధర్మో రక్షతి రక్షిత: అన్నారు మన పెద్దలు.. నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు.. అదే సమయంలో ఇతరుల ధర్మాన్ని కూడా గౌరవించు.. వీటిని ఉల్లంఘిస్తే జరిగేది ఏమిటో నేను ప్రత్యేకంగా చెప్పను.. గతంలో జరిగిన దుర్ఘటనలే పునరావృత్తం అవుతాయి..

No comments:

Post a Comment