Tuesday, March 4, 2014

తోక ముడిచిన బంకర్లు..

పెట్రోల్ బంకుల బంద్ తో నిన్నంతా నరకయాతన అనుభవించాను.. రోడ్డు మీద పార్క్ చేసిన నా వాహనం నుండి పొద్దు పొద్దునే పెట్రోలు కొట్టేశారు.. బండి స్టార్ట్ అయ్యి కొద్ది సేపటికే తత్వం బోధపడింది.. పెట్రోలు బంకుల యజమానులు సమ్మెకు దిగి బంకులు మూసేశారని.. చేసిది లేక ఓ స్నేహితుడి ఇంట్లో బండి పడేసి బస్సులో ఆఫీసు వెళ్లేసరికి గంట ఆలస్యమైపోయింది..
ప్రభుత్వాన్ని, బంకుల యాజమానులను కసితీరా తిట్టుకున్నాను.. రాష్ట్రపతి పాలనలో వీరి ఆగడాలను పట్టించుకునే నాధుడే లేడా అని ఫేస్ బుక్ లో పోస్టు చేసేందుకు టైప్ చేసి పెట్టుకున్నా.. అంతలోగనే ఉగ్ర నరసింహుడు నా మనోభావాలను పసిగట్టి గర్జించాడు.. దెబ్బకు దిగొచ్చి సమ్మె విరమించారు లుఠేరీలు..

నిజాయితీగా పని చేసే వ్యాపారులు భయపడాల్సిన అవసరం ఏమిటి? పెట్రోలు బంకుల యజమానులు వినియోగదారులను నిలువునా దోచేస్తున్నది వాస్తవం కాదా? కంటికి కనిపించని ట్యాంపరింగ్ మిషన్ల కారణంగా తాము మోసపోతున్నామనే వాస్తవం వినియోగదారులకు తెలియడం లేదు.. రోజులు లక్షలాది రూపాయల అక్రమ సంపాదన కళ్ల చూస్తున్న ఈ లుఠేరీలు తూనికలు, కొలతల శాఖ అధికారుల దాడులతో బెండేలెత్తిపోయారు.. దాడులు ఆపాలంటూ బంకులు మూసేసి ప్రభుత్వాన్నే బ్లాక్ మెయిల్ చేయబోయారు.. గవర్నర్ నరసింహన్ గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో బెంబేలెత్తిపోయిన వ్యాపారులు తోకముడి సమ్మె విరమించారు.. అప్పుడు అనిపించింది రాష్ట్రపతి పాలన ఇంత కమ్మగా ఉంటుందా అని.. అదే పౌర ప్రభుత్వం ఉన్నట్లుయితే సమ్మె వారం రోజలు సాగి, వాటాలు కుదిరాకే విరమించేవారేమో?..

No comments:

Post a Comment