Monday, March 10, 2014

ఎందుకీ ద్వంద్వ ప్రామాణాలు?

తెలంగాణలో బీసీలకే ముఖ్యమంత్రి పదవి - నిన్న చంద్రబాబు నాయుడు
తెలంగాణలో దళితులకే సీఎం పదవి - ఇవాళ జైరామ్ రమేష్
తెలంగాణ వస్తే దళితున్ని ముఖ్యమంత్రి చేస్తాం - చానాళ్ల క్రితమే చంద్ర శేఖర రావు
ఓకే బలహీన వర్గాల వారైనా, దళితులు అయినా ముఖ్యమంత్రి పదవి చేపట్టడంలో ఎవరికీ అభ్యంతరం లేదు.. కానీ చంద్రబాబు, జైరామ్ రమేష్ గార్లకు ఓ ప్రశ్న తెలంగాణలో మాత్రమే ఈ రిజర్వేషన్ ఎందుకు? సీమాంధ్రలో బీసీలు, దళితులకు అత్యున్నత స్థానం అధిరోహించే అర్హత లేదా? అక్కడి పదవులు అగ్ర వర్ణాలకేనా?
తెలంగాణ దళితులు, బీసీలు చేసుకున్న పుణ్యం ఏమిటి?.. సీమాంధ్రలో వారు చేసిన పాపం ఏమిటి?
ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్ష పదవి, ముఖ్యమంత్రి పదవి బీసీలకు ఇవ్వ వచ్చుకదా?
ఇక కేసీఆర్ గారి విషయానికి వద్దాం.. తెలంగాణ వస్తే దళితున్ని సీఎం చేస్తామని గతంలోనే వాగ్దానం చేశారు.. తెలంగాణ ఖాయం అయిన తర్వాత ఈ విషయాన్ని ఎక్కడా ప్రస్థావించడం లేదు.. గతంలో చేసిన ప్రకటనకు ఇంకా కట్టుబడే ఉన్నారా?

No comments:

Post a Comment