Wednesday, March 26, 2014

ఈ పొత్తు లాభదాయకమేనా?

బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేస్తే ఎవరికి లాభం?
కచ్చితంగా టీడీపీకే... కాకపోతే బీజేపీకి తాత్కాలికంగా కొన్ని సీట్లు పెరుగుతాయి..
రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే?
నష్టం టీడీపీకే అధికం.. బీజేపీకి మాత్రం ఓట్ల శాతం ఘననీయంగా పెరిగి దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి..
బీజేపీ తన బలాన్ని అధికంగా అంచనా వేసుకుంటోంది.. ఏవో కొన్ని సీట్లు ఇస్తాం సర్దుకు పోవాలి అన్నిది టీడీపీ వైఖరి.. వారి వైఖరి ఇదే అయితే ఒంటరిగానే పోటీ చేసి గెలవొచ్చుకాదా? ఆ సత్తా ఉందా?
పొత్తులు ఇచ్చి పుచ్చుకునే పద్దతిలో ఉండాలి.. 1999, 2004 ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ప్రయోజనాలు ఆశించి బీజేపీ త్యాగానికి సిద్దపడి తక్కువ సీట్లు ఇచ్చినా సర్దుకుపోయింది.. కానీ ఇప్పుడు ఆ సీన్ లేదు.. తెలంగాణ, సీమాంధ్రలో తగిన సీట్లు రాకపోయినా, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా బీజేపీకి ఉంది.. పొత్తు లేకున్నా రెండు ప్రాంతాల్లో బీజేపీకి అంతో ఇంతో ఫలితాలు వస్తాయి.. వాస్తవానికి ఈ ఎన్నికల్లో టీడీపీ కన్నా బీజేపీకే సానుకూలత అధికంగా కనిపిస్తోంది..
ముద్దొచ్చినప్పుడే ఎత్తుకుంటానంటే ఇప్పడు కుదరదు.. టీడీపీది మొదటి నుండి ద్వంద్వ వైఖరే.. వారి స్నేహం నిండా స్వార్ధమే.. బీజేపీ బలంగా ఉన్నప్పుడు పొత్తుల కోసం వెంపర్లాడతారు.. లేదంటే మతతత్వం పార్టీ అంటూ దూరం పెడతారు? సెక్యులరిజం పేరుతో యునైటెడ్ ప్రంట్ ప్రభుత్వంలో చక్రం తిప్పిన చంద్రబాబు, బీజేపీ అధికారంలోకి రాగానే ఆ ఫ్రంట్ తెప్ప తగిలేశారు.. 2004లో అధికారం పోగానే మళ్లీ మతత్వం గుర్తుకు వచ్చి బీజేపీకి దూరం పెట్టి, వామపక్షాలను అక్కున చేర్చుకున్నారు..
ఇప్పుడు బీజేపీ మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తోంది అనే నమ్మకం కలగడంతో గతాన్ని మరచి మళ్లీ స్నేహ హస్తం చాస్తున్నారు..
మిత్ర ధర్మం తెలియని టీడీపీతో పొత్తు అవసరమా? బీజేపీ నేతలు ఆలోచించాలి.. సీట్లు ఎన్ని వచ్చినా సంస్థాగతంగా బలపడేందుకు ఇదే సరైన సమయం..1998 పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రం నుండి బీజేపీ వంటరిగానే పోటీ చేసి 4 పార్లమెంట్ సీట్లు గెలుచుకొని, 40 అసెంబ్లీ సీట్లలో మొదటి స్థానాన్ని, 50 సీట్లలో ద్వితీయ స్థానాన్ని పొందింది.. ఆ తర్వాత బాబు ధృతరాష్ట్ర కౌగిలిలో పడి చిక్కి శల్యమైంది..

గౌరవ ప్రదంగా సమాన స్థాయిలో సీట్లు ఇస్తేనే టీడీపీతో పొత్తు పెట్టుకోవాలి.. లేదా వంటరిగానే పోటీ చేసి సత్తా చాటుకోవాలి.. ఇది సగటు బీజేపీ అభిమానులు, కార్యకర్తల మనసులోని మాట..

No comments:

Post a Comment