Monday, March 17, 2014

సిగ్గు సిగ్గు..

ఎన్నికల వేళ వచ్చింది రంగుల పండుగ.. ఏ రంగు పడినా కష్టమే..
ఎరుపు కమ్యూనిస్టులదట.. పసుపు తెలుగు దేశానిదట.. కాషాయం బీజేపీదట.. ఆకుపచ్చ ఎంఐఎందట.. నీలం బహుజనులద.. మిగతా వర్ణాలు కాంగ్రెస్, వైసీపీలవట.. అందరూ రంగులు పంచేసుకున్నారు..
ఇంతకీ నీదే రంగంటే ఏమి చెప్పను?.. ఇంధ్ర ధనస్సులోని అన్ని రంగులూ నాకు ఇష్టమే..
రాజకీయమంతా రంగుల్లానే గజిబిజిగా కనిపింది.. ఏ నాయకుడు ఎప్పుడు ఏ రంగు పులుముకుంటున్నాడో తెలియడం లేదు.. చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చేస్తున్నాడు.. సిద్దాంతాలకు ఏనాడో తిలోదకాలు ఇచ్చేశారు.. విలువలను వలవల్లా నిస్సిగ్గుగా విప్పేశారు.. ప్రజల ఆకాంక్షలు ఎవరికి పట్టాయి?.. గెలుపు, అధికారమే పరమావధిగా రంగులు మారుస్తున్న ఈ నాయకులను చూసి ఊసరవెళ్లి సైతం సిగ్గు పడుతోంది.. నాకన్నా వేరే వేగంగా రంగులు మారుస్తున్నారని..

No comments:

Post a Comment