Monday, March 10, 2014

ఇందు కోసమేనా మనం పోరాడింది..

రజాకార్ల దురాగతాలకు, నిజాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన హైదరాబాద్ సంస్థాన ప్రజలు 1948 సెప్టెంబర్ 17న జరిగిన పోలీస్ యాక్షన్ తో స్వతంత్ర భారత దేశంలో కలిసిపోయారు.. 1956 నవంబర్ 1న హైదరాబాద్ సంస్థానం విచ్చిన్నమై తెలంగాణ, ఆంధ్ర కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.. 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరిస్తోంది.. ఈ తేదీలకు చరిత్రలో ప్రాధాన్యత ఉంది..
బ్రిటిష్ వారు ఇండియా వదిలి వెళ్లాక అప్పటి వరకూ వారి సామంత రాజ్యంగా ఉన్న హైదరాబాద్, ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలో స్వతంత్ర ఇస్లాం దేశంగా కొనసాగాలంటూ రజాకార్లు పోరాడారు.. మజ్లిస్ ఇత్తేహాదల్ ముస్లిమిన్ (ఎంఐఎం)కు అనుబంధ సంస్థ ఇది.. వీరికి నాయకుడు కాశీం రజ్వి.. రజాకార్లు నిజాం పాలకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టు, ఆర్యసమాజ్, స్టేట్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను అణచివేసే ప్రయత్నం చేశారు..  రక్త పిపాసులలైన రజాకార్లు పోరాట యోధులతో పాటు సామాన్య ప్రజలను కూడా చిత్ర హింసలు పెట్టారు.. పెద్ద ఎత్తున మారణ కాండ సాగించారు.. గ్రామాలపై పడి దోచుకున్నారు.. మహిళల మాన ప్రాణాలను హరించారు.. బైరోన్ పల్లి మారణ కాండ, బీబీనగర్లో మహిళలను నగ్నంగా బతుకమ్మ ఆడించిన వైనం ఈనాటికీ తెలంగాణ పల్లెలు మరచిపోలేదు.. ఈ చరిత్రకు సజీవ సాక్షులు కొందరు బతికే ఉన్నారు.. (చరిత్ర పుటలు తిరగేస్తే ఈ నిజాలు కనిపిస్తాయి)
భారత దేశంలో హైదరాబాద్ విలీనం తర్వాత రజాకార్ల ఆగడాలపై విచారణ జరిగింది. మజ్లిస్ (ఎంఐఎం) పార్టీని నిషేధించారు.. కాశీం రజ్వీని అరెస్టు చేశారు.. 1957లో జైలు నుండి విడుదల అయ్యాక పాకిస్తాన్ పారిపోయాడు.. పోతూ పోతూ అబ్దుల్ వాహెద్ ఓవైసీ నాయకత్వంలో మజ్లిస్ పార్టీని పునరుద్దరించాడు.. పాత నగరంలో, తెలంగాణలో అప్పటి వరకూ బలంగా ఉన్న కమ్యూనిస్టులకు గండి కొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంను పునరుద్దరించేందుకు అనుమతి ఇచ్చింది..

66 ఏళ్ల తర్వాత మరో దురదృష్టకర సంఘటన జరుగుతోంది.. తెలంగాణ నూతన రాష్ట్రంగా ఆవిర్భవిస్తున్న వేళ మజ్లిస్ పార్టీతో పొత్తుకు సిద్దమైంది.. పాత నగరంలో ఈ పార్టీ దౌర్జన్యాలు అందరికీ తెలిసిందే.. తెలంగాణ ప్రజలు ఏ శక్తులకు వ్యతిరేకంగా పోరాడారో మళ్లీ వారి నీడలోకి పోవాలని కోరుకుంటున్నారా?.. నిరంకుశ నిజాం పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారా?.. ఓటు బ్యాంకు రాజకీయాలకు అంతులేదా? ఒక వర్గం ఓట్ల కోసం మెజారిటీ ప్రజల ప్రయోజనాలకు బలి పెడతారా? ఆత్మ విమర్శ చేసుకోంది.. 

No comments:

Post a Comment