Saturday, March 15, 2014

ఈ క్లారిటీ చాలదు గబ్బర్..

స్క్రిప్ట్, హైటెక్ హంగామాలు అదిరిపోయాయి.. సినిమా ఆడియో ఫంక్షన్ లెవళ్లో పార్టీని ప్రకటించేశారు.. కానీ క్లారిటీ లేదు..
ఉన్న ఒకే క్లారిటీ కాంగ్రెస్ కో హఠావో.. దేశ్ కో బచావో..’ తెలంగాణ ఏర్పాటును పరోక్షంగా వ్యతిరేకత ప్రకటించారు.. అంటే ఒక ప్రాంత ప్రజలకే పరిమితం కావాలని భావించారా? కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులపై విరుచుకుపడటానికేనా రెండు గంటల సుదీర్ఘ ప్రసంగం?.. పవన్ కల్యాణ్ ప్రసంగంలో తన వ్యక్తిగత జీవితం, కుటుంబం వచ్చిన విమర్షలకు.. ఆరోపణలు చేసిన వారికి హెచ్చరికలకే ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టంగా కనిపించింది..
పవన్ కల్యాణ్ పార్టీ పెడతారంటే అభిమానులతో పాటు రాజకీయ వర్గాలు, మీడియా, రాష్ట్ర ప్రజలంతా ఉత్సుకతతో ఎదురు చూశారు.. కానీ ఎక్కడా పార్టీ ఎందుకు పెడుతున్నారు? ఎన్నికల ముందే ఎందుకు వచ్చారు? ఎన్ని స్థానాలకు పోటీ చేస్తారు?, ఎవరితో కలిసి ముందుకు పోతారు?.. అనే విషయాలపై స్పష్టత లేదు.. పార్టీ విధానాలు ఏమిటో సరిగ్గా వివరించలేదు..

సినిమాకు, నిజ జీవితానికి చాలా తేడా ఉంటుంది.. తెరపై గబ్బర్ సింగ్ మాదిరిగా ఇరగదీసి, రప్ఫాడించడం రాజకీయాల్లో కుదరదు.. సినీ నటుడిగా పవన్ కల్యాణ్ ను అభిమానించే వారంతా, రాజకీయ నటుడిగా ఆహ్వానించాలంటే ఈ క్లారిటీ చాలదు.. 

No comments:

Post a Comment