Saturday, September 30, 2017

దసరా - విజయదశమి ఎందుకు?

మనమంతా దసరా పండుగ జరపుకునేందుకు సిద్దమయ్యాం.. దీన్నే విజయదశమి అని కూడా అంటున్నాం.. అసలు ఏమిటి ఈ దసరా, విజయదశమిల వెనుక ఉన్న కథ..
శ్రీరాముడు ఈ రోజునే రావణాసురున్ని సంహరించిన రోజు ఇది.. రావణుడు అంటే పది తలల రాక్షసుడు మనకు గుర్తు వస్తాడు..
ఈ పది తలలు దేనికి సంకేతమో మీకు తెలుసా?.. మనలోని దుష్ట గుణాలు అంటే కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్య, స్వార్ధ, అన్యాయ, అమానత్వ, అహంకారాలు.. ఈ దశ వికారాలను అంతమొందించడం ద్వారా దశహరా జరుపుకుంటాం.. ఇలా దశహరాయే దసరా అయ్యింది..
రావణ దహనం అంటే కేవలం ఒక రాక్షసుని బొమ్మను కాల్చేయడం కాదు.. దశ దుర్గుణాలను దగ్దం చేయడానికి ప్రతీకగా మనం భావించాలి..
దసరా రోజున రావణ సంహారం మాత్రమే కాదు.. మరో మహత్కార్యం కూడా జరిగింది.. జగజ్జనని దుర్గామాత మహిషాసురున్ని అంతమొందించింది కూడా ఇదే రోజున.. దుష్ట శక్తులపై దైవం సాధించిన విజయానికి సంకేతంగా మనం దసరా, విజయదశమిలను జరుపుకుంటాం..

అందరికీ పర్వదిన శుభాకాంక్షలు.. 

Monday, September 11, 2017

సమాజంలో చిచ్చు పెడుతున్న మేతావి

ఆయన ప్రపంచ ప్రఖ్యాత రచయిత(ట).. దళిత, బహుజన వర్గాల మేధావి(ట).. స్వయం ప్రకటిత మహా మేధావి (మేతావి).. ఆయన రాసిన పుస్తకాల వెనుక ఉన్న పరిచయ వాక్యాలు.. సోషల్ సైంటిస్ట్ గా చలామణి.. చేసే పని మాత్రం కులాల మధ్య చిచ్చు పెడుతూ సమాజంలో అశాంతిని రగిలించడం.. కొన్ని కులాలను అదే పనిగా దూషించడం వెన్నతో పెట్టిన విద్య అయింది.. ఆ మధ్య బ్రాహ్మణులను ఆడిపోసుకున్నాడు.. కేసులు పెట్టగానే కాస్త తగ్గాడు,, వారికి సారీ చెప్పుకొని తర్వాత చెప్పలేదని భుకాయించాడు.. ఇప్పుడు కోమట్ల వెంట పడ్డాడు.. వారు ఆగ్రహించే సరికి బెదిరిస్తున్నారంటూ పోలీసులు రక్షణ కోరుతున్నాడు.. అడుసు తొక్కనేల?.. అనుభవించనేల?
‘నేను హిందువునెట్లయిత?’ అంటాడు.. సరే ఆయన హిందువు కాదని అంగీకరించాడు.. మరి అన్య మతస్తుడైవుండి హిందూ మతాన్ని, దేవతలను కించ పరిస్తే పరమత దూషణ కాదా?.. ఇది మతపరమైన ఘర్షణలు లేవనెత్తడం కిందకు రాదా?  ఏ మతాన్ని ఆచరిస్తాడో ఆయన ఇష్టం.. పోనీ ఏ మతాన్ని నమ్మని వాడా? ఇంకా సంతోషం.. కానీ మెజారిటీ ప్రజలు ఆచరిస్తున్న మతాన్ని కించ పరచడం లౌకిక వాద స్పూర్తికి వ్యతిరేకం కాదా?
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కుల రహిత సమాజాన్ని కోరుకున్నారు.. ఆనాడు హిందూ సమాజంలో ఉన్న కుల వ్యవస్థను నిరసించారు.. అణచివేతకు గురైన వర్గాలను సామాజికంగా, ఆర్ధికంగా పైకి తీసుకు వచ్చి అందరికీ సమాన అవకాశాలు కల్పించడం కోసం పోరాడారు. రిజర్వేషన్ల ద్వారా రాజ్యాంగం ద్వారా రక్షణ కల్పించారు.. కానీ ఈనాడు ఆ మహానుభావుని  పేరు చెప్పుకుటుంటున్న ఇలాంటి మేతావులు సామాజిక అశాంతిని రగిలిస్తున్నారు.. కొన్నాళ్ల క్రితం రాజీవ్ మల్హోత్రా రాసిన ‘భారత దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర’ (Breaking India) అనే పుస్తకాన్ని చదివాను.. ద్రావిడ దళిత ఉద్యమాల్లో పాశ్చాత్య జోక్యాలపై ఇందులో ప్రస్తావించారు ఆ రచయిత.. మన ప్రస్తుత మేతావి గారు చేస్తున్నన పని చూస్తే నాకు ఆ పుస్తకం గుర్తొచ్చింది.. ఇంతకీ ఎవరా మేతావి అన్నది మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా.. ఎందుకంటే ఆయన పేరు ఉచ్చరించడానికి, రాయడానికి కూడా నాకు ఇష్టం లేదు..

భావ ప్రకటనా స్వేచ్ఛకు హిందూ దేవుల్లే దొరికారా?

అప్పుడెప్పుడో ఎం.ఎఫ్.హుస్సేన్ అనే బూతు బొమ్మల ఆర్టిస్టుండేవాడు.. ఇతగాడి చిత్రాలను చూసి ఆహా ఏహో అంటూ కొనుక్కునేవారు.. దీంతో అతగాడికి మదమెక్కింది. భారత మాతను, హిందూ దేవతలను, మహిళలను నగ్నంగా గీసి అవమానించాడు.. హిందూ మత సంస్థలు అతనిపై ఆగ్రహించాయి.. ఎంఎఫ్ హుస్సేన్ మీద కేసులు పెట్టాయి.. ఇలా ఆగ్రహం వ్యక్తం చేయడం భావ ప్రకటన స్వేచ్ఛకు వ్యతిరేకం అంటూ కొందరు అభ్యు’దయ్య’వాదులు అతగాడిని వెనుకోసుకు వచ్చారు.. అంత భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నవాడు తమ దేవుడిని, తమ స్త్రీలను నగ్నంగా చిత్రీకరించుకోచ్చు కదా? హిందూ దేవుళ్లే తేలికగా దొరికారా? అని ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వకుండా మీరు మతతత్వ వాదులు అని ఎదురుదాడికి దిగారు.. చివరకు హుస్సేన్ మహాశయుడు కేసులకు జడిసి దేశం వదిలి పారిపోయాడు.. మత స్వేచ్చ లేని ఓ ఉన్మాద గల్ఫ్ దేశంలో దిక్కుమాలిన చావు చచ్చాడు..
ఇప్పుడు జావేద్ హబీబ్ అనే వాడి వంతు వచ్చింది.. దేశ వ్యాప్తంగా హైటెక్ సెలూన్లూ నడుపుతూ సాంప్రదాయ నాయీ బ్రాహ్మణ వృత్తిదారుల పొట్టగొడుతున్న జావేద్, తన వ్యాపార ప్రకటన కోసం హిందూ దేవుళ్లను ఎంచుకున్నాడు.. ఇతగాడి సెలూన్ లో క్షవరం చేయించుకోవడానికి దేవుళ్లంతా కట్టగట్టుకొని వచ్చారట.. ఈ కార్టూన్ చూడగానే వళ్లు మండిపోతోంది.. జావేద్ హబీబ్ ఆ క్షవరం ఏదో తమ దేవుడికి, వాళ్ల మతస్తులకు చేసుకోవచ్చు కదా?.. ఇలా అడగలేని వాళ్లు జావేద్ హబీబ్ సెలూన్లకు పోయి క్షవరాలు చేయించుకుంటుంటే, చీమూ నెత్తురు లేని వీరిని చూసి నవ్వుకుంటూ గల్లా పెట్టె నింపుకుంటారు ఇతగాడు..
మన దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ పేరిట ఏమి చేసినా చెల్లుతుందని కొందరు భావిస్తున్నారు.. ఈ దిక్కుమాలిన స్వేచ్ఛను మెజారిటీ మతస్తులే భరించాలా?.. అన్య మతస్తులకు వర్తించదా?.. ఈ హుస్సేన్లు, హబీబ్ల దురహంకారాన్ని భరించాల్సిందేనా?.. మత సామరస్యాన్ని దెబ్బ తీస్తున్న వీరిని ప్రభుత్వాలు, చట్టాలు పట్టించుకోవా?.. పొరపాటున మనం ఇలా వాదిస్తే మతతత్వవాదులం, మతోన్మాదులం, ఫాసిస్టులం అంటూ దుయ్యబడతారు మన అభ్యు’దయ్య’వాదులు, వీర సెక్యులరిస్టులు, మేతావులు, నానావిధ జాతులవారూ..

Tuesday, September 5, 2017

వినాయక చవితిపై వివక్ష ఏల?

ఎంత మంది పాల‌కులు, నాయ‌కులు వినాయ‌క చ‌వితి ఉత్స‌వాల్లో పాల్గొన్నారు?.. భ‌క్తుల‌కు అన్న‌దానాలు చేశారు?.. క‌నీసం శుభాకాంక్ష‌లు చెప్పిన వారు ఎంద‌రు?
అన్య మ‌త‌స్తుల పండుగ‌ల‌కు ఎందుకు శుభాకాంక్ష‌లు చెప్పారు?. విందులు ఎందుకు ఇచ్చారు? అని నేను అడ‌గ‌డం లేదు..

Saturday, September 2, 2017

పరకాల అమరులకు నివాళులు

70 ఏళ్ల క్రితం ఇదే రోజు ప‌ర‌కాల‌లో ర‌క్తం చిందింది. మ‌రో జ‌లియ‌న్ వాలాబాగ్ ఘ‌ట‌న‌గా చ‌రిత్ర‌లో నిలిచిపోయింది..
సెప్టెంబ‌ర్ 2, 1947..
భార‌త దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చినా, హైద‌రాబాద్ స్టేట్ ఇంకా నిజాం నిరంకుశ పాల‌న‌తో మ‌గ్గిపోతోంది. వ‌రంగ‌ల్ జిల్లా ప‌ర‌కాల‌లో జాతీయ ప‌తాకాన్ని ఎగుర వేసేందుకు చుట్టుప‌క్క‌ల గ్రామాల నుంచి జ‌నం పెద్ద సంఖ్య‌లో త‌ర‌లి వ‌చ్చారు. ఆగ్ర‌హించిన నిజాం పోలీసులు, ర‌జాకార్లు విచ‌క్ష‌ణా ర‌హితంగా ఊరేగింపుపై కాల్పులు జ‌రిపారు. ఆనాటి ఘ‌ట‌న‌లో 15 మంది మ‌ర‌ణించారు, అంత‌కు ఎన్నో రెట్లు జ‌నం గాయ‌ప‌డ్డారు.. దుర‌దృష్టం కొద్దీ ఈ ఘ‌ట‌న‌కు చ‌రిత్ర‌లో పెద్ద‌గా స్థానం దొర‌క‌లేదు.. ప‌ర‌కాల అమ‌రులు ఘ‌నంగా నివాళ్ల‌ర్పిద్దాం.. 