Monday, September 11, 2017

సమాజంలో చిచ్చు పెడుతున్న మేతావి

ఆయన ప్రపంచ ప్రఖ్యాత రచయిత(ట).. దళిత, బహుజన వర్గాల మేధావి(ట).. స్వయం ప్రకటిత మహా మేధావి (మేతావి).. ఆయన రాసిన పుస్తకాల వెనుక ఉన్న పరిచయ వాక్యాలు.. సోషల్ సైంటిస్ట్ గా చలామణి.. చేసే పని మాత్రం కులాల మధ్య చిచ్చు పెడుతూ సమాజంలో అశాంతిని రగిలించడం.. కొన్ని కులాలను అదే పనిగా దూషించడం వెన్నతో పెట్టిన విద్య అయింది.. ఆ మధ్య బ్రాహ్మణులను ఆడిపోసుకున్నాడు.. కేసులు పెట్టగానే కాస్త తగ్గాడు,, వారికి సారీ చెప్పుకొని తర్వాత చెప్పలేదని భుకాయించాడు.. ఇప్పుడు కోమట్ల వెంట పడ్డాడు.. వారు ఆగ్రహించే సరికి బెదిరిస్తున్నారంటూ పోలీసులు రక్షణ కోరుతున్నాడు.. అడుసు తొక్కనేల?.. అనుభవించనేల?
‘నేను హిందువునెట్లయిత?’ అంటాడు.. సరే ఆయన హిందువు కాదని అంగీకరించాడు.. మరి అన్య మతస్తుడైవుండి హిందూ మతాన్ని, దేవతలను కించ పరిస్తే పరమత దూషణ కాదా?.. ఇది మతపరమైన ఘర్షణలు లేవనెత్తడం కిందకు రాదా?  ఏ మతాన్ని ఆచరిస్తాడో ఆయన ఇష్టం.. పోనీ ఏ మతాన్ని నమ్మని వాడా? ఇంకా సంతోషం.. కానీ మెజారిటీ ప్రజలు ఆచరిస్తున్న మతాన్ని కించ పరచడం లౌకిక వాద స్పూర్తికి వ్యతిరేకం కాదా?
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కుల రహిత సమాజాన్ని కోరుకున్నారు.. ఆనాడు హిందూ సమాజంలో ఉన్న కుల వ్యవస్థను నిరసించారు.. అణచివేతకు గురైన వర్గాలను సామాజికంగా, ఆర్ధికంగా పైకి తీసుకు వచ్చి అందరికీ సమాన అవకాశాలు కల్పించడం కోసం పోరాడారు. రిజర్వేషన్ల ద్వారా రాజ్యాంగం ద్వారా రక్షణ కల్పించారు.. కానీ ఈనాడు ఆ మహానుభావుని  పేరు చెప్పుకుటుంటున్న ఇలాంటి మేతావులు సామాజిక అశాంతిని రగిలిస్తున్నారు.. కొన్నాళ్ల క్రితం రాజీవ్ మల్హోత్రా రాసిన ‘భారత దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర’ (Breaking India) అనే పుస్తకాన్ని చదివాను.. ద్రావిడ దళిత ఉద్యమాల్లో పాశ్చాత్య జోక్యాలపై ఇందులో ప్రస్తావించారు ఆ రచయిత.. మన ప్రస్తుత మేతావి గారు చేస్తున్నన పని చూస్తే నాకు ఆ పుస్తకం గుర్తొచ్చింది.. ఇంతకీ ఎవరా మేతావి అన్నది మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా.. ఎందుకంటే ఆయన పేరు ఉచ్చరించడానికి, రాయడానికి కూడా నాకు ఇష్టం లేదు..

No comments:

Post a Comment