Thursday, March 30, 2017

ఉగాది వేళ.. ఇలా..



అందరి జీవితాల్లో ఉగాది వెలుగులు

తీపి, చేదు రుచుల్లా సుఖ దుఃఖాల‌తో కూడిన‌దే జీవితం..
మాన‌వ జీవితం స‌క‌ల అనుభూతుల స‌మ్మిశ్రితం..
స్థిత ప్ర‌జ్ఞ‌త అల‌వ‌ర్చుకోవ‌డం వివేక‌వంతుల ల‌క్ష‌ణం..
శ్రీ హేవ‌ళంభి నామ సంవత్సరం మీ అంద‌రి జీవితాల్లో వెలుగులు నింపాల‌ని కోరుకుంటూ..
ఉగాది శుభాకాంక్షలతో..

Saturday, March 25, 2017

హద్దు మీరిన కలెక్టర్

అడవి పంది మాసం, గొడ్డు మాంసం, కోతి మాంసం.. ఇలా అన్ని రకాల మాంసాలు తినొచ్చు.. పూర్వం అన్ని రకాల మాంసాలు తినేవారు.. కానీ దరిద్రపు బ్రాహ్మిణికల్ కల్చర్ వచ్చాక ఆహార అలవాట్లు మారిపోయాయి.. దేవుని పేరిట పిచ్చి మాలలు వేస్తూ మాంసాలు మానేస్తున్నారు.. గాడిద గుడ్డు..ఈ మాటలు ఏ దారిన పోయే దానయ్యో, మరే చవట సన్నాసో అని ఉంటే పట్టించుకునేవాళ్లం కాదు.. కానీ బాధ్యతాయుతమైన కలెక్టర్ ఇలాంటి పిచ్చివాగుడు వాడగం దారుణం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి నోట ఈ మాటలు వచ్చాయి..

సాంప్రదాయాలు, మనోభావాలను అవహేళన చేస్తూ, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగం చేసిన ఈ కలెక్టర్ ను ప్రభుత్వం వెంటనే తొలగించి చట్టప్రకారం శిక్షించాల్సిన అవసరం ఉంది.. ఎవరి ఆహారపు అలవాట్లు, విశ్వాసాలు వారివి.. ఈ విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.. పందిని తింటాడో, బర్రెను తింటాడో, కోతిని, కుక్కను, పిల్లిని, బల్లిని ఏదైనా తినమనండి పర్వాలేదు.. ఈ కలెక్టర్ నాస్తికుడో, అన్య మతస్తుడో, ఇంకెవడో నాకు అవసరం లేదు.. ప్రజల మత విశ్వాసాలతో ఆడుకునే హక్కు ఇతగాడికి ఎవరు ఇచ్చారు?

Wednesday, March 22, 2017

ఎప్పటికీ పాజిటివ్ ఆలోచనలే..

' మీ పోస్టులు చాలా పాజిటివ్..'
' య‌స్‌.. '
'ఎందుకలా?'
' నా ర‌క్తంలోనే పాజిటివ్ ఉంది..'
' ఎలా? '
' బీ పాజిటివ్.. థింక్ పాజిటివ్.. పాజిటివ్ మైండ్.. పాజిటివ్ లైఫ్.. టోట‌ల్లీ.. అయామ్ ఆల్వేస్ పాజిటివ్‌..'
ఒక ఫ్రెండ్‌తో నా స‌ర‌దా  సంభాష‌ణ ఇది.. అన్న‌ట్లు  B+ గ్రూప్ ర‌క్తం అవసరమైనవారు న‌న్ను సంప్ర‌దించ‌వ‌చ్చు..

Sunday, March 19, 2017

యోగికి రాజయోగం

అజయ్ సింగ్ నేగి.. 1972 జూన్ 5వ తేదీన పౌరీ గడ్వాలీ జిల్లా (ఉత్తరాఖండ్)లోని పంచూర్ గ్రామంలో జన్మించారు.. హెచ్‌ఎన్‌బీ గర్వాల్‌ వర్సిటీ నుంచి బీఎస్సీ పట్టా పొందారు. హిందూ యువ వాహినిని స్థాపించారు. 12వ లోక్‌సభలో 26 ఏళ్ల పిన్నవయస్కుడైన ఎంపీగా రికార్డు సృష్టించారు. 1998 నుంచి వరుసగా ఐదుసార్లు గోరఖ్‌పూర్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. యోగి ఆదిత్యనాథ్ గురుంచి సంక్షిప్త పరిచయం ఇది..

సన్యాస ధర్మాన్ని పాటిస్తున్న యోగి ఆదిత్యనాథ్ గోరఖ్ పూర్ మఠాధిపతిగా కూడా ఉన్నారు.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు..రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరొందిన ఆదిత్య నాథ్ ఏమి మాట్లాడినా సంచలనమే.. ఆయననను కరడు గట్టిన హిందుత్వ వాది అంటారు.. కానీ యోగి ఆదిత్య నాధ్ మెజారిటీ ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై పోరాడుతున్నారు అన్న విషయాన్ని మరచిపోరాదు..

ఆయన యోగి.. ఇప్పుడు రాజయోగి అయ్యారు.. రాజధర్మాన్ని పాటించడం ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ విధి.. ఉత్తరప్రదేశ్ ప్రజలు అఖండ మెజారిటీ ఇచ్చి బీజేపీని గెలిపించారు.. దేశంలోనే పెద్దదైన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించడం యోగి ఆదిత్యనాథ్ కు కత్తిమీద సాములాంటిదే.. పేదరికం, అత్యాచారాలు, గుండాయిజం, అవినీతి, ఆరాచకం రాజ్యమేలుతున్న యూపీని గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఆదిత్యనాథ్ పై పడింది.. ఆయన చేతితో ఉన్నది మంత్రదండం కాకపోవచ్చు.. కానీ రాజదండంతో అన్నింటినీ సరిదిద్దగలనే నమ్మకం నాకుంది.. 

Thursday, March 16, 2017

వామ్మో పెద్దొర!

'ఇచ్చేస్తున్న.. ఇక తీసుకోండి..'
పెద్దొర ఉదార‌త చూపించాడు.
'అన్నా.. మీరు దేవుడ‌న్నా.. ఈ సాయం మ‌ర‌చిపోలేం.. మీ పేరు చెప్పుకొని బ‌తుకుతాం..' 
అంటూ జేజేలు కొడుతూ, దండాలు పెట్టుకొని వెనుదిరిగారు అమాయ‌కులు.
'సార్..ఇలా అయితే క‌ష్టం.. అంద‌రికీ ఉదారంగా ఇస్తూ పోతే ఎలా?..'
చెవిలో గొణిగాడు పెద్దాఫీస‌ర్‌.
'ఏమ‌య్యా.. నేనేమ‌న్నా పిచ్చోనిలా క‌నిపిస్తున్ననా?.. దీన్ని అడ్డుకోవ‌డానికి ఎవరూ లేరనుకున్నవా ఏంటి..'
పెద్దొర అన్న‌మాట‌ అర్థంకాక బుర్ర గోక్కున్నాడు పెద్దాఫీస‌ర్.
'ఇగో దానయ్యా.. ఇక చూస్కోపో..'
పెద్దొర అదేశంతో కోర్టుకు బ‌య‌లు దేరాడు దానయ్య..
అవాక్కవడం పెద్దాఫీసర్ వంతయింది..

Friday, March 10, 2017

ఇలా చేస్తే నగదు కష్టాలే ఉండవు..

ప్రధాని నరేంద్ర మోదీ సాహసోపేతంగా చేపట్టిన డీమానిటైజేషన్ కార్యక్రమంతో దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడిందనడంలో ఏ మాత్రం అనుమానం లేదు.. కానీ కొందరు అధికారుల అనాలోచిత విధానాల కారణంగా ఈ ఫలాలు ప్రజలకు అందని పరిస్థితి ఏర్పడింది.. కష్టాలు మరింతగా పెరుగుతున్నాయి..
పెద్ద నోట్ల రద్దు పుణ్యం వల్ల వచ్చిన తాత్కాలిక కష్టాల పుణ్యమా అని ప్రజల్లో పొదుపు శక్తి పెరిగింది.. కానీ కొన్ని బ్యాంకుల దివాళాకోరు చర్యలు ఖాతాదారుల్లో ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి.. నగదు నిల్వ, లావాదేవీలపై అడ్డగోలు ఛార్జీల కారణంగా వేతన జీవులు జీతం పడగానే దాదాపుగా ఊడ్చేసుకుంటున్నారు.
గతంలో రూ.1000 ఉంటే ఎంతో ధీమా.. ఇప్పుడు అది పోయి రూ.2000, కొత్త రూ.500 నోట్లు వచ్చాయి.. రూ.2000 నోటు దైనందిన లావాదేవీలకు పెద్ద గుదిబండగా మారింది. చిల్లర కష్టాల కారణంగా దాన్ని భద్రంగా ఇళ్లలోనే దాచుకుంటున్నారు.. అదే సమయంలో రూ.500ను ఆచితూచి ఖర్చు చేస్తున్నారు..
ఈ కారణాల వల్లే పాత రూ.1000, రూ.500 నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ విడుదల చేసిన కొత్త నోట్లు ప్రజల దగ్గర నుండి తిరిగి బ్యాంకులకు చేరడం లేదు.. ఫలితంగా ఏటీఎంలు, బ్యాంక్ కౌంటర్లు క్యాష్ లెస్ అయిపోయాయి..
ఇప్పుడు తక్షణం చేయాల్సిన పనులు ఇవి..
1 ముందు బ్యాంకులు అడ్డగోలు ఛార్జీలను ఎత్తేసి పొదుపు, లావాదేవీలను ప్రోత్సహించాలి..
2 ఆర్బీఐ మార్కెట్లోకి అత్యవసరంగా కొత్త రూ.1000 నోటును విడుదల చేయడంతో పాటు, రూ.100  రూ.50, రూ.20, రూ.10 రూపాయల చలామాణిని విస్తృతంగా పెంచాలి..
3 నగదు రహిత లావాదేవీలపై ప్రజలను చైతన్య వంతం చేసే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు బ్యాంకులు, వాణిజ్య సంస్థలు విస్తృత ప్రచారం చేయాలి.. క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్లపై ప్రోత్సాహకాలను పెంచాలి..
ఇవన్నీ కచ్చితంగా పాటిస్తే మన ఆర్థిక రంగం మరింత బలోపేతం కావడమే కాదు, నల్లధనం సమస్యే ఉండదు..

Thursday, March 9, 2017

సమయంలోనే విశ్రాంతి ఉంది..

గోడ గడియారం ఎప్పుడు చూసినా టిక్కు టిక్కు మంటూ పని చేస్తూనే ఉంది.. చాలా రోజుల నుండి ఆసక్తిగా గమస్తోంది ఓ బల్లి.. ఇంతకీ ఈ గడియారం విశ్రాంతి ఎప్పుడు తీసుకుంటుంది? అనే అనుమానం వచ్చింది.. చివరకు గడియారాన్నే అడిగేసింది..
ఓ గడియారమా! నీకు విశ్రాంతి లేదా?
లేకేం.. కచ్చితంగా ఉంది..
ఎప్పుడూ పని చేస్తూనే కనిపిస్తున్నావు.. ఇంతకీ నీవు విశ్రాంతి తీసుకుంటున్నది ఎప్పుడు?
ఒక్క టిక్ కి మరో టిక్ కి మధ్యనే నాకు విశ్రాంతి..’    

సమయంలేదని తప్పించుకునేవారికి, పని చేయకుండా విశ్రాంతితో కాలక్షేపం చేసేవారికి గడియారం స్పూర్తి కావాలి..  సమయం కల్పించుకోవడం మన చేతిలోనే ఉంది.. పనిలోనే విశ్రాంతిని కూడా ఆస్వాదించగలం అని గ్రహించాలి..

Wednesday, March 8, 2017

ప్రతి రోజూ మహిళల రోజు ఎందుకు కారాదు?

యత్ర నార్యంతు పూజ్యంతు రమంతే తత్ర దేవతా..
ఎక్కడ స్త్రీలను పూజిస్తారో, అక్కడ దేవతలు కొలువై ఉంటారని మన పెద్దలు చెబుతుంటారు.. భారతీయ సమాజంలో మహిళలకు మొదటి నుంచీ ఉన్న గౌరవనీయ స్థానం ఇది.. పురుషులతో సమానంగా, ఇంకా చెప్పాలంటే కాస్త ఎక్కువ ప్రాధాన్యతే మహిళలకు ఉంది. మన దేశాన్ని భారత మాతగా కొలుస్తున్నాం.. మన పురాణాలను గమనించినట్లైతే దుర్గామాత, పార్వతి, పోచమ్మ ఎల్లమ్మ తదితర దేవతలను శక్తికి ప్రతీకగా, సరస్వతి, లక్ష్మిలను చదువు, సంపదకు గుర్తులుగా పూజిస్తాం..
దురదృష్టవశాత్తు మన దేశంపై విదేశీయుల దండయాత్రలు మొదలయ్యాక పరిస్థితి మారింది.. ప్రజల ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది.. మరోవైపు మూఢనమ్మకాలు పెరిగాయి.. దీంతో స్త్రీలను ఇంటికే పరిమితం చేయడం మొదలు పెట్టారు.. అయినా రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీభాయి, చెన్నమ్మ తదితర వీర వనితలు తమ శక్తి సామర్ధ్యాలను చాటుకున్నారు..ఇక ఆధునిక యుగంలో మహిళలు అన్ని రంగాల్లో పురుషులకు ధీటుగా దూసుకుపోతున్నారు.. రాజకీయ, పరిపాలన, వ్యాపార రంగాల్లో ఎందరో మహిళలు ఉన్నత స్థానంలో ఉన్నారు.. అయినా ఎక్కడో లోపం.. ఇవన్నీ పైపై మెరుగులేనా అనిపిస్తుంది.. ..
పొద్దున్నే పేపర్ తెరచినా, టీవీ ఛానళ్లు చూసినా ప్రముఖంగా కనిపించే వార్తలు బాధను కలిగిస్తుంటాయి.. మహిళలపై వివక్ష దారుణంగా కొనసాగుతోంది.. బాల్య వివాహాలు, అవిద్య చాలా మేరకు తగ్గినా, మహిళలపై అత్యాచారాలు, హింస, వరకట్న వేధింపులు చూస్తుంటే మనం నిజంగా అనాగరికులమేనా అనే సందేహం కలుగుతుంది.. సామాజికంగా, రాజకీయంగా వివక్ష దారుణంగా ఉంది.. రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్ల పుణ్యమా అని పదవులు మహిళలకు దక్కినా పెత్తనం మాత్రం పురుషులదే.. అత్యున్నత స్థానంలో ఉన్న మహిళలదీ ఇదే దుస్థితి..మహిళలకు రాజకీయాల్లో 33 శాతం రిజర్వేషన్ల బిల్లుకు మాత్రం మోక్షం కలిగే పరిస్థితి కనిపించడంలేదు..
మనం ఆధునికులం అని చెప్పుకుంటున్నాం.. కానీ మన ఆలోచనా విధానం పూర్తిగా అనాగరికంగా ఉంది.. స్త్రీని భోగ వస్తువుగానే చూస్తున్నాం.. సినిమాలు, టీవీలు, పత్రికల్లో కనిపించే దృశ్యాలను ఎలా అర్థం చేసుకోవాలి? మన పిల్లలకు, యువతకు ఎలాంటి సందేశం ఇస్తున్నాం? మహిళల కట్టు, బొట్టు గురుంచి కామెంట్ చేయడం గౌరవ ప్రదం అనిపించుకోదు.. పురుషుల వస్త్రధారణ మారినట్లుగానే మహిళలదీ మారుతోంది అని నా అభిప్రాయం.. ఈ విషయంలో స్త్రీలను ఎంత తప్పు పడుతున్నామో, పురుషులకూ అంతే బాధ్యత ఉంది.. మనం భారతీయులం అనే విశిష్ట గుర్తింపును నిలుపుకునేందుకు మన సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది..
అసలు మహిళల హక్కులు, గౌరవం, ప్రాధామ్యాల విషయంలో పోరాటాలు చేసే దుస్థితి ఎందుకు?.. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.. సృష్టిలో స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానమే.. ఏ ఒక్కరు లేకున్నా ప్రకృతి అనేది ఉండదు.. పురుషులకన్నా ఏ విధంగానూ స్త్రీ తక్కువ కాదు..
మార్పు అనేది మన కుటుంబాల నుంచే రావాలి.. మన ఇళ్లలోని మహిళా మూర్తులను గౌరవించాలి.. ఆడ పిల్లలను మగ పిల్లలతో సమానంగా చదివించాలి.. వారు స్వశక్తిపై ఎదిగేందుకు తోడ్పడాలి.. అప్పుడే సమాజం మారుతుంది.. ఇవేవీ చేయకుండా ఎవరిని నిందించినా ఫలితం ఉండదు..
చివరగా నాదో సందేహం? అసలు మహిళలకంటూ ఒక దినోత్సవం ఏమిటి? ఒక్క మార్చి 8వ తేదీనాడే మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి.. ఈ ఒక్కరోజే మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి గౌరవిస్తే సరిపోతుందా?.. ప్రతి రోజూ మహిళల దినమే ఎందుకు కారాదు?

Thursday, March 2, 2017

కేరళ హత్యలపై స్పందన ఏది?

ఒకటా.. రెండా.. ఏకంగా 270 హత్యలు.. ఆరు దశాబ్దాలుగా సాగుతున్న బీభత్స హత్యాకాండ ఇది..
దేవ భూమిగా కేరళకు పేరుంది.. వామపక్ష పార్టీ దీన్ని మరుభూమిగా మార్చేసింది..

స్వయాన కేరళ ముఖ్యమంత్రి సొంత జిల్లా కన్నూరులోనే 80 మందిని హతమార్చారు.. అంతే కాదు స్వయాన ప్రస్తుత సీఎం పినరయి విజయన్ పై హత్యారోపణలు ఉన్నాయి.. దర్జీ పని చేసే రామకృష్ణ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఆయన..
దేశంలో ఎక్కడో ఏదో చిన్న ఘటన జరిగితే దాన్ని భూతద్దంలో చూపించే వామపక్షులు తమ ఏలుబడిలోని కేరళలో సాగిస్తున్న మారణకాండ గురుంచి ప్రశ్నించే వారే లేరా? ఈ విషయంలో రాజకీయ పార్టీలు, పత్రికలు,, ఛానళ్లు, సోషల్ మీడియా ఎందుకు మౌనం పాటిస్తున్నాయి?
హత్యకు గురైనవారు చేసిన పాపమేమిటి?.. వారు జాతీయవాదులు కావడమేనా?.. ఆర్ఎస్ఎస్ లో క్రియాశీలకంగా పని చేయడమే వారు చేసిన తప్పా?