Sunday, March 19, 2017

యోగికి రాజయోగం

అజయ్ సింగ్ నేగి.. 1972 జూన్ 5వ తేదీన పౌరీ గడ్వాలీ జిల్లా (ఉత్తరాఖండ్)లోని పంచూర్ గ్రామంలో జన్మించారు.. హెచ్‌ఎన్‌బీ గర్వాల్‌ వర్సిటీ నుంచి బీఎస్సీ పట్టా పొందారు. హిందూ యువ వాహినిని స్థాపించారు. 12వ లోక్‌సభలో 26 ఏళ్ల పిన్నవయస్కుడైన ఎంపీగా రికార్డు సృష్టించారు. 1998 నుంచి వరుసగా ఐదుసార్లు గోరఖ్‌పూర్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. యోగి ఆదిత్యనాథ్ గురుంచి సంక్షిప్త పరిచయం ఇది..

సన్యాస ధర్మాన్ని పాటిస్తున్న యోగి ఆదిత్యనాథ్ గోరఖ్ పూర్ మఠాధిపతిగా కూడా ఉన్నారు.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు..రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరొందిన ఆదిత్య నాథ్ ఏమి మాట్లాడినా సంచలనమే.. ఆయననను కరడు గట్టిన హిందుత్వ వాది అంటారు.. కానీ యోగి ఆదిత్య నాధ్ మెజారిటీ ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై పోరాడుతున్నారు అన్న విషయాన్ని మరచిపోరాదు..

ఆయన యోగి.. ఇప్పుడు రాజయోగి అయ్యారు.. రాజధర్మాన్ని పాటించడం ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ విధి.. ఉత్తరప్రదేశ్ ప్రజలు అఖండ మెజారిటీ ఇచ్చి బీజేపీని గెలిపించారు.. దేశంలోనే పెద్దదైన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించడం యోగి ఆదిత్యనాథ్ కు కత్తిమీద సాములాంటిదే.. పేదరికం, అత్యాచారాలు, గుండాయిజం, అవినీతి, ఆరాచకం రాజ్యమేలుతున్న యూపీని గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఆదిత్యనాథ్ పై పడింది.. ఆయన చేతితో ఉన్నది మంత్రదండం కాకపోవచ్చు.. కానీ రాజదండంతో అన్నింటినీ సరిదిద్దగలనే నమ్మకం నాకుంది.. 

No comments:

Post a Comment