Friday, March 10, 2017

ఇలా చేస్తే నగదు కష్టాలే ఉండవు..

ప్రధాని నరేంద్ర మోదీ సాహసోపేతంగా చేపట్టిన డీమానిటైజేషన్ కార్యక్రమంతో దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడిందనడంలో ఏ మాత్రం అనుమానం లేదు.. కానీ కొందరు అధికారుల అనాలోచిత విధానాల కారణంగా ఈ ఫలాలు ప్రజలకు అందని పరిస్థితి ఏర్పడింది.. కష్టాలు మరింతగా పెరుగుతున్నాయి..
పెద్ద నోట్ల రద్దు పుణ్యం వల్ల వచ్చిన తాత్కాలిక కష్టాల పుణ్యమా అని ప్రజల్లో పొదుపు శక్తి పెరిగింది.. కానీ కొన్ని బ్యాంకుల దివాళాకోరు చర్యలు ఖాతాదారుల్లో ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి.. నగదు నిల్వ, లావాదేవీలపై అడ్డగోలు ఛార్జీల కారణంగా వేతన జీవులు జీతం పడగానే దాదాపుగా ఊడ్చేసుకుంటున్నారు.
గతంలో రూ.1000 ఉంటే ఎంతో ధీమా.. ఇప్పుడు అది పోయి రూ.2000, కొత్త రూ.500 నోట్లు వచ్చాయి.. రూ.2000 నోటు దైనందిన లావాదేవీలకు పెద్ద గుదిబండగా మారింది. చిల్లర కష్టాల కారణంగా దాన్ని భద్రంగా ఇళ్లలోనే దాచుకుంటున్నారు.. అదే సమయంలో రూ.500ను ఆచితూచి ఖర్చు చేస్తున్నారు..
ఈ కారణాల వల్లే పాత రూ.1000, రూ.500 నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ విడుదల చేసిన కొత్త నోట్లు ప్రజల దగ్గర నుండి తిరిగి బ్యాంకులకు చేరడం లేదు.. ఫలితంగా ఏటీఎంలు, బ్యాంక్ కౌంటర్లు క్యాష్ లెస్ అయిపోయాయి..
ఇప్పుడు తక్షణం చేయాల్సిన పనులు ఇవి..
1 ముందు బ్యాంకులు అడ్డగోలు ఛార్జీలను ఎత్తేసి పొదుపు, లావాదేవీలను ప్రోత్సహించాలి..
2 ఆర్బీఐ మార్కెట్లోకి అత్యవసరంగా కొత్త రూ.1000 నోటును విడుదల చేయడంతో పాటు, రూ.100  రూ.50, రూ.20, రూ.10 రూపాయల చలామాణిని విస్తృతంగా పెంచాలి..
3 నగదు రహిత లావాదేవీలపై ప్రజలను చైతన్య వంతం చేసే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు బ్యాంకులు, వాణిజ్య సంస్థలు విస్తృత ప్రచారం చేయాలి.. క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్లపై ప్రోత్సాహకాలను పెంచాలి..
ఇవన్నీ కచ్చితంగా పాటిస్తే మన ఆర్థిక రంగం మరింత బలోపేతం కావడమే కాదు, నల్లధనం సమస్యే ఉండదు..

No comments:

Post a Comment