Saturday, November 30, 2013

'గొప్ప' కుటుంబంలో పుట్టక పోవడమే పాపమా?

 ఇంద్రకుమార్ గుజ్రాల్.. ఈయన ఎంత మందికి గుర్తున్నారు.. నేటి తరానికి ఈయన తెలియదంటే అందుకు వారిని తప్పుపట్టలేం.. ఎందు కంటే మన దేశంలో మన దేశంలో గాంధీ, నెహ్రూ కుటుంబంలో పుట్టిన వారే గొప్పవారు.. వారే ఈ దేశ పాలకులు.. చరిత్ర వారినే గుర్తిస్తుంది.. ఈ కుటుంబానికి ఛెందని వారు ఎంత గొప్పవారైనా చరిత్రకు పట్టదు..
సంకీర్ణ ప్రభుత్వాల హవా ప్రారంభమయ్యాక దేవగౌడ తర్వాత ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టించారు ఐకే గుజ్రాల్.. జీలం(ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది)లో పుట్టిన గుజ్రాల్ భారత స్వాతంత్ర్య సమర పోరాటంలో భాగంగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు.. ఇందిరా గాంధీ క్యాబినెట్లో సమాచార శాఖ మంత్రిగా పని చేశారు.. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరకు అనుకూలంగా ఏకపక్ష వార్తల విషయంలో సంజయ్ గాంధీతో విభేదించడంతో గుజ్రాల్ ను తప్పించి వీసీ శుక్లాను నియమించారు.. ఆ తర్వాత గుజ్రాల్ రష్యా రాయభారిగా వెళ్లారు.. వీపీ సింగ్, దేవెగౌడ సంకీర్ణ ప్రభుత్వాల్లో విదేశాంగ మంత్రిగా సేవలు అందించారు.. ఆ తర్వాత ప్రధానమంత్రి పదవి వరించింది..
ఇంతకీ గుజ్రాల్ గారిని ఎందుకు గుర్తు చేస్తున్నానంటారా? అసలు విషయానికి వద్దాం..
ఇంద్ర కుమార్ గుజ్రాల్ మరణించి నేటికి ఏడాది అవుతోంది.. ఢిల్లీలో ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.. అయితే ఆయన సమాధిని మాత్రం దిక్కూ, లేకుండా అనామకంగా సిమెంట్ గచ్చుతో వదిలేశారు.. ఈ పరిస్థితికి నొచ్చుకున్న గుజ్రాల్ కుటుంబం, అరుణ్ జైట్లీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి లేఖ కూడా రాశారు.. తామే ఖర్చు భరించి సమాధిని అభివృద్ధి చేసుకుంటామని చెప్పారు.. కానీ సింగ్ గారి రాతి గుండె స్పందించలేదు.. మరోవైపు ఇందిగాంధీ సమాధి శక్తిస్థల్, రాజీవ్ గాంధీ సమాధి వీర్ భూమి బ్రహ్మాండంగా వెలిగిపోతున్నాయి.. ఎందుకంటే వారు ఎంతో గొప్ప కుటుంబంలో పుట్టినవారు కదా?..
ఇదంతా చదువుతుంటే మన పీవీ నరసింహారావు గారు గుర్తొస్తున్నారా? ఐదేళ్లు దేశానికి ప్రధానిగా పనిచేసి ఆర్థిక సంస్కరణలకు బాటలు వేసిన పీవీకి కనీసం ఢిల్లీలో అంత్యక్రియలు జరిపే అవకాశం కూడా ఇవ్వలేదు సోనియా గాంధీ.. ఆయన శవాన్ని ఏఐసీసీ కార్యాలయం లోపలికి కూడా అనుమతించకుండానే హైదరాబాద్ పంపేశారు.. ఇక్కడ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆయన శవం కూడా సరిగ్గా కాలకుండా జాగ్రత్తలు తీసుకొని సోనియా విధేయతను చాటుకుంది.. ఆయన సమాధి ప్రాంగణాన్ని అనామకంగా వదిలేశారు..
పీవీజీ, గుజ్రాల్జీ చేసిన పాపం ఏమిటి? వారు కూడా దేశానికి ప్రధానులుగా సేవలు చేశారు కదా?.. వారి సమాధులకు ఎందుకు ఈ దుర్గతి?

Thursday, November 28, 2013

పాములే నయం

అసెంబ్లీ ఆవరణలో పాముల సంచారం -వార్త 
అసెంబ్లీలో కూర్చునే కొండ చిలువల కన్నా ఇవే బెటర్ కదా.. 

Friday, November 22, 2013

జర్నలిజం వృత్తికి కళంకం..

తరుణ్ తేజ్ పాల్ కొందరికి గొప్ప జర్నలిస్టుగా కనిపించి ఉండొచ్చు.. నాకు మొదటి నుండి ఇతడిపై సదభిప్రాయం లేదు.. తేజ్ పాల్ చేతిలో అత్యాచారానికి గురైన మహిళా జర్నలిస్టు స్వయాన అతడి స్నేహితుని కూతురేనట.. ఇలాంటి నీచుడు జర్నలిస్టు అని అని చెప్పడానికే నాకు సిగ్గుగా ఉంది.. స్వయంగా తరుణ్ తేజ్ పాల్ నేరాన్ని అంగీకరించినా జర్నలిస్టు, అభ్యుదయ, ప్రజా, మహిళా సంఘాలు ఇంత వరకూ నోరు మెదపకుండా తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం ఆశ్యర్యంగా ఉంది.. ఏం నోళ్లు పడిపోయాయా?.. ఛీ వీరు అసలు మనుషులేనా?
ఈ అత్యాచార సంఘటన అంతర్గత వ్యవహారం అంటోంది తెహల్కా బృందం.. అంతర్గత విచారణ జరుపుతారట.. ఆరు నెలల పాటు ఎడిటర్ పదవిని త్యజిస్తున్నట్లు తనకు తాను శిక్ష విధించుకున్నాడీ పెద్ద మనిషి.. ఏం ఇదేమన్నా జాట్ల ఖాప్ పంచాయితీనా? తేజ్ పాల్ ఏమైనా చట్టాలకు అతీతుడా? చేసిన తప్పుకు శిక్ష అనుభవించనక్కరలేదా?
జర్నలిజం వృత్తికే కళంకలం తెచ్చిన తేజ్ పాల్ లాంటి వారిని కఠినంగా శిక్షించకపోతే ఈ వృత్తికే గౌరవం పోతుంది..

Saturday, November 16, 2013

ధ్యాన్ చంద్ కు భారత రత్నం ఏదీ?..

క్రికెట్ క్రీడలో అసమాన ప్రతిభ చూపి రిటెర్ అయిన సచిన్ టెండూల్కర్ కు భారత రత్న ఇవ్వాలనే నిర్ణయంపై ఎవరికీ అభ్యంతరం ఉండబోదు.. కోట్లాది మంది భారతీయుల హృదయాలను చూరగొన్న గొప్ప ఆటగానికి ఇది సముచిత గౌరవమే.. దీన్ని స్వాగతిద్దాం.. అయితే ఇదే సమయంలో మరో అద్భుత క్రీడాకారుడున్ని గుర్తు తెచ్చుకుందాం..
మేజర్ ధ్యాన్ చంద్ సింగ్.. నేటి తరానికి ఈయన పేరు తెలియక పోవచ్చు.. హాకీ క్రీడలో భారత దేశానికి గౌరవం తెచ్చిన మేటి క్రీడాకారుడు.. ధ్యాన్ చంద్ నాయకత్వంలో భారత హాకీ జట్టు 1928, 1932, 1936 ఒలింపిక్ ఆటల పోటీల్లో మూడు బంగారు పతకాలను సాధించింది.. ఆయన హాకీ స్టిక్ పట్టాడంతో ప్రత్యర్థి జట్టు చిత్తు కావాల్సిందే.. ప్రపంచంలోనే అత్యధికంగా వేయికి పైగా గోల్స్ చేసిన ఘనత ధ్యాన్ చంద్ దే.. ఈ రికార్డు ఇప్పటికీ ఆయన పేరిటే ఉంది.. ప్రపంచ హాకీలో ధ్యాన్ చంద్ నేటికీ ధృవతారగానే కొనసాగుతున్నారు.. ఆయనకు భారత ప్రభుత్వం 1956లో పద్మ భూషన్ అవార్డు ఇచ్చి గౌరవించింది.. కానీ క్రీడాకారుడిగా అర్హత లేదనే సాకుతో భారత రత్న ఇవ్వలేదు..
భారతీయులు హకీని పూర్తి విస్మరించారు.. క్రికెట్ తప్ప వేరే ఆట లేదనేందగా పిచ్చి ముదిరింది.. ఇందుకు ప్రభుత్వ ప్రోత్సాహం కూడా ఉందనడం కాదనలేని సత్యం.. ఒలింపిక్, ఏసియన్ క్రీడల్లో చిన్న దేశాలు సైతం పతకాల పట్టికలో దూసుకు పోతుంటే ఒకటి అర పతకాలు సాధిస్తున్న భారత్ పరువుపోతోంది.. ఇప్పటికైనా కళ్లు తెరిచి ఇతర క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది..
సచిన్ టెండూల్కర్ తో పాటు మేజర్ ధ్యాన్ చంద్ కు కూడా భారత రత్న అవార్డు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పినా, మాట నిల్పుకోలేదు.. ప్రతిష్టను కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో దేశంలో ప్రజాధరణ ఉన్న సచిన్ టెండూల్కర్ కు భారత రత్న అవార్డు ఇచ్చి ఆయన అభిమానులను తనవైపు తిప్పుకోవాలనే దూరాలోచన చేసిందనడం ముమ్మాటికీ సత్యం..
క్రీడాకారులను గౌరవించే విషయంలో దయచేసి రాజకీయాలు చేయకండి.. సచిన్ తో పాటు ధ్యాన్ చంద్ కు కూడా భారత రత్న అవార్డు ఇద్దాం.. అది మనను మనం గౌరవించుకోవడం కూడా.. అంతే కాకుండా క్రికెటేతర క్రీడలకు కూడా ప్రోత్సహం ఉందని సందేశం ఇచ్చినట్లవుతుంది.. ఈ విషయంపై భారత ప్రభుత్వం దృష్టి సారిస్తే మంచిది..

జయహో సచిన్..

నాకు ఈనాటికీ క్రికెట్ గురుంచి అంతగా తెలియదు.. ఎందుకో ఆ క్రీడ నాకు నచ్చలేదు.. తెలుసుకోవాలనీ అనిపించలేదు.. అన్ని విషయాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్న జర్నలిస్టుగా ఇలా వ్యాఖ్యానించడం సరైంది కాదని తెలుసు.. కానీ మనసులో మాటను చెబుతున్నాను.. క్రికెట్ పేరుతో సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులను చిన్నపట్టి నుండి చూస్తున్న కారణంగా మనసులో ఏర్పడ్డ అభిప్రాయం ఇది.. దీన్ని చాలా మంది అంగీకరించకపోవచ్చు.. క్రికెట్ మోజులో పడి మన దేశం ఇతర క్రీడలను నిర్లక్ష్యం చేయడం వల్లే ఒలింపిక్, ఏసియన్ గేమ్స్ లో చాలా అవమానం పాలవుతున్నామని నా అభిప్రాయం.. అయితే సచిన్ టెండూల్కర్ సాధించిన విజయాలను అభినందించకుండా ఉండలేను..

Thursday, November 14, 2013

నెహ్రూ జయంతి నాడే బాలల దినోత్సవం ఎందుకు?

నవంబర్ 14న ప్రథమ ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం.. ఈ రోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటారు.. ఎందుకు అంటే నెహ్రూ గారికి చిన్న పిల్లలు అంటే ఎంతో ఇష్టమని, అందుకే ఆయన జన్మదినం రోజున బాలల దినోత్సవం జరుపుకుంటున్నామని చెబుతారు..
అసలు పిల్లలను ఇష్టపడనిది ఎవరు? ముద్దులొలికే, కల్మషం లేని చిన్నారులను ప్రతి మనిషి ప్రేమిస్తాడు.. పిల్లలను ఇష్టపడని వాడు అసలు మనిషే కాదు.. మరి నెహ్రూజీకే పిల్లలు ఇష్టమని ఎలా నిర్ధారించారు.. ఆయన జయంతి నాడే బాలల దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి? ఇతర జాతీయ నాయకులకు పిల్లలంటే ఇష్టం లేదా?.. ఆలోచించండి..
నిజానికి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో జూన్ 1వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటారు.. అయితే నవంబర్ 20వ తేదీన అంతర్జాతీయ బాలల దినోత్సవం జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించింది.. 

Monday, November 11, 2013

ఎమ్మెల్యే జ్ఞాన బోధ

'సిగరెట్టు తాగని వాడు సిగ్గులేని వాడు..
సిగరెట్ తాగువాడు శివుని కొడుకు..
బీడీ తాగువాడు భీముని కొడుకు..'
నెల్లూరు రచ్చబండ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనం వివేకానందుల వారు తన పక్కను ఉన్న విద్యార్థికి చేసిన జ్ఞాన బోధన ఇది.. పైనా ఎమ్మెల్యే విడుస్తున్న సిగరెట్టు పొగకు ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఈ కుర్రాన్ని పట్టుకొని మీ అన్న సిగరెట్టు తాగడా? మీ నాన్న తాగడా? అని ఆరా తీశాడు..
బహిరంగంగా పొగ తాగరాదనే శాసనాన్నిఉల్లంఘించిన శాసన సభ్యుడు, తాను తప్పు చేయడమే కాకుండా ఇది తప్పుకాదు అని భావి భారత పౌరుడికి బోధించడం దారుణం.. అంతకు ముందే ఎమ్మెల్యే గారి 'ధూమ కేతు' అవతారం చూసి ఓ మహిళ పారిపోయింది.. ఎమ్మెల్యేగారికి ఇది సరదా అనిపించవచ్చు కానీ తాను ప్రజా ప్రతినిధిని అని, అందరికీ ఆదర్శంగా ఉండాలని గ్రహిస్తే మంచిది.. అందునా స్వామి వివేకానంద పేరు పెట్టుకున్నారు.. కలి కాలం ఏమి చేస్తాం..

Saturday, November 9, 2013

భారతీయులు, హిందువులంటే ఎందుకు చులకన?..

భారత దేశం, హిందూ మతం అంటే తెల్ల తోలు విదేశీయులకు ఎంత చులకనో ఒక్కసారి చూడండి..
అసోంలో రేప్ ఫెస్టివల్ జరుగుతోందంటూ అమెరికాకు చెందిన National Report అనే వెబ్ సైట్ అవాస్తవ కథనాన్ని ప్రచురించింది.. నాగా సాధువుల ఫోటోను ప్రచురించింది.. ఈ కథనం చదివిన ప్రవాస భారతీయులు నొచ్చుకున్నారు.. తమ నిరసన వ్యక్తం చేశారు.. అసోం ప్రభుత్వం పరువు నష్టం దావా వేసే ఆలోచనతో ఉంది.. కానీ భారత ప్రభుత్వం దీనిపై ఏ మాత్రం స్పందించలేదు..
మరోవైపు ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ కు చెందిన బ్రూక్ వేల్ యూనియన్ అనే మద్యం కంపెనీ తమ బీరు బాటిల్స్ పైన గణపతి తలతో ఉన్న లక్ష్మీ దేవి బొమ్మను, కామ ధేనువును ముద్రించి అమ్మకానికి పెట్టింది.. ఆస్ట్రేలియాలోని భారతీయులంతా ఈ అంశంపై తీవ్ర ఆగ్రహం, నిరసన వ్యక్తం చేస్తున్నారు.. కానీ షరా మామూలే భారత ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు..
సాల్మన్ రష్దీ తన సాటానిక్ వర్సెస్ అనే నవలలో ఏదో రాశారని ముస్లింలు ఆగ్రహిస్తే భారత దేశం స్పందించి ఆ నవలను నిషేధించింది.. బంగ్లా దేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ రాసిన లజ్జ అనే నవలను ఆ దేశ ప్రభుత్వం నిషేధించింది.. వీరిద్దరి తలలపై కొందరు ఛాందన వాదులు వెల కట్టారు.. హైదరాబాద్ వచ్చిన తస్లీమాపై ఎంఐఎం ఎమ్మెల్యేలు దాడి చేసినా మన రాష్ట్ర ప్రభుత్వం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. డానిష్ పత్రికల్ వచ్చిన ఒక కార్టూన్ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు ఆగ్రహించారు.. ఈ అంశంతో మన దేశానికి ఎలాంటి సంబంధం లేకున్నా హైదరాబాద్లో హిందువులపై దాడులు జరిగాయి.. ఏసుక్రీస్తు వచ్చిన డావిన్సీ కోడ్ అనే నవల, సినిమాలపై మన దేశ క్రైస్తవులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.. ఒక తెలుగు పత్రికలో ప్రచురితమైన మద్యం సీసాతో ఏసు ఫోటోపై కూడా నిరసనలు వ్యక్తం అయ్యాయి..
కానీ హిందూ మతానికి తరచూ ఏదో ఏ రూపంలో అవమానం జరుగుతున్నా స్వ మతస్తులకే పట్టడం లేదు.. ఇక మన మన సో కాల్డ్ సెక్యులర్ ప్రభుత్వాలు ఏమి స్పందిస్తాయి..

ఈ తరహా ఉదంతాలపై ప్రతి భారతీయుడు; హిందువు దీనిపై స్పందించి తన నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది.. హిందూ మతం సహసానికి ప్రతీక, దీన్ని ఆసరాగా తీసుకొని పదే పదే అవమానిస్తే ఆగ్రహించక తప్పదు..

Friday, November 8, 2013

ఇద్దరు సీఎంలూ.. స్పందనలు..

ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు దాడి చేసి కాంగ్రెస్ అగ్ర నేతలను, కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారు.. అనేక మందిని గాయపరిచారు..
బీహార్ రాజధాని పాట్నాలో బీజేపీ బహిరంగ సభలో పలు చోట్ల ఉగ్రవాదులు బాంబులు పేల్చారు.. కొందరు కార్యకర్తలు చనిపోగా, ఎంతో మంది గాయపడ్డారు..
ఈ రెండు సంఘటనల సమయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రుల స్పందన ఎలా ఉందో చూడండి..
ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకొని బాధితులను పరామర్శించి వారికి అన్ని రకాలుగా ఆదుకునే చర్యలు చేపట్టారు.. బాధితులు కాంగ్రెస్ వారైనా ఎలాంటి వివక్ష చూపలేదు..
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు ఇదేమీ పట్టలేదు.. ఇటీవలి దాకా మిత్ర పక్షంగా ఉన్న బీజేపీకి చెందిన బాధితులను పరామర్శించడానికి నామోషీ అడ్డం వచ్చింది.. పైగా ఆరోజున విందూ వినోదాల్లో గడిపారనే ఆరోపణలు ఉన్నాయి..
రెండూ ఉగ్రవాద సంఘటనలే.. ఇద్దరూ ముఖ్యమంత్రలే.. కానీ వారి స్పందనలో ఎంత తేడా ఉందో గమనించారా?

Thursday, November 7, 2013

ఈ భారం ఎవరు భరించాలి?..

బస్సు ఎక్కాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది.. ఆర్టీసీ ఛార్జీలు నడ్డి విరుస్తున్నాయి.. హైదరాబాద్ సిటీ బస్సు కనీస టికెట్టు ధర రూ.6.. ఒక స్టేజీ ప్రయాణానికే ఇంత చెల్లించాల్సి రావడం దారుణమే.. ఇక దూర ప్రాంతాల బస్సు ఛార్జీలు ఆకాశాన్నంటి పోయాయి.. నష్టాలను భర్తీ చేసుకోడానికే ఛార్జీలు పెంచామని ఆర్టీసీ చెబుతోంది.. నిజమే కదా?..
ఈ పరిస్థితికి కారణం ఎవరు? ఉభయ ప్రాంతాల ఉద్యమకారులు, ఆర్టీసీ కార్మిక సంఘాలు కాదా? రోజుల తరబడి బందుల పేరుతో ఆర్టీసీని దివాలా అంచుకు తెచ్చారు.. అదే సమయంలో రాజకీయ నాయకులకు చెందిన ప్రయివేటు బస్సులు ప్రయాణీకులకు అడ్డగోలుగా లూఠీ చేశాయి..  లాభాలు నాయకులకు, నష్టాలు ఆర్టీసీకా?..

ఉభయ ప్రాంతాల ఉద్యమకారులు ఒక్కసారి ఆలోచించండి.. మీ అనాలోచిత నిర్ణయం సామాన్య ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టింది.. ఒకనైనా ఉద్యమాల నుండి సామాన్యుని ప్రయాణ సాధనమైన ఆర్టీసీని మినహాయించండి..

Tuesday, November 5, 2013

అనుకూలంటే ఉంటేనే ఓకేనా?..

ప్రిపోల్ సర్వేలు నిషేధించాలట.. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.. ఎన్నికల సంఘంపై వత్తిడి తెస్తోంది.. గతలంలో ఎన్నికల కమిషన్ స్వయంగా ఈ ప్రతిపాదన తెచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీయే వ్యతిరేకించింది.. కానీ ఇప్పడు ప్లేట్ పిరాయించింది.. కాంగ్రెస్ పార్టీ చేయించిన సర్వేలతో సహా, అన్ని సర్వేలు నరేంద్ర మోడీకి అనుకూలంగా నివేదికలు ఇవ్వడమే కారణమట.. కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, ఏ పార్టీ అయినా ఇదే వైఖరిని అవలంభిస్తోంది.
తమకు అనుకూలం ఫలితాలు కనిపిస్తే ప్రిపోల్ సర్వేలు మంచివి.. వ్యతిరేకంగా ఉంటే చెడ్డవి.. ఇదేం ద్వంద్వ వైఖరి? జాతీయ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం ఉండాల్సి అవసరం లేదా?
నా వరకైతే ప్రిపోల్ సర్వేలకు వ్యతిరేకిని.. నిజానికి వీటి ఫలితాలు ఊగిసలాటలో ఉన్న తటస్త ఓటర్లను కొంత మేర ప్రభావితం చేస్తాయి.. మన ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటుకు కూడా ఎంతో విలువుంది.. జయాపజయాలను నిర్ణయించడానికి ప్రతి ఓటు కీలకమే..
నిజానికి ప్రిపోల్ సర్వేలు పెద్ద మోసం.. ఎవరు సర్వే చేయిస్తే వారికి అనుకూలంగా కొంత మేర మొగ్గు చూపిస్తాయి.. ప్రిపోల్ సర్వేలే నిజమైతే 2009 ఎన్నికల ముఖ చిత్రం మరోలా ఉండేది..

Saturday, November 2, 2013

Friday, November 1, 2013

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కమలం పువ్వుల చెర్వులు (Lotus Ponds) మూయించాలి, ఇవి బీజేపీకి ప్రచారంగా ఉపయోగపడుతున్నాయి అని కాంగ్రెస్ కోరగానే ఎన్నికల సంఘం సరేనంటూ ఆదేశాలు ఇచ్చేసింది..
మరి కాంగ్రెస్ పార్టీకి ప్రచార సాధనాలవుతున్న హస్తాలను ఏమి ఛేస్తారు? నరికేస్తారా? ఎన్నికలయ్యేదాకా జేబుల్లో దాచుకోమని ఆదేశిస్తారా?
ఈ లెక్కన ఢిల్లీలో చీపుర్లతో ఇళ్లు ఊడవ కూడదు.. చీపురు కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల గుర్తు కదా మరి..

రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ నోటీసులు - వార్త


ఐదున్నర దశాబ్దాల పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్ర స్వప్నం నెరవేరుతున్న వేళ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఎలా బాధపడిపోతున్నారో చూడండి.. ఈ సెంటిమెంట్లు ఇంతకాలం గుర్తుకు వచ్చి ఉంటే పరిస్థితి ఇలాగే ఉండేదా?.. తెలంగాణ ప్రజలు కూడా తెలుగు వారు, తమ కుటుంబ సభ్యులనే విషయాన్ని ఇంత కాలం మరిచారా?.. ఎవరిని మభ్య పెట్టడానికి ఈ సెంటిమెంట్లూ?.. ఆయింట్మెంట్లూ?..