Friday, November 22, 2013

జర్నలిజం వృత్తికి కళంకం..

తరుణ్ తేజ్ పాల్ కొందరికి గొప్ప జర్నలిస్టుగా కనిపించి ఉండొచ్చు.. నాకు మొదటి నుండి ఇతడిపై సదభిప్రాయం లేదు.. తేజ్ పాల్ చేతిలో అత్యాచారానికి గురైన మహిళా జర్నలిస్టు స్వయాన అతడి స్నేహితుని కూతురేనట.. ఇలాంటి నీచుడు జర్నలిస్టు అని అని చెప్పడానికే నాకు సిగ్గుగా ఉంది.. స్వయంగా తరుణ్ తేజ్ పాల్ నేరాన్ని అంగీకరించినా జర్నలిస్టు, అభ్యుదయ, ప్రజా, మహిళా సంఘాలు ఇంత వరకూ నోరు మెదపకుండా తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం ఆశ్యర్యంగా ఉంది.. ఏం నోళ్లు పడిపోయాయా?.. ఛీ వీరు అసలు మనుషులేనా?
ఈ అత్యాచార సంఘటన అంతర్గత వ్యవహారం అంటోంది తెహల్కా బృందం.. అంతర్గత విచారణ జరుపుతారట.. ఆరు నెలల పాటు ఎడిటర్ పదవిని త్యజిస్తున్నట్లు తనకు తాను శిక్ష విధించుకున్నాడీ పెద్ద మనిషి.. ఏం ఇదేమన్నా జాట్ల ఖాప్ పంచాయితీనా? తేజ్ పాల్ ఏమైనా చట్టాలకు అతీతుడా? చేసిన తప్పుకు శిక్ష అనుభవించనక్కరలేదా?
జర్నలిజం వృత్తికే కళంకలం తెచ్చిన తేజ్ పాల్ లాంటి వారిని కఠినంగా శిక్షించకపోతే ఈ వృత్తికే గౌరవం పోతుంది..

No comments:

Post a Comment