Thursday, September 17, 2015

పటేల్ గారిని స్మరించుకోవడం మన విధి..

హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో సంపూర్ణంగా విలీనమై ఇక్కడి ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారు.. ఇందుకు కారణం ఎవరో తెలుసా?.. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్..
స్వతంత్ర భారత దేశ తొలి హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సర్ధార్ పటేల్, ముందుగా స్వదేశీ సంస్థానాలపై దృష్టి సారించారు.. బ్రిటిష్ వారు పోతూ పోతూ మెలిక పెట్టి పోయారు.. సంస్థానాలు భారత్, పాకిస్తాన్ ఎందులైనా విలీనం కావచ్చట.. లేదా స్వతంత్రంగా ఉండొచ్చట.. ఇది దేశ సమగ్రతకు మప్పు అని గ్రహించారు పటేల్.. ఐదు వందల పైచిలుకు సంస్థానాలను విలీనం చేయడలో విజయం సాధించారు.. ఈ క్రమంలో మొండి కేసిన హైదరాబాద్, జునాగడ్ లను సైనిక చర్య ద్వారా దారికి తెచ్చారు..
హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ ప్రాంతం కాలక్రమంలో ఆంధ్ర్రప్రదేశ్ లో కనిసింది.. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంలోగా ఆవిర్భవించింది.. కానీ ఈ పరిణామాలన్నింటికీ మూలం ఉక్కు మనిషి సర్ధార్ పటేల్.. పటేల్ ఆ రోజున హైదరాబాద్ సమస్యను ప్రధాని నెహ్రూకు అప్పగించి ఉంటే?.. జమ్మూ కాశ్మీర్ సమస్యలా ఈనాటికీ రగులుతూనే ఉండేది.. హైదరాబాద్ విమోజన సందర్భంగా ఉక్కు మనిషిని స్మరించుకోవడం తెలంగాణ ప్రజల విధి..

అరుదైన రోజు..

ఈరోజు నిజంగా అరుదైన రోజు.. వినాయక చవితి, హైదరాబాద్ విమోచన దినం, ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సెప్టెంబర్ 17వ తేదీనే వచ్చాయి.. వినాయక చవితి ప్రతి ఏటా తిథి ప్రకారం వస్తుంది.. కానీ మిగతా రెండు సందర్భాలు క్యాలెండర్లో ప్రతి ఏటా ఒకే తేదీన వస్తుంటాయి.. హైదరాబాద్ విముక్తికి కారణమైన దివంగత ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్, నరేంద్ర మోదీ ఇద్దరూ ఒకే రాష్ట్రానికి చెందిన వారు కావడం మరో విశేషం..

భారత దేశంలో హైదరాబాద్ విలీనమైన మహోన్నత రోజు..

నిరంకుశ పాలన నుండి విముక్తి చెందిన రోజు.. స్వేచ్ఛ కోసం తపించిన ప్రజల బానిస సంకెళ్లు తెగిన రోజు.. తరతరాల బూజు వదిలిన రోజు.. హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనమైన రోజు ఇది..
17 సెప్టెంబర్ 1948..
భారత దేశమంతా బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందింది.. కానీ వారి సామంతుడైన ఏడో మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ సంస్థానాన్ని భారత దేశంలో విలీనం చేసే ప్రసక్తి లేదన్నాడు.. తాను స్వతంత్రంగా ఉంటానన్నాడు.. అవసరమైతే పాకిస్తాన్ లో చేరతానని బెదిరింపు..  
మధ్య యుగాల నాటి ప్యూడల్ వారసత్వం, మత మౌఢ్యం, నిరంకుశత్వం కలగలసిన పాలన.. ప్రజల సంక్షేమం ఏమాత్రం పట్టదు.. మెజారిటీ ప్రజల ఆకాంక్షలు అంటే లెక్కలేదు... మెజారిటీ ప్రజల భాషా సంస్కృతులకు విలువేలేదు.. సమాజంలో కొన్ని ఉన్నత వర్గాలు తప్ప, మిగతా వారివంతా బానిస బతుకులే.. ఒకవైపు దేశ్ ముఖ్, దేశ్ పాండే, దొరలు గ్రామీణ ప్రజల శ్రమను దోచుకునేవారు.. మరోవైపు కాశీం రజ్వీ నేతృత్వంలో రక్త పిపాసులైన రజాకార్లు ప్రజలపై పడి మారణకాండ సృష్టించారు..  మహిళల మానప్రాణాలు దోచుకున్నారు.. నగ్నంగా బతుకమ్మలు ఆడించారు..
ప్రజల ఆక్రందనలు నవాబు గారికి పట్టలేదు.. నిరంకుశ పాలనపై పోరాడిన ఆంధ్ర మహాసభ, ఆర్యసమాజం, స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలను నిషేధించాడు.. ఆ సంస్థల నాయకులను, కార్యకర్తలను జైలుపాలు చేసి చిత్ర హింసలు పెట్టాడు..
భారత దేశం నడి బొడ్డున క్యాన్సర్ కణితిలా మారింది హైదరాబాద్ సంస్థానం.. మెజారిటీ ప్రజలు భారత దేశంలో కలవాలని కోరుకుంటున్నారు.. వీరి ఆకాంక్షలపై నీళ్లు చల్లాడు నిజాం నవాబు.. హైదరాబాద్ పరిణామాలు ఎప్పటికప్పుడు గమనిస్తూ వచ్చారు కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్.. ఇక ఆలస్యం ఏమాత్రం పనికిరాదని నిర్ణయించుకున్నారు.. వెంటనే ఆపరేషన్ పోలో (పోలీసు యాక్షన్) అమలు చేశారు..

ఐదు రోజుల యుద్దంలో హైదరాబాద్ సైన్యం తోక ముడిచింది.. భారత సైన్యానికి ప్రజలు జేజేలు పలికారు.. ఏడు తరాల తన అసఫ్ జాహీ వంశ పాలన అంతరించిందని అర్థమైపోయింది ముసలి నవాబుకు.. విధిలేని పరిస్థితిలో లొంగుబాటును అంగీకరించాడు.. అలా 17 సెప్టెంబర్ 1948న హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో సంపూర్ణంగా విలీనం అయింది..

తొండమునేక దంతము..


Wednesday, September 16, 2015

హైదరాబాద్ విలీనాన్ని ఒప్పుకోవడం లేదా?

నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి పొందింది నిజం.. భారత దేశంలో విలీనం అయింది వాస్తవం.. మరి ఈ నిజం, వాస్తవం అంగీకరించేందుకు ఎందుకు భయం?
సెప్టెంబర్ 17 వచ్చినప్పుడల్లా ఎందుకీ నీలి నీడలు?.. సమైక్య రాష్ట్రంలో ఇదే తంతు.. స్వరాష్ట్రంలోనూ అదే విధానమా?
హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ భాగం కావడం అబద్దమా?.. ఆర్యసమాజం, స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు చేపట్టిన పోరాటం తప్పా?.. రాజకార్లు, దేశ్ ముఖ్ లు, జమీందార్ల అరాచకాలు నిజం కాదా?
తెలంగాణ గడ్డ భారత దేశంలో విలీనం కావడాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారా?.. తరతరాల నిజాము బూజు వదలడం మీకు నచ్చలేదా?.. నాటి హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉన్న మరాఠ్వాడా, హైదరబాద్ కర్ణాటక ప్రాంతాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా విలీన ఉత్సవాలు జరుగుతుంటే, ప్రధాన భూభాగమైన తెలంగాణలో ఎందుకు జరగవు?..
సమైక్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని జరపకపోవడాన్ని తప్పు పట్టింది తెరాస.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు కేసీఆర్.. మరి మన రాష్ట్రం మనకు వచ్చిన తర్వాత, ఆయనే అధికారంలో ఉన్నాక సెప్టెంబర్ 17 వేడుకలను ఎందుకు నిర్వహించడం లేదు?
హైదరాబాద్ విమోచన దినోత్సవం నిర్వహిస్తే ముస్లింలు బాధ పడతారని ఓ మూర్ఖపు వాదన వినిపిస్తున్నారు. రాచరిక పాలన పీడ విరుగడైతే వారెందుకు బాధ పడతారు?.. అసఫ్ జాహీ వంశ పాలనకు వారెలా ప్రతినిధులు అవుతారు?..
నిజాం పాలన అంతం కావాలని అక్షరాయుధాలు ఎక్కుపెట్టి రజాకార్ల చేతిలో హతమైన షోయబుల్లా ఖాన్ ఎవరు? విసునూరు దేశ్ ముఖ్ రామచంద్రారెడ్డి దాష్టీకానికి బలైన షేక్ బందగీ, తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న ముక్దుం మొయినుద్దీన్ ఎవరు?.. వీరు ముస్లింలు కాదా?..
సెప్టెంబర్ 17ను ఎందుకు మతంతో ముడిపెడుతున్నారు?.. జాతీయ జన జీవన స్రవంతి నుండి ముస్లింలను ఎందుకు దూరం చేస్తున్నారు?.. భారత దేశ స్వాతంత్ర్య పోరాటంలో, హైదరాబాద్ విముక్తి పోరాటంతో ముస్లింలకు కూడా భాగస్వామ్యం ఉంది.. వారి పేరు చెప్పుకొని కొన్ని శక్తులు హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని వ్యతిరేకించడం అర్థం లేదని పని..

భారత దేశానికి ఆగస్టు 15, 1947న స్వాతంత్ర్యం రావడం ఎంత నిజమో, సెప్టెంబర్ 17, 1948న భారత దేశంలో హైదరాబాద్ విలీనం కావడమూ అంతే వాస్తవం.. సంకుచిత విధానాలు, రాజకీయాలు, వితండవాదాలు, కుహనా లౌకిక వాదాన్ని కట్టిపెట్టి సెప్టెంబర్ 17 ఉత్సవాలను అధికారికంగా ఘనంగా జరుపుకుందాం..

Wednesday, September 9, 2015

జనం భాషే కాళోజీ గోడు..

రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రాంరాజా.. ఇది ఆయన అసలు పేరు.. తండ్రి మరాఠి, తల్లి కన్నడిగ.. కానీ తెలుగే ఆయన భాష, మాట, రాత, శ్వాస అయింది..  నిరంకుశ నిజాం పాలనను నిరసించాడు. అరాచక పాలనపై అక్షరాయుధాలతో పోరాటం చేశాడు.. సత్యాగ్రహం చేసి జైలుకు వెళ్లాడు. ఆర్యసమాజం, ఆంధ్రమహాసభ, స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టులు, విశాలాంధ్ర ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పోరు, పౌర హక్కులు, గ్రంధాలయ ఉద్యమం.. ఇలా అన్నింటా తానై పని చేశాడు. అన్ని సిద్దాంతాలను సమానంగా ఆదరించాడు. జనం ఆవేదనే ఆయన గోడు అయింది.. ప్రజాస్వామ్యవాది, వ్యక్తి స్వేచ్ఛను గట్టిగా బలపరిచాడు.. అన్నింటికీ మించి గొప్ప మానవతా వాది.. ఆయనే కాళోజీ నారాయణ రావు.
‘ పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది..’ అంటూ లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ రావు దివంగతులైనప్పుడు కాళోజీ నివాళి అర్పించారు.. ఈ పదాలు ఆయన జీవితానికీ చక్కగా వర్తిస్తాయి..
కాళోజీ కవిగా ఎక్కువ ప్రసిద్ధి పొందారు.. తెలుగు భాష అంటే ఆయనకు ప్రాణం. మాతృ భాషను అవమానిస్తే అసలు సహించేవారు కాదు..
తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు-సంకోచ పడియెదవు సంగతేమిటిరా?..అని నిలదీశారు అంతే కాదు..
ఏ భాష నీది ఏమి వేషమురా, ఈ భాష ఈ వేషమెవరి కోసమురా, ఆంగ్లమందున మాటలనగానే ఇంత కుల్కెదవెందుకురా, తెలుగువాడివై తెలుగు రాదనుచు సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా, అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు, సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా..’ అంటూ ఈసడించారు కాళోజీ.
తెలుగులో అన్ని మాండలికాలను సమానంగా ఆదరించాలని కోరేవారు.. ఒక ప్రాంతానిదే తెలుగు భాషగా చలామణి కావడాన్ని సహించలేకపోయారు. రెండున్నర జిల్లాల భాష తెలుగు భాష ఎట్టయితదని ప్రశ్నించారు..
తెలంగాణ యాస భాషలను గేలి చేసిన తోటి తెలుగువారిని అసలు సహించలేకపోయారు కాళోజీ..
‘’ తెలంగాణ యాస నెపుడు యీసడించు భాషీయులసుహృద్భావనఎంతని వర్ణించుట సిగ్గుచేటు..’ కవిత ద్వారా ఎండగట్టారాయన..
ఎవని వాడుక భాష వాడు రాయాలె. ఇట్ల రాస్తే అవతలోనికి తెలుస్తదా అని ముందర్నే మనమనుకునుడు, మనను మనం తక్కువ చేసుకున్నట్లె. ఈ బానిస భావన పోవాలె. నే నెన్నో సార్లు చెప్పిన. భాష రెండు తీర్లు - ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకు బడుల భాష. పలుకు బడుల భాషగావాలె..’ అని స్పష్టంగా చెప్పారు కాళన్న..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళోజీ నారాయణ రావు జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించింది.. ఈ సందర్భంగా ఆ మహావ్యక్తిని స్మరించుకుందాం..

Monday, September 7, 2015

రాజా వారు ఇకనైనా బుద్దిగా ఉండండి..

డిగ్గీ రాజా అధికారికంగా వివాహం చేసుకున్నారట.. ముందు హానీమూన్, తర్వాత పెళ్లి.. భార్య పోయి వారాలైనా గడవక ముందే, మరో వివాహితతో వ్యవహారం రచ్చగా మారితే కానీ ఈ తాతయ్యకు చేసిన తప్పు తెలిసిరాలేదు పాపం.. రాజా వారు ఇకనైనా బుద్దిగా ఉండాలని కోరుకుందాం..

Saturday, September 5, 2015

సంస్కారం మరచిన పూర్వ విద్యార్థి,,

ఈయ‌న పేరు శేఖ‌ర్ గుప్తా.. జాతి హితం పేరిట ప్ర‌తివారం సాక్షిలో కాల‌మ్ నిర్వ‌హిస్తాడు.. శిశుమందిర్‌లో చ‌దువుకున్నాడ‌ట‌.. 
చిన్నపుడు జ‌హంగీర్ గురుంచి త‌న‌కు చెప్ప‌లేదంటూ తెగ బాధ ప‌డిపోయాడు.. శిశుమందిర్‌లో చ‌దువుకున్నందుకు త‌న జీవితానికి మంచి జ‌రిగింద‌ని చెబుతూనే, కానీ.. అంటూ స‌న్నాయి నొక్కులు వినిపిస్తున్నాడు.. 

శిశుమందిర్లో తాను నేర్చుకున్న సంస్కారాలపై బురద చల్లుతున్నాడు.. ఉపాధ్యాయ దినోత్సవం రోజున తన ఆచార్యుల ఋణం ఇలా తీర్చు కున్నాడు. 

ఇలాంటి వారిని ఏమ‌నాలో మీరే తేల్చుకోండి.

శ్రీకృష్ణ భగవానుడు లోకానికి జగద్గురువు.. కృష్ణాష్టమి, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు..