Tuesday, December 27, 2016

బీకామ్ లో ఫిజిక్స్ అట..

చిన్నప్పుడు నేను డ్రాయింగ్ బాగా వేసేవాన్ని.. ఆరో తరగతిలో అనుకుంటా మా మాస్టారు చెప్పారు.. ఫైన్ ఆర్ట్స్ కోర్సు చేయరా అని.. అది మనసులో బాగా కూర్చుండిపోయింది.. కొంత కాలానికి అనుకున్నాను.. ఫైన్ ఆర్ట్స్ బదులు బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (బీఏ) చేస్తే బాగుంటుంది కదా అని.. ఆర్ట్స్ చదివితే మంచి ఆర్టిస్ట్ (చిత్రకారున్ని) అవుతానని అనిపించింది.. ఆ వయస్సులో నా అమాయకత్వం అలా ఏడిచింది.. కానీ ఏడో తరగతి వచ్చే సరికి తత్వం బోధ పడింది..

ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నానంటే.. అప్పట్లో నా చిన్ని బుర్రకు ఫైన్ ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ తేడా తెలియదు.. ఇప్పుడూ అంతే.. విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (బీకామ్)లో ఫిజిక్స్ చదువుకున్నారట.. అదెలా చెప్మా?.. 

కళాకారుడి ముసుగులో బరితెగింపు

మన దేశంలో కళాకారుల ముసుగులో కొందరు సైకోగాళ్లు యదేచ్ఛగా చలరేగిపోతూ మత విశ్వాసాలతో ఆడుకుంటున్నారు.. వీరికి కొందరు మేతావులు ఆహా, ఓహో అంటూ వంతపాడుతున్నారు.. తాజాగా నీలాంబర్ చక్రబర్తి అనే దౌర్భాగ్యుడు ఏకంగా కాళీమాత, జీసస్, బుద్ధ భగవానుడి అవమానించాడు.. (మహ్మదీయుల జోలికి పోలేదు.. వారు ఊరుకోరని భయం ఏమో?) ఒకే చిత్రంలో అన్ని మతాల దేవుళ్లను ఇరికించి సర్వధర్మ సమభావన చాటుకున్న వీడిని ఏమనాలి.. జాదవ్ పూర్ యూనివర్సిటీలో ఫిలాసపీ చదువుకుంటున్న వీడి పైత్యాన్ని ఏ విధంగా సమర్ధించాలి?
గతంలో ఎం.ఎఫ్.హుస్సేన్ అనే దగుల్భాజీ కూడా ఇలాగే కళాకారుని ముసుగేసుకొని మెజారిటీ ప్రజల మత విశ్వాసాలతో ఆడుకోగా, సోకాల్డ్ మేతావులంతా వాడినిక సమర్ధించుకొచ్చారు.. చివరకు న్యాయస్థానాలు కన్నెర్ర చేయడంతో దేశం వదిలిపారిపోయాడు.. ఓ గల్ఫ్ దేశంలో వృద్ధాప్యంతో దిక్కులేని చావు చావగా స్వదేశానికి కూడా తీసుకురాకుండా అక్కడే పూడ్చేశారు..
చేవ చచ్చి, చీమూ నెత్తురు లేని భారతీయులు ఇలాంటి వారిని భరించాల్సిందేనా?

http://postcard.news/will-shocked-know-left-ideologist-posted-hindu-god-facebook/    

Tuesday, December 20, 2016

వీరికి ఉరి కన్నా భయంకర శిక్షలు అవసరం

అప్పుడే బస్సు దిగిన ఓ బాబాయి బస్టాప్ నుండి ఇంటికి వెళ్లే హడావుడిలో ఉన్నాడు.. ఓ పిన్నిగారు షాపింగ్ కోసం వచ్చారు.. ఓ తమ్ముడు స్నేహితులతో కలిసి చాయ్ తాగుతూ కబుర్లు చెబుతున్నాడు.. థియేటర్లో ఆడుతున్నది ఏ సినిమా అంటూ ఓ యువకుడు అటువైపు చూస్తున్నాడు.. ఓ ఆటోవాలా సిగరెట్ ఊదుతూ గిరాకీ కోసం చూస్తున్నాడు.. కొందరు కాలేజీ అమ్మాయిలు, అబ్బాయిలు ట్యూషన్ పూర్తి చేసుకొని కబుర్లు చెబుకుంటూ ఇంటికి వెళుతున్నారు.. షాపులవారు కస్టమర్లతో బిజీగా ఉన్నారు..
దిల్ సుఖ్ నగర్ లో ప్రతి సాయంత్రం ఇవి సాధారణ దృశ్యాలు.. కానీ దురదృష్టవశాత్తు ఆ రోజు ఫిబ్రవరి 21, 2013.. హఠాత్తుగా భారీ పేలుడు చోటు చేసుకుంది.. ఆ తీవ్రతకు ఎన్నో మానవ శరీరాలు ఎగిరిపడి తునాతునకలైపోయాయి.. జనం ఏ జరిగిందో తెలియక అటూ ఇటూ పరుగెడుతున్నారు.. కొద్ది సేపటికే మరో పేలుడు.. అదే దృశ్యం రిపీట్.. 18 మంది దుర్మరణం.. 131 మందికి తీవ్ర గాయాలు..

యాదృచ్చికంగా నేను ఆనాటి విశాద ఘటనా స్థలంలో ఉన్నాను.. నేనోంతో ఇష్టపడే దిల్ సుఖ్ నగర్ ఇలా దిల్ దుఖ్ నగర్ కావడం ఎంతో కలిచివేసింది.. ఆనాటి ఘోరకలికి కారణమైన ఐదుగురు ముష్కరులకు ఉరిశిక్ష పడటం నాకు అందరికీ సంతోషం కలిగించింది.. కానీ నాకు కొంత అసంతృప్తి మిగిలింది.. శిక్ష పడినా ఈ నరరూప రాక్షసుల మోహాల్లో ఎలాంటి విషాదం లేదట.. పైగా పైశాచిక ఆనందం.. తమకు కలగబోయే ఊహాజనిత జన్నత్ (స్వర్గం) సుఖాలు కళ్లముందు మెదిలి ఉండొచ్చు.. మతం పేరిట మారణహోమం సృష్టించి అమాయకుల ఉసురు తీసిన వీరిని వారి దేవుడు స్వర్గానికి పంపుతాడో నరకానికి పంపుతాడో తెలియదు.. ఉరేస్తే ఎలాంటి బాధ లేకుండా క్షణాల్లో వారి ప్రాణాలు పోతాయి.. అంత తేలికగా వీరిని శిక్షిస్తే ఎలా?.. గరుడ పురాణంలో కనిపించే శిక్షలన్నీ ఇక్కడే అమలు చేసి పంపించేయాలి.. అప్పుడే ఉగ్రదాడి అమరులకు నిజమైన నివాళి..

Thursday, December 15, 2016

చాయ్ జాతీయ పానీయం కావాలి..

గరం గరం చాయ్.. ఇది లేనిదే నాకు రోజు గడవదు.. దాదాపు భారతీయులందరి పరిస్థితి ఇంతే అనుకుంటాను..బ్రిటిష్ వాడు పోతూ పోతూ మనకు అంటించిన వ్యసనం అంటారు.. వ్యసనం అనే కంటే బహుమతి అనడం సబబేమో..
శరీరానికి ఉత్తేజాన్ని కలిగించే తేనీటిని పెద్దలు మొదట్లో అనుమానంగానే చూశారు.. నిజానికి ఇందులో కెఫేన్ ఉన్నా ఇది అంతగా అనారోగ్యాన్ని కలిగించేంది కాదు.. పైగా టీ లోని బి విటమిన్, రొబోప్లేవిన్, నియాన్ తదితర పదార్ధాలు శరీరానికి మేలు చేసేవే.. ముఖ్యంగా క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నట్లు గుర్తించారు.. అయితే ఏ విషయంలో అయినా అతి పనికి రాదు.. ఇది టీకీ వర్తిస్తుంది.. చాయ్ అదే పనిగా తాగితే మన శరీరం ఇతర ఆహార పదార్ధాలను స్వీకరించడం కష్టమవుతుంది.. రోజుకు రెండు లేదా మూడు కప్పులకే టీని పరిమితం చేసుకోవండం ఉత్తమం..
నాబోటీ ప‌క్కా హైద‌రాబాదీల‌కు చాయ్ అంటే పంచ ప్రాణాలతో సమానం.. ఇరానీ చాయ్ గురుంచి అందరూ గొప్పగా చెప్పుకుంటున్నా అందులో రుచి తప్ప సాధారణ టీతో పోలిస్తే పెద్దగా సుగుణాలు ఏవీ లేవు. నిజామ్ పాలకుల సమయంలో కొందరు ఇరానీ వ్యాపారులు దక్కన్ కు చాయ్ పరిచయం చేయడం వల్ల ఇరానీ చాయ్ అనే బ్రాండ్ వ్యాప్తిలోకి వచ్చింది.. నిజానికి మనం తాగే చాయ్ ఇరాన్ లో ఎక్కడా తాగరు.. మనం మాత్రం ఆ పేరు చెప్పుకొని లొట్టలేసుకుంటూ జుర్రు కుంటాం.. గత దశాబ్ద కాలంగా నగరానికి పరిచయం అయిన రోడ్ సైడ్ డబ్బా టీ సెంటర్లు సాంప్రదాయ చాయ్ కు గట్టి పోటీ ఇస్తునా అందులో రుచీ పచీ ఉండదు.. సాధారణంగా మనం తాగున్న టీ కన్నా సహజ సిద్దమైన గ్రీన్ టీతో ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.. ప్రయత్నించండి..
ఒక చాయ్ వాలా మ‌న దేశానికి ప్ర‌ధాన‌మంత్రి కావ‌డం కూడా గ‌ర్వ‌కార‌ణం.. ప్ర‌పంచంలో అత్య‌ధికంగా తేయాకును ఉత్ప‌త్తి చేస్తున్న‌ది, తేనీటిని తాగుతున్న‌ది భార‌త దేశంలోనే.. చాయ్‌ను జాతీయ పానీయంగా ప్ర‌క‌టించాల‌నే  డిమాండ్ చాలా కాలంగా ఉంది.. ఈ కోరిక‌ను మ‌న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నెర‌వేర్చాల‌ని కోరుకుంటున్నాను.. 
ఇవాళ అంతర్జాతీయ తేనీటి దినోత్సవం (డిసెంబర్15).. అందుకే ఈ చాయ్ కీ బాత్‌..

Saturday, December 10, 2016

స్పూర్తినిచ్చే భగవద్గీత

భగవద్గీత.. ఈ పేరు వినగానే చాలా మంది హిందువుల పవిత్ర గ్రంథం అనేస్తారు..  కానీ నా దృష్టిలో ఇది కేవలం ఆధ్యాత్మిక గ్రంధం మాత్రమే కాదు.. ప్రపంచంలో మొదటి వ్యక్తిత్వ వికాస గ్రంథం.. సమాజంలో మనిషి ఉత్తమ పౌరునిగా ఎదిగేందుకు అవసరమైన మార్గాన్ని భగవద్గీత చూపిస్తుంది.. శ్రీకృష్ణ పరమాత్ర్మడు మహాభారత యుద్ధంలో అర్జునుడికి చేసిన కర్తవ్య బోధన భగవద్గీతగా ప్రసిద్దికెక్కింది.. ఈ 18 అధ్యాయాల భగవంతుని గీతంలో వేదాలు, ఉపనిషత్తుల సారాంశం నిక్షిప్తమై ఉంది.. భారతీయ ఆధ్యాత్మిక చింతనలో భగవద్గీతకు ప్రముఖ స్థానం ఉంది. అయితే దీన్ని కేవలం ధార్మిక గ్రంధంగా చూస్తే మది మన అజ్ఞానమే అవుతుంది..
తెలుగువారికి ఘంటసాల ఆలపించిన భగవద్గీతతో పరిచయం ఎక్కువ..
భగవద్గీత భారత జాతీయోధ్యమం, ఆధ్యాత్మిక, తాత్విక, సాంస్కృతిక పునర్జీవనాలకు స్పూర్తిని ఇచ్చింది.. మహర్షి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, బాలగంగాధర్ తిలక్, మహాత్మగాంధీ, బంకించంద్ర చటోపాధ్యాయ, అరబిందో ఘోష్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, వీర్ సావర్కార్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాంప్రసాద బిస్మిల్, ఖుదీరాంబోస్, సుఖ్ దేవ్, రాజగురు, ఉద్దాం సింగ్ లాంటి ఎందరో మహనీయులు, వీరులు భగవద్గీత నుండి స్పూర్తిని పొందారు..
భగవద్గీత అంటే చనిపోయినప్పుడు వినిపించే ఘంటసాల సంగీతం అనే భావన చాలా మందిలో ఉండటం దురదృష్టకరం.. ఆత్మీయులను కోల్పోయిన సమయంలో బాధను మరచిపోయేందుకు, ఆధ్మాత్మిక చింతన కోసం భగవద్గీతను వినడంలో తప్పులేదు.. కానీ నిత్య జీవితంలో అన్ని సందర్భాల్లోనూ మనం గీతా పారాయణం చేయడంతో పాటు అందులోని విషయాలను ఆచరించాలి..
మరి కొందరు భవవద్గీతను పదవీ విరమణ తర్వాత కాలక్షేపం కోసం చదువుతారు.. కానీ జీవిత చరమాంకంలో మాత్రమే గీతను చదువుకోవడం వల్ల ఏం లాభం? ముందుగానే చదువుకుంటే వారు తమ జీవితాలను మరింత ఫలవంతంగా తీర్చి దిద్దుకునేవారు కదా?
భగవద్గీత కేవలం హిందువులదేనా?.. అలా అని శ్రీకృష్ణుడు ఎక్కడా అందులో చెప్పలేదే.. మానవ జీవితాన్ని మార్చేసిన ఆవిష్కరణలు, సిద్దాంతాలు ఒక మతానికే పరిమితం కాలేదు కదా? మరి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన గీతాన్ని ఒక మతంతో ముడి పెట్టడం సమంజసమేనా? హిందుత్వం ఒక జీవన విధానం.. భగవద్గీత ఈ ధర్మాన్ని ఆచరించే వారి జీవితాన్ని పరిపూర్ణం చేస్తుంది.. అన్య మత విశ్వాసులకు ఈ అదృష్టం ఎందుకు దక్కరాదు?
నేడు గీతాజయంతి.. మార్గశీర్ష మాసం శుద్ధ ఏకాదశి రోజున భగవద్గీత ఆవిర్భవించింది.. ఈ శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు..

Thursday, December 8, 2016

రాజకీయ వ్యంగ్యానికి చిరునామాకు ఆశ్రునివాళి

అందరివాడు.. ఈ పదానికి సరైన అర్థం చో రామస్వామి.. ఆయన తమిళ పత్రిక తుగ్లక్ ఎడిటర్.. అయినా రాజకీయ విమర్శకుడిగా దేశ వ్యాప్త గుర్తుంపు తెచ్చుకున్నారు.. రామస్వామి కలమనే కత్తికి అన్ని వైపులా పదును ఉంటుంది.. వ్యంగ్య విమర్శలకు పేరొందిన చో రామస్వామి పత్రిక తుగ్లక్ ముఖచిత్రంపై కార్టూనే ప్రధానంగా కనిపించడం విశేషం.. రాజకీయ నాయకులు అందరితోనూ సన్నిహితంగా ఉంటాడు.. కానీ విమర్శించాల్సి వస్తే ఎవరికీ వదలడు.. నీతి నిజాయితీ, విలువలను పాటించారు రామస్వామి.. జయలలితతోనూ, కరుణానిధితోనూ స్నేహ సంబంధాలు నడిపిన ఘటికుడు చో.. జయలలితకు రామస్వామి ఎంతో సన్నిహితుడు.. అయినా ఒక దశలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఆమెను వ్యతిరేకించాడు.. వాజపేయి హయాంలో ఎన్డీఏ కూటమిలో చేర్చడంలో ప్రధాన పాత్ర రామస్వామిదే.. విచిత్రంగా జయ ఆయన సత్సంబంధాలు పునరుద్దరించుకున్నారు.. అదీ రామస్వామి ప్రత్యేకత.. చో రామస్వామి ఇక లేదనే వార్త బాధాకరమే,. జయలలిత కన్నుమూసిన రెండో రోజే, అదే ఆస్పత్రిలో చో కూడా దేహ పరిత్యాగం చేయడం యాదృచ్చికమే.. చో రామస్వామికి నా వంతుగా నివాళి..

Tuesday, December 6, 2016

జయలలిత..
ఈ పేరు వినగానే భయమెరుగని ధీర వనిత కళ్ల ముందు మెదులుతుంది.. ప్రత్యర్థులకు ఆమె నియంతగా కనిపిస్తుంది.. కానీ కోట్లాది మంది తమిళులు అమ్మ అని పిలుచుకుంటారు..
మైసూర్ రాష్ట్రంలోని సాధారణ తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన పుష్పవల్లి ప్రస్థానం సినీ రంగంలో జయలలితగా మొదలై పొరుగున ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రిగా ముగిసింది.. ఈ విజయం అంత తేలికగా కొనసాగలేదు..
జయలలిత వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లకు గురైంది.. పూలమ్మిన చోటే కట్టెలమ్మాల్సి వచ్చినా రాజీ పడలేదు.. తన అభినయంలో చలన చిత్రసీమను ఉర్రూతలూపిన జయ, రాజకీయ సముద్రం ఎనో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు.. ఎంజీఆర్ మరణానంతరం అన్నా డీఎంకేలోని ప్రత్యర్థులు ఆమెను బయటకు నెట్టేస్తే, ఏఐఏడీఎంకే పార్టీని స్థాపించి ఆధిక్యతను సాధించడమే కాదు.. వారిని కలిపేసుకున్నారు..
తమిళనాడు శాసనసభలో ముఖ్యమంత్రి కరుణానిధి ప్రోద్భలంతా డీఎంకే ఎమ్మెల్యేలు జయలలితను చీర లాగి అవమానించారు.. ఆగ్రహించిన జయ రాష్ట్రమంతా తిరిగి ఒక మహిళామూర్తిగా తనకు జరిగిన అవమానాన్ని చాటి చెప్పారు.. అఖండ మెజారిటీతో తన పార్టీని గెలిపించుకుకొని ముఖ్యమంత్రి పదవిని చేపట్టడమే కాదు, కరుణానిధిపై బదులు తీర్చుకున్నారు..
కాలక్రమంలో జయలలిత ఎన్నో అవినీతి ఆరోపణలు, సమస్యలు ఎదుర్కొన్నారు.. ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.. జైలు జీవితాన్ని అనుభవించారు.. ఒక దశలో నమ్మిన వారే ఆమెనే మోసం చేసేందుకు ప్రయత్నించారు.. అయినా ఓర్పు, నేర్పుతో పోరాటం సాగించారు జయ.. కాదన్న ప్రజలనే ఒప్పించి తిరిగి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు..
ప్రభుత్వంలో మంత్రులతో సహా పార్టీలో సీనియర్ నాయకులు కేడర్ అంతా జయకు లాగిలపడి పాదాభివందనాలు చేయడం చూస్తుంటే ఆమెలో నియంతృత్వ పోకడలు కనిపింస్తాయి.. కానీ జీవితంలో ఎన్నో సవాళ్లను ధీటుగా ఎదుర్కొన్న నాయకురాలికి అది తగిన సత్కారమేనని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.. తన వైఖరిపై ఎన్ని విమర్శలు వచ్చినా భయపడలేదు.. జయ పగబడితే ఎంటి వారైనా అంతే సంగతులు అని చాలా సార్లు నిరూపితమైంది..
తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత చేపట్టిన తన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా కొత్త ఒరవడిని సృష్టించారు.. ప్రత్యర్థులకు, విమర్శకులకు అవి జనాకర్శక పథకాలుగా కనిపించవచ్చు.. కానీ అవే ఆమెను ప్రజల హృదయాలను గెలుచుకున్నాయి.. అమ్మగా చిరస్థాయి గుర్తింపును కల్పించాయి.. లక్షలాది మంది అభిమానులు ఇప్పుడు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు.. తమిళనాడు అమ్మలేని లోటును స్పష్టంగా చూస్తోంది..

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఆశ్రు నివాళి..

Saturday, December 3, 2016

జాతీయ గీతం కూడా వివాదమేనా?

సినిమా హాళ్లలో జాతీయ గీతం .. కానీ కోర్టుల్లో వద్దు.. రెండు రోజుల తేడాలో సుప్రీం కోర్టు భిన్నమైన స్పందన కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది.. ఇదే సమయలో మరో సందేహం.. దేశంలోని అన్ని న్యాయ స్థానాలతో పాటుగా ప్రభుత్వ కార్యాలయాల్లో, వివిధ రాష్ట్రాల సచివాలయాలు, కార్యాలయాలు, ప్రభుత్వ– ప్రయివేటు విద్యా సంస్థల్లో ప్రతి నిత్యం రెండు పూటలా, లేదా ఒక సమయంలో అయినా ఎందుకు జాతీయ గీతాన్ని ఆలపించకూడదు?

దేశ ప్రజల్లో మాతృభూమి, జాతీయ గీతం, చిహ్నాల పట్ల విధేయత, ప్రేమ, భక్తి, గౌరవం కచ్చితంగా ఉండాలి.. ఇవి లోపించడం వల్లే మన దేశంలో ఉగ్రవాదం, వేర్పాటు వాదం పెరిగిపోతోంది.. దేశ భక్తిని మతంతో ముడిపెట్టరాదు... ఇంత వరకూ మనకు ఎలాంటి అభిప్రాయ బేధాలు ఉండాల్సిన అవసరం లేదు.. కానీ..
సినిమా హాళ్లలో జాతీయ గీతాలాపన ఎలా స్వాగతించాలో అర్థం కావడం లేదు.. జాతీయ గీతం ఆలపించే సమయంలో విధిగా లేచి నిలబడి గౌరవాన్ని ప్రకటించాలి.. వీలైతే మనమూ ఆలపించాలి.. సినిమాలు చూడటానికి వచ్చేవారిలో రకరకాల వ్యక్తులు ఉంటారు.. తాగుబోతులు, జూదరులు, వ్యభిచారులు, రౌడీలు, చిల్లర దొంగలు.. ఇలా రకరకాల అసాంఘిక శక్తులు హళ్లలోకి వస్తుంటారు.. వీరి నుండి మనం ఎలాంటి దేశభక్తిని ఆశించగలం?
మరోవైపు ఇప్పుడు వస్తున్న చిత్రాల్లో హింస, శృంగారం, ద్వంద్వార్థాలు, వెలికి హాస్యం అధికంగా ఉంటున్నాయి.. పెద్దలకు మాత్రమే, ‘ఏ’ గ్రేడు చిత్రాలు సరేసరి.. ఇలాంటి చిత్రాలు ప్రదర్శిస్తున్న హాలులో జాతీయ గీతాన్ని ఎలా ఆలపించగలం?.. న్యాయస్థానాలు తీర్పు ఇచ్చే ముందు ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే బాగుండేది.. అయితే దేశభక్తి, సందేశాత్మక, మంచి చిత్రాలు ప్రదర్శించినప్పు జాతీయ గీతం ఆలపిస్తే చాలా బాగుంటుంది.. విచిత్రం ఏమిటంటే న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో బీజేపీ, సంఘ్ పరివార్ కు సంబంధం లేదు.. అయినా కొందరు వ్యక్తులు, సంస్థలు, మీడియా అప్పుడే ఈ సంస్థలను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానాలు చేస్తున్నాయి.. దేశభక్తి వీరికి మాత్రమే పేటెంట్ హక్కా?
జాతీయ గీతాన్ని కేవంలం పవిత్రమైన స్థలాల్లోనే ఆలాపించాలి అని నా భావన.. ఉదాహరణకు బహిరంగ సభలు, ప్రభుత్వ – ప్రైవేటు కార్యక్రమాలు, పార్టీల సభలు, చర్చాగోష్టులు, విద్యాసంస్థలు.. ముఖ్యంగా ప్రభుత్వం ద్వారా, ప్రభుత్వ సహాయంతో నడిచే ప్రతి సంస్థలోనూ జాతీయ గీతం ఆలపించాల్సిందే.. ఇంత వరకూ ఎవరికీ అభ్యంతరం ఉందు.. చివరగా కోర్టుల్లో జాతీయ గీతం అవసరం లేదు అని ధర్మాసనం వారు తమ నిర్ణయాన్ని సవరించుకోవాల్సిందినా నా మనవి..

Friday, December 2, 2016

మరీ అతి చేస్తున్న మమత..

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరీ అతి చేస్తున్నారు.. ఆ రాష్ట్రం భారత దేశంలో భాగం కాదా?.. మన సైన్యం తనిఖీలు చేపడితే యాగీ చేయడం ఏమిటి?.. దేశ రక్షణ కోసం కంటికి రెప్పలా పోరాడుతున్న మన సైన్యానికి దేశంలో ఎక్కడికైనా వెళ్లుతుంది.. సైన్యం ఏమైనా బెంగాల్ లో సాధారణ పౌరులకు ఇబ్బంది కలిగిస్తే, కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి ఒక ముఖ్యమంత్రిగా మమతకు పూర్తి హక్కు ఉంది.. కానీ నల్లధనంపై పోరాటం చేపట్టిన ప్రధాని నరేంద్ర మోదీపై కోపంతో సైన్యంపై కూడా రాజకీయ విమర్శలు చేయడం దారుణం..

నిన్న విమాన ల్యాండింగ్, ఇవాళ సైన్యం మొహరింపు.. ఈ రెండు అంశాలను ఆమె రాజకీయం చేయడం ద్వారా సెల్ప్ గోల్ చేసుకున్నారు.. మమతా బెనర్జీకి చిత్త శుద్ధి ఉంటే బెంగాల్ లో దొంగనోట్లను అరికట్టాలి.. శారదా కుంభకోణంపై దర్యాప్తు జరపాలి,, బంగ్లాదేశ్ నుండి అక్రమ చొరబాట్లను అరికట్టాలి.. అంత ధైర్యం ఆమెకు ఉందంటారా?