Tuesday, December 20, 2016

వీరికి ఉరి కన్నా భయంకర శిక్షలు అవసరం

అప్పుడే బస్సు దిగిన ఓ బాబాయి బస్టాప్ నుండి ఇంటికి వెళ్లే హడావుడిలో ఉన్నాడు.. ఓ పిన్నిగారు షాపింగ్ కోసం వచ్చారు.. ఓ తమ్ముడు స్నేహితులతో కలిసి చాయ్ తాగుతూ కబుర్లు చెబుతున్నాడు.. థియేటర్లో ఆడుతున్నది ఏ సినిమా అంటూ ఓ యువకుడు అటువైపు చూస్తున్నాడు.. ఓ ఆటోవాలా సిగరెట్ ఊదుతూ గిరాకీ కోసం చూస్తున్నాడు.. కొందరు కాలేజీ అమ్మాయిలు, అబ్బాయిలు ట్యూషన్ పూర్తి చేసుకొని కబుర్లు చెబుకుంటూ ఇంటికి వెళుతున్నారు.. షాపులవారు కస్టమర్లతో బిజీగా ఉన్నారు..
దిల్ సుఖ్ నగర్ లో ప్రతి సాయంత్రం ఇవి సాధారణ దృశ్యాలు.. కానీ దురదృష్టవశాత్తు ఆ రోజు ఫిబ్రవరి 21, 2013.. హఠాత్తుగా భారీ పేలుడు చోటు చేసుకుంది.. ఆ తీవ్రతకు ఎన్నో మానవ శరీరాలు ఎగిరిపడి తునాతునకలైపోయాయి.. జనం ఏ జరిగిందో తెలియక అటూ ఇటూ పరుగెడుతున్నారు.. కొద్ది సేపటికే మరో పేలుడు.. అదే దృశ్యం రిపీట్.. 18 మంది దుర్మరణం.. 131 మందికి తీవ్ర గాయాలు..

యాదృచ్చికంగా నేను ఆనాటి విశాద ఘటనా స్థలంలో ఉన్నాను.. నేనోంతో ఇష్టపడే దిల్ సుఖ్ నగర్ ఇలా దిల్ దుఖ్ నగర్ కావడం ఎంతో కలిచివేసింది.. ఆనాటి ఘోరకలికి కారణమైన ఐదుగురు ముష్కరులకు ఉరిశిక్ష పడటం నాకు అందరికీ సంతోషం కలిగించింది.. కానీ నాకు కొంత అసంతృప్తి మిగిలింది.. శిక్ష పడినా ఈ నరరూప రాక్షసుల మోహాల్లో ఎలాంటి విషాదం లేదట.. పైగా పైశాచిక ఆనందం.. తమకు కలగబోయే ఊహాజనిత జన్నత్ (స్వర్గం) సుఖాలు కళ్లముందు మెదిలి ఉండొచ్చు.. మతం పేరిట మారణహోమం సృష్టించి అమాయకుల ఉసురు తీసిన వీరిని వారి దేవుడు స్వర్గానికి పంపుతాడో నరకానికి పంపుతాడో తెలియదు.. ఉరేస్తే ఎలాంటి బాధ లేకుండా క్షణాల్లో వారి ప్రాణాలు పోతాయి.. అంత తేలికగా వీరిని శిక్షిస్తే ఎలా?.. గరుడ పురాణంలో కనిపించే శిక్షలన్నీ ఇక్కడే అమలు చేసి పంపించేయాలి.. అప్పుడే ఉగ్రదాడి అమరులకు నిజమైన నివాళి..

No comments:

Post a Comment