గరం గరం చాయ్.. ఇది లేనిదే నాకు రోజు గడవదు.. దాదాపు భారతీయులందరి పరిస్థితి ఇంతే అనుకుంటాను..బ్రిటిష్ వాడు పోతూ పోతూ మనకు అంటించిన వ్యసనం అంటారు.. వ్యసనం అనే కంటే బహుమతి అనడం సబబేమో..
శరీరానికి ఉత్తేజాన్ని కలిగించే తేనీటిని పెద్దలు మొదట్లో అనుమానంగానే చూశారు.. నిజానికి ఇందులో కెఫేన్ ఉన్నా ఇది అంతగా అనారోగ్యాన్ని కలిగించేంది కాదు.. పైగా టీ లోని బి విటమిన్, రొబోప్లేవిన్, నియాన్ తదితర పదార్ధాలు శరీరానికి మేలు చేసేవే.. ముఖ్యంగా క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నట్లు గుర్తించారు.. అయితే ఏ విషయంలో అయినా అతి పనికి రాదు.. ఇది టీకీ వర్తిస్తుంది.. చాయ్ అదే పనిగా తాగితే మన శరీరం ఇతర ఆహార పదార్ధాలను స్వీకరించడం కష్టమవుతుంది.. రోజుకు రెండు లేదా మూడు కప్పులకే టీని పరిమితం చేసుకోవండం ఉత్తమం..
నాబోటీ పక్కా హైదరాబాదీలకు చాయ్ అంటే పంచ ప్రాణాలతో సమానం.. ఇరానీ చాయ్ గురుంచి అందరూ గొప్పగా చెప్పుకుంటున్నా అందులో రుచి తప్ప సాధారణ టీతో పోలిస్తే పెద్దగా సుగుణాలు ఏవీ లేవు. నిజామ్ పాలకుల సమయంలో కొందరు ఇరానీ వ్యాపారులు దక్కన్ కు చాయ్ పరిచయం చేయడం వల్ల ఇరానీ చాయ్ అనే బ్రాండ్ వ్యాప్తిలోకి వచ్చింది.. నిజానికి మనం తాగే చాయ్ ఇరాన్ లో ఎక్కడా తాగరు.. మనం మాత్రం ఆ పేరు చెప్పుకొని లొట్టలేసుకుంటూ జుర్రు కుంటాం.. గత దశాబ్ద కాలంగా నగరానికి పరిచయం అయిన రోడ్ సైడ్ డబ్బా టీ సెంటర్లు సాంప్రదాయ చాయ్ కు గట్టి పోటీ ఇస్తునా అందులో రుచీ పచీ ఉండదు.. సాధారణంగా మనం తాగున్న టీ కన్నా సహజ సిద్దమైన గ్రీన్ టీతో ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.. ప్రయత్నించండి..
ఒక చాయ్ వాలా మన దేశానికి ప్రధానమంత్రి కావడం కూడా గర్వకారణం.. ప్రపంచంలో అత్యధికంగా తేయాకును ఉత్పత్తి చేస్తున్నది, తేనీటిని తాగుతున్నది భారత దేశంలోనే.. చాయ్‌ను జాతీయ పానీయంగా ప్రకటించాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది.. ఈ కోరికను మన ప్రధాని నరేంద్ర మోదీ నెరవేర్చాలని కోరుకుంటున్నాను..
ఇవాళ అంతర్జాతీయ తేనీటి దినోత్సవం (డిసెంబర్15).. అందుకే ఈ చాయ్ కీ బాత్..
Thursday, December 15, 2016
చాయ్ జాతీయ పానీయం కావాలి..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment