Thursday, December 8, 2016

రాజకీయ వ్యంగ్యానికి చిరునామాకు ఆశ్రునివాళి

అందరివాడు.. ఈ పదానికి సరైన అర్థం చో రామస్వామి.. ఆయన తమిళ పత్రిక తుగ్లక్ ఎడిటర్.. అయినా రాజకీయ విమర్శకుడిగా దేశ వ్యాప్త గుర్తుంపు తెచ్చుకున్నారు.. రామస్వామి కలమనే కత్తికి అన్ని వైపులా పదును ఉంటుంది.. వ్యంగ్య విమర్శలకు పేరొందిన చో రామస్వామి పత్రిక తుగ్లక్ ముఖచిత్రంపై కార్టూనే ప్రధానంగా కనిపించడం విశేషం.. రాజకీయ నాయకులు అందరితోనూ సన్నిహితంగా ఉంటాడు.. కానీ విమర్శించాల్సి వస్తే ఎవరికీ వదలడు.. నీతి నిజాయితీ, విలువలను పాటించారు రామస్వామి.. జయలలితతోనూ, కరుణానిధితోనూ స్నేహ సంబంధాలు నడిపిన ఘటికుడు చో.. జయలలితకు రామస్వామి ఎంతో సన్నిహితుడు.. అయినా ఒక దశలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఆమెను వ్యతిరేకించాడు.. వాజపేయి హయాంలో ఎన్డీఏ కూటమిలో చేర్చడంలో ప్రధాన పాత్ర రామస్వామిదే.. విచిత్రంగా జయ ఆయన సత్సంబంధాలు పునరుద్దరించుకున్నారు.. అదీ రామస్వామి ప్రత్యేకత.. చో రామస్వామి ఇక లేదనే వార్త బాధాకరమే,. జయలలిత కన్నుమూసిన రెండో రోజే, అదే ఆస్పత్రిలో చో కూడా దేహ పరిత్యాగం చేయడం యాదృచ్చికమే.. చో రామస్వామికి నా వంతుగా నివాళి..

No comments:

Post a Comment