Saturday, December 3, 2016

జాతీయ గీతం కూడా వివాదమేనా?

సినిమా హాళ్లలో జాతీయ గీతం .. కానీ కోర్టుల్లో వద్దు.. రెండు రోజుల తేడాలో సుప్రీం కోర్టు భిన్నమైన స్పందన కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది.. ఇదే సమయలో మరో సందేహం.. దేశంలోని అన్ని న్యాయ స్థానాలతో పాటుగా ప్రభుత్వ కార్యాలయాల్లో, వివిధ రాష్ట్రాల సచివాలయాలు, కార్యాలయాలు, ప్రభుత్వ– ప్రయివేటు విద్యా సంస్థల్లో ప్రతి నిత్యం రెండు పూటలా, లేదా ఒక సమయంలో అయినా ఎందుకు జాతీయ గీతాన్ని ఆలపించకూడదు?

దేశ ప్రజల్లో మాతృభూమి, జాతీయ గీతం, చిహ్నాల పట్ల విధేయత, ప్రేమ, భక్తి, గౌరవం కచ్చితంగా ఉండాలి.. ఇవి లోపించడం వల్లే మన దేశంలో ఉగ్రవాదం, వేర్పాటు వాదం పెరిగిపోతోంది.. దేశ భక్తిని మతంతో ముడిపెట్టరాదు... ఇంత వరకూ మనకు ఎలాంటి అభిప్రాయ బేధాలు ఉండాల్సిన అవసరం లేదు.. కానీ..
సినిమా హాళ్లలో జాతీయ గీతాలాపన ఎలా స్వాగతించాలో అర్థం కావడం లేదు.. జాతీయ గీతం ఆలపించే సమయంలో విధిగా లేచి నిలబడి గౌరవాన్ని ప్రకటించాలి.. వీలైతే మనమూ ఆలపించాలి.. సినిమాలు చూడటానికి వచ్చేవారిలో రకరకాల వ్యక్తులు ఉంటారు.. తాగుబోతులు, జూదరులు, వ్యభిచారులు, రౌడీలు, చిల్లర దొంగలు.. ఇలా రకరకాల అసాంఘిక శక్తులు హళ్లలోకి వస్తుంటారు.. వీరి నుండి మనం ఎలాంటి దేశభక్తిని ఆశించగలం?
మరోవైపు ఇప్పుడు వస్తున్న చిత్రాల్లో హింస, శృంగారం, ద్వంద్వార్థాలు, వెలికి హాస్యం అధికంగా ఉంటున్నాయి.. పెద్దలకు మాత్రమే, ‘ఏ’ గ్రేడు చిత్రాలు సరేసరి.. ఇలాంటి చిత్రాలు ప్రదర్శిస్తున్న హాలులో జాతీయ గీతాన్ని ఎలా ఆలపించగలం?.. న్యాయస్థానాలు తీర్పు ఇచ్చే ముందు ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే బాగుండేది.. అయితే దేశభక్తి, సందేశాత్మక, మంచి చిత్రాలు ప్రదర్శించినప్పు జాతీయ గీతం ఆలపిస్తే చాలా బాగుంటుంది.. విచిత్రం ఏమిటంటే న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో బీజేపీ, సంఘ్ పరివార్ కు సంబంధం లేదు.. అయినా కొందరు వ్యక్తులు, సంస్థలు, మీడియా అప్పుడే ఈ సంస్థలను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానాలు చేస్తున్నాయి.. దేశభక్తి వీరికి మాత్రమే పేటెంట్ హక్కా?
జాతీయ గీతాన్ని కేవంలం పవిత్రమైన స్థలాల్లోనే ఆలాపించాలి అని నా భావన.. ఉదాహరణకు బహిరంగ సభలు, ప్రభుత్వ – ప్రైవేటు కార్యక్రమాలు, పార్టీల సభలు, చర్చాగోష్టులు, విద్యాసంస్థలు.. ముఖ్యంగా ప్రభుత్వం ద్వారా, ప్రభుత్వ సహాయంతో నడిచే ప్రతి సంస్థలోనూ జాతీయ గీతం ఆలపించాల్సిందే.. ఇంత వరకూ ఎవరికీ అభ్యంతరం ఉందు.. చివరగా కోర్టుల్లో జాతీయ గీతం అవసరం లేదు అని ధర్మాసనం వారు తమ నిర్ణయాన్ని సవరించుకోవాల్సిందినా నా మనవి..

No comments:

Post a Comment