Tuesday, May 30, 2017

గోహత్యా పాతకం ఊరికే పోతుందా?

మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి గోహత్యా పాతకం చుట్టుకుంది.. తామేమి చేస్తున్నామో ఆలోచించే సోయి కూడా లేకుండా పోయింది ఆ పార్టీ కేడర్ కు..  
యూత్ కాంగ్రెస్ జిందాబాద్.. హే మోదీ నరేంద్ర మోదీ అనే నినాదాలు చేస్తూ ఆవు దూడను కోసేశారు.. అనంతరం నిర్లజ్జగా కాంగ్రెస్ పతాకాల సాక్షిగా గోమాంసాన్ని పంచిపెట్టారు..
ఓటు బ్యాంకు రాజకీయాలతో ఈ దేశంలో మెజారిటీ ప్రజల మత విశ్వాసాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ పార్టీ తన మూల సూత్రాలనే మరచి పోయింది.. గోహత్య నిషేధాన్ని కోరుకున్నారు మహాత్మా గాంధీ.. గాంధీ వారసులమని చెప్పుకునే వారు ఆయన అభిమతాన్ని బేఖాతరు చేశారు.. వారు చేయలేని పనిని మోదీ సర్కారు చేసేందుకు ప్రయత్నిస్తే నిర్లజ్జగా అడ్డుకుంటూ, నిరసన పేరిట ఆవు దూడనే బలి ఇచ్చారు..

కేరళ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన పనిపై విమర్శలు రావడంతో ఖంగుతిన్న రాహుల్ గాంధీ ఈ ఘటనను ఖండించారు.. చేతులు కాలాక ఆకులు పట్టుకొని ప్రయోజనం ఏమిటి? గోహత్యా పాతకం ఊరికే పోతుందా?

Sunday, May 28, 2017

సీపీఎం నేత చెత్తవాగుడు

ఇతడు కేరళ సీపీఎం కార్యదర్శి బాలకృష్ణన్..
భారత సైన్యం మహిళలను కిడ్నాప్ చేసి హత్యలు చేస్తుంది అని వాగాడు.. దేశంలో ఎక్కడ ఆర్మీ ఉన్నా అంతేనట..
ఇంతకూ ఇతడు ఈ దేశంలోనే పుట్టాడా?.. భారతీయులకే పుట్టాడా?.. సీపీఎం ఇతడి వ్యాఖ్యలను సమర్ధిస్తుందా?.. ఒకవేళ సమర్థించకపోతే పదవి నుంచి తొలగించి, పోలీస్ కేసు పెడుతుందా?.. వివరణ ఇచ్చుకోవాలి..

కులభూషన్ విషయంలో భంగపడ్డ పాక్

కులభూషణ్ జాదవ్ వ్యవహారంలో అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మన దేశానికి నైతిక విజయం మాత్రమే కాదు.. పాకిస్తాన్ కు చెంప పెట్టు.. ఇంకా చెప్పాలంటే ఒక హెచ్చరిక..

కులభూషణ్ నావికాదళంలో పదవీ విరమణ చేసి వ్యాపారం చేసుకుంటున్నాడని భారత్ చెబుతోంది. కానీ పాకిస్తాన్ మాత్రం అతడు గూఢచారి అంటూ ఏకంగా మరణ శిక్ష విధించింది. అతన్ని కలుసుకునేందుకు భారత దౌత్య అధికారులకే కాదు, కుటుంబ సభ్యులకు కూడా అవకాశం ఇవ్వలేదు.. పాక్ పూర్తిగా ఏకపక్షంగా, అనుమానాస్పదంగా వ్యవహరించింది కాబట్టే ఐసీజేలో మన వాదన నెగ్గింది.. ఇప్పడు అత్యవసరంగా చేయాల్సిన పని కులభూషణ్ ను కాపాడుకోవాలి. ఇంతకీ అతనికి మరణ శిక్ష ఎప్పుడు? అనే విషయంలో స్పష్టత లేదు.. ఈలోగా పాకీలు ఏదైనా దురాగతానికి పాల్పడినా దిక్కులేదు.. నిండా మునిగినోడికి చలి ఉండదంటారు. ఉగ్రవాద దేశంగా ముద్ర వేయించుకొని అన్నింటికీ బరి తెగిస్తోంది పాక్.. వారికి ఐసీజే ఒక లెక్కకాదు.. దాన్ని తోసిరాజని హడావుడిగా శిక్ష అమలు చేసి చేతులు దులుపుకుంటే మనం చేయగలిగేది ఏమీ ఉండదు..
పాకిస్తాన్ విషయంలో మనం మొదటి నుండి అవలంభిస్తున్న మెతక వైఖరే అనర్థాలకు దారి తీస్తోంది. జమ్మూ కాశ్మీర్ లో సగ భాగాన్ని ఆక్రమించుకొని, కొంత భాగం చైనాకు దారా దత్తం చేసినా పాక్ ను ఏమీ చేయలేకపోతున్నాం.. ఐక్యరాజ్య సమితిలో నెహ్రూ మహానుభావుడు వేసిన కేసు ఇంకా అలాగే ఉంది. ఆ దేశంలో ఇప్పటి వరకూ జరిగిన యుద్దాల్లో మనమే గెలిచాం.. కానీ మన భూభాగాలను మాత్రం తిరిగి తెచ్చుకోలేకపోయాం.. మన బలహీనతలు గ్రహించింది కాబట్టే పాక్ ధీమాగా ఉంది..
కాల్పుల విరమణ ఒప్పందాలు, శాంతి ప్రక్రియ, చర్చలూ అంటూ సమయం చాలా వృధా చేస్తున్నాం.. పాకిస్తాన్ ను తన భాషలోనే ధీటుగా బదులు ఇచ్చి మన భూభాగలను మనం లాక్కున్నప్పుడే నిజమైన విజయం.. జైహింద్..

(19.05.2017)

Tuesday, May 16, 2017

ధర్నా చౌక్ ఎత్తివేత నిరంకుశత్వమే..

ప్రభుత్వ విధానాలు నచ్చకుంటే నిరసన తెలపడం ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు.. కానీ ప్రదర్శనలు, ర్యాలీలు చేస్తే ప్రభుత్వాలకు నచ్చదు.. లాఠీ ఛార్జీలు, అరెస్టులు తప్పవు.. పోనీ శాంతి యుతంగా ధర్నా చేసి నిరసర తెలియజేస్తామంటే అయిష్టంగానే అంగీకరిస్తాయి..
పాతికేళ్ల క్రితం ప్రతిపక్షాలు, వివిధ సంఘాలవారు రాష్ట్ర సచివాలయం ముందు ఫుట్ పాత్ మీద (ప్రస్తుత లుంబినీపార్క్ పర్యాటక భవన్) ధర్నాలు చేసేవారు.. దీని కారణంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోందనే కారణంతో ప్రభుత్వమే స్వయంగా ప్రస్తుత ఇందిరా పార్కు ముందు నిరసనలు తెలుపుకునేందుకు శాశ్వతంగా చోటు ఇచ్చింది.. దీనికి క్రమంగా ధర్నా చౌక్ అనే పేరొచ్చింది.. దిల్లీలోని జంతర్ మంతర్ తరహాలో..
ప్రభుత్వం ఇప్పుడు ధర్నా చౌక్ ఎత్తేసింది.. ఇందుకు శాంతి భద్రతలను సాకుగా చూపుతోంది.. ఎక్కడో శివారు ప్రాంతంలో ధర్నాలు చేసుకోవాలట.. గతంలో సచివాలయం ముందు ధర్నాలు చేస్తే ముఖ్యమంత్రి కాకపోయినా కనీసం మంత్రులు, అధికారులైనా చూసేవారు.. ఇప్పుడు ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ధర్నాచౌక్ వారికి కనిపించని విషయం దేవుడెరుగు.. కనీసం అక్కడ ఏ కార్యక్రమం చేసినా ఏదో రూపంలో ప్రభుత్వం దృష్టికి పోతుందనే ఆశ మినుకు మినుకుమనేది.. ఇప్పుడా ఆశ కూడా అడియాయే అయిపోయింది.. ప్రభుత్వం ప్రజల ఆక్రందనలు వినే స్థితిలో లేనప్పుడు ఎక్కడ ధర్నా చేస్తే ఏం లాభం.. చెవిటి వారి ముందు శంఖం ఊదినా ప్రయోజనం ఏమిటి?..

అధికారంలో ఉన్నవారికి భజనలే వినసొంపుగా ఉంటాయి.. నిందిస్తే ఊరుకుంటారా?.. ఈ లాజిక్కు తెలియని అమాయకంలో ఉన్నాయి పాపం ప్రతిపక్షాలు.. రండీ పుణ్యాత్ములారా.. సర్కారు భజనకు..

Sunday, May 14, 2017

నారద జయంతి ఎందుకు జరుపుకుంటున్నాం..

సమాచార భారతి ఆధ్వర్యంలో జరిగిన నారద జయంతి కార్యక్రమం సందర్భంగా నారదున్ని పరిచయం చేసే అవకాశం నాకు కలిగింది.. ఆ ప్రసంగ సారాంశం ఇలా సాగింది..
ఈరోజు మనం నారద జయంతి జరుపుకుంటున్నాం..
నారదుడు అంటే ఎవరో మీకు తెలుసు.. బ్రహ్మదేవుని పుత్రుడు, విష్ణుమూర్తికి అమిత భక్తుడు.. మన సినిమాల పుణ్యమా అని నారదుడు అంటే అందరికీ ఒక దురభిప్రాయం ఏర్పడింది. నారదుడు కలహప్రియుడని భావిస్తారు.. ఆయనను ఒక హాస్య పాత్రగా మార్చేశారు.. నారద మహర్షిని అర్థం చేసుకోకపోవడం వల్ల వచ్చిన సమస్య ఇది. వాస్తవానికి నారదుడు ఏమి చేసినా లోక కల్యాణం కోసమే చేశారు..
నారద అంటే అర్థం ఇలా ఉంది.. నార అంటే జ్ఞానం.. అంటే ఇచ్చువాడు.. నారదుడు త్రిలోక సంచారి.. లోకాలన్నింటికీ వార్తలను చేరవేస్తుంటాడు. దేవతలను, దానవులను, రుషులను, రాజులను కలిసేవారు.. అంటే ఈ లోకానికి తొలి పాత్రికేయుడు నారదుడు అన్నమాట.. అందుకే నారదుని జయంతిని ప్రపంచ పాత్రికేయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
నారదుడు గొప్ప రాజనీతిజ్ఞుడు.. రాజనీతి, ధర్మం తెలిసిన వాడు.  అంతే కాదు మంచి సంగీతకారుడు. అందుకు ప్రతీకగా ఆయన చేతిలో తంబురను చూడవచ్చు.. నారద భక్తి సూత్రాలను అందించడమే కాదు. వాటిని గానం చేసి, నిరంతరం ధర్మ ప్రచారం చేశాడు..
రామాయణం లాంటి మహాకావ్యం మనకు అందింది అంటే అది నారదుని పుణ్యమే.. రాముడిని వాల్మీకికి పరిచయం చేసి, ఆయనచే రామాయణం రాయించింది నారదుడే.. అలాగే వేద వ్యాసునిచే మహాభారతం, భాగవతం రాయించింది కూడా నారదుడే.. ధృవుడికి నారాయణ మంత్రం ఉపదేశించింది, ప్రహ్లాదుడు తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు నారాయణ భక్తిని, మరమాత్ముని తత్వాన్ని బోధించింది కూడా నారదుడే..
నారదుడు ఒక ఆదర్శ పాత్రికేయుడని మనం చెప్పవచ్చు.. పాత్రికేయుని లక్షణం సమాజానికి వార్తలను అందించడమే కాదు.. సమాజ శ్రేయస్సు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మంచి చెడులను విశ్లేషించడం, ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడం పాత్రికేయుని విధి.. నారదుడు ఆనాడు చేసిన పని కూడా ఇదే.. ధర్మ రక్షణ, లోక కల్యాణం కోసం వార్తలను చేరవేసేవాడు నారదుడు..
ఏ వార్త ఎవరికి ఎలా చేరవేయాలో నారదుడికి బాగా తెలుసు.. అటు దేవతలకు, ఇటు దానవులకు సమాచారాన్ని అందించినా.  లోక కల్యాణం దాని వెనుక స్పష్టంగా కనిపిస్తుంది.. దానవులపై దేవతలను యుద్దానికి ఉసిగొలిపి, విష్ణుమూర్తిని దశావతారాలు ఎత్తేందుకు ప్రోత్సహించింది కూడా నారదుడే..
తిధి ప్రకారం నారదుని జయంతి వైశాఖ కృష్ణ పాడ్యమి రోజున వస్తుంది. అయితే మన వెసులుబాటును బట్టి నారద జయంతిని నిర్వహించుకుంటున్నాం.. సమాచార భారతి గత 19 ఏళ్లుగా మీడియాకు సంబంధించిన పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ప్రతి ఏటా నారద జయంతిని నిర్వహించి, విశిష్ట పాత్రికేయులను సన్మానిస్తోంది.. ఇందులో భాగంగానే ఈనాటి కార్యక్రమం..










హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన నారద జయంతిలో సీనియర్ పాత్రికేయులు శంకరనారాయణ, అరుణా రవికుమార్, విద్యారణ్య, సీనియర్ ఫోటో జర్నలిస్టు శివకుమార్ గారిని సన్మానించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ పి.విజయబాబు, ముఖ్యవక్తగా అఖిల భారతీయ ప్రజ్ఞాప్రవాహ్ సంయోజక్ జె,నందకుమార్ హాజరుకాగా, సమాచార భారతి అధ్యక్షుడు జి.గోపాల్ రెడ్డి అధ్యక్షత వహించారు.. సమాచార భారతి కార్యదర్శి ఆయుష్, సహచర మిత్రులు ఓంప్రకాశ్, దేవిక, నీలేశ్ జోషి, వంశీకృష్ణ, మన్యంకొండ తదితరులు ఈ కార్యక్రమం నిర్వహణలో పాల్గొన్నారు..

మాతృ మూర్తిని ప్రతి రోజూ పూజించాల్సిందే..

ఇవాళ మాతృదినోత్సవం అంటూ హడావుడి.. మన తల్లులను ఈ ఒక్కరోజు మాత్రమే గుర్తు చేసుకుంటే చాలా?.. వారికో దండం పెట్టి, బహుమతి ఇచ్చి, మన పనిలో మనం మునిగి పోదామా?.. ఇంతటితో మన బాధ్యత తీరిపోయినట్లేనా? 
అమ్మకు ఎంత చేసినా రుణం తీర్చుకోలేం.. మనకు జన్మనిచ్చి, పెంచి, సమాజంలో పౌరునిగా మార్చున తల్లి పట్ల ఒక్కరోజు కృతజ్ఞత చూపితే చాలదు.. మాతృమూర్తిని 
ప్రతిరోజూ పూజించాలి.. గౌరవించాలి.. బాగోగులను పట్టించుకోవాలి.. వారు ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకోవాలి.. 
మాతృదేవోభవ.. తల్లికి దేవతలతో సమాన హోదా కల్పించింది మన ధర్మం.. పాశ్చాత్య సంస్కృతుల్లో మనకు ఉన్నంత సెంటిమెంట్లు ఉండవు.. దురదృష్టవశాత్తు వారి సంస్కృతి మన సమాజంలో ప్రవేశించింది.. వారి ఆచార వ్యవహారాలు పాటిస్తూ భారతీయ మూలలను మరచిపోతున్నాం.. కొత్త కొత్త దినాలను పాటిస్తున్నాం.. నా దృష్టిలో mother's day కూడా అలాంటిదే.. ఎవరి సెంటిమెంట్స్ వారికి ఉంటాయి.. తప్పులేదు.. కానీ మన సెంటిమెంట్లను కూడా అవతలివారు గౌరవించి, ఆచరించేలా చూద్దాం..

ఈ ప్రమాదాల మర్మం ఏమిటి?

నిన్న పొద్దున్నే ఆఫీసుకు వెళ్లే సరికి దుర్వార్త..
‘మంత్రి గారి కుమారుడు యాక్సిడెంట్ లో పోయాడు..’
‘అయ్యో పాపం ఎలా జరిగింది?..’
‘వేగంగా వెళ్లుతున్న కారు మెట్రో పిల్లర్ ను ఢీకొట్టిందట..’
ఆరేళ్ల క్రితం ఇలాంటి వార్తే విన్నాను.. నాటి మంత్రి కొడుకు ఔటర్ రింగ్ రోడ్డు కారు ప్రమాదంలో మరణించాడు.. అంతకు ముందు ఓ మాజీ క్రికెటర్ కొడుకు ఇలాగే మరణించాడు..

ఈ యాక్సిడెంట్లకు కారణం ఏమిటి అంటే మితి మీరిన వేగం, సీటు బెల్ట్ పెట్టుకోక పోవడం, ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో పిల్లరూ.. ఇలా నానా కారణాలు చెబుతారు.. కానీ అసలు వాస్తవాన్ని ఎందుకు ఒప్పుకోరు?
భాగ్యనగరం విశ్వనగరంగా ఎదుగుతోందని మురిసిపోతున్నాం.. కానీ దానితో పాటు అన్ని రకాల అవలక్షణాలు సంతరించుకుంటున్నాయనే నిజాన్ని మాత్రం నాయకమన్యులు అంగీకరించరు..
విచ్చల విడిగా వెలుస్తున్న పబ్బులు, బార్లు, హుక్కా సెంటర్లు, డ్రగ్స్.. విశృంఖల పాశ్యాత్య సంస్కృతి.. తెల్లవార్ల దాకా తాగి తందానాలాడే వీఐపీల సంతానం.. శివారు ఫార్మ్ హౌస్ లు, రిసార్టుల్లో రేవ్ పార్టీలు.. దీనికి తోడు రహదార్ల మీద వేగంగా కార్లు, బైకు రేసింగ్లు.. మద్యం అమ్మకాలతో ఎక్సైజ్, వాణిజ్య శాఖలకు, డ్రంక్ అండ్ డ్రైవ్ చలాన్లతో పోలీసులకు దండిగా డబ్బుల వస్తున్నాయి.. ప్రభుత్వం ఇలా అన్ని వైపులా సొమ్ము చేసుకుంటోంది.. కానీ తన బాధ్యతను మరచిపోతోంది.. ఇదే సంక్షేమ రాజ్య లక్షణం అని భావిస్తే అది మన కర్మ..
ఒక్కసారి అందరూ ఆత్మవిమర్శ చేసుకోండి.. ఎక్కడిపోతోంది మన సమాజం.. వీఐపీలు మాత్రమే కాదు.. ప్రతి వ్యక్తి ముందు తమ ఇంటిని సరిదిద్దుకోవాలి.. మీ కుటుంబ సభ్యులు, పిల్లలు ఏమి చూస్తున్నారో గమనించండి.. సంపాదించ సొమ్మును విచ్ఛల విడిగా ఖర్చు పెడతామంటే అది మీ ఇష్టం.. కానీ వారికి క్రమశిక్షణ చేర్పించండి. హద్దుల్లో ఉంచండి.. లేకపోతే ఇలా కడుపు కోతలు తప్పవు..
(11 మే, 2017)

Tuesday, May 9, 2017

దేవునితో రాజకీయాలా?


 దేవుని ముందు ప్రాంతీయ‌, భాషా విభేదాలు ఎందుకు?.. వేంక‌టేశ్వ‌ర స్వామి హిందువులంద‌రి దేవుడు.. దేశ విదేశాల నుండి లక్ష‌లాది మంది భ‌క్తులు వెంక‌న్న స‌న్నిధికి వ‌చ్చి మొక్కుకుంటారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ గా ఎవ‌రిని నియ‌మిస్తే ఎందుకు?  ఆ అధికారి ధ‌ర్మ నిష్ట‌గ‌ల హైంద‌వుడు, స‌మ‌ర్థుడు అయితే చాలు.. అంతే కానీ ఉత్త‌రాదివారు, తెలుగు రాని వారు అధికారిగా ఉండ‌కూడ‌ద‌నే వాద‌న ఎందుకు?. ఇవాళ ద‌క్షిణ భార‌త దేశం వారిని మాత్ర‌మే అధికారిగా నియ‌మించాలని వాదిస్తున్నారు, రేపు కేవలం ఆంధ్రప్రదేశ్ వారిని, అందునా రాయ‌ల‌సీమ‌, లేదా చిత్తూరు-తిరుప‌తి వాసుల‌నే నియ‌మించాల‌నే డిమాండ్లు చేస్తే?.. తెలుగేత‌రులు తిరుమ‌ల‌లో అడుగు పెట్ట‌కూడ‌దు అంటే?..
టీటీడీ పాల‌క మండ‌లి స‌భ్యుల గుణ గ‌ణాలు ఎలా ఉన్నా చాలా? ఈ విష‌యంలో ఎందుకు అభ్యంత‌రం లేవ‌దీయ‌రు? తిరుమ‌ల‌లో అన్య మ‌త‌స్తుల ఆగ‌డాల‌ని ఎందుకు ప్ర‌శ్నించ‌డం లేదు?.. ఒక కొత్త రాజ‌కీయ నాయ‌కుడు ఉనికి కోసం ప్రాంతీయ, భాషా విద్వేషాల‌ను వాడుకుంటున్నాడంటే స‌రే ఆయ‌న అవ‌స‌రం అలాంటిది అనుకుందాం.. మ‌రి నాబోటి ధ‌ర్మ‌నిష్టగ‌ల వారు గౌర‌వించే ఒక స్వామీజీ కూడా ఇలాంటి వాద‌న‌లు చేయ‌డం చాలా బాధ‌ను క‌లిగిస్తోంది.. వీరంద‌రినీ నేను కోరేది ఒకటే.. వెంక‌న్న స్వామిని రాజ‌కీయం చేయ‌కండి అనే.. 

సోషల్ మీడియా.. నిర్భయంగా ఇలా..

ఏ విషయంలో అయినా మంచీ, చెడూ రెండూ ఉంటాయి.. అది సోషల్ మీడియాకు కూడా వర్తిస్తుంది. భావ ప్రకటనా స్వేచ్ఛను ఉపయోగించుకోవడానికి సోషల్ మీడియా చక్కని వేదిక.. అదే సమయంలో దీని పరిమితులను కూడా అర్థం చేసుకువాలి.. 

ఇటీవలి కాలంలో సోషల్ మీడియా విస్తృతిని చూసి నాయకులు, అధికారులు భయపడిపోతున్నారు.. సోషల్ మీడియాను కట్టడి చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు.. ఇందులో భాగంగా గ్రూప్ అడ్మిన్లను అరెస్టు చేసే అవకాశాల వార్తకు ప్రచారం కల్పిస్తున్నారు.. ఈ వార్తను చూసి అడ్మిన్లు, మెంబర్లు హడలెత్తిపోతున్నారు.. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి.. మనం తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు.. సాంకేతికంగా మనం ఇబ్బందులు పడకుండా ఉండాలంటే స్వీయ నియంత్రణ చాలా అవసరం.. ఇందు కోసం ఈ నియమ నిబంధనలను కచ్చితంగా పాటిద్దాం..
దేశ భద్రత, సమగ్రత, జాతీయ చిహ్నాలకు భంగం కలిగించే పోస్టులు చేయకండి..
నిరాధార, విద్వేష పూరితచ కథనాలు,  వదంతులు, వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే పోస్టులు పెట్టకండి..
మన చట్టాలను న్యాయస్థానాలను గౌరవించండి. కోర్టులు ఇచ్చే తీర్పులను సమీక్షించవచ్చు.. కానీ నిందించరాదు..
మహిళల గౌరవ మర్యాదలకు భంగం కలిగించే పోస్టులు వద్దు.. అసభ్యకర పోస్టులకు దూరంగా ఉండండి.. వ్యక్తిగత జీవితాలను, ప్రైవసీని కాపాడండి..
మనం సత్యం అని నమ్మిన వాటినే పోస్టు చేయండి.. ఫార్వర్డ్ మెసేజెస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.. అవతలి వారు పంపిన పోస్టు పూర్తి యదార్థం అని భావిస్తేనే తిరిగి ఫార్వర్డ్ చేయండి..
అశ్లీల సందేశాలు, చిత్రాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించవద్దు.. వాటిని పంపేవారిని హెచ్చరించండి.. మీరు కూడా ఇతరులకు ఇలాంటి వాటిని పోస్టు చేయకండి..
మనం నమ్మిన సిద్ధాంతం, రాజకీయ భావజాలాన్ని నిరభ్యంతరంగా ప్రచారం చేసుకోవచ్చు.. సైద్ధాంతిక విమర్శలు చేయవచ్చు.. వాద ప్రతివాదనలు జరుపుకోవచ్చు.. అయితే అవతలి వారిని విమర్శించే విషయంలో అసభ్య పదజాలం వాడరాదు. హుందాతనం పాటించాలి..  కానీ వ్యక్తిగతంగా, పరువుకు భంగం కలిగించే నిందా వ్యాఖ్యలు చేయవద్దు..
మనం తప్పు చేయనంత వరకూ ఎవరికీ భయపడాల్సిన అవసరమే లేదు.. మన దేశాన్ని, ధర్మాన్ని నిందించేవారిని ఉపేక్షించాల్సిన అవసరం లేదు.. అన్యాయాన్ని ఎదిరించాలి.. నీతి నిజాయితీ లేని వారిని, అవినీతి పరులైన నాయకులు, అధికారులను వదలకండి.. మనం ప్రజల తరపున నిలవాలి.. సమాజానికి అండగా ఉండాలి.. ప్రజల సొమ్మును కాపాడటంలో ముందుండాలి.. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే హక్కు మనకు ఉంది.. మనపై నిరాధార ఆరోపనలతో కేసులు పెట్టినా అవి న్యాయస్థానంలో చెల్లవు..
కాబట్టి సోషల్ మీడియా సభ్యులు,, అడ్మిన్లు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు.. కాకపోతే మన గ్రూప్ లోని ప్రతి సభ్యుడు మనకు తెలిసిన వాడై ఉండాలి.. అడ్మిన్లు పరిమిత సంఖ్యలో ఉండాలి.. గ్రూప్ సభ్యులంతా అంశాలతో నియమ నిబంధనలు ఏర్పాటు చేసుకొని వాటిని విధిగా పాటించాలి.. వారందరికీ ఈ విషయంలో అవగాహన కల్పించాలి.. అదుపు తప్పే వారిని హెచ్చరించాలి.. ఉల్లంఘించిన సభ్యులను నిరభ్యంతరంగా తొలగించేయాలి.. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే మనం ఎవరికీ భయపడాల్సిన  అవసరమే లేదు..

Monday, May 8, 2017

లాలూ. నితీష్ దొందు దొందేనా?

బిహార్ లో ఏదైనా సాధ్యమే..
అప్పట్లో పశువుల దాణా పేరుతో కోట్లాది రూపాయలు మింగేశారు.. ఇప్పుడు నిషేదం పేరుతో స్వాధీనం చేసుకున్న మద్యం ఎలుకలు తాగేశాయి అంటున్నారు..
లాలూ అయినా, నితీష్ అయినా పాలనలో తేడా లేదా? దొందు దొందేనా?.. ర్రిప్పీట్టే..


Saturday, May 6, 2017

వీరి ఉరి శిక్షకు నేను వ్యతిరేకం.. యువరానర్..

నిర్భయ కేసులో దోషులకు హైకోర్టు విధించిన ఉరిశిక్షను సుప్రీం కోర్టు సమర్థించింది.. అయితే  వీరికి ఉరి వేయడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను..
ఎందుకు అంటారా?..
నిర్భయ.. ఆమె అసలు పేరు తెలియదు.. రాత్రివేళ బస్సులో మృగాళ్ల భారిన పడి నరక యాతన అనుభవించి చివరకు తనువు చాలించింది.. ఆమెపై జరిగిన దారుణ అత్యాచారానికి దేశమంతా చలించింది.. మూడు రోజుల పాటు ఢిల్లీ నగరమే స్థంభించిపోయింది.. తమ వృత్తి జీవితాలు తప్ప, ఇతర విషయాలేవీ పట్టని యువతీ, యువకులు ఆమెకు న్యాయం చేయమంటూ, రేపిస్టులను ఉరి తీయమంటూ రోడ్ల మీదకు వచ్చారు.. స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఓ సామాజిక సమస్యపై వచ్చిన అతి పెద్ద ఉద్యమం ఇది.. దేశ నాయకత్వం కలవరపడింది..
నిర్భయ చనిపోయిందని ఎవరన్నారు?.. ఆమె చనిపోలేదు.. చనిపోయింది మానవత్వం.. నిర్భయ భౌతికంగా ఈ లోకంలో లేకపోవచ్చు.. ఆమె ఆత్మకు శాంతి కలగాలంటే మనందరి దృక్పథంలో మార్పు రావాలి.. తప్పు రేపిస్టులది మాత్రమే అనడం సరికాదు.. ఆడ పిల్లలను అంగడి సరుకులా చూపిస్తున్న ఈ సమాజమే అతి పెద్ద దోషి.. తమ పిల్లలు పెద్ద చదువులు చదవాలని, పెద్ద జీతాలు వచ్చే ఉద్యోగాలు చేయాలని తల్లి దండ్రులు కోరుకుంటారు.. కానీ వారికి నైతిక విలువలు నేర్పించాలనే ఆలోచన మాత్రం కలగడం లేదు.. మన ఇంటి నుండి మార్పు వచ్చినప్పుడే సమాజం కూడా మారుతుంది..
నిర్భయపై అమానుషంగా వ్యవహరించిన వారిలో ఒకడు జైలులోనే ఆత్మహత్య చేసుకున్నాడు.. మరొకడు మైనర్ అనే సాకుతో నామమాత్రం నిర్భంధం అనుభవించి, ఇప్పుడు సమాజంలో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు.. మిగతా నలుగురికి హైకోర్టు ఉరిశిక్ష వేస్తే, తాజా సుప్రీం కోర్టు దీన్ని సమర్థించింది.. రేపిస్టులకు ఉరి శిక్ష వేయాలని మనమంతా కోరుకోవడంలో తప్పులేదు.. వారికి కఠినమైన శిక్షలు పడాల్సిందే.. కానీ ఉరి వేస్తారనే భయం కూడా లేకుండా నిర్భయంగా భరి తెగించే శాడిస్టు వెధవలు కూడా ఉంటారు..
అందుకే నేను కోరుకుంటున్నారు.. ఉరి శిక్ష వద్దు.. ఉరేస్తే కొద్ది క్షణాల్లో పుట్టుక్కున చస్తారు.. అంతకన్నా దారుణమైన శిక్షలు కావాలి.. ఇలాంటి వెధవలను రోజుల తరబడి చిత్రహింసలు పెట్టి మరీ ఈ లోకం నుండి సాగనంపాలి.. అప్పుడు కానీ మరొకడు ఇలాంటి పనులు చేయడానికి సాహసించడు..


Thursday, May 4, 2017

బాహుబలి బాగుంది.. కథే తిరకాసుగా ఉంది

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాలనే ఆసక్తి నాకైతే లేదు.. కానీ జర్నలిస్టుగా, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నందున బాహుబలి-2 ఎలా ఉందంటూ అందరూ నన్ను అడగడంతో ఏమీ చెప్పలేక ఇబ్బంది పడ్డాను.. ఆ చిత్రంపై మాట్లాడాలంటే చూస్తేనే ఆ అర్హత వస్తుందని భావించాను. ఇక వీలు చూసుకొని ఒక మిత్రునితో వెళ్లాల్సి వచ్చింది. బాహుబలి-2 చూడాలంటే అంతకు ముందు ఏం జరిగిందో తెలియాలి. అందుకే బాహుబలి-1 కూడా చూశాను.. రాచ కుటుంబంలో అంతఃపుర కుట్రను కథాంశంగా తీసుకొని మలచిన అద్భుత గ్రాఫిక్ విజువల్స్ ఎఫెక్ట్ బాహుబలి.. ఈ చిత్ర రెండు భాగాలు చూసిన తర్వాత ఎక్కడో కథ అతకలేదు అనిపించింది..
బాహుబలి-1 మిగిల్చిన ప్రశ్నలకు రెండో భాగం పూర్తిగా జవాబులివ్వలేకపోయింది. మహిష్మతి రాజ్యానికి కట్టు బానిస కట్టప్ప బాహుబలిని చంపడానికి కారణం తెలిసింది. బాహుబలి1లో భల్లాలదేవుడి కొడుకు భద్ర తల నరకడం చూపారు.. కానీ భల్లాలదేవుడికి వివాహం జరిగిందా? ఒకవేళ అవివాహితుడైతే కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు అనే ప్రశ్నలకు రెండు భాగాల్లోనూ సమాధానం లేదు.. బాహుబలి1లో మహిష్మతి రాజ్యంపై దండయాత్రకు దిగిన కాలకేయుల నేపథ్యం తెలుస్తోంది. కానీ రాకుమారి దేవసేనకు చెందిన కుంతల రాజ్యంపై దాడికి దిగిన పిండారీల గురించి అంతా గందరగోళమే.. బాహుబలి-2 క్లైమాక్స్ చూస్తే మొదటి భాగంలోని యుద్ద దృశ్యాలే బాగున్నాయి. అలాగే మొదటి భాగంలో అస్లాం ఖాన్ ఏ సాయం కావాలన్నా ఈ మిత్రుడున్నాడుఅని కట్టప్పకు మాట ఇచ్చాడు.. కానీ రెండో భాగంలోని క్లైమాక్స్ లో మహేంద్ర బాహుబలి (శివుడు)కి సైన్య బలం లేకున్నా అస్లాం ఖాన్ సాయం తీసుకోలేదు..
కుంతల రాజ్య రాకుమారి దేవసేన నేపథ్యం, అమరేంద్ర బాహుబలితో మహిష్మతి రాజ్యానికి ఎలా వచ్చిందో చాలా చక్కగా చూపించారు.. కానీ ఎంతో ధీరురాలైన ఆమె పాత్ర అబలగా కొనసాగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అత్త శివగామికి ఎదురు మాట్లాడింది సరే.. కానీ భల్లాల దేవుడి మీద పరాక్రమాన్ని ఎందుకు చూపలేదో అర్థం కానీ విషయం.. బాహుబలి-1లో అవంతిక అందచందాలతో పాటు శూరత్వాన్ని చూపించారు.. కానీ రెండో భాగంలో అవేమీ అక్కర రాలేదు.. క్లైమాక్స్ యుద్దంలో కూడా పనికి రాలేదు..
బాహుబలి రెండు భాగాలు చూసిన తర్వాత నాకు ఎంతో అద్భుతం అనిపించిన పాత్ర కట్టప్ప.. సత్యరాజ్ ఈ పాత్రలో ఎంతో చక్కగా ఒదిగిపోయాడు.. ఆ తర్వాత నన్ను ఆకట్టుకున్న పాత్ర భల్లాలదేవుడు (రానా) బాహుబలిగా నటించిన ప్రభాస్ రేంజ్ ఈ చిత్రంతో పెరిగింది అనడంలో అనుమానం లేదు.. కానీ దర్శకుడు రాజమౌళి మరి కాస్త అద్భుతంగా ఈ పాత్రను తీర్చిదిద్ది ఉంటే బాగుండేది అనిపించింది..
మొత్తానికి రాజమౌళి ఐదేళ్ల పాటు కష్టపడి నిర్మించిన బాహుబలి రెండు భాగాలు నిజంగానే చాలా వండర్.. చిన్నప్పుడు నేను చదువుకున్న చందమామ, బాలమిత్ర కథలను సజీవంగా వెండి తెరపై చూపిన ఈ దర్శకుని హ్యాట్యాప్ చెప్పకుండా ఉండలేదు.. అద్భుతమైన గ్రాఫిక్స్.. ఒక తెలుగు చలన చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం, ఇతర భాషల చిత్రాల బాక్సాఫీసులను బీట్ చేయడం చాలా గొప్ప విషయం.

సోషల్ మీడియా అంటేనే రకరకాల వ్యక్తుల భావాల వేదిక.. రంధ్రాన్వేషకులకు నిరంతరం ఇక్కడ పని ఉంటుంది. ప్రతి ఒక్కరూ తన వాక్ స్వాతంత్ర్యాన్ని సోషల్ మీడియా వేదికగా ఉపయోగించుకోవచ్చు.. మనం సినిమాను వినోదం, ఆహ్లాదం కోసమే చూడాలి. నిజ జీవితంతో అన్వయించుకోవద్దు.. బాహుబలి తీసి కోట్లు గడించిన నిర్మాతలు, దర్శకుడు రాజమౌళి రైతులకు ఏమైనా సాయం చేయవచ్చు కదా అంటున్నారు.. ఒక సామాజిక స్పృహతో ఇలా మాట్లాడంలో తప్పులేదు.. ఆ భావన బాహుబలి టీంకు మాత్రమే కాదు.. సమాజంలోని ప్రతి ఒక్కరికీ రావాలి.. సమాజం నుండి మనం పొందిన దానిలో ఎంతో కొంత తిరగి సమాజానికి ఇవ్వాలి అనే చింతన అందరు వ్యాపారుల్లోనూ రావాలి..

ఐఏఎస్ అంటే ఇలా ఉండాలి..

ఐఏఎస్ అనే పదానికి నిర్వచనం ‘అయ్యా..ఎస్’ అయిపోయింది కొందరు బ్యూరోకాట్ల తీరువల్ల.. అధికారంలో ఉన్న వ్యక్తుల ఆదేశాలను జీ హుజూర్ అంటూ అమలు చేయడమే వారి దృష్టిలో పరిపాలన..

కేరళకు చెందిన ఈ కలెక్టర్ ఇందుకు పూర్తిగా భిన్నం.. ప్రభుత్వం అంటే ప్రజలకు జవాబుదారీ, వారి సంక్షేమం కోసమే పని చేయాలి.. ప్రభుత్వం ఆస్తులను పరిరక్షించాలి.. అని మనసా, వాచా నమ్ముతాడు.. ఆచరణలో చూపిస్తూ అక్కడి వామపక్ష ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారిపోయాడు..
ప్రభుత్వ భూములను కబ్జా చేసి విచ్చల విడిగా వెలుస్తున్న హోటళ్లు, రిసార్టులను కూల్చేయిస్తున్నాడు.. అక్రమంగా వెలిసిన ప్రార్థనాలయాలను కూడా వదలడం లేదు.. అధికార పార్టీ వత్తిళ్లను బేఖాతరు చేస్తున్నాడు.. లాండ్ మాఫియా గుండెల్లో నిద్రపోతున్నాడు.. మంత్రి కె.కె.మణి ఆయన్ని ఆరెస్సెస్ మనిషి అని నిందించాడు.. అతన్ని బదిలీ చేస్తే ప్రభుత్వానికి ఎక్కడ చెడ్డపేరు వస్తుందో అని ముఖ్యమంత్రి పినరయి విజయన్ భయపడుతున్నాడు..
నీతికి నిజాయితీకి మారుపేరు ఆ అధికారి.. ప్రజా సేవ కోసం డాక్టర్ వృత్తిని వదులుకున్నాడు.. సివిల్స్ - 2013లో దేశంలోనే 2వ ర్యాంకు సాధించాడు.. ఆ ఆరడుగుల బులెట్టు పేరు శ్రీరామ్ వెంకిట రమణ్.. ఇడుక్కి జిల్లా కలెక్టర్.. హ్యాట్సాప్ శ్రీరామ్ వెంకిట రమణ్..
02.05.17

Tuesday, May 2, 2017

పాకిస్తాన్ మళ్లీ కోలుకోలేని దెబ్బ తీయాలి..

సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం భారత భద్రతా ధళాలపై దాడి చేసింది.. ఇద్దరు జవాన్లను హతమార్చి అత్యంత దారుణం వారి శరీరాలను చిత్రం చేసింది.. భారత సైన్యం బదులు తీర్చుకుంది.. ఏడుగురు పాక్ జవాన్లను హతమార్చింది(?)..
తాజాగా జరిగిన పై ఘటన మీడియాకు సాధారణ వార్తగా మారిపోయింది.. ప్రజలు ‘ఓహో మళ్లీ పాకిస్తాన్ ఏదో చేసిందన్నమాట..’ అనుకొని నిట్టూర్చారు.. అంతగా మొద్దుబారిపోయాం మనం..
పాకిస్తాన్ పదే పదే మనల్ని ఎందుకు కవ్విస్తోంది?.. మన ప్రభుత్వం ఎందుకు ధీటుగా బుద్ది చెప్పలేకపోతోంది?.. ఇంకా ఎంత కాలం మనం ఆదే ఆగడాలను భరించాలి?.. ఎంత కాలం మనం ఇలా శాంతి,శాంతి అంటూ చేతులు ముడుచుకు కూర్చోవాలి?.. దేశం కోసం ఆలోచించే ప్రతి వ్యక్తిలోనూ రగిలే ప్రశ్నలు ఇవి..

ఇక మనం ఉపేక్షించి లాభం లేదు.. మన సహనాన్ని వారు చేతగాని తనంగా భావిస్తున్నారు.. మోదీజీ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవాల్సిందే.. పాకిస్తాన్ మళ్లీ కన్నెత్తి చూడకుండా కోలుకోని దెబ్బ తీయాల్సిందే.. జై హింద్

Monday, May 1, 2017

మూర్ఖులతో జాగ్రత్త..

మూర్ఖులు తమ మనుగడ కోసం ఎదుటి వారిని పొగడ్తలతో ముంచెత్తుతుంటారు.. వీరికి మంచి, చెడు అనే విచక్షణ ఉండదు.. ఇలాంటి ప్రశంసలను విశ్వసించవద్దు.. బుద్దిమంతులు నిర్మొహమాటంగా తప్పులు ఎత్తి చూపి మందలిస్తారు.. వీరు చీవాట్లు పెట్టినా మన మంచి కోసమే అని భావించాలి.