నిర్భయ
కేసులో దోషులకు హైకోర్టు విధించిన ఉరిశిక్షను సుప్రీం కోర్టు సమర్థించింది..
అయితే వీరికి ఉరి వేయడాన్ని నేను తీవ్రంగా
వ్యతిరేకిస్తున్నాను..
ఎందుకు
అంటారా?..
నిర్భయ..
ఆమె అసలు పేరు తెలియదు.. రాత్రివేళ బస్సులో మృగాళ్ల భారిన పడి నరక యాతన అనుభవించి
చివరకు తనువు చాలించింది.. ఆమెపై జరిగిన దారుణ అత్యాచారానికి దేశమంతా చలించింది..
మూడు రోజుల పాటు ఢిల్లీ నగరమే స్థంభించిపోయింది.. తమ వృత్తి జీవితాలు తప్ప, ఇతర
విషయాలేవీ పట్టని యువతీ, యువకులు ఆమెకు న్యాయం చేయమంటూ,
రేపిస్టులను ఉరి తీయమంటూ రోడ్ల మీదకు వచ్చారు.. స్వతంత్ర భారత దేశ
చరిత్రలో ఓ సామాజిక సమస్యపై వచ్చిన అతి పెద్ద ఉద్యమం ఇది.. దేశ నాయకత్వం
కలవరపడింది..
నిర్భయ
చనిపోయిందని ఎవరన్నారు?.. ఆమె చనిపోలేదు.. చనిపోయింది మానవత్వం.. నిర్భయ భౌతికంగా
ఈ లోకంలో లేకపోవచ్చు.. ఆమె ఆత్మకు శాంతి కలగాలంటే మనందరి దృక్పథంలో మార్పు
రావాలి.. తప్పు రేపిస్టులది మాత్రమే అనడం సరికాదు.. ఆడ పిల్లలను అంగడి సరుకులా
చూపిస్తున్న ఈ సమాజమే అతి పెద్ద దోషి.. తమ పిల్లలు పెద్ద చదువులు చదవాలని, పెద్ద
జీతాలు వచ్చే ఉద్యోగాలు చేయాలని తల్లి దండ్రులు కోరుకుంటారు.. కానీ వారికి నైతిక
విలువలు నేర్పించాలనే ఆలోచన మాత్రం కలగడం లేదు.. మన ఇంటి నుండి మార్పు
వచ్చినప్పుడే సమాజం కూడా మారుతుంది..
నిర్భయపై
అమానుషంగా వ్యవహరించిన వారిలో ఒకడు జైలులోనే ఆత్మహత్య చేసుకున్నాడు.. మరొకడు మైనర్
అనే సాకుతో నామమాత్రం నిర్భంధం అనుభవించి, ఇప్పుడు సమాజంలో స్వేచ్ఛగా
తిరుగుతున్నాడు.. మిగతా నలుగురికి హైకోర్టు ఉరిశిక్ష వేస్తే, తాజా సుప్రీం కోర్టు
దీన్ని సమర్థించింది.. రేపిస్టులకు ఉరి శిక్ష వేయాలని మనమంతా కోరుకోవడంలో
తప్పులేదు.. వారికి కఠినమైన శిక్షలు పడాల్సిందే.. కానీ ఉరి వేస్తారనే భయం కూడా
లేకుండా నిర్భయంగా భరి తెగించే శాడిస్టు వెధవలు కూడా ఉంటారు..
అందుకే
నేను కోరుకుంటున్నారు.. ఉరి శిక్ష వద్దు.. ఉరేస్తే కొద్ది క్షణాల్లో పుట్టుక్కున
చస్తారు.. అంతకన్నా దారుణమైన శిక్షలు కావాలి.. ఇలాంటి వెధవలను రోజుల తరబడి
చిత్రహింసలు పెట్టి మరీ ఈ లోకం నుండి సాగనంపాలి.. అప్పుడు కానీ మరొకడు ఇలాంటి
పనులు చేయడానికి సాహసించడు..
No comments:
Post a Comment