Tuesday, May 9, 2017

సోషల్ మీడియా.. నిర్భయంగా ఇలా..

ఏ విషయంలో అయినా మంచీ, చెడూ రెండూ ఉంటాయి.. అది సోషల్ మీడియాకు కూడా వర్తిస్తుంది. భావ ప్రకటనా స్వేచ్ఛను ఉపయోగించుకోవడానికి సోషల్ మీడియా చక్కని వేదిక.. అదే సమయంలో దీని పరిమితులను కూడా అర్థం చేసుకువాలి.. 

ఇటీవలి కాలంలో సోషల్ మీడియా విస్తృతిని చూసి నాయకులు, అధికారులు భయపడిపోతున్నారు.. సోషల్ మీడియాను కట్టడి చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు.. ఇందులో భాగంగా గ్రూప్ అడ్మిన్లను అరెస్టు చేసే అవకాశాల వార్తకు ప్రచారం కల్పిస్తున్నారు.. ఈ వార్తను చూసి అడ్మిన్లు, మెంబర్లు హడలెత్తిపోతున్నారు.. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి.. మనం తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు.. సాంకేతికంగా మనం ఇబ్బందులు పడకుండా ఉండాలంటే స్వీయ నియంత్రణ చాలా అవసరం.. ఇందు కోసం ఈ నియమ నిబంధనలను కచ్చితంగా పాటిద్దాం..
దేశ భద్రత, సమగ్రత, జాతీయ చిహ్నాలకు భంగం కలిగించే పోస్టులు చేయకండి..
నిరాధార, విద్వేష పూరితచ కథనాలు,  వదంతులు, వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే పోస్టులు పెట్టకండి..
మన చట్టాలను న్యాయస్థానాలను గౌరవించండి. కోర్టులు ఇచ్చే తీర్పులను సమీక్షించవచ్చు.. కానీ నిందించరాదు..
మహిళల గౌరవ మర్యాదలకు భంగం కలిగించే పోస్టులు వద్దు.. అసభ్యకర పోస్టులకు దూరంగా ఉండండి.. వ్యక్తిగత జీవితాలను, ప్రైవసీని కాపాడండి..
మనం సత్యం అని నమ్మిన వాటినే పోస్టు చేయండి.. ఫార్వర్డ్ మెసేజెస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.. అవతలి వారు పంపిన పోస్టు పూర్తి యదార్థం అని భావిస్తేనే తిరిగి ఫార్వర్డ్ చేయండి..
అశ్లీల సందేశాలు, చిత్రాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించవద్దు.. వాటిని పంపేవారిని హెచ్చరించండి.. మీరు కూడా ఇతరులకు ఇలాంటి వాటిని పోస్టు చేయకండి..
మనం నమ్మిన సిద్ధాంతం, రాజకీయ భావజాలాన్ని నిరభ్యంతరంగా ప్రచారం చేసుకోవచ్చు.. సైద్ధాంతిక విమర్శలు చేయవచ్చు.. వాద ప్రతివాదనలు జరుపుకోవచ్చు.. అయితే అవతలి వారిని విమర్శించే విషయంలో అసభ్య పదజాలం వాడరాదు. హుందాతనం పాటించాలి..  కానీ వ్యక్తిగతంగా, పరువుకు భంగం కలిగించే నిందా వ్యాఖ్యలు చేయవద్దు..
మనం తప్పు చేయనంత వరకూ ఎవరికీ భయపడాల్సిన అవసరమే లేదు.. మన దేశాన్ని, ధర్మాన్ని నిందించేవారిని ఉపేక్షించాల్సిన అవసరం లేదు.. అన్యాయాన్ని ఎదిరించాలి.. నీతి నిజాయితీ లేని వారిని, అవినీతి పరులైన నాయకులు, అధికారులను వదలకండి.. మనం ప్రజల తరపున నిలవాలి.. సమాజానికి అండగా ఉండాలి.. ప్రజల సొమ్మును కాపాడటంలో ముందుండాలి.. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే హక్కు మనకు ఉంది.. మనపై నిరాధార ఆరోపనలతో కేసులు పెట్టినా అవి న్యాయస్థానంలో చెల్లవు..
కాబట్టి సోషల్ మీడియా సభ్యులు,, అడ్మిన్లు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు.. కాకపోతే మన గ్రూప్ లోని ప్రతి సభ్యుడు మనకు తెలిసిన వాడై ఉండాలి.. అడ్మిన్లు పరిమిత సంఖ్యలో ఉండాలి.. గ్రూప్ సభ్యులంతా అంశాలతో నియమ నిబంధనలు ఏర్పాటు చేసుకొని వాటిని విధిగా పాటించాలి.. వారందరికీ ఈ విషయంలో అవగాహన కల్పించాలి.. అదుపు తప్పే వారిని హెచ్చరించాలి.. ఉల్లంఘించిన సభ్యులను నిరభ్యంతరంగా తొలగించేయాలి.. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే మనం ఎవరికీ భయపడాల్సిన  అవసరమే లేదు..

No comments:

Post a Comment