Thursday, May 4, 2017

ఐఏఎస్ అంటే ఇలా ఉండాలి..

ఐఏఎస్ అనే పదానికి నిర్వచనం ‘అయ్యా..ఎస్’ అయిపోయింది కొందరు బ్యూరోకాట్ల తీరువల్ల.. అధికారంలో ఉన్న వ్యక్తుల ఆదేశాలను జీ హుజూర్ అంటూ అమలు చేయడమే వారి దృష్టిలో పరిపాలన..

కేరళకు చెందిన ఈ కలెక్టర్ ఇందుకు పూర్తిగా భిన్నం.. ప్రభుత్వం అంటే ప్రజలకు జవాబుదారీ, వారి సంక్షేమం కోసమే పని చేయాలి.. ప్రభుత్వం ఆస్తులను పరిరక్షించాలి.. అని మనసా, వాచా నమ్ముతాడు.. ఆచరణలో చూపిస్తూ అక్కడి వామపక్ష ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారిపోయాడు..
ప్రభుత్వ భూములను కబ్జా చేసి విచ్చల విడిగా వెలుస్తున్న హోటళ్లు, రిసార్టులను కూల్చేయిస్తున్నాడు.. అక్రమంగా వెలిసిన ప్రార్థనాలయాలను కూడా వదలడం లేదు.. అధికార పార్టీ వత్తిళ్లను బేఖాతరు చేస్తున్నాడు.. లాండ్ మాఫియా గుండెల్లో నిద్రపోతున్నాడు.. మంత్రి కె.కె.మణి ఆయన్ని ఆరెస్సెస్ మనిషి అని నిందించాడు.. అతన్ని బదిలీ చేస్తే ప్రభుత్వానికి ఎక్కడ చెడ్డపేరు వస్తుందో అని ముఖ్యమంత్రి పినరయి విజయన్ భయపడుతున్నాడు..
నీతికి నిజాయితీకి మారుపేరు ఆ అధికారి.. ప్రజా సేవ కోసం డాక్టర్ వృత్తిని వదులుకున్నాడు.. సివిల్స్ - 2013లో దేశంలోనే 2వ ర్యాంకు సాధించాడు.. ఆ ఆరడుగుల బులెట్టు పేరు శ్రీరామ్ వెంకిట రమణ్.. ఇడుక్కి జిల్లా కలెక్టర్.. హ్యాట్సాప్ శ్రీరామ్ వెంకిట రమణ్..
02.05.17

No comments:

Post a Comment