Tuesday, May 9, 2017

దేవునితో రాజకీయాలా?


 దేవుని ముందు ప్రాంతీయ‌, భాషా విభేదాలు ఎందుకు?.. వేంక‌టేశ్వ‌ర స్వామి హిందువులంద‌రి దేవుడు.. దేశ విదేశాల నుండి లక్ష‌లాది మంది భ‌క్తులు వెంక‌న్న స‌న్నిధికి వ‌చ్చి మొక్కుకుంటారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ గా ఎవ‌రిని నియ‌మిస్తే ఎందుకు?  ఆ అధికారి ధ‌ర్మ నిష్ట‌గ‌ల హైంద‌వుడు, స‌మ‌ర్థుడు అయితే చాలు.. అంతే కానీ ఉత్త‌రాదివారు, తెలుగు రాని వారు అధికారిగా ఉండ‌కూడ‌ద‌నే వాద‌న ఎందుకు?. ఇవాళ ద‌క్షిణ భార‌త దేశం వారిని మాత్ర‌మే అధికారిగా నియ‌మించాలని వాదిస్తున్నారు, రేపు కేవలం ఆంధ్రప్రదేశ్ వారిని, అందునా రాయ‌ల‌సీమ‌, లేదా చిత్తూరు-తిరుప‌తి వాసుల‌నే నియ‌మించాల‌నే డిమాండ్లు చేస్తే?.. తెలుగేత‌రులు తిరుమ‌ల‌లో అడుగు పెట్ట‌కూడ‌దు అంటే?..
టీటీడీ పాల‌క మండ‌లి స‌భ్యుల గుణ గ‌ణాలు ఎలా ఉన్నా చాలా? ఈ విష‌యంలో ఎందుకు అభ్యంత‌రం లేవ‌దీయ‌రు? తిరుమ‌ల‌లో అన్య మ‌త‌స్తుల ఆగ‌డాల‌ని ఎందుకు ప్ర‌శ్నించ‌డం లేదు?.. ఒక కొత్త రాజ‌కీయ నాయ‌కుడు ఉనికి కోసం ప్రాంతీయ, భాషా విద్వేషాల‌ను వాడుకుంటున్నాడంటే స‌రే ఆయ‌న అవ‌స‌రం అలాంటిది అనుకుందాం.. మ‌రి నాబోటి ధ‌ర్మ‌నిష్టగ‌ల వారు గౌర‌వించే ఒక స్వామీజీ కూడా ఇలాంటి వాద‌న‌లు చేయ‌డం చాలా బాధ‌ను క‌లిగిస్తోంది.. వీరంద‌రినీ నేను కోరేది ఒకటే.. వెంక‌న్న స్వామిని రాజ‌కీయం చేయ‌కండి అనే.. 

No comments:

Post a Comment