Sunday, May 14, 2017

మాతృ మూర్తిని ప్రతి రోజూ పూజించాల్సిందే..

ఇవాళ మాతృదినోత్సవం అంటూ హడావుడి.. మన తల్లులను ఈ ఒక్కరోజు మాత్రమే గుర్తు చేసుకుంటే చాలా?.. వారికో దండం పెట్టి, బహుమతి ఇచ్చి, మన పనిలో మనం మునిగి పోదామా?.. ఇంతటితో మన బాధ్యత తీరిపోయినట్లేనా? 
అమ్మకు ఎంత చేసినా రుణం తీర్చుకోలేం.. మనకు జన్మనిచ్చి, పెంచి, సమాజంలో పౌరునిగా మార్చున తల్లి పట్ల ఒక్కరోజు కృతజ్ఞత చూపితే చాలదు.. మాతృమూర్తిని 
ప్రతిరోజూ పూజించాలి.. గౌరవించాలి.. బాగోగులను పట్టించుకోవాలి.. వారు ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకోవాలి.. 
మాతృదేవోభవ.. తల్లికి దేవతలతో సమాన హోదా కల్పించింది మన ధర్మం.. పాశ్చాత్య సంస్కృతుల్లో మనకు ఉన్నంత సెంటిమెంట్లు ఉండవు.. దురదృష్టవశాత్తు వారి సంస్కృతి మన సమాజంలో ప్రవేశించింది.. వారి ఆచార వ్యవహారాలు పాటిస్తూ భారతీయ మూలలను మరచిపోతున్నాం.. కొత్త కొత్త దినాలను పాటిస్తున్నాం.. నా దృష్టిలో mother's day కూడా అలాంటిదే.. ఎవరి సెంటిమెంట్స్ వారికి ఉంటాయి.. తప్పులేదు.. కానీ మన సెంటిమెంట్లను కూడా అవతలివారు గౌరవించి, ఆచరించేలా చూద్దాం..

No comments:

Post a Comment